పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. బండలు గురించి కృష్ణవేణి అభిప్రాయం:

    11/04/2017 8:32 am

    @అనిల్ అట్లూరి గారూ,
    ‘కడ్డీల’కి ముద్దు పేరు పెట్టినప్పుడు, అవి ‘ బండలు’ అయాయి. 🙂
    థేంక్యూ.
    ‘కథల సంపుటం’ అన్నది తేవడానికి ముందు కథలని ఎవరైనా అచ్చేయాలి కదా! దానికోసం నేను బద్ధకం వదిలించుకుని రాయడానికీ ప్రయత్నించాలిగా!
    అవన్నీ అయే పనులు కావు కానీ సంవత్సరానికి ఒకటో, రెండోసార్లు రాస్తునవి ఎవరో ఒకరు వేసుకుంటున్నారు చాలు.

  2. బండలు గురించి కృష్ణవేణి అభిప్రాయం:

    11/04/2017 8:26 am

    @మాలగారూ,
    ‘బాగున్నాయి’ అన్నందుకు మహదానందం. ఆహా, చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఆ రోజులు రావు మరి!:(
    చదివినందుకూ, కామెంట్ పెట్టినందుకూ కూడా థేంక్యూ.

  3. బండలు గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    11/03/2017 8:23 pm

    బావుంది.
    బండలు> కడ్డీలు ఎప్పుడయ్యాయి?
    విమానం కధలు అని ఒక కొత్త కధల సంపుటం తీసుకురావచ్చు!

  4. మరికొన్ని అరుదైన పాటలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    11/03/2017 3:55 pm

    Lyla: The verse “kausalyaa suprajaa raama” was sung by Balijepalli Lakshmikantam (a.k.a Lakshmikanta kavi), who played the role of Viswamitra in that film. Obviously I won’t tell you who he is, etc.

    Regarding other songs, there is no dispute about taste. But my motivations, or selection criterion for picking them are different, not necessarily “good quality” singing. But, I would particularly disagree with you about the song “madhoodayaMlO …”. But, we can take that off-line!

    తెలుగులో గళమాధుర్యం కోసం నేను విన్నది స్త్రీలలో -బాలసరస్వతి, ఎస్. వరలక్ష్మి, భానుమతి, శ్రీరంగం గోపాలరత్నం. మొదటి ముగ్గురి స్వరం తప్పక గుర్తించగలం. snip … snip … గాయని సుశీల లాగా. సుశీల గొంతు వేలాది వేల తెలుగు స్త్రీలకు ఉన్నది. ఏమీ ప్రత్యేకత లేదు.

    I have been saying the same for a while. So …

    But, Rohini Prasad gaaru put it quite well here: http://eemaata.com/em/issues/201003/1556.html#comment-19094

    డూడూ బసవన్న అంటే జానపదమై పోతుందనీ, ఛందస్సుంటే చాలు కవిత్వమని, పాట పాడినవారందరూ గాయకులేనని, అందరూ పాడటానికి అర్హులేననీ, ఎవరైనా ఏ పనైనా చేసెయ్యగలరనీ, ఇలాటి డెమొక్రాటిక్ భావనలు నాకు లేవు.

    same here!!

    Best,
    Sreenivas

  5. కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి Nageswara Rao అభిప్రాయం:

    11/03/2017 12:45 pm

    దేశికాచారి గారితో ఏకీభవిస్తున్నాను. ఇలాంటి భావజాల ప్రచార వ్యాసాలు ప్రచురించకపోవడమే మంచిది.

    ఈ భావజాలాన్ని ప్రచారం చేసే చాలామంది రచయితలకు (భాస్కర్ గారిని ఇందులో చేర్చడంలేదు) వాస్తవాలతో పని లేదు. ఎదుటి పక్షం వాదనలో నిజాలను అంగీకరించే నిజాయితీ కూడా ఉండదు. భారతీయ వారసత్వాన్ని ప్రేమిచేవారందరూ వీళ్ళ దృష్టిలో ప్రగతి నిరోధకులు.

    ఈ భావజాలంగాళ్లే సారంగను భ్రష్టుపట్టించారు. ఈమాటను వీళ్ళనుండి కాపాడవలసినదని మనవి.

  6. బండలు గురించి mala అభిప్రాయం:

    11/03/2017 11:28 am

    వేణి గారు మీ ఏర్లైన్స్ కథలు బాగుంటున్నాయండి. చాలా బాగారాస్తున్నారు. మొత్తానికి వెండి బండల మీద కాలక్షేపం చేశారన్నమాట 🙂

  7. బండలు గురించి కృష్ణవేణి అభిప్రాయం:

    11/03/2017 9:43 am

    @మంథా భానుమతిగారూ,
    మీకు నచ్చినందుకు థేంక్యూ, థేంక్యూ, థేంక్యూ. 🙂
    ఓలేటి శ్రీనివాస్ భాను గారి ‘పొగబండి’ కథలు చదివాను.
    ఇలాంటి ఎయిర్ లైన్స్ కథలు ఎక్కువ రాస్తే ఎవరు వేసుకుంటారో, ఎవరు వద్దనేస్తారో తెలియదు.
    ప్రస్తుతానికి ‘ఈ మాట’ టీం వేసుకున్నందుకు మాత్రం సంతోషంగా ఉంది.

  8. ఇస్మాయిల్ అవార్డు-2015 గురించి వేణు గోపాల్ అభిప్రాయం:

    11/03/2017 9:21 am

    ఆ కవితలుకూడా ప్రచురిస్తే బాగుండేది

  9. కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి imdrakanti pinakapani అభిప్రాయం:

    11/03/2017 7:15 am

    ఒకరకంగా నాయకుడి పాత్ర అగ్రకులంగానూ హాస్య నటుడి పాత్ర అణగారిన కులంగానూ తేడాలు చూపించడానికి ఈ భాషలను వాడతారు.

    ఇది తప్పు. ఇక్కడ విషయం కులానికి సంబంధించింది కాదు. బ్రాంహణులు, రెడ్లు వగైరా కులాల వారు కూడా మాండలిక యాసలోనే మాట్లాడతారు. ఒక్క హీరో మాత్రమే ఏ ప్రాంతానికి సంబంధించిన వాడైనా శిష్ట భాషనే మాట్లాడతాడు.

  10. ‘జ్ఞాపిక’ గురించి suryavamsie అభిప్రాయం:

    11/03/2017 4:48 am

    మెంతి బుట్టల కాన్సెప్ట్ నిజమేనా? ఆ బుట్టల్లో మెంతులే ఎందుకు వేస్తారు? అన్న ప్రశ్న నన్ను వేధిస్తోంది?