పన్నెండు సమావేశాలు జరిగిన సందర్భంగా ఇలా సింహావలోకనం చేసుకోవడం బావుంది. ఈ సమావేశం మాత్రమే కదా రచనలో ఎదురయ్యే అన్నీ సమస్యలకి ఉపశమనం కాదు కదా. అవాలని ఆశించడం కూడా అత్యాశే. ఏ రచన అయినా కొంత తపస్సు అవసరం. అది రచయిత ఏకాంతంలో జరగాల్సిందే. సమూహం ఇచ్చే, సమూహం మాత్రమే ఇవ్వగలిగే సపోర్టు ఇటువంటి సమావేశాల ద్వారా దొరుకుతుంది.
శ్రీకాంత్ గారి ఒంటరి నవలా సమీక్ష చదివాను చాలా బాగుంది అయితే వారు ఒక ప్రశ్న చర్చకు పెట్టారు నర్సయ్య వానని నిలదీయడం పైన పాము పాకుతుంటే కదలకుండా కూర్చోవడం గురించి! ప్రకృతి భాషని అర్థం చేసుకోవడం ప్రకృతితో మమేకమయ్యేవారికే సాధ్యం!
మన సంస్కృతిలో చెట్లను పూజించడం, సూర్యుడికి నమస్కరించడం వ్యవసాయ పనిముట్లను పసుపు కుంకుమ పూసి గౌరవించడం వంటివి మనకు సాయంచేసే వాటి పట్ల మనిషితనం చూపే కృతజ్ఞత.
పశువులు కూడా ప్రేమని లాలనని చిరాకుని ప్రతి ఫీలింగ్ ని గ్రహిస్తాయనేది వ్యవసాయంతో పశుపోషణతో సంబంధం వున్నవారికి అనుభవమే!
విషపు ప్రాణైనా తన జోలికి రాకపోతే అనవసరంగా కాటువేయదు మనవల్ల దానికి భయంలేనప్పుడు దానివల్ల మనకు కూడా భయం వుండదు అని నరసయ్య ఉద్దేశాన్ని తెలపటానికే ఆ సంఘటన అనుకుంటున్నాను.
ఇక వర్షాన్ని నిలదీయడం కొడుకు తనని వదిలివెళ్ళినా కుంటలోనిఅనేక పక్షులకి ఆవాసాలైన చెట్లు కొట్టడానికి నర్సయ్య అంగీకరించలేదు గాలికి మహా వృక్షం పడిపోతే గాలిమీద అతను పోట్లాడడం సహజంగానే వుంది. ప్రకృతితో తన బాధలు చెప్పుకున్నా …స్నేహం చేసినా …పోట్లాడినా …ప్రకృతి బిడ్డగా పెరిగినపుడు సాధ్యమే!
అయినా అనుభవం శాస్త్రాన్నిస్తుంది కానీ శాస్త్రం అనుభవాన్నివ్వదంటారు! ఒక సందర్భంలో రాములమ్మ రాఘవతో చంద్రునితో కష్టాలు చెప్పుకుంటే తీరతాయని చెప్తుంది. అది అవిద్యలా అజ్ఞానంలా మనకు కనిపించినా ఆర్ద్రంగా… ప్రకృతితో చేసే వారి స్నేహం ముచ్చటేస్తుంది
కోరిక తీరకపోతే …మనకన్నా చందమామకు ఎక్కువ కష్టాలని నచ్చచెప్పుకునే వారి హృదయ సంస్కారానికి …సంతోషం వెస్తుంది ఎది ఏమైనా ఈనాటి ఈ సమాజానికి అవసరమైన అంశాన్ని…సజీవ చిత్రంగా కళ్ళముందు నిలిపిన రచయిత అభినందనీయులు.
గడినుడి – 19 గురించి Jyothi అభిప్రాయం:
05/13/2018 10:59 pm
నమస్తే, నేను ఒక వారం కిందట నా సమాధానాలు పంపాను, కానీ ఈమెయిల్ కన్ఫర్మేషన్ రాలేదు. మళ్ళీ సబ్మిట్ చెయ్యవచ్చా?
[తప్పకుండా. మీరు సమాధానాలు ఎన్ని సార్లయినా పంపవచ్చు. మీ సమాధానాలన్నీ సరైనవే అయితే అభినందిస్తూ వెంటనే ఈ-మెయిల్ పంపుతాము. — సం. ]
జనరంజని: మహానటి సావిత్రి గురించి suresh adapa అభిప్రాయం:
05/12/2018 11:28 pm
This appears 95% of the source for the movie and her biopic
పంతం గురించి Bhanu అభిప్రాయం:
05/12/2018 10:36 am
బాగుంది మానస గారూ. కానీ ఏదో తొందరలో రాసినట్టు, మీ శైలికి భిన్నంగా అనిపించింది.
భాను కేశరాజు
సిలబస్: 4. సమ్మర్ క్లాస్ గురించి నారాయణ అభిప్రాయం:
05/11/2018 11:05 am
Super!😊👍
అన్నమాచార్య సంకీర్తనల రాగాల విశిష్టత: రజనీకాంతరావు గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
05/11/2018 7:18 am
Many thanks Parucuru Sreenivas garu!
జనరంజని: మహానటి సావిత్రి గురించి శ్రీ రంగనాథ స్వామి అభిప్రాయం:
05/10/2018 10:24 pm
🙏🙏🙏🙏
కథా ఉత్సవాలు పన్నెండు గురించి S. Narayanaswamy అభిప్రాయం:
05/10/2018 8:47 am
పన్నెండు సమావేశాలు జరిగిన సందర్భంగా ఇలా సింహావలోకనం చేసుకోవడం బావుంది. ఈ సమావేశం మాత్రమే కదా రచనలో ఎదురయ్యే అన్నీ సమస్యలకి ఉపశమనం కాదు కదా. అవాలని ఆశించడం కూడా అత్యాశే. ఏ రచన అయినా కొంత తపస్సు అవసరం. అది రచయిత ఏకాంతంలో జరగాల్సిందే. సమూహం ఇచ్చే, సమూహం మాత్రమే ఇవ్వగలిగే సపోర్టు ఇటువంటి సమావేశాల ద్వారా దొరుకుతుంది.
ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు గురించి M b d syamala అభిప్రాయం:
05/10/2018 7:37 am
శ్రీకాంత్ గారి ఒంటరి నవలా సమీక్ష చదివాను చాలా బాగుంది అయితే వారు ఒక ప్రశ్న చర్చకు పెట్టారు నర్సయ్య వానని నిలదీయడం పైన పాము పాకుతుంటే కదలకుండా కూర్చోవడం గురించి! ప్రకృతి భాషని అర్థం చేసుకోవడం ప్రకృతితో మమేకమయ్యేవారికే సాధ్యం!
మన సంస్కృతిలో చెట్లను పూజించడం, సూర్యుడికి నమస్కరించడం వ్యవసాయ పనిముట్లను పసుపు కుంకుమ పూసి గౌరవించడం వంటివి మనకు సాయంచేసే వాటి పట్ల మనిషితనం చూపే కృతజ్ఞత.
పశువులు కూడా ప్రేమని లాలనని చిరాకుని ప్రతి ఫీలింగ్ ని గ్రహిస్తాయనేది వ్యవసాయంతో పశుపోషణతో సంబంధం వున్నవారికి అనుభవమే!
విషపు ప్రాణైనా తన జోలికి రాకపోతే అనవసరంగా కాటువేయదు మనవల్ల దానికి భయంలేనప్పుడు దానివల్ల మనకు కూడా భయం వుండదు అని నరసయ్య ఉద్దేశాన్ని తెలపటానికే ఆ సంఘటన అనుకుంటున్నాను.
ఇక వర్షాన్ని నిలదీయడం కొడుకు తనని వదిలివెళ్ళినా కుంటలోనిఅనేక పక్షులకి ఆవాసాలైన చెట్లు కొట్టడానికి నర్సయ్య అంగీకరించలేదు గాలికి మహా వృక్షం పడిపోతే గాలిమీద అతను పోట్లాడడం సహజంగానే వుంది. ప్రకృతితో తన బాధలు చెప్పుకున్నా …స్నేహం చేసినా …పోట్లాడినా …ప్రకృతి బిడ్డగా పెరిగినపుడు సాధ్యమే!
అయినా అనుభవం శాస్త్రాన్నిస్తుంది కానీ శాస్త్రం అనుభవాన్నివ్వదంటారు! ఒక సందర్భంలో రాములమ్మ రాఘవతో చంద్రునితో కష్టాలు చెప్పుకుంటే తీరతాయని చెప్తుంది. అది అవిద్యలా అజ్ఞానంలా మనకు కనిపించినా ఆర్ద్రంగా… ప్రకృతితో చేసే వారి స్నేహం ముచ్చటేస్తుంది
కోరిక తీరకపోతే …మనకన్నా చందమామకు ఎక్కువ కష్టాలని నచ్చచెప్పుకునే వారి హృదయ సంస్కారానికి …సంతోషం వెస్తుంది ఎది ఏమైనా ఈనాటి ఈ సమాజానికి అవసరమైన అంశాన్ని…సజీవ చిత్రంగా కళ్ళముందు నిలిపిన రచయిత అభినందనీయులు.
అహం బ్రహ్మాస్మి గురించి Dvrao అభిప్రాయం:
05/09/2018 8:24 am
కధ బావుందండి. రాయడం మానకండి.
శ్రీనాథుని చాటుపద్యములు గురించి AMBATIPUDI SAISANKAR అభిప్రాయం:
05/08/2018 5:35 am
ఈ పద్యాలకు ఆర్థాలను ఆందించగలరని విన్నపము!