కథ చాలా బాగుంది. గురుత్వాకర్షణ పన్ను భలే ఐడియా. బాధ్యత లేని ప్రభుత్వాలు పౌరులపై వేసే పన్నుల భారాలు ఇలానే ఉంటున్నాయి. నాకు కథలు చదివే అలవాటు లేదు. అయినా, ఈ కథ చివరిదాకా చదివించింది. పన్నుల గురించి ఒక రాజనీతిజ్ఞుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ప్రతి ఒక్కరూ రెండు రకాల పనులు చేస్తారని ఒక కొటేషన్ చదివా. ఒకటి పుట్టినప్పటి నుంచి “బతకడం” రెండు చనిపోయేదాకా “పన్ను” చెల్లించడం.
హరిశ్చంద్ర నాటకం కాటిసీనులో కవికోకిల గుఱ్ఱం జాషువా గారి పద్యాలను అభినవ హరిశ్చంద్ర బిరిదాంకితులు కీ॥ శే॥ శ్రీ బండారు రామారావు గారు తొలిసారిగా పాడారని మా నాన్నగారు చెప్పారు. మానాన్నగారు శ్రీ బండారు, శ్రీ చెంచు రామారావు గార్లకు సమకాలికులు. శ్రీ బండారు గారి నాటకం అని తెలిస్తే 70 కి.మీ. దూరమైనా వెళ్ళేవారని తెలిపారు. మానాన్నగారి దర్శకత్వం వహించిన శిలువధారి నాటకంలో శ్రీ రామారావుల ద్వయం చాలాసార్లు నటించినారని తెలిపారు.
అహం బ్రహ్మాస్మి గురించి రామ్ పెయ్యల అభిప్రాయం:
05/28/2018 4:14 am
చాలా చాలా బాగుంది రాజుగారు, చాలా రోజులకి మళ్లీ తూ గో కి తీసుకెళ్ళారు, ధన్యవాదాలు.
తెలుగు సాహిత్య విమర్శ – ఒక చూపు గురించి S. Narayanaswamy అభిప్రాయం:
05/26/2018 8:12 pm
బాగా విస్తృతమైన సబ్జెక్టు. సాధారణ పాఠకులకి అందేట్లు రాయడం కష్టం. మంచి ప్రయత్నం.
పంతం గురించి Swathi అభిప్రాయం:
05/22/2018 12:21 am
So lovely expression. Enjoyed it!
వేటూరి సుందర రామమూర్తి: ఆంధ్ర సినీ సాహితికి అమరకోశం గురించి వరదయ్య తిరువాయిపాటి అభిప్రాయం:
05/20/2018 11:22 pm
పాటలు వ్రాయగ నేర్చిన
వేటూరిని జూచి భక్త కోటి మురియగా
మాటలపొందిక నలరగ
తేటగు భావముల నిల్పు తీరును గనుమా
సినీ చైతన్యం గురించి వరదయ్య తిరువాయిపాటి అభిప్రాయం:
05/20/2018 10:37 pm
నడతను చెడుపును సినిమా
లెడదయు మలినంబుఁగాగ నిడుమలు దెచ్చున్
వడిబడిదుర్వ్యసనములను
సడిసేయక కుములుచుంద్రు నడిసంద్రమునన్
గురుత్వాకర్షణ సుంకం గురించి ఆర్. అన్నయ్య అభిప్రాయం:
05/20/2018 12:11 pm
కథ చాలా బాగుంది. గురుత్వాకర్షణ పన్ను భలే ఐడియా. బాధ్యత లేని ప్రభుత్వాలు పౌరులపై వేసే పన్నుల భారాలు ఇలానే ఉంటున్నాయి. నాకు కథలు చదివే అలవాటు లేదు. అయినా, ఈ కథ చివరిదాకా చదివించింది. పన్నుల గురించి ఒక రాజనీతిజ్ఞుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ప్రతి ఒక్కరూ రెండు రకాల పనులు చేస్తారని ఒక కొటేషన్ చదివా. ఒకటి పుట్టినప్పటి నుంచి “బతకడం” రెండు చనిపోయేదాకా “పన్ను” చెల్లించడం.
ఆర్. అన్నయ్య,
కర్నూలు.
ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం! గురించి madhu ayyagari అభిప్రాయం:
05/20/2018 12:43 am
అల్లసాని పెద్డన గారి సూర్యోదయ వర్ణన ఎవరైనా పొస్ట్ చేయ్యగలరా? సదా మీకు రుణపడి ఉంటాను.
నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి నేలం ఆనంద్ అభిప్రాయం:
05/19/2018 10:34 pm
హరిశ్చంద్ర నాటకం కాటిసీనులో కవికోకిల గుఱ్ఱం జాషువా గారి పద్యాలను అభినవ హరిశ్చంద్ర బిరిదాంకితులు కీ॥ శే॥ శ్రీ బండారు రామారావు గారు తొలిసారిగా పాడారని మా నాన్నగారు చెప్పారు. మానాన్నగారు శ్రీ బండారు, శ్రీ చెంచు రామారావు గార్లకు సమకాలికులు. శ్రీ బండారు గారి నాటకం అని తెలిస్తే 70 కి.మీ. దూరమైనా వెళ్ళేవారని తెలిపారు. మానాన్నగారి దర్శకత్వం వహించిన శిలువధారి నాటకంలో శ్రీ రామారావుల ద్వయం చాలాసార్లు నటించినారని తెలిపారు.
నేలం ఆనంద్, గడ్డిపాడు
గుంటూరు(జిల్లా)522001
పునరావృతమ్ గురించి Bhaskar అభిప్రాయం:
05/17/2018 9:27 am
Super Story, I love sci-fi, and it’s a pleasant surprise to find an occasional sci-fi story in Telugu.
బువ్వమ్మవ్వ గురించి Narra venugopal అభిప్రాయం:
05/15/2018 9:38 am
బాగుందండి బూబమ్మ అవ్వ కథ.