పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు గురించి G. K. Ananthasuresh అభిప్రాయం:

    05/01/2018 7:09 pm

    ఒక మంచి నవల గురించి రాసిన మంచి సమీక్ష. థాంక్స్, శ్రీకాంత్ గారూ. ఒక ప్రశ్న: ప్రకృతిలో మమైకం కావాలంటే, పల్లెలకే పోవాలా? వ్యవసాయమే చేయాలా? నగర వాతావరణంలో అది సాధ్యపడదా?

  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 17 గురించి టి. చంద్రశేఖర రెడ్డి అభిప్రాయం:

    05/01/2018 11:43 am

    జనవరి 2017 ఈమాటలో ప్రచురించిన శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక-1నే, తిరిగి శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక-17 గా మే 2018 ఈమాటలో ప్రచురించారు. కావాలనే ప్రచురిస్తే ఇబ్బంది లేదు. కాదు అంటే, ఇంతకుముందు ప్రచురించని మరో శ్రీశ్రీ పదబంద ప్రహేళికని అందించే ప్రయత్నం చేయండి.

    టి. చంద్రశేఖర రెడ్డి

    [శ్రీశ్రీ గారు పదబంధ ప్రహేళిక – 17 గా ప్రచురించింది ఈ ప్రహేళికనే. అయితే, ఇది జనవరి 2017 సంచికలోని ప్రహేళికకు కాపీ అని మేము గుర్తించలేదు. అందుకని కొత్త ప్రహేళికను అందజేసాం. మా తప్పు చూపినందుకు ధన్యవాదాలు. — సం. ]

  3. ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు గురించి వివినమూర్తి అభిప్రాయం:

    05/01/2018 10:08 am

    రసపట్టులో తర్కం కూడదుట. తియ్యటి ఇష్టమైనదేదో తిన్నాక ఆలోచన లేకుండా ఉంటే బాగుండేది. కానీ ఆలోచనాప్రాణులు అమరేంద్ర ప్రశ్న కి గురవుతారు నాలాగా మీలాగా. 30 ఎకరాల కమతాల లెక్క నంజ పుంజ భూములకి నప్పదు. కాంత్ గారూ మదుపరుల ప్రపంచం సేద్యానికి గిట్టుబాటు లేకుండా చేస్తుంది. కార్పొరేట్ వ్యవసాయం కనుచూపు మేరలో ఉంది. భూమిపై హక్కు స్టాక్ అవుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు నిజమైన సరుకు అవుతాయి. వారు గిట్టుబాటు ధరలు అడగరు ప్రభుత్వాలను ధరల నియంత్రణ చేయనీయరు. ఈ విషాద వాస్తవం చూడబోతున్నాం.

  4. ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు గురించి Amarendra Dasari అభిప్రాయం:

    05/01/2018 7:11 am

    నాదో ఆలోచన: ఎంత ప్రకృతిని ధ్వంసం చెయ్యకపోతే మనిషి అయిదు వేల యేళ్ల క్రితం వ్యవసాయం చేపట్టగలిగాడూ…

  5. విశ్వనాథ నర్తనశాల గురించి శ్రీనివాసరావు అభిప్రాయం:

    05/01/2018 4:44 am

    నాకు ఈ నాటక pdf ఉంటే మెయిల్ కి పంప ప్రార్థన

  6. ఒకటి నుంచి పదిల దాకా… గురించి Lalitha TS అభిప్రాయం:

    04/29/2018 10:10 pm

    నారాయణస్వామిగారు: మెచ్చుకున్న మీకు ధన్యవాదాలు!
    జ్యోతి: చాలా థాంక్స్!

  7. ఇదిగిదిగిదిగో నేను! గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    04/28/2018 7:00 am

    అచ్యుతుని గోపాలకృష్ణమూర్తి గారు తెలుగు పుస్తకాలు వెతుక్కుంటూ మద్రాసులోని పాండి బజార్‍లో, రాణీ బుక్ సెంటర్ కి వఛ్హినప్పుడు, మీరు ఫలానా కదా అని అంటే, “అరే ఎలా గుర్తు పట్టారు నన్ను?” అని ఆశ్చర్యపొయ్యారాయన.

    తరువాత ఎప్పుడో పంజగుట్టలోని, హైద్రాబాద్ సెంట్రల్ మాల్ లో భార్యాభర్తలు ఇద్దరూ, షూస్ కోసం వెతుక్కుంటూ ఉంటే పలకరించాను. గుర్తు చేసేలోపే, వారు నన్ను గుర్తుపట్టారు.

    ఆ, అచ్యుతుని గోపాలకృష్ణమూర్తి గారే, ఏజీకె, భారతదేశంలోని ప్రకటనా రంగాన్ని సమూలంగా మార్చివేసిన వ్యక్తి. రిలయన్స్ వారి ముద్ర సంస్థ ప్రాంభించినవాడు. దాదాపు ఏడు బిలియన్ల వార్షిక వ్యాపారం ఆ సంస్థది.

    ఇట్లా రాతల్లో మాటల్లో పాటల్లో గీతల్లో పడి తిరిగే మనుషులకు ఎదురైన తొలి గుర్తింపులన్నీ ఒక కాలమ్‌గా నడిపి, ఆ పై ఒక పుస్తకంలా తేవచ్చు కదా అని” అన్నారు కదా ఇక్కడ టపాయించాను! 🙂

  8. లలిత గీతాలు గురించి ACHARAM SHANMUKHA CHARY అభిప్రాయం:

    04/27/2018 4:51 am

    ఈ లలితగీతాలను డౌన్ లోడ్ చేసుకొనే అవకాశం లేదా ?

  9. అద్దెకిచ్చి చూడు గురించి Krishna Veni అభిప్రాయం:

    04/26/2018 9:06 am

    @దమయంతిగారూ.
    కృతజ్ఞతలు.
    అవును, ఎఫ్బిలో మీ పోస్టే యీ కథకి ప్రేరణ. కొంత యదార్థం కొంత కల్పనా.

  10. ఒకటి నుంచి పదిల దాకా… గురించి Jyothi అభిప్రాయం:

    04/24/2018 4:53 pm

    లలిత గారు, మీ పద్యం చాలా బాగుంది. Keep posting more like this.