As I browsed after submitting my recent most opinion, I chanced upon a PDF of a Master’s thesis “Speaking Like a Brahmin: Social Aspects of a Register of Spoken Telugu” submitted by one Brad B. Miller of Department of Linguistics and English Language, to Brigham Young University in March 2013. The list of references is quite interesting.
“శివలింగాన్ని” పూజించాలి అని మీ భావమా? శివలింగం చేతనమో అచేతనమో సహజంగా తనంత తానై ఉండాలి గానీ క్రియను బట్టి ఉండడం ఏమిటి? అంటే “దుష్టుల” దృష్టిలో అది అచేతనం మార్కండేయుని దృష్టిలో అది చేతనం అని చెప్పుకోవాలా! అంటే అది కర్తను బట్టి కూడా ఉంటుందనుకోవాలి.”
This is very interesting. “Does it depend on karta?” you ask. The expression a language resorts to to describe an event depends on the nature of the karma, that is in one word on the culture of the people who, belong to it. A language is not just its alphabet, words, sentences, syntax, semantics etc, all theses are skeletal and stale. The flesh and blood of a language is the culture of its people. Let me put it this way : the culture-language twine structures the DNA of a people.
నమస్కారాలతో
తః తః
మీరు “కిశోర్ గోడ గుద్దుకున్నాడు” – నాకు తెలిసినంత వరకూ ఈ వాక్యం సరైనదే, ‘కుక్క పురుగు తిన్నది’ – ఇది కచ్చితంగా తప్పే!” అని రాసినప్పటినించీ అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారా అని ఆలోచిస్తూనే ఉన్నాను.
“సినిమా పాటగా ఈ వాక్యం ప్రసిద్ధమైనా, నిజానికి ఇందులో కొంత తిరకాసుంది. అదేమిటో పదాలను కాస్త అటూయిటూ చేస్తే తెలుస్తుంది. ఈ వాక్యం చూడండి: రాయిని ఆడది చేసిన రాముడివా ‘ఆడది రాయిని చేసిన రాముడివా!’ దీని అర్థం ఏమిటి? ఒక ఆడదాని చేత రాయిగా మారిన రాముడివా అని అర్థం వస్తుంది. ఇలా పదక్రమం మార్చడం వల్ల అర్థం మారిపోయిందంటే అది సరైన తెలుగు వాక్యం కాదని లెక్క” అని రాశారు.
కాబట్టి బహుశా ప్రత్యేక సందర్భాలలో, సందర్భాన్ని బట్టి అర్థం తెలుస్తూ ఉన్నా, సామాన్య భాషా లక్షణాన్ని బట్టి ఉండాల్సిన ప్రత్యయం ఉండకపోతే అది భాషా స్వరూపానికి విరుద్ధంగా ఉండి, తప్పే అవుతుంది : ఆ తప్పును నిర్ణయించే పద్ధతి ఇదే (కర్తనూ కర్మనూ తారుమారు చేసి చూడడం ) అనీ మీ అభిప్రాయంగా అర్థమౌతూంది.
దీని ప్రకారం మీరుచెప్పినట్టే గోడ కిశొరు గుద్దుకున్నాడు సరైనదే. అలాగే పురుగు కుక్క తిన్నది అంటే అర్థం మారిపోవచ్చు. కాబట్టి కుక్క పురుగు తిన్నది అనడం సరైనది కాకపోవచ్చు.
కానీ ఇదన్ని సందర్భాల్లో కుదరక పోవచ్చు. అసలు సూతమైన జడంబు ద్వితీయకు ప్రథమ బహుళంబుగా అగు – కే వర్తించదు. అసలు విభక్తులను బట్టి వేరు చేసినా ఇక్కడ జడంబు ప్రథమావిభక్తిలో ఉంది. కాబట్టీ జడమైన (జడము యొక్క ) ద్వితీయావిభక్తికి అనే అర్థం రాదు.
నేనదేందంటే ఇక్కడ కూడా అర్థబోధను బట్టే కానీ క్రియలను బట్టి కాదు అని. అందుకు నేనిచ్చిన ఉదాహరణ మసీదులో కాజా తిన్నాడు.
మీరు పూజించడం అనే క్రియను సూచించి “దుష్టులు గుడిలో శివలింగం పగలుగొట్టేసారు”, “మార్కండేయుడు శివలింగం పూజించాడు” – ఈ రెండు వాక్యాలలో ఏది సరైనది, ఏది కాదు, ఎందుకు? అన్నారు.
దీనికి సమాధానం చెప్పాల్సింది మీరే! “దుష్టులు గుడిలో శివలింగం పగలుగొట్టేసారు” సరైనది. “మార్కండేయుడు శివలింగం పూజించాడు” సరైనది కాదు — అనుకుంటే: ఎందుకు అంటే పగలగొట్టడం అనే క్రియకు చేతనమైన కర్మ అవసరం లేదు “కుండ పగలగొట్టినట్లు ” శివలింగం కూడా పగలగొట్టేయొచ్చు కానీ పూజించడం వరకు మాత్రం “శివలింగాన్ని” పూజించాలి అని మీ భావమా? శివలింగం చేతనమో, అచేతనమో సహజంగా తనంత తానై ఉండాలి గానీ క్రియను బట్టి ఉండడం ఏమిటి? అంటే “దుష్టుల” దృష్టిలో అది అచేతనం, మర్కండేయుని దృష్టిలో అది చేతనం అని చెప్పుకోవాలా! అంటే అది కర్తను బట్టి కూడా ఉంటుందనుకోవాలి. లేదా “మార్కండేయుడు శివలింగం పూజించాడు” సరైనది కానీ దుష్టులు గుడిలో శివలింగం పగలుగొట్టేసారు” సరైనదికాదు అంటే అది స్వవచో వ్యాఘాతమవుతుంది. లేదా రెండూ తప్పులో రెండూ సరియైనవో ఐతే గొడవే లేదు.
చెరువు నీరు నిండింది
చెరువులో నీరు నిండింది. షష్టికి ప్రధమ
చెరువు నీటితో నిండింది. తృతీయకు ప్రధమ
తెప్ప అలలూగింది తెప్ప అలలవల్ల ఊగింది పంచమికి ప్రధమ
నేను ప్రగతి (ని) (ఇదొక యాంకరు మాట )
ఇట్లాంటి అనేక సందర్భాల్లో చాలా విభక్తులకు ప్రధమ యగును.
భాషా లక్షణాలు సహజంగా ఎర్పడి పోతుంటాయి కాబట్టి అవి ఇంత సంక్లిష్టంగా ఉండవని నా అభిప్రాయం. అప్పటికేర్పడిన వ్యాకరణ సూత్రాలతో బంధించాలనుకుంటేనే సమస్య వస్తుందనుకుంటాను.
ఇంతకూ మీరు reverse పద్ధతిలో ఆసక్తికరంగా చెప్పిన, ఇంతటి దీర్ఘ విశ్లేషణను ప్రేరేపించిన, అసలు కారణం “వెలుంగర్చింతు”. దీన్నే “అర్చింతు వెలుగు” అని ఉంటే మీరూ ఒప్పుకుని ఉంటారనుకుంటాను. అలాగే అర్చింతు కైలాసాచల సానువాసము ఇత్యాదులన్నీ సరైనవే అనిపిస్తాయి. దీనికి కారణం “జడంబు ద్వితీయకు ప్రథమ బహుళంబుగా అగు” కాక అర్చింతు వెలుగు(న్) లో నకారానికి లోపం రావడమే.
ఇక వెలుంగర్చింతు అని సంధి చేసినా ఇబ్బందేం లేదు. సంధి అంటే సంహిత కు లక్షణం కాబట్టి, అత్యంతమైన సన్నికర్ష (దగ్గరగా ఉండడమే) సంహిత కాబట్టీ సంధి (అది సమాసంకూడా ఐతే తప్ప) లో ఉన్న పదాలు విడదీసి అన్వయం చెప్పుకోవచ్చు. అంటే వెలుంగర్చింతు అన్నా అర్చింతు వెలుగు(న్) అన్నా ఒకటే!
శ్రీ కామేశ్వర రావు :
మీ వివరణలు బాగున్నవి. ‘ఏ కొద్ది’ అంటే ‘any finite’ అన్న అర్థం మీరు ఇచ్చిన వివరణ తర్వాత నాకు తోచింది. శ్రీ శాయి పరిచ్ఛేదాన్ని పేర్కొన్నారు కానీ రచనలో మీరు చెప్పిఉండవలసిందనే నేను అనుకుంటున్నాను. దువ్వూరివారి వ్యాఖ్యలో కనబడుతున్న ఉదాహరణలు అచ్చతెలుగు మాటలు గల్గినవని మీరు గమనించి ఉంటారు. నేను ‘వెలుంగు అర్చింతు’ వంటి వాటికి ఈసూత్రం పట్టదనే అనుకుంటున్నాను.
ఒక విషయం : తెలుగు సినిమా వ్యాపార ప్రసాదంగా వ్యవహారంలో ఉన్న ఈ నాటి హిందీ- ఇంగ్లిష్ సంకర తెలుగుకు – వార్తా పత్రికలు సైతం ‘అదుర్స్’ వంటి పదాలను అచ్చోసిన ఆంబోతులుగా జనం మీదకు వదిలేస్తే విచ్చలవిడిగా విహరిస్తున్న జీవ భాషకు- ‘సూరి’ సూత్రాల వర్తింపు ప్రశ్నించవచ్చునా?
నమస్కారాలతో
తః తః
విజయ భాస్కర రెడ్డి గారూ, మనకి బడిలో వ్యాకరణం నేర్పే తీరు ఇలాంటి సందేహాలకు దారి తీస్తోంది! డు, ము, వు, లు అనేవి ప్రత్యయాలు. కొన్ని రకాలైన పదాలకు ప్రథమావిభక్తిలో ఆ ప్రత్యయాలు వస్తాయి. కొన్ని పదాలకు ప్రథమా విభక్తిలో ఏ ప్రత్యయాలు రావు. అంచేత డు, ము, వు, లు లేకపోయినా చెట్టు, చీర మొదలైన పదాలు ప్రథమావిభక్తిలోనే ఉంటాయి.
తఃతఃగారు,
1. నాకు తెలిసినంతవరకూ ఈ సూత్రానికి తత్సమ, తద్భవ, ఆచ్ఛికమనే భేదం లేదు. ఈ సూత్రం కారక పరిచ్ఛేదంలో వస్తుంది.
2. ” పిల్లి తిన్న కోడి పిలిచిన బల్కునా?” – ఈ వాక్యాన్ని ఇంకొకరు కూడా ఈ వ్యాస సందర్భంలోనే నాతో ప్రస్తావించారు 🙂 నేను అర్థం చేసుకున్నంత వరకూ, పద్య సందర్భాన్ని బట్టి, ఇది పిల్లిని తిన్న కోడి కాదు, పిల్లి తినేసిన కోడి. కాబట్టి ఇక్కడ పిల్లి కర్మ కాదు. అంచేత ఇక్కడ ద్వితీయా విభక్తి అవసరం లేదు. అలాగే “పలుకునా” అనే క్రియకు కర్త కోడి. దానికీ ద్వితీయ రాదు. “పిల్లిని తిన్న కోడి” అనే భావం రావాలంటే అక్కడ కచ్చితంగా “పిల్లిఁ దిన్న కోడి” అని సరళాదేశం జరిగి అరసున్న రావాలి.
3. నేను వ్యాసంలో ప్రస్తావించినట్లు, ఒక సూత్రంలో, ‘వైకల్పికం’, ‘బహుళం’ అనే పదాలు ప్రయోగించకుండా ‘అగు’ అని ఊరుకుంటే అది నిత్యమనే అర్థం. ‘కర్మంబున ద్వితీయయగు’ అనే సూత్రం ప్రకారం కర్మ వాచకానికి నిత్యంగా ద్వితీయ వచ్చి తీరాలి. కాని అలా రాని సందర్భాలు ఉండబట్టే, ఏయే సందర్భాలలో రాకుండా ఉంటుందో చెప్పడానికి ‘జడంబు…’ అన్న సూత్రం అవసరమయ్యింది. సూత్రంలో చెప్పిన కార్యం, కొన్ని చోట్ల ‘వైకల్పికం’గా జరగడమూ, కొన్ని సందర్భాలలో ‘నిత్యంగా’ జరగడమో, లేదా అసలు జరగకుండా ఉండడమో జరిగితే దాన్ని ‘బహుళం’ అంటారు. ఒక సూత్ర కార్యం బహుళంగా జరిగేటప్పుడు, ఏయే సందర్భాలలో నిత్యమో, ఏయే సందర్భాలలో వైకల్పికమో, ఏయే సందర్భాలలో ఆ కార్యం జరగదో చెప్పి తీరాలి. కనీసం కొన్ని ఉదాహరణలిచ్చి ఇలాంటి సందర్భాలలో ఇలా జరుగుతుంది అనయినా చెప్పాలి. ‘జడంబు ద్వితీయ…’ సూత్రంలో కూడా ఏయే సందర్భాలలో ఈ సూత్ర కార్యం జరగదో, అంటే పదం జడమైనా ద్వితీయ కచ్చితంగా వచ్చి తీరుతుందో చిన్నయ్యసూరి వివరించాడు. అయితే అవి నేనీ వ్యాసంలో చెపుతున్న అపవాదాలు కావు కాబట్టి, అతను పేర్కొన్నవి సరికావని నేను భావిస్తాను కాబట్టి, దానికి ఈ వ్యాస విషయంతో సంబంధం లేదు కాబట్టి, వాటిని ఇక్కడ వివరించ లేదు. మీరు కారక పరిచ్ఛేదంలో ఈ సూత్ర వివరణ చూడండి.
4. భాషను పరిపూర్ణంగా ఒదిగించడానికి ఎన్ని సూత్రాలైనా ‘కొద్ది’ సూత్రాలుగా మిగిలిపోతాయని!
తజ్జనని లోగిటం గల
రజ్జుపరంపరలఁ గ్రమ్మఱన్ సుతుఁ గట్టన్
బొజ్జ దిరిగి రాదయ్యె జ
గజ్జాలము లున్న బొజ్జఁ గట్టన్ వశమే? :-))
శ్రీ కామేశ్వర రావు :
1. మొదలుబెడుతూ మీరు చెప్పిన వాక్యాల లో అన్నీ – కర్త, కర్మ,,క్రియ – మూడూ అచ్చ తెలుగు పదాలు గా ఉన్నవి కావు . ‘వెలుంగు అర్చింతు’లలో ఒక మాట ‘ తెలుగు ‘ కాదు . పరవస్తు వారి తెలుగు వ్యాకరణ సూత్రం సంకరాలకు వర్తిస్తుందా? మీరు ఈ సూత్రం ఏ పరిచ్ఛేదం లోదో చెప్పిఉండ వలసినది.
2. “అందుకే కర్త కర్మ రెండూ చైతన్యపదార్థాలే అయినప్పుడు వాటి మధ్య భేదం తెలియడానికి ద్వితీయా విభక్తి తప్పనిసరి అవుతుంది. ”
ఈ వేమన పద్యపాదం చూడండి : ” పిల్లి తిన్న కోడి పిలిచిన బల్కునా? ” (‘బడు’ లేని ‘చైతన్య’ వంతమైన అచ్చ తెలుగు మాట).
3. “కర్మ జడమైనా ద్వితీయా ప్రత్యయం కచ్చితంగా వచ్చి తీరాల్సిన సందర్భాలు మనకు వ్యవహారంలో కొన్ని కనిపిస్తాయి. వాటిని ఈ సూత్రంలో చిన్నయ్యసూరి పేర్కొనలేదు.” అవసరం లేదు .అలా పేర్కొనే పక్షాన ‘ నిత్యము ‘ అని ఒక సూత్రం చేయాలి. కచ్చితంగా రాని సందర్భాలు పేర్కొనాలి : చూ : ‘ బహుళ గ్రహణము చేత స్త్రీ వాచక…. సంధి లేదు. ఆమ్మ యిచ్చెను.
4. “సహజంగా ఏర్పడిన ఏ మానవభాష కూడా ఏ కొద్ది సూత్రాలలోనో పరిపూర్ణంగా ఒదిగిపోదు.” ‘కొద్ది’ అని అనటం లో ఒదిగే టట్టు చేయగలిగేటన్ని సూత్రాలు చేయగలిగే అవకాశం ఉండ వచ్చనే నేనా!
నమస్కారాలతో
తః తః
ఇదిగిదిగిదిగో నేను! గురించి Ajit Kumar అభిప్రాయం:
04/16/2018 3:19 am
మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే ఆ కిక్కే వేరప్పా
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ ఆహ్వానం గురించి Siva aDusumilli అభిప్రాయం:
04/15/2018 11:31 am
రిజిస్ట్రేషను ఇక్కడ చేసుకోండి.
http://dtlcgroup.org
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి తః తః అభిప్రాయం:
04/14/2018 12:46 pm
Dear Friends:
As I browsed after submitting my recent most opinion, I chanced upon a PDF of a Master’s thesis “Speaking Like a Brahmin: Social Aspects of a Register of Spoken Telugu” submitted by one Brad B. Miller of Department of Linguistics and English Language, to Brigham Young University in March 2013. The list of references is quite interesting.
తః తః
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి తః తః అభిప్రాయం:
04/14/2018 9:16 am
Sri Indrakanti:
This is very interesting. “Does it depend on karta?” you ask. The expression a language resorts to to describe an event depends on the nature of the karma, that is in one word on the culture of the people who, belong to it. A language is not just its alphabet, words, sentences, syntax, semantics etc, all theses are skeletal and stale. The flesh and blood of a language is the culture of its people. Let me put it this way : the culture-language twine structures the DNA of a people.
నమస్కారాలతో
తః తః
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి indrakanti pinakapani అభిప్రాయం:
04/14/2018 6:16 am
కామేశ్వర రావు గారూ,
మీరు “కిశోర్ గోడ గుద్దుకున్నాడు” – నాకు తెలిసినంత వరకూ ఈ వాక్యం సరైనదే, ‘కుక్క పురుగు తిన్నది’ – ఇది కచ్చితంగా తప్పే!” అని రాసినప్పటినించీ అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారా అని ఆలోచిస్తూనే ఉన్నాను.
“సినిమా పాటగా ఈ వాక్యం ప్రసిద్ధమైనా, నిజానికి ఇందులో కొంత తిరకాసుంది. అదేమిటో పదాలను కాస్త అటూయిటూ చేస్తే తెలుస్తుంది. ఈ వాక్యం చూడండి: రాయిని ఆడది చేసిన రాముడివా ‘ఆడది రాయిని చేసిన రాముడివా!’ దీని అర్థం ఏమిటి? ఒక ఆడదాని చేత రాయిగా మారిన రాముడివా అని అర్థం వస్తుంది. ఇలా పదక్రమం మార్చడం వల్ల అర్థం మారిపోయిందంటే అది సరైన తెలుగు వాక్యం కాదని లెక్క” అని రాశారు.
కాబట్టి బహుశా ప్రత్యేక సందర్భాలలో, సందర్భాన్ని బట్టి అర్థం తెలుస్తూ ఉన్నా, సామాన్య భాషా లక్షణాన్ని బట్టి ఉండాల్సిన ప్రత్యయం ఉండకపోతే అది భాషా స్వరూపానికి విరుద్ధంగా ఉండి, తప్పే అవుతుంది : ఆ తప్పును నిర్ణయించే పద్ధతి ఇదే (కర్తనూ కర్మనూ తారుమారు చేసి చూడడం ) అనీ మీ అభిప్రాయంగా అర్థమౌతూంది.
దీని ప్రకారం మీరుచెప్పినట్టే గోడ కిశొరు గుద్దుకున్నాడు సరైనదే. అలాగే పురుగు కుక్క తిన్నది అంటే అర్థం మారిపోవచ్చు. కాబట్టి కుక్క పురుగు తిన్నది అనడం సరైనది కాకపోవచ్చు.
కానీ ఇదన్ని సందర్భాల్లో కుదరక పోవచ్చు. అసలు సూతమైన జడంబు ద్వితీయకు ప్రథమ బహుళంబుగా అగు – కే వర్తించదు. అసలు విభక్తులను బట్టి వేరు చేసినా ఇక్కడ జడంబు ప్రథమావిభక్తిలో ఉంది. కాబట్టీ జడమైన (జడము యొక్క ) ద్వితీయావిభక్తికి అనే అర్థం రాదు.
నేనదేందంటే ఇక్కడ కూడా అర్థబోధను బట్టే కానీ క్రియలను బట్టి కాదు అని. అందుకు నేనిచ్చిన ఉదాహరణ మసీదులో కాజా తిన్నాడు.
మీరు పూజించడం అనే క్రియను సూచించి “దుష్టులు గుడిలో శివలింగం పగలుగొట్టేసారు”, “మార్కండేయుడు శివలింగం పూజించాడు” – ఈ రెండు వాక్యాలలో ఏది సరైనది, ఏది కాదు, ఎందుకు? అన్నారు.
దీనికి సమాధానం చెప్పాల్సింది మీరే! “దుష్టులు గుడిలో శివలింగం పగలుగొట్టేసారు” సరైనది. “మార్కండేయుడు శివలింగం పూజించాడు” సరైనది కాదు — అనుకుంటే: ఎందుకు అంటే పగలగొట్టడం అనే క్రియకు చేతనమైన కర్మ అవసరం లేదు “కుండ పగలగొట్టినట్లు ” శివలింగం కూడా పగలగొట్టేయొచ్చు కానీ పూజించడం వరకు మాత్రం “శివలింగాన్ని” పూజించాలి అని మీ భావమా? శివలింగం చేతనమో, అచేతనమో సహజంగా తనంత తానై ఉండాలి గానీ క్రియను బట్టి ఉండడం ఏమిటి? అంటే “దుష్టుల” దృష్టిలో అది అచేతనం, మర్కండేయుని దృష్టిలో అది చేతనం అని చెప్పుకోవాలా! అంటే అది కర్తను బట్టి కూడా ఉంటుందనుకోవాలి. లేదా “మార్కండేయుడు శివలింగం పూజించాడు” సరైనది కానీ దుష్టులు గుడిలో శివలింగం పగలుగొట్టేసారు” సరైనదికాదు అంటే అది స్వవచో వ్యాఘాతమవుతుంది. లేదా రెండూ తప్పులో రెండూ సరియైనవో ఐతే గొడవే లేదు.
చెరువు నీరు నిండింది
చెరువులో నీరు నిండింది. షష్టికి ప్రధమ
చెరువు నీటితో నిండింది. తృతీయకు ప్రధమ
తెప్ప అలలూగింది తెప్ప అలలవల్ల ఊగింది పంచమికి ప్రధమ
నేను ప్రగతి (ని) (ఇదొక యాంకరు మాట )
ఇట్లాంటి అనేక సందర్భాల్లో చాలా విభక్తులకు ప్రధమ యగును.
భాషా లక్షణాలు సహజంగా ఎర్పడి పోతుంటాయి కాబట్టి అవి ఇంత సంక్లిష్టంగా ఉండవని నా అభిప్రాయం. అప్పటికేర్పడిన వ్యాకరణ సూత్రాలతో బంధించాలనుకుంటేనే సమస్య వస్తుందనుకుంటాను.
ఇంతకూ మీరు reverse పద్ధతిలో ఆసక్తికరంగా చెప్పిన, ఇంతటి దీర్ఘ విశ్లేషణను ప్రేరేపించిన, అసలు కారణం “వెలుంగర్చింతు”. దీన్నే “అర్చింతు వెలుగు” అని ఉంటే మీరూ ఒప్పుకుని ఉంటారనుకుంటాను. అలాగే అర్చింతు కైలాసాచల సానువాసము ఇత్యాదులన్నీ సరైనవే అనిపిస్తాయి. దీనికి కారణం “జడంబు ద్వితీయకు ప్రథమ బహుళంబుగా అగు” కాక అర్చింతు వెలుగు(న్) లో నకారానికి లోపం రావడమే.
ఇక వెలుంగర్చింతు అని సంధి చేసినా ఇబ్బందేం లేదు. సంధి అంటే సంహిత కు లక్షణం కాబట్టి, అత్యంతమైన సన్నికర్ష (దగ్గరగా ఉండడమే) సంహిత కాబట్టీ సంధి (అది సమాసంకూడా ఐతే తప్ప) లో ఉన్న పదాలు విడదీసి అన్వయం చెప్పుకోవచ్చు. అంటే వెలుంగర్చింతు అన్నా అర్చింతు వెలుగు(న్) అన్నా ఒకటే!
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి తః తః అభిప్రాయం:
04/14/2018 4:21 am
శ్రీ కామేశ్వర రావు :
మీ వివరణలు బాగున్నవి. ‘ఏ కొద్ది’ అంటే ‘any finite’ అన్న అర్థం మీరు ఇచ్చిన వివరణ తర్వాత నాకు తోచింది. శ్రీ శాయి పరిచ్ఛేదాన్ని పేర్కొన్నారు కానీ రచనలో మీరు చెప్పిఉండవలసిందనే నేను అనుకుంటున్నాను. దువ్వూరివారి వ్యాఖ్యలో కనబడుతున్న ఉదాహరణలు అచ్చతెలుగు మాటలు గల్గినవని మీరు గమనించి ఉంటారు. నేను ‘వెలుంగు అర్చింతు’ వంటి వాటికి ఈసూత్రం పట్టదనే అనుకుంటున్నాను.
ఒక విషయం : తెలుగు సినిమా వ్యాపార ప్రసాదంగా వ్యవహారంలో ఉన్న ఈ నాటి హిందీ- ఇంగ్లిష్ సంకర తెలుగుకు – వార్తా పత్రికలు సైతం ‘అదుర్స్’ వంటి పదాలను అచ్చోసిన ఆంబోతులుగా జనం మీదకు వదిలేస్తే విచ్చలవిడిగా విహరిస్తున్న జీవ భాషకు- ‘సూరి’ సూత్రాల వర్తింపు ప్రశ్నించవచ్చునా?
నమస్కారాలతో
తః తః
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
04/14/2018 1:36 am
విజయ భాస్కర రెడ్డి గారూ, మనకి బడిలో వ్యాకరణం నేర్పే తీరు ఇలాంటి సందేహాలకు దారి తీస్తోంది! డు, ము, వు, లు అనేవి ప్రత్యయాలు. కొన్ని రకాలైన పదాలకు ప్రథమావిభక్తిలో ఆ ప్రత్యయాలు వస్తాయి. కొన్ని పదాలకు ప్రథమా విభక్తిలో ఏ ప్రత్యయాలు రావు. అంచేత డు, ము, వు, లు లేకపోయినా చెట్టు, చీర మొదలైన పదాలు ప్రథమావిభక్తిలోనే ఉంటాయి.
తఃతఃగారు,
1. నాకు తెలిసినంతవరకూ ఈ సూత్రానికి తత్సమ, తద్భవ, ఆచ్ఛికమనే భేదం లేదు. ఈ సూత్రం కారక పరిచ్ఛేదంలో వస్తుంది.
2. ” పిల్లి తిన్న కోడి పిలిచిన బల్కునా?” – ఈ వాక్యాన్ని ఇంకొకరు కూడా ఈ వ్యాస సందర్భంలోనే నాతో ప్రస్తావించారు 🙂 నేను అర్థం చేసుకున్నంత వరకూ, పద్య సందర్భాన్ని బట్టి, ఇది పిల్లిని తిన్న కోడి కాదు, పిల్లి తినేసిన కోడి. కాబట్టి ఇక్కడ పిల్లి కర్మ కాదు. అంచేత ఇక్కడ ద్వితీయా విభక్తి అవసరం లేదు. అలాగే “పలుకునా” అనే క్రియకు కర్త కోడి. దానికీ ద్వితీయ రాదు. “పిల్లిని తిన్న కోడి” అనే భావం రావాలంటే అక్కడ కచ్చితంగా “పిల్లిఁ దిన్న కోడి” అని సరళాదేశం జరిగి అరసున్న రావాలి.
3. నేను వ్యాసంలో ప్రస్తావించినట్లు, ఒక సూత్రంలో, ‘వైకల్పికం’, ‘బహుళం’ అనే పదాలు ప్రయోగించకుండా ‘అగు’ అని ఊరుకుంటే అది నిత్యమనే అర్థం. ‘కర్మంబున ద్వితీయయగు’ అనే సూత్రం ప్రకారం కర్మ వాచకానికి నిత్యంగా ద్వితీయ వచ్చి తీరాలి. కాని అలా రాని సందర్భాలు ఉండబట్టే, ఏయే సందర్భాలలో రాకుండా ఉంటుందో చెప్పడానికి ‘జడంబు…’ అన్న సూత్రం అవసరమయ్యింది. సూత్రంలో చెప్పిన కార్యం, కొన్ని చోట్ల ‘వైకల్పికం’గా జరగడమూ, కొన్ని సందర్భాలలో ‘నిత్యంగా’ జరగడమో, లేదా అసలు జరగకుండా ఉండడమో జరిగితే దాన్ని ‘బహుళం’ అంటారు. ఒక సూత్ర కార్యం బహుళంగా జరిగేటప్పుడు, ఏయే సందర్భాలలో నిత్యమో, ఏయే సందర్భాలలో వైకల్పికమో, ఏయే సందర్భాలలో ఆ కార్యం జరగదో చెప్పి తీరాలి. కనీసం కొన్ని ఉదాహరణలిచ్చి ఇలాంటి సందర్భాలలో ఇలా జరుగుతుంది అనయినా చెప్పాలి. ‘జడంబు ద్వితీయ…’ సూత్రంలో కూడా ఏయే సందర్భాలలో ఈ సూత్ర కార్యం జరగదో, అంటే పదం జడమైనా ద్వితీయ కచ్చితంగా వచ్చి తీరుతుందో చిన్నయ్యసూరి వివరించాడు. అయితే అవి నేనీ వ్యాసంలో చెపుతున్న అపవాదాలు కావు కాబట్టి, అతను పేర్కొన్నవి సరికావని నేను భావిస్తాను కాబట్టి, దానికి ఈ వ్యాస విషయంతో సంబంధం లేదు కాబట్టి, వాటిని ఇక్కడ వివరించ లేదు. మీరు కారక పరిచ్ఛేదంలో ఈ సూత్ర వివరణ చూడండి.
4. భాషను పరిపూర్ణంగా ఒదిగించడానికి ఎన్ని సూత్రాలైనా ‘కొద్ది’ సూత్రాలుగా మిగిలిపోతాయని!
తజ్జనని లోగిటం గల
రజ్జుపరంపరలఁ గ్రమ్మఱన్ సుతుఁ గట్టన్
బొజ్జ దిరిగి రాదయ్యె జ
గజ్జాలము లున్న బొజ్జఁ గట్టన్ వశమే? :-))
అది నాది గురించి Sasikala అభిప్రాయం:
04/13/2018 11:35 pm
చక్కని శైలితో రీడర్స్ ఆలోచనకు స్పేస్ ఇచ్చారు. ఒక్క వాక్యం అదనంగా లేదు. స్టిల్ హాంటింగ్ స్టోరీ 👌👌
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి తః తః అభిప్రాయం:
04/13/2018 1:15 pm
శ్రీ కామేశ్వర రావు :
1. మొదలుబెడుతూ మీరు చెప్పిన వాక్యాల లో అన్నీ – కర్త, కర్మ,,క్రియ – మూడూ అచ్చ తెలుగు పదాలు గా ఉన్నవి కావు . ‘వెలుంగు అర్చింతు’లలో ఒక మాట ‘ తెలుగు ‘ కాదు . పరవస్తు వారి తెలుగు వ్యాకరణ సూత్రం సంకరాలకు వర్తిస్తుందా? మీరు ఈ సూత్రం ఏ పరిచ్ఛేదం లోదో చెప్పిఉండ వలసినది.
2. “అందుకే కర్త కర్మ రెండూ చైతన్యపదార్థాలే అయినప్పుడు వాటి మధ్య భేదం తెలియడానికి ద్వితీయా విభక్తి తప్పనిసరి అవుతుంది. ”
ఈ వేమన పద్యపాదం చూడండి : ” పిల్లి తిన్న కోడి పిలిచిన బల్కునా? ” (‘బడు’ లేని ‘చైతన్య’ వంతమైన అచ్చ తెలుగు మాట).
3. “కర్మ జడమైనా ద్వితీయా ప్రత్యయం కచ్చితంగా వచ్చి తీరాల్సిన సందర్భాలు మనకు వ్యవహారంలో కొన్ని కనిపిస్తాయి. వాటిని ఈ సూత్రంలో చిన్నయ్యసూరి పేర్కొనలేదు.” అవసరం లేదు .అలా పేర్కొనే పక్షాన ‘ నిత్యము ‘ అని ఒక సూత్రం చేయాలి. కచ్చితంగా రాని సందర్భాలు పేర్కొనాలి : చూ : ‘ బహుళ గ్రహణము చేత స్త్రీ వాచక…. సంధి లేదు. ఆమ్మ యిచ్చెను.
4. “సహజంగా ఏర్పడిన ఏ మానవభాష కూడా ఏ కొద్ది సూత్రాలలోనో పరిపూర్ణంగా ఒదిగిపోదు.” ‘కొద్ది’ అని అనటం లో ఒదిగే టట్టు చేయగలిగేటన్ని సూత్రాలు చేయగలిగే అవకాశం ఉండ వచ్చనే నేనా!
నమస్కారాలతో
తః తః
అది నాది గురించి Anil అట్లూరి అభిప్రాయం:
04/13/2018 7:17 am
Brevity thy name is Chandra! 🙂