పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. యుద్ధం గురించి Anjaneyulu KSR అభిప్రాయం:

    09/05/2017 4:40 pm

    ప్రేమ మనసుకి కలిగె భావన
    కీర్తి మన శక్తి యుక్తులకొచ్చె గుర్తింపు
    కీర్తికి ప్రేమకి మధ్యనున్న సున్నిత సుతార తీగని లాగారు, మీ కవితతొ….

  2. భూమి చాలని మనిషి గురించి బి.వేణుగోపాల్ రెడ్డి అభిప్రాయం:

    09/05/2017 2:48 pm

    భూభ్రమణ కాంక్షను గొప్పగా పరిచయం చేశారు సార్. పుస్తకాన్ని చదవాలనే అతృతను సమీక్ష ప్రారంభంలోనే కలిగించారు. యాత్రా సాహిత్యం పట్ల గొప్ప అవగాహన ఉన్న మీరు పుస్తకాన్ని అద్భుతంగా పరిచయం చేశారు. భ్రమణం అందరికి సాధ్యపడదు. సాధ్యపడినవారి అనుభవాలు సాహితీ లోకానికి చాలా అవసరం. రచయుత ఆదినారాయణగారు అభినందనీయులు.

  3. వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 4. వైరుధ్యం వర్సెస్ వైవిధ్యం గురించి viswam అభిప్రాయం:

    09/05/2017 9:40 am

    గాన్ విత్ ది విండ్ రాసిన నవలా రచయిత అప్పటి అక్కడ సమాజాన్ని చాలా సునిశితంగా పరిశిలించి అధ్యయనం చేసి మనుష్యులు పరిస్తితులను బట్టి ఎలా మారూతారో సమాజంని నవలలో ఆద్భుతంగా వ్యక్తీకరించారు అన్ని పాత్రలను వాస్తవానికి దగ్గరగా రాశారు. వేయిపడగలు సమాజం లో వర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తు ఇది దేవుడే ఇలా చేశాడు. మానవప్రమేయం మన పుట్టుకలో లేదు అని చెబుతారు.

  4. నాకు నచ్చిన పద్యం: పాత సంప్రదాయంలో కొత్త చూపు గురించి వీరభద్రం అభిప్రాయం:

    09/05/2017 9:01 am

    నాకు ఠక్కున మనుచరిత్రలో పెద్దన కూర్చిన ‘తరుణి ననన్యకాంత…’ అనే పద్యం గుర్తుకు వచ్చింది. అక్కడ ఆయన చేసినది సూర్యోదయ వర్ణన.

    ఈ పద్యం, దాని క్రిందనున్న పద్యాలు సూర్యాస్తమ వర్ణనగానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

    http://www.andhrabharati.com/kAvyamulu/manu/manu302.html

  5. బ్రేక‌ప్ గురించి viswam అభిప్రాయం:

    09/05/2017 8:10 am

    సహజంగానే ఉన్నది. ఉన్నది ఉన్నట్టుగా వున్నది.

  6. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి వీరభద్రం అభిప్రాయం:

    09/05/2017 1:47 am

    ఈ శ్లోకం మీద ఇంత చర్చ జరుగుతున్నప్పుడు, ఈ శ్లోకార్ధానికున్న వెసులుబాటుని exploit చేస్తూ, గణపతి నవలాప్రారంభంలో చిలకమర్తి వారు వ్యంగ్యంగా సాధించిన విపరీతార్ధాన్ని కూడా ఎవరైనా పెద్దలు ఉటంకిస్తే, సందర్భోచితంగా ఉంటుంది.

  7. గుర్రాల మావయ్య గురించి Vinay అభిప్రాయం:

    09/05/2017 1:25 am

    బాగుంది

  8. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి వురుపుటూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    09/05/2017 12:53 am

    “ఈ ఏనుగు ముఖమాయన వినాయకుడేనా? అలా అయితే ఆయనను అంత చులకన చేసిన శ్లోకాన్ని ఆయన ప్రార్థన వెనుకనే భక్తిగా ఎందుకు పఠిస్తున్నారు?”

    నాకు తెలిసి –
    శ్రీవైష్ణవసంప్రదాయంలో విష్వక్సేనుడు – కొంత స్కందుడు, కొంత గణపతి. (వైష్ణవ) సేనాపతి, విఘ్ననాశకుడు. శ్రీవైష్ణవకుటుంబాలలో తొలిపూజ విష్వక్సేనుడికే.

    ఈ విష్వక్సేనుడి పరివారంలో ఒక “గజాననర్” అనే ఒక “నిత్యసూరి” ఉంటాడు. “వీర”వైష్ణవదేవాలయాలలో గణపతికి బదులు ఈ గజాననుడి విగ్రహాలు ఉంటాయట. ఈయన ఏకదంతుడు కాదు (రెండు దంతాలూ పూర్తిగా ఉన్న మూర్తి ఈయనది). తుంబిక్కై ఆళ్వారని కూడా ఈయనకి పేరు. విఘ్నహర్తలలో ఈయనా ఒకడట.
    “శుక్లాంబరధరం…” కూడా విష్వక్సేనస్తుతి అని ఒక వాదము ఉన్నది.

  9. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-1 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/04/2017 8:51 pm

    శుక్లాంబరధరం అన్న శ్లోకానికి విశ్వనాథ సత్యనారాయణ చేసిన వ్యాఖ్యను ఈ అనుబంధం ద్వారా ఈమాట పాఠకులకు అందజేస్తున్నాము.

    శుక్లాంబరధరం … (విశ్వనాథ వ్యాఖ్య)

    ‘సాహిత్య సురభి’ అన్న పుస్తకంలోని ఈ వ్యాఖ్యను మాకు స్కాన్ చేసి అందజేసిన మిత్రుడు హేలీ కల్యాణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు.

    సంపాదకుల తరఫున,
    సురేశ్ కొలిచాల.

  10. భూమి చాలని మనిషి గురించి amarendra dasari అభిప్రాయం:

    09/04/2017 4:59 pm

    థాంక్స్ రామయ్య గారూ