పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. ఛాయామాయావి: మార్కస్ బార్ట్‌లీ గురించి తః తః అభిప్రాయం:

    09/27/2017 4:04 pm

    ఎండ మండి పోతోంది, వర్షం పడటం లేదు.కుండపోత వర్షం వచ్చేస్తోందని మూడు రోజులుగా పేపర్లు .ఏ మార్కస్ బార్ట్‌లీ నో ( రవికాంత్ నగాయిచో ) వర్షం నేల మీద పడకుండా ఆకాశం లో బాణా లల్లేశాడా అనిపించి మళ్ళీ ఈ రచన చదివాను. ఉహు.. ఈ రచన లొ విషయ సేకరణేగానీ ఆత్మీయత కనిపించ లేదు. నెట్ లో వెతికాను. బార్ట్‌లీ ని స్వయం గా ఎరిగిన వారు రాసిన – ఇప్పుడే రాత్రి రెండు గంటల ఇరవై నిముషాల కు చదవటం పూర్తిచేసిన – ఒక రచనను పాఠకుల దృష్టి కి తేవాలనిపించింది .
    Marcus Bartley: A life in pictures
    (Rochelle Shah, The Hindu APRIL 05, 2017)

    తః తః

  2. గడి నుడి – 11 గురించి సంపాదకులు అభిప్రాయం:

    09/25/2017 5:17 pm

    ఈసారి గడినుడి అతి కష్టంగా ఉన్నట్టుంది కాబట్టి గడువుతేదీని ఈ నెల 30వ తేదీవరకూ పొడిగిస్తున్నాము. అంతేకాక సమాధానాలను సరిచూపించే సదుపాయాన్ని ఎనేబుల్ (enable) చేసాం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ అయిదు రోజుల్లో సరైన సమాధానాలు వస్తాయని ఆశిద్దాం.

  3. ఒక పాట – రెండు బాణీలు గురించి విశ్వనాధ్ అభిప్రాయం:

    09/22/2017 5:07 pm

    ముఖ్యంగా ‘ఒదిగిన మనసునా’ ఈరోజు ఎన్నిసార్లు విన్నానో. 70,80లలో రేడియోతో పరిచయమున్నవారికి గొప్ప అనుభూతి. విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించేవి. ఏమైనా తిరిగి వాటిని అందుబాటులోకి తెచ్చిన మీకు ధన్యవాదాలు.

  4. ఒక పాట – రెండు బాణీలు గురించి విశ్వనాధ్ అభిప్రాయం:

    09/22/2017 4:48 pm

    ధన్యవాదాలు శ్రీనివాస్ గారు,
    మంచి అనుభూతి కలిగించారు.

  5. పునరావృతమ్ గురించి S. Narayanaswamy అభిప్రాయం:

    09/22/2017 3:11 pm

    చాలా బాగా రాసారు.

  6. పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి RAVI KRISHNA C అభిప్రాయం:

    09/22/2017 9:24 am

    శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి నమస్సులు. సర్ కుశలమా? లలితగీతాలలో శ్రీమతి పి. సుశీలమ్మ గారు పాడిన “నిదురబో నా తండ్రి, నిదురించే జగమంతా నిఖిల ప్రాణులతో” ఉంటే తెలియజేయండి. మిత్రులు కీ .శే. ప్రొఫెసర్. శ్రీ టీ. వి. రావుగారు శ్రీ. మల్లిక్ పాడినది తన ఛానల్ లో ఉంచారు. దానిలో చివర్లో ఇది మొదట పి. సుశీల గారు మద్రాస్ లో పాడారని చెప్పడము గమనించవచ్చు.

    రిగార్డులు,
    రవికృష్ణ చారేపల్లి
    తిరుపతి

  7. రైలు అమ్మాయి గురించి సునీల్ భైరిశెట్టి అభిప్రాయం:

    09/21/2017 1:02 pm

    ఆకలికి కుల మత ప్రాంతాలతో పని లేదు. అలాగే ప్రేమకు, ఆకర్షణకు కూడా.. రెండింటినీ వాస్తవికతతో సున్నితంగా స్పృశించారు. కళ్ళ మధ్య ప్రయాణించే, కలల తీరాల్లో ఊహించుకునే భావాలు కెనడాలో అయినా, కొలొంబోలో అయినా ఒకటే.. అనువాద ఛాయలు కనిపించకుండా నేర్పుగా రాయడం ఆకట్టుకుంది..

  8. రైలు అమ్మాయి గురించి స్వాతి యాకసిరి అభిప్రాయం:

    09/20/2017 12:57 am

    కథ చాలా బావుందండి. అనువాదం అని చెప్తే కానీ తెలియదేమో అనిపించింది.

  9. పేకాట గురించి రాఘవేంద్ర అభిప్రాయం:

    09/19/2017 5:38 pm

    అబ్బో బ్రహ్మాండం. చాలా మంది కళ్ళు తుడుచుకొని ఉంటారు. టిం రసర్ట్ ని తలచుకొని కాదండోయ్.

  10. యుద్ధం గురించి A S Murthy అభిప్రాయం:

    09/19/2017 8:54 am

    Reminded me of a friend in my high school, who used to write shortest essays in Telugu, yet come 1st, nice writing.