పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథల గురించిన సింగమనేని గారి విశ్లేషణ చాలా బావుంది. వారి దృష్టికోణాన్ని ఆవిష్కరించిన తీరు అద్భుతంగా వుంది. కృష్ణాతీరంలోని మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల దైన్యాన్నీ, విషాదాన్నీ కథల నిండా నింపి పాఠకులకు అందించిన పెద్దిభొట్ల గురించి, రాయలసీమ ప్రాంతంలోని కరువు రైతుల కన్నీటి బతుకుల మధ్యనించి వచ్చిన కథకుడు సింగమనేని సహానుభూతితో రాసిన యీ వ్యాసం నిజాయితీగా వుంది.
నా ఈ వాఖ్య కేవలం శర్మ దంతుర్తి గారి ఈ క్రింది వాక్యాలకి సంబంధించినవి. మిగతా వ్యాఖ్యలకి సంబంధించినది కాదు.
అలా మొదట్లో ఈమాట దగ్గిర తమ రచనలు మొదలుపెట్టి, ఉత్తరోత్తరా మరో చోటకి – ఈ సంపాదక వర్గం తీరు నచ్చక – వెళ్ళినవారు ఉండి ఉండవచ్చు. అది ఊరి చెరువుమీద వచ్చే కోపం లాంటిది.
రచయితలకి పత్రికలు ఎంత అవసరమో, పత్రికల మనుగడకి రచయితలూ అంతే అవసరం. రాసేవాళ్ళు కరువయ్యి మూత బడ్డ పత్రికలు చాలా ఉన్నాయి. పత్రికల వల్ల రచయితలకి ఎంత పేరు వస్తుందో, మంచి రచనల వలన పత్రికల స్థాయీ అంతే పెరుగుతుంది. ఒక పత్రిక నిలబడడానికి రచయితల కృషీ ఎక్కువే. వెలకట్టలేనిది కూడా. బాగా రాసేవారి వెంట పత్రికలు ఎందుకు వెంటబడతాయి? రాయండి మహప్రభో అంటూ. ఏదైనా ప్రత్యేక సందర్భం వస్తే రాయండీ అంటూ ఎందుకు వెంట పడతారు?
కాకపోతే పత్రిక ఒక వెసులుబాటు మాత్రమే. ఇప్పుడు చాలా మాధ్యమాలు ఉన్నాయి, రచయితలు అచ్చు దురద తీర్చుకోవడానికి. ఇది – win-win situation లాంటిది. కేవలం ఒక్కరే ఎప్పుడూ గెలవరు.
అయినా – ఎవరైనా రాయకపోవడానికి పలు కారణాలు ఉంటాయి. ఎంత కడుక్కోవలసి వచ్చినా మురికి నీరు వైపు ఎవరూ వెళ్ళరు కదా?
ఓ చెందరం గారొ,
మరీ ఆ దొర “For sale: baby shoes, never worn”, కధ లాగా, మీ కధలు కూడా ఇంకా చిక్కనైతే పాఠకులలో కొంత మంది తలలు పగలగొట్టుకుంటారు అర్ధం కాక! చి. న.
మీరు ప్రస్తావించిన త్రిపుర గారి కవితని వారి అల్లుడు, రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు మొన్నామధ్య ఫేస్‍బుక్ లో ఒక టపా ద్వార పంచారు. అది ఇక్కడ ఆసక్తి ఉన్న పాఠకుల కోసం ఇస్తున్నాను.
ఓ కాఫ్కా సుబ్బరామయ్య గారి యింగువ వృత్తాంతం – త్రిపుర
అతనిప్పుడు ఒక ఎముకల గూడు
ఎవరీ ప్రపంచంలో
తమ పాదముద్రలొదిలేసి పోయారు
ఎవరెవరో ఎందరెందరో ఎక్కడెక్కడికో
అనంత కాల ప్రవాహంలో కొట్టుకపోయారు’
అతనోసారి ఎన్నేళ్ల క్రితమో
రోడ్డుమీద నడుస్తూ
ఉన్నట్లుంది అన్నాడు నీతో
జీవితంలో ఎన్నో విషయాలు
తెలుసుకోకుండానే వెళ్లిపోతాం
నువ్వు రోడ్డు మీద పోతూంటావ్
అవతల దూరంగా వెళ్తున్న ఎవరినో
చూడాలనుకుంటావ్
కాని ఏ లారీయో ట్రక్కో అడ్డువస్తుంది
అంతే, ఆ మనిషిని ఎప్పటికీ చూడలేవు
ఏదో తెలుసుకోవాలనో చూడాలనో
అనుకుంటూనే
కాలం గడిచిపోతుంది
చివరకు అట్లాగా చచ్చిపోతాం
ఆఖరుగా ఒక ప్రశ్న:
యింతకీ ‘యింగువ’ ఏమిటి?
ఒక కుడివైపు చిన్నగదిలో
కిటికీ పక్కన నవ్వారు మంచానికి
అతడిపుడొక అంటుకున్న బల్లి
మగత లోంచీ దగ్గు లోంచీ
ఎప్పుడో ఒకసారి పైకి చూస్తూ
వచ్చిన వాళ్లందర్నీ
ఏదో అడుగుతున్నాడు
అతని గుండెలమీదికి వంగి విందామని
నువ్వు ఏమిటి కావాలని అడిగితే
ఆఖరి గరగర ఊపిరితో
యింగువ ఏమిటి అన్నాడు
తరవాత రెండుసార్లు తల ఎగరేసి
దేన్నో వెతుకుతున్నట్లు చూసి
అంతా అయిపోయిందనిపించాడు
యింగువ ఏమిటో అతనికి తెలియలేదు
సుబ్బరామయ్యగారు కూడా చెప్పలేదు
నీక్కూడా చాలా తెలుసు
కాని యింగువ ఏమిటో యిప్పటికీ తెలియదు
అదొక కుట్ర
అదొక విద్యుత్ రహస్యం
అదొక మాయావి చెలగాటం
అదొక పులులు తిరిగే రాత్రి
ఏదేనా అవవచ్చు
తెలుసుకోవాల్సిన అవసరం
వుందోలేదో కూడా తెలియదు
నవ్వారు మంచం మీదో
హాస్పిటల్ ఆక్సిజన్ టెంట్ లోనో
ఆఖరి శ్వాస విడుస్తున్నప్పుడైనా
(‘త్రిపుర కాఫ్కా కవితలు’, ప్రచురణ సాహితీ మిత్రులు, విజయవాడ, 2001)
నేను చదివే తెలుగు పత్రిక ఒక్క ‘ఈమాట’ మాత్రమే. నాకు సాహిత్యం మీద ఆసక్తితో మాత్రమే ఇక్కడకు వచ్చేది. ఈమాట సంపాదకుల లాగానే నేను. సాహిత్యం మీదే ఆసక్తి.
ఈ లోపల ఈ పత్రికలో వేరే ఆర్టికల్స్ చదువుతూనే ఉంటాను. వాటి మీద అభిప్రాయాలు ఈ మేగజీన్ లో రాస్తూనే ఉంటాను. ఎప్పటి మాదిరే. కొన్నేళ్లుగా ఈ పత్రికలో నేను రచన చేస్తూనే ఉన్నాగా. ఈ ఒక్క కామెంట్ మీద ఎక్కువ తక్కువ ఇంట్రస్ట్ ఏమీలేదు. ఇదీ అన్ని రచనల్లానే.
ప్రపంచంలో తెలుగు పరిస్ధితిలో నాకు అసలు ఆసక్తి లేదు. ఇంకో మేగజీన్ కు తెలుగులో రాయాలన్న ఆలోచన లేదు.
Nice to hear from you. – Lyla
[Thank you for your kind words. The respect is mutual.
We do agree that all rights belong the writer. It has always been the policy of eemaata. So, you are free (not that you need our permission) to publish your poem in any other public forum to continue the discussion there (or, for that matter write an article right here in eemaata explaining your views on posthumous celebrations of artists and why you abhor them). However, we are sorry that we cannot delete/alter the published comment history here. -Ed.]
మాల్ ప్రాక్టీసు అన్నారు కనక ఈ ముక్క చెప్దామనిపించింది. ఆ మధ్యన ఒక పెద్దాయన మెక్ డొన్నాల్డ్ వారిని కోర్టుకీడ్చాడు(ట) – కారణం ఏమిటంటే, అక్కడ అమ్మే తిండి తింటూ ఈయన లావు అయిపోయాడు. మరి అక్కడ ఎందుకు తిన్నావయ్యా మగడా అంటే అక్కడ చవక కనక. అలా చవగ్గా అమ్మడం వల్లే నేను ఇలా అయ్యాను. ఇన్ని మిలియన్లు ఇప్పించండి అని వాదన. జడ్జ్ గారు పది నిముషాల్లో దీన్ని విసిరికొట్టారు.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, మీరు కనక కోర్టుకి వెళ్తే – ఏదో రామాయణం సినిమాలో డయలాగు గుర్తుకొస్తోంది – “నా తోకమీద ఈకలు కూడా పీకలేవురా.” జడ్జ్, కోర్టు దాకా ఎందుగ్గానీ ఓ (ఆ! చెట్టుకింద వాడే) లాయర్ ని అడిగి చూడండి. మీకు నిజంగానే “ఉన్నదున్నట్టు ప్రచురించుకోవాలనుంటే ఓ బ్లాగో, ట్వీటొ ఫేసు బుక్కో మొదలుపెట్టండి. అయితే వాటినెంతమంది చూస్తారో ఎలా మిమ్మల్ని అభినందిస్తారో, పేడనీళ్లు జల్లుతారో అనేది ఆ బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. ముఖే ముఖే సరస్వతి అన్నారు కదా? అలా మొదట్లో ఈమాట దగ్గిర తమ రచనలు మొదలుపెట్టి, ఉత్తరోత్తరా మరో చోటకి – ఈ సంపాదక వర్గం తీరు నచ్చక – వెళ్ళినవారు ఉండి ఉండవచ్చు. అది ఊరి చెరువుమీద వచ్చే కోపం లాంటిది.
ఆఖరిగా ఈ ముక్క కూడా చెప్పనివ్వండి – ఏమీ లాభాపేక్ష లేకుండా అష్టకష్టాలూ పడుతూ తెలుగుకి ఏదో తమవంతు సాయం చేద్దాం అనుకుంటూ, పంటికింద ఇంగువముక్కల్లా ఎడ్వర్ టైజ్ మెంటులు తగలకుండా (బ్లాగుల్లో, ట్వీటుల్లో, ఫేసు బుక్కులో అలా కుదరదు అని మీకు తెలియకపోతే) ఉచితంగా సాహిత్యం (అదే, తమకి దొరికినంతలో మంచివి ప్రచురిస్తూ) అందిచ్చే పత్రికలో మీర్రాసిన ఒక ఆఫ్టరాల్ చిన్న కామెంటు ప్రచురించకపోతే మీకింత కోపం/దుగ్ధ ఎందుకొస్తున్నాయో తెలుసుకోవచ్చా? సంపాదకులు ఎవరికీ కారణం చెప్పక్కర్లేదు కానీ మీకు చేతనైనంతలో చెప్పారని నాకు అనిపించింది. ఇంకా దీన్ని కెలుకుతారెందుకు?
మా పీకల మీదుంచిన కత్తులు తీయండి గురించి శోభ అభిప్రాయం:
06/06/2018 7:33 am
చక్కని అనువాదం… బలమైన ప్రతిఘటనా స్వరం భాస్కర్ గారూ…
మన కాలం మహాకథకుడు పెద్దిభొట్ల గురించి సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి అభిప్రాయం:
06/06/2018 1:22 am
పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథల గురించిన సింగమనేని గారి విశ్లేషణ చాలా బావుంది. వారి దృష్టికోణాన్ని ఆవిష్కరించిన తీరు అద్భుతంగా వుంది. కృష్ణాతీరంలోని మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల దైన్యాన్నీ, విషాదాన్నీ కథల నిండా నింపి పాఠకులకు అందించిన పెద్దిభొట్ల గురించి, రాయలసీమ ప్రాంతంలోని కరువు రైతుల కన్నీటి బతుకుల మధ్యనించి వచ్చిన కథకుడు సింగమనేని సహానుభూతితో రాసిన యీ వ్యాసం నిజాయితీగా వుంది.
సెలవు మాస్టారూ! గురించి రామదాసు అభిప్రాయం:
06/06/2018 1:22 am
ఈ కధ పేరు ఇంగువ అనుకుంటాను, చాలా కాలం క్రితం చదివాను. జీవితంలో ఒక కొత్త పార్శ్వాన్ని చూపించిన కథ.
జూన్ 2018 గురించి Gorti Brahmanandam అభిప్రాయం:
06/05/2018 11:47 am
నా ఈ వాఖ్య కేవలం శర్మ దంతుర్తి గారి ఈ క్రింది వాక్యాలకి సంబంధించినవి. మిగతా వ్యాఖ్యలకి సంబంధించినది కాదు.
రచయితలకి పత్రికలు ఎంత అవసరమో, పత్రికల మనుగడకి రచయితలూ అంతే అవసరం. రాసేవాళ్ళు కరువయ్యి మూత బడ్డ పత్రికలు చాలా ఉన్నాయి. పత్రికల వల్ల రచయితలకి ఎంత పేరు వస్తుందో, మంచి రచనల వలన పత్రికల స్థాయీ అంతే పెరుగుతుంది. ఒక పత్రిక నిలబడడానికి రచయితల కృషీ ఎక్కువే. వెలకట్టలేనిది కూడా. బాగా రాసేవారి వెంట పత్రికలు ఎందుకు వెంటబడతాయి? రాయండి మహప్రభో అంటూ. ఏదైనా ప్రత్యేక సందర్భం వస్తే రాయండీ అంటూ ఎందుకు వెంట పడతారు?
కాకపోతే పత్రిక ఒక వెసులుబాటు మాత్రమే. ఇప్పుడు చాలా మాధ్యమాలు ఉన్నాయి, రచయితలు అచ్చు దురద తీర్చుకోవడానికి. ఇది – win-win situation లాంటిది. కేవలం ఒక్కరే ఎప్పుడూ గెలవరు.
అయినా – ఎవరైనా రాయకపోవడానికి పలు కారణాలు ఉంటాయి. ఎంత కడుక్కోవలసి వచ్చినా మురికి నీరు వైపు ఎవరూ వెళ్ళరు కదా?
ఆహవి గురించి amarendra dasari అభిప్రాయం:
06/05/2018 11:00 am
థాంక్స్ ముత్తులింగం గారు… థాంక్ యూ భాస్కర్ గారూ
మరోసారి గురించి Dr.Ismail అభిప్రాయం:
06/05/2018 12:25 am
కథ కవిత్వమైతే,
కవిత్వం కథైతే,
ఇలాగే ఉంటుంది…Splendid.👏🏼
నేనింకా ఆ ఖాళీ సినిమా హాలు,
చెత్త దగ్గరే ఆగిపోయాను.😕
మరోసారి గురించి Anil అట్లూరి అభిప్రాయం:
06/04/2018 11:51 am
ఓ చెందరం గారొ,
మరీ ఆ దొర “For sale: baby shoes, never worn”, కధ లాగా, మీ కధలు కూడా ఇంకా చిక్కనైతే పాఠకులలో కొంత మంది తలలు పగలగొట్టుకుంటారు అర్ధం కాక! చి. న.
సెలవు మాస్టారూ! గురించి Anil అట్లూరి అభిప్రాయం:
06/04/2018 11:28 am
సత్యవతి గారు,
మీరు ప్రస్తావించిన త్రిపుర గారి కవితని వారి అల్లుడు, రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారు మొన్నామధ్య ఫేస్‍బుక్ లో ఒక టపా ద్వార పంచారు. అది ఇక్కడ ఆసక్తి ఉన్న పాఠకుల కోసం ఇస్తున్నాను.
ఓ కాఫ్కా సుబ్బరామయ్య గారి యింగువ వృత్తాంతం – త్రిపుర
అతనిప్పుడు ఒక ఎముకల గూడు
ఎవరీ ప్రపంచంలో
తమ పాదముద్రలొదిలేసి పోయారు
ఎవరెవరో ఎందరెందరో ఎక్కడెక్కడికో
అనంత కాల ప్రవాహంలో కొట్టుకపోయారు’
అతనోసారి ఎన్నేళ్ల క్రితమో
రోడ్డుమీద నడుస్తూ
ఉన్నట్లుంది అన్నాడు నీతో
జీవితంలో ఎన్నో విషయాలు
తెలుసుకోకుండానే వెళ్లిపోతాం
నువ్వు రోడ్డు మీద పోతూంటావ్
అవతల దూరంగా వెళ్తున్న ఎవరినో
చూడాలనుకుంటావ్
కాని ఏ లారీయో ట్రక్కో అడ్డువస్తుంది
అంతే, ఆ మనిషిని ఎప్పటికీ చూడలేవు
ఏదో తెలుసుకోవాలనో చూడాలనో
అనుకుంటూనే
కాలం గడిచిపోతుంది
చివరకు అట్లాగా చచ్చిపోతాం
ఆఖరుగా ఒక ప్రశ్న:
యింతకీ ‘యింగువ’ ఏమిటి?
ఒక కుడివైపు చిన్నగదిలో
కిటికీ పక్కన నవ్వారు మంచానికి
అతడిపుడొక అంటుకున్న బల్లి
మగత లోంచీ దగ్గు లోంచీ
ఎప్పుడో ఒకసారి పైకి చూస్తూ
వచ్చిన వాళ్లందర్నీ
ఏదో అడుగుతున్నాడు
అతని గుండెలమీదికి వంగి విందామని
నువ్వు ఏమిటి కావాలని అడిగితే
ఆఖరి గరగర ఊపిరితో
యింగువ ఏమిటి అన్నాడు
తరవాత రెండుసార్లు తల ఎగరేసి
దేన్నో వెతుకుతున్నట్లు చూసి
అంతా అయిపోయిందనిపించాడు
యింగువ ఏమిటో అతనికి తెలియలేదు
సుబ్బరామయ్యగారు కూడా చెప్పలేదు
నీక్కూడా చాలా తెలుసు
కాని యింగువ ఏమిటో యిప్పటికీ తెలియదు
అదొక కుట్ర
అదొక విద్యుత్ రహస్యం
అదొక మాయావి చెలగాటం
అదొక పులులు తిరిగే రాత్రి
ఏదేనా అవవచ్చు
తెలుసుకోవాల్సిన అవసరం
వుందోలేదో కూడా తెలియదు
నవ్వారు మంచం మీదో
హాస్పిటల్ ఆక్సిజన్ టెంట్ లోనో
ఆఖరి శ్వాస విడుస్తున్నప్పుడైనా
(‘త్రిపుర కాఫ్కా కవితలు’, ప్రచురణ సాహితీ మిత్రులు, విజయవాడ, 2001)
జూన్ 2018 గురించి lyla yerneni అభిప్రాయం:
06/04/2018 11:13 am
శర్మగారూ:
నేను చదివే తెలుగు పత్రిక ఒక్క ‘ఈమాట’ మాత్రమే. నాకు సాహిత్యం మీద ఆసక్తితో మాత్రమే ఇక్కడకు వచ్చేది. ఈమాట సంపాదకుల లాగానే నేను. సాహిత్యం మీదే ఆసక్తి.
ఈ లోపల ఈ పత్రికలో వేరే ఆర్టికల్స్ చదువుతూనే ఉంటాను. వాటి మీద అభిప్రాయాలు ఈ మేగజీన్ లో రాస్తూనే ఉంటాను. ఎప్పటి మాదిరే. కొన్నేళ్లుగా ఈ పత్రికలో నేను రచన చేస్తూనే ఉన్నాగా. ఈ ఒక్క కామెంట్ మీద ఎక్కువ తక్కువ ఇంట్రస్ట్ ఏమీలేదు. ఇదీ అన్ని రచనల్లానే.
ప్రపంచంలో తెలుగు పరిస్ధితిలో నాకు అసలు ఆసక్తి లేదు. ఇంకో మేగజీన్ కు తెలుగులో రాయాలన్న ఆలోచన లేదు.
Nice to hear from you. – Lyla
[Thank you for your kind words. The respect is mutual.
We do agree that all rights belong the writer. It has always been the policy of eemaata. So, you are free (not that you need our permission) to publish your poem in any other public forum to continue the discussion there (or, for that matter write an article right here in eemaata explaining your views on posthumous celebrations of artists and why you abhor them). However, we are sorry that we cannot delete/alter the published comment history here. -Ed.]
జూన్ 2018 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
06/04/2018 8:58 am