పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. కలలు ఇచ్చిన బలిమి గురించి K V SESHA KUMAR అభిప్రాయం:

    06/02/2018 10:53 am

    సులోచనారాణి గారికి చక్కని నివాళి, మైథిలి అబ్బరాజు గారి వ్యాసం.
    రచనల విశ్లేషణ నేల విడిచి సాము చేయని రీతిలో సాగింది. ఢన్యవాదాలు.

    ఆ మహా రచయిత్రికి శ్రధ్ధాంజలి.

    “కలకు కల్పన జోడించి మలచి నవల
    లెన్నియో వ్రాసి పఠితల యెదల లెస్స
    దోచి యధ్ధనపూడి సులోచనమ్మ
    సురల నలరింప నిక స్వర్గపురిని జేరె”

  2. నిర్ణయం గురించి దోసపాటిరామచంద్రరావు అభిప్రాయం:

    06/02/2018 5:50 am

    చక్కని వినూత్న పత్రిక.

  3. మా పీకల మీదుంచిన కత్తులు తీయండి గురించి సంతోష్ అభిప్రాయం:

    06/02/2018 5:01 am

    తమిళనాడులో జరిగిన నిర్దాక్షిణ్య ఏకపక్ష దాడులని నిరసిస్తూ కృష్ణన్ గారు రాసిన కవితను అనువదించి తెలుగువారికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు భాస్కర్ గారు. కవితలు విమర్శనాత్మకంగా చక్కగా ఉన్నాయి.

  4. జూన్ 2018 గురించి Nageswara Rao అభిప్రాయం:

    06/01/2018 10:48 pm

    తెలుగు సాహిత్యంలో ధ్రువతారగా, నవల ప్రపంచానికి రారాణిగా వెలుగుతూ, దాదాపు ఆరు దశాబ్దాలపాటు సాహిత్యసేవ చేసి, తెలుగు సాహిత్యాన్ని చదవడాన్ని కొన్ని లక్షలమందికి అలవాటుచేసిన యద్దనపూడిగారిపై మంచి సంపాదకీయం రాస్తారని ఆశించాను. నిరాశపరిచారు.

  5. సెలవు మాస్టారూ! గురించి Jyothi అభిప్రాయం:

    06/01/2018 9:51 pm

    ఎంత ఆత్మీయమైన నివాళి. నిజంగా తెలుగు కథకుల్లో మొదటి వరసలో వుండే రచయిత. సరళమైన భాష, పరిచయమైన పరిసరాలు, నేల విడచి సాము చేయని కథాంశాలు…వీరి కథల ప్రత్యేకత. నీళ్ళు ఎప్పటికీ మరచిపోలేని గొప్ప కథ.

  6. నాకు నచ్సిన పద్యం: గౌతమీకోకిల వేదుల గురించి Vasu (Srinivasa Nyayapati) అభిప్రాయం:

    06/01/2018 8:57 pm

    ఆరోజుల్లో రేడియోలో వినడమే. అప్పట్లో కవిపేరు కూడా చెప్పేవారు. అదే నా దగ్గరున్న ఆధారం. నా దగ్గర పాటల పుస్తకాలు లేవు. మరే ఆధారమూ లేదు. ఒకవేళ మీరన్నది సరైతే, Sorry for false alert.

    -Vasu-

  7. జూన్ 2018 గురించి lyla yerneni అభిప్రాయం:

    06/01/2018 3:10 pm

    “రచయితలు ఇప్పటికీ పాతకాలపు సాహిత్య భావనలనే పట్టుకుని వేలాడడం, విమర్శకులు సాహిత్యరూపలక్షణ పరిమితీపరిణామాలపై చర్చ విస్తృతంగా జరపకపోవడం ఇందుకు కారణాలు. ఈ స్థితిని సంస్కరించే దిశగా నేటి సాహిత్యకారులు అడుగువేస్తారని, రేపటితరంలో వారి వారసత్వంగా చక్కటి సాహిత్యాభిరుచిని పెంపొందిస్తారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆశించడం ఎండమావి చందమే అయినా అది ఎప్పటికీ అత్యాశ కాకూడదనే మా ఆశ.”

    పత్రిక మాసపత్రికగా మారింది, ఇండియా, ఔట్ ఆఫ్ ఇండియా రచయితలు పెరిగారు కామోసు! ఈ ఇంటర్నేషనల్ తెలుగు పత్రిక అమ్మయ్య! ఇక కక్కుర్తి నివాళి ఆచారం మాని, నిక్కపు సాహిత్య పత్రికగా మారుతుందని. అని నేనూ, మీలానే ఆశ పడినానేమో, No chance. పాత సంస్కారపు గ్రహచారం వదలదు. మూడు పువ్వులు, ఆరు కాయలు కాలేదు సరికదా, ఇప్పుడు One wedding and thousand funerals.

    కొందరు సప్లైదారు రచయితలు- వారి అభిమాన సాహితీవేత్తల చావుకు ముందే ఆర్టికల్ రెడీ చేసి ఉంచుకుని మేక్సిమమ్ ఎఫెక్ట్ కోసం టైమ్డ్ రిలీజ్ చేస్తారో, మరి కొందరి సాహితీ-సంగీత వేత్తల చక్కని రచనలు సేకరించినా, వాటిని దొరికిన వెంటనే ప్రచురించకుండా వారు చనిపోయిన తరుణంలో వాటిని రిలీజ్ చేసి ఘనంగా ధాంధూంగా సాగనంపుదామని, ఫేమిలీ కాని, సప్లైదారులు గాని, రచనలను తొక్కిపట్టి ఆపి ఉంచుతారో తెలియదు.

    ఇంతకన్నా అత్యాచారం సాహిత్యం పట్ల ఘోరాపచారం ఒక సాహితీజీవి పట్ల ఇంకోటి ఉంటుందా?

    దయచేసి మీ సమాధానమివ్వండి. తప్పక మీ ఉద్దేశమేమిటో చెప్పండి.

    Lyla

    [As much as you hate to see it, we do believe it is better to celebrate than to ignore the life and works of one when departed. And, please get used to it because we are not changing any time soon about this. ఏదీ తొక్కిపట్టుకుని ఎవరుపోతారా అని ఏ “సప్లయ్ దారులూ” చూడరు. అలా ఒకరిని నిందించటం మీకు తగదు. When we celebrate, some may come and mourn.That’s their prerogative. చచ్చిపోయినవారిని తలచుకోడం మీకు అత్యాచారం ఎలా అనిపిస్తుందో అలా అది వారి ఇష్టం. బైదివే, మీరు కోట్ చేసిన ముందుమాటకూ మీ అభిప్రాయానికి ఏ సంబంధమూ లేదు. గమనించగలరు. – సం.]

  8. చిత్రపటం గురించి ప్రశాంతి అభిప్రాయం:

    06/01/2018 2:22 pm

    చాలా బాగుంది సాంఘిక గారు మీ కవిత. చిత్రపటం.

  9. కలలు ఇచ్చిన బలిమి గురించి B.V.S.Bhanusree అభిప్రాయం:

    06/01/2018 1:14 pm

    చాలా చక్కటి విశ్లేషణ. ఆమె తన దారిలో తాను రాసుకుపోయేరు కాని, ఎవరితోనూ పోటీ పడలేదు. అవసరమైన వివరణలు ఇచ్చుకోలేదు. చాలా డిగ్నిఫైడ్‌గా ఆమె మార్గంలో ఆమె నడిచి పోయేరు!

  10. నాకు నచ్సిన పద్యం: గౌతమీకోకిల వేదుల గురించి Vasu (Srinivasa Nyayapati) అభిప్రాయం:

    06/01/2018 12:32 pm

    అంతా బాగుంది గానీ “భావకవులవలె ఎవరికి(కీ) తెలియని ఏవో పాటలు పాడాలోయ్” అన్న పాట (పెళ్ళి చేసుకుని ఇల్లుచూసుకుని…) పింగళి రాసినది కాదు, శ్రీశ్రీది.

    -వాసు-

    [మీరు పొరబడ్డారు. అది రాసినది పింగళి. ఎక్కడా, చివరికి సినిమా టైటిల్స్‌లో కూడా శ్రీశ్రీ పేరు లేదు. ఇది రాసింది శ్రీశ్రీ అని మీదగ్గర ఏమైనా ఆధారాలుంటే చూపగలరు – సం.]