పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు గురించి E.Gajendra Nath Reddy అభిప్రాయం:

    05/07/2018 12:19 pm

    ఒంటరి నవల తనను చదివిన ప్రతీ ఒకరికీ అనేక భావాలను కలుగజేయటం… ఆ అభిప్రాయాలపై ఇంత అద్భుతమైన చర్చ జరగటం ఆ నవలకు మరింత సమగ్రతను చేకూర్చింది. పాత్రల విషయానికొస్తే సరసయ్య పాత్ర ఉండిఉండేదా అన్న అనుమానం సమకాలీన పాఠక సమాజానికి కలుగడం సహజమే. ఐతే గతంలో ఇలాంటి వారు ఉండేవారు అనడంలో సందేహం లేదు. ఆయన పాత్ర చిత్రణలో రాజయోగి ప్రభావం ఉంది. అవధూత శ్రీ కాశీనాయనను అనుసరించే భక్తునిగా పంచభూతాల నియంత్రణనూ సాధించగలిగాడు. ఇక్కడ హేతుబద్ధత లేదు అనిపించినా, కొంతమంది సిధ్ధపురుషుల లీలలు మన పెద్దల ద్వారా మనకు ఎరుకే. ఇక పాము నర్సయ్య ఒంటిపై పాకడం రాఘవ ఆ సన్నివేశంలో ఉండటం జీవవైవిధ్యం పట్ల సానుభూతిని పెంచే విధంగా… విషపురుగైనా ప్రేమించగలిగితే హాని చేయదు… అనే భావన సృష్టించబడటం కోసం రచయిత రాసి ఉండవచ్చు. పల్లె స్వభావాన్ని, పల్లె పొదుముకునే తత్వాన్ని, పల్లె ఔన్నత్యాన్ని వివరించటంలో సన్నపురెడ్డి వారిది అందె వేసిన చేయి. ఈ నవలలో పల్లె ఆధునీకరణ సంకెళ్ళలో ఎలా బిగించబడిందో గొప్పగా రాశారు. రాఘవ అన్వేషణ సఫలం ఐన తరుణంలో రచయిత ఇచ్చిన పోలిక అద్భుతమైనదిగా లేదూ… మేదరమ్మ పాడిన తత్వం వేదాంత సారాన్ని మనకందించింది… జీవవైవిధ్య సంరక్షణతో కలసిన శ్రమైక జీవన సౌందర్య మాధుర్యాన్ని ఈ నవల చక్కగా తెలియజేసింది. పల్లె ఋణం ఎలా తీర్చుకోవాలో అద్భుతంగా తెలియజేసిందీ నవల.

  2. ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు గురించి శ్రీకాంత్ గడ్డిపాటి అభిప్రాయం:

    05/07/2018 7:14 am

    ఇక ఈ నవలలో స్పృశించబడిన ఈ క్రింది విషయాల లాంటి వాటి మీద ఎవరైనా చర్చిస్తే తెలుసుకోవాలని ఉంది.

    – “నర్సయ్య వానని నిలదీయడం”
    – “నర్సయ్య ఒంటి మీద నుండి పాము పాకి వెళ్ళిపోవడం” ఇత్యాది…

    ఇంగ్లీషు వారు చెబుతున్న క్వాంటమ్ లివింగ్, క్వాంటమ్ లైఫ్ వంటి వాటికి పై వాటికి సంబంధం ఉందా?

  3. సిలబస్: 3. ఊహ అనే ఇమాజినేషన్ గురించి శివకుమార్ తాడికొండ అభిప్రాయం:

    05/07/2018 4:59 am

    దీనిలో అన్ని బొమ్మలూ అద్భుతంగా వుండి, బాపు గారు స్వాతిలో కథలకు వేసిన బొమ్మలని (నేను చూసినవి కొన్నే అయినా) గుర్తుకు తెచ్చాయి. ఆ రచయిత(త్రు)లు ఎంత అదృష్టవంతులో గదా అనుకుంటాను ఇప్పటికీని.

  4. సిలబస్: 4. సమ్మర్ క్లాస్ గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    05/06/2018 6:08 am

    జీనాత్ అమాన్ రోజులు పోయినవిగా! కిడ్డింగ్! జీనాత్ అమానేం ఖర్మ, సావిత్రీ రోజుల్లోను అంతే! ఈ మహేశ్ బాబు రోజుల్లోను అంతే!

    స్క్రూ డ్రైవర్ పట్టుకోగానే వాడో ఇంజినీరు! కారు బొమ్మైయ్యగానే వాడో ఆర్టిస్టు! గొంతు విప్పగానే ఓ గాయని!

    వాళ్ళు కలలు కనాలి! నువ్వన్నట్టు, వాళ్ళ చూట్టూ వాళ్ళకి కావల్సినవి కూర్చితే, వాళ్ళే నేర్చుకుంటారు! తరువాత మెళకువలు నేర్పించవచ్చు!

    కానీ నీ సమ్మర్ క్లాస్ గురించి చెబితే ఎంత మందికి అర్ధం అవుతుంది!

  5. ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు గురించి amarendra dasari అభిప్రాయం:

    05/05/2018 8:12 am

    అవి అనివార్యంగా అనేకానేక మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతాయి. తద్వారా మేలు కలిగించే రచనలు అవుతున్నాయి

    – మంచి మాట.

    (వనరుల) వినియోగాన్ని నిర్వహించుకోవడం ఇపుడున్న సాంకేతికతతో అసాధ్యమా?

    – సాధ్యమని నా నమ్మకం.

    భూమి కోట్ల సంవత్సరాలుగా పెను విధ్వంసాలెన్నో చూసింది… మనిషి యేమి చూసాడు?

    – అలనాటి పెను విధ్వంసాలలో మనిషి పాత్ర లేదు. ఈనాటి విధ్వంసాలను అరికట్టడంలో మనిషి నిర్మాణాత్మక పాత్ర పోషించే ఆవకాశం బాగా ఉంది. ఆతను మనం నిందించే అంత దుర్మార్గుడు కాదు.

  6. ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు గురించి శ్రీకాంత్ గడ్డిపాటి అభిప్రాయం:

    05/05/2018 12:34 am

    అవునండి. నిజానికి అవి యునిడైమన్షనల్ నోస్టాల్జిక్ రొమాంటిసిస్మిక్ గానే రాయబడ్డాయి. తియ్యగా మెచ్చుకోవాల్సిందే. తరువాత అవి అనివార్యంగా అనేకానేక మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతాయి. తద్వారా అవి సమాజానికి చాలా మేలు కలిగించే రచనలు అవుతున్నాయి.

    మనిషి మనుగడకు ప్రకృతి ఇచ్చిన వనరులు –పూర్తిగా వినియోగింపబడేవి, ప్రతి సంవత్సరం పూరింపబడేవి అని స్ధూలంగా రెండు రకాలుగా అనుకుంటే, వీటికి అనుగుణంగా తమ వినియోగాన్ని, తమ సంఖ్యను, వ్యవస్ధను నిర్వహించుకోవడం ఇప్పుడున్న సాంకేతికతతో అసాధ్యమా? పూనిక పూనడం, ఆచరణలో పెట్టడమే అసాధ్యంలా అగుపిస్తోంది. ఈ అసంతులన విధ్వంసం అనేది మనిషే మొదలెట్టింది. ఒక నియంత్రణ కూడా మనిషే తేవాలి. మనిషి కోసమే. మనిషి మనుగడ కోసమే.

    తన మూర్ఖతతోనో, అతితెలివితోనో ఇగ్నొరెంటుగా ఇలాగే పోతూ ఉంటే ప్రకృతి పాఠం చెప్పితీరుతుంది. తన పధ్ధతిలో. భూమి తను పుట్టాక అసలు సిసలు పెనువిధ్వంసాలెన్నో చూసింది కోట్ల సంవత్సరాలుగా. మనిషేంచూశాడు?

  7. అహం బ్రహ్మాస్మి గురించి varma అభిప్రాయం:

    05/05/2018 12:15 am

    ధన్యవాదాలు శివకుమార్ గారూ. సదా మీ సలహాలనీ సూచనలనీ ఆకాంక్షిస్తూ.

  8. రజనీకాంతరావు ప్రభావం నాపై చాలా ఉంది: బాలమురళీకృష్ణ జ్ఞాపకాలు గురించి శివకుమార్ తాడికొండ అభిప్రాయం:

    05/04/2018 7:55 pm

    బాలమురళిగారితో ఇంటర్వ్యూని ప్రచురించినందుకు ధన్యవాదాలు. ఆనాటి రికార్డింగులు ఏవీ లేకపోవడం, చాలా కార్యక్రమాలు లైవ్ గా నడవడం (వోలేటి గారి సంగీత శిక్షణ కార్యక్రమంతో సహా) మన దురదృష్టం. చివరిలో పేర్కొన్న అంశాలని నేను తెలుసుకోవడం మొదటిసారి అవడం వల్ల “ఔరా!” అనిపించింది.

  9. అహం బ్రహ్మాస్మి గురించి శివకుమార్ తాడికొండ అభిప్రాయం:

    05/04/2018 7:38 pm

    కథ, కథనం అద్భుతం. పాత్రలు సజీవంగా ముందు నిలిచాయి. అభివందనాలు! చివర్లో “సింహాద్రి మాట సగం వినిపించి సగం వినిపించక” అన్న ఆరు పదాలు నప్పలేదు. వాటితో బాటుగా సింహాద్రి చివరి డైలాగ్ లోని మొదటి రెండు పదాలనీ తొలగిస్తే సత్తిబాబు పాత్ర ఔచిత్యానికి భంగం రాకుండా ఉండేది. ఆస్తిపాస్తులు పోగొట్టుకోవడంవల్ల ఆయన నిజం గాయత్రీ మంత్రాన్ని జపించే దారిలో పడ్డారని చెప్పడం కథకుని ఉద్దేశమని అనిపించకపోవడం ఈ సూచనలకి కారణం.

  10. సిలబస్: 2. తొలి ప్రేమలేఖ గురించి శివకుమార్ తాడికొండ అభిప్రాయం:

    05/04/2018 6:06 pm

    “బ్రూయాత్”కి అర్థం అన్వర్ గారికి తెలియదని కాదు పేర్కొన్నది. తెలియని చదువరులకి ఉపయోగపడుతుందని!