పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. జూన్ 2018 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    06/04/2018 8:05 am

    సాహిత్యరంగంలో నిన్నటి తరం నేటి తరానికి అందించిన వారసత్వం ఎటువంటిది, అది రేపటికి ఎలా ఉండాలి?

    సరదాగా “నేను సైతం” ఓ రాయి విసుర్దామని రాస్తున్నా ఆ మధ్య దేశం వెళ్లి వచ్చాక – అంటే రాష్ట్రం వేరు పడక ముందే లెండి – “తెలుగు సాహిత్యం చచ్చిపోయినట్టుంది, నేను చూసిన ఊళ్లలో కానీ నగరాల్లో కానీ ఆఖరికి న్యూసు పేపర్లలో కానీ తెలుగు అనేది ఎవరికీ అఖ్ఖర్లేకుండా పోతోంది. ఇలా అయితే కొంతకాలానికి తెలుగు సాహిత్యం చచ్చి ఊరుకుంటుంది. ఎవరికీ దీనిమీద ఇంటరెస్టు లేదు..”. అలా కొన్ని చితుకులు వేసి మంట పెట్టాను ఒక ఇంటర్నెట్టు గ్రూపులో. చూసుకోండి తస్సాదియ్యా ఎంతమంది నా మీద ఎగిరారో! ఆఫ్టరాల్ల్ నువ్వెవడివోయ్ చెప్పడానికి అంటూ. ప్రస్తుతం ఓ సారి విజైవాడ, విశాఖ, హైద్రాబాదు వెళ్ళి ఏ స్కూల్లో కుర్రాణ్నైనా పట్టుకుని “ఒరే అబ్బాయ్ మీ తెలుగు వాచకంలో ఓ పద్యం వినిపించు నాయనా” అని అడిగి చూడండి. “తెలుగా?, నేను ఫ్రెంచి, జెర్మనూ, సంస్కృతం తీసుకున్నా” అనడానికి 80 శాతం ఛాన్సు ఉంది – నాకు తెలిసినంత బావి కప్ప దృష్టిలో నండి సుమా. పోనీ సంస్కృతం చదువుతున్నాడు కదా, దాని గురించి అడగండి. పూర్తిగా తెలుగు రాసే పత్రిక – ఈనాడు తో సహా – ఒకటి చూపించండి. వాటిల్లో వచ్చే భాష ఇలా ఉంది – “ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది,” “దీన్ని షాకింగ్ కామెంటు గా యూజ్ జేస్తన్నారు …”

    సాహిత్యం మాట అటుంచి ఒక యాభై సంవత్సరాల్లో తెలుగు అనే భాష ఉంటే అప్పటికి సంతోషమే.

    ఇంతకీ లైలా గారూ, ఇదంతా మీ కామెంటు సరిగ్గా ప్రచురించనందుకా? ఇదే కామెంటు మీరు అచ్చుపత్రికకి పంపిస్తే వాళ్ళు ఎడిట్ చేసి ప్రచురించారనుకోండి రెండు నెలల తర్వాత, మీరేం చేస్తారు? చేయగలరు? ఇంతకీ ఓనర్ ఎవరైతేనేం గానీ ఈమాటకి మాల్ ప్రాక్టీస్ ఇన్స్యూరెన్స్ ఉంటే మీరు కోర్టుకి వెళ్తున్నారా? అహ అసలు ఉత్తినే అడుగుతున్నాను లెండి. 🙂

    శర్మ దంతుర్తి

  2. జూన్ 2018 గురించి lyla yerneni అభిప్రాయం:

    06/04/2018 5:56 am

    చదువుతున్న పాఠకులకు, పత్రిక యజమాని, ఇతర అధికారులకు మరి కొన్ని వివరాలు తెలియటం కోసం:

    “తొక్కిపట్టి ఆపి ఉంచుతారో తెలియదు.

    ఇంతకన్నా అత్యాచారం సాహిత్యం పట్ల ఘోరాపచారం ఒక సాహితీజీవి పట్ల ఇంకోటి ఉంటుందా?”

    నేను రాసి పంపిన పైదానిలో ‘తెలియదు’. ‘ఇంతకన్నా’ అన్న మాటల మధ్య ఇంకా పన్నెండు మాటలున్నాయి. అవి ప్రచురించనూ లేదు. కత్తిరించామని సంపాదకులు చెప్పనూ లేదు. కత్తిరిస్తే ఎందుకో తెలియదు. అవి ఎక్కడకు పోయాయో తెలియదు.

    ఇప్పటి సాహిత్యం తీరుతెన్నులు ఏవో బాగులేవని, సాహిత్యవిమర్శ కావాలని, రచయితలు మారాలని వారి ఆశ అని రాసిన సంపాదకీయం చదివినాక, నేను సంపాదకీయం లోని చివరి భాగం ఉదహరిస్తూ, సాహిత్యంలోని ఒక ప్రత్యేక అంశాన్ని చర్చలోకి తేవటానికి, కొన్ని ఆలోచనలు, సంశయాలు కలిగిఉన్న ఆధునిక కవితా రూపంలో, సంపాదకీయం కింది అభిప్రాయాల బాక్స్లోనే దానిని సబ్మిట్ చేసాను.

    పత్రిక సంపాదకులు నా రచనను ముక్కలు, మార్పులు చేసి, ప్రచురించి, పైగా, సరిచేసి పూర్తిగా ప్రచురించటానికి నిరాకరిస్తున్నారు. పద్యం పూర్తిగా ప్రచురిస్తే నేను సాహిత్య చర్చ కొనసాగిస్తాను.
    ఈ పత్రికకు నా రచన, తదనంతర చర్చ అవసరం లేకపోతే, వారు ఎడిట్ చేసిన నా రచన ఇతర ఉత్తరపత్రాలు తొలగిస్తే నేను వేరే చోట నా పద్యం ప్రచురించుకుని, నా సాహిత్య చర్చ కొనసాగించుకుంటాను. రచన మీద హక్కులు రచయితవే. I reserve my legal rights.

    పత్రిక నిర్ణయాలు తీసుకోటానికి వారం రోజుల వ్యవధి సరిపోతుందని నేననుకుంటున్నాను.

    లైలా

  3. జూన్ 2018 గురించి VSTSayee అభిప్రాయం:

    06/04/2018 2:31 am

    Sri Amarendra Dasari said:

    I appreciate the balance and firmness with which the Editors handled this discussion.

    The “And no!” was not necessary to express their firmness; the next sentence would have been enough.
    Regards,
    VSTSayee.

  4. జూన్ 2018 గురించి Amarendra Dasari అభిప్రాయం:

    06/04/2018 12:32 am

    I appreciate the balance and firmness with which the Editors handled this discussion. All the best

  5. కలలు ఇచ్చిన బలిమి గురించి నీలిమ అభిప్రాయం:

    06/03/2018 10:24 pm

    యద్దనపూడి గారి సుపరిచితమైన రచనలన్నింటిని ఒక్కచోట గుదిగుచ్చి ఎంత చక్కగా విశ్లేషించారు !!!

    ఆవిడిక లేరు అని తెలియగానే మనసంతా అలముకున్న ఒక తెలియని నిస్పృహ, వేదన, బాధ… నా ఇంటి పుస్తకాల సేకరణ లోంచి సెక్రెటరీ నవల తీసుకొని చదవడం మొదలెట్టాను…..అంతే అలా రాత్రి 2 గంటలకి మొత్తం పూర్తిచేసాక కానీ పుస్తకాన్ని మూయలేకపోయా. 52 ఏళ్ల క్రితం రాసిన నవలకి, ఈనాటికీ ఎంత చదివించే గుణం – అదీ ఇప్పటికే ఎన్నోసార్లు చదివిందైనా !! ఇదనే కాదు , ఆవిడ చాలా రచనలు అంతే.

    మన తరువాతి తరాలు తెలుగు మీది మమకారాన్ని బ్రతికించుకోవాలే కాని, కొన్ని తరాలకి సరిపోయే రచనలని వదిలివెళ్లారు ఆ నవలారాణి 🙏🙏

  6. సిలువ గుడి గురించి amarendra dasari అభిప్రాయం:

    06/03/2018 10:03 pm

    నిజమే మూర్తిగారు, ఇది ఇష్టంతో రాసిన సమీక్ష …thankyou

  7. సిలువ గుడి గురించి వివిన మూర్తి అభిప్రాయం:

    06/02/2018 11:34 pm

    అమరేంద్ర గారి సూచన మేరకు చదివాను. పుస్తకం చదివి తీరాలనిపించింది. ఒక పుస్తకం మీద ఇష్టమో గౌరవమో కలిగితే మాత్రమే ఇలాంటి సమీక్ష వస్తుంది.

  8. జూన్ 2018 గురించి lyla yerneni అభిప్రాయం:

    06/02/2018 8:34 pm

    [We refuse to entertain a dialogue with you further. And no! your previous comment will not be reverted to as sent by you. Ed.]

    సంపాదకులు గారు: మీరు అసలు మొదటికే సమాధానం ఇచ్చి ఉండనవసరం లేదు. ఎవరేమంటారు. అది మీ ఇష్టం. కాని ఇస్తే గాని, నేను పొయట్రీ ఫార్మ్ లో రాసినది అలాగే ప్రచురించి మీకు తోచిన సమాధానం ఇచ్చి ఉండాల్సింది. మీరు వదిలేస్తే ఇంకెవరైనా పాఠకులు వారికి ఇంట్రస్ట్ ఉంటే, వారు వారికి తోచిన విషయాలు రాసేవారేమో.

    మీరు ఇప్పటికీ ఎందుకు నా అభిప్రాయం పొయట్రీ ఫార్మ్ లో ప్రకటించటానికి అశక్తులో తెలియటం లేదు. అలాటి పద్యాలు ఎన్నో నేను ఈమాటలో చదివాను. ఉదాహరణకు ఈ సంచికలోనే ఈ పత్రిక ఎడిటర్ చేసిన అనువాదపు పద్యం ఉంది. పేరు: ” మా పీకల మీదుంచిన కత్తులు తీయండి”

    నా పద్యం లోని భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. ఈ పత్రిక ఎడిటర్ రాసిన ఆ పై పద్యం లో భాష మీకు అభ్యంతరకరంగా లేదా? లేనందువల్లే వేసి ఉంటారు కదా. మరి చదివిన ఒక పాఠకుడు భలేగా ఉంది పద్యం అన్నారే. వారికి భాష, సబ్జెక్ట్ కూడా ఏమీ బాధ పెట్టలేదు మరి.

    నా అభిప్రాయం పొయట్రీ ఫార్మ్లో ఏమిటని, వచనంగా పేర్చినారా? మరి ఎడిటర్ భాస్కర్ పబ్లికేషన్ వచనం లోకి మార్చలేదే? ఏమిటి తేడా? ఇతరులెందరో అభిప్రాయాలను పొయట్రీగా రాసారు. వాటిని అచ్చు వేస్తూనే ఉన్నారు కద.

    ఏ రకంగా చూసినా నా అభిప్రాయాన్ని మీరు ఎందుకు మార్చారో, సరిగా వెయ్యక పోగా పైగా నాకు సలహాలిస్తూ ఆరోపణలు చేస్తూ సమాధానాలు ఇచ్చారో నాకు తెలియటం లేదు.

    సరే మీరు నాతో ఇంక మాటలు ఆపివేయదలిచారు. అది మీ నిర్ణయం. నాకైతే ఈ ఉత్తరం మీరు ప్రచురించటానికీ ఇతర పాఠకులు చదువుకోటానికీ ఏమీ అభ్యంతరం లేదు.

    Thanks for your time. -Lyla Yerneni

  9. జూన్ 2018 గురించి lyla yerneni అభిప్రాయం:

    06/02/2018 5:50 pm

    For the record, we did edit your “గుంటకాడి నక్కలు గుర్తుకొస్తున్నాయి అసహ్యంతో కక్కులొస్తున్నాయి.” about other writers as we found it objectionable.

    సంపాదకులు గారూ: మీరిప్పటికీ నేను మొదటి సారిగా పంపిన రాతను, పంపినది పంపినట్టుగా ప్రచురించనే లేదు.

    ఇప్పుడు చెపుతున్నారు, మీకు ‘objectionable’ గా ఉన్న మాటలు మాత్రమే కత్తిరించామని. అదొక్కటేనా మీరు చేసిన మార్పు?

    ఐతే ఆ కత్తిరించి పడేసిన పాఠకులకు చూపదగని మాటలు ఇప్పుడెందుకు ప్రచురిస్తున్నారు? ఇప్పుడు చదివే వాళ్లకు కనపడవా? కళ్లకు గంతలు కట్టినారా?

    ఐతే ఆ పై objectionable మాటలు మీకు ఇంతకు ముందు ఏ రచనలలోనూ కనపడలేదనమాట. ఈ మాటలు నేను రచయితలను ఉద్దేశించి రాసినవని మీ కెలా తెలిసింది? ఏ రచయితలను ఉద్దేశించానో కూడా మీకు తెలిసిందా? తెలిస్తే అవి కూడా ఇవ్వండి.

    ఇంతకూ మొదటిగా పంపిన రచన ఇప్పటికైనా రాసినది రాసినట్టు చూపరేం?( మీకు) అబ్జెక్షనబుల్ మాటలతో సహా ఇప్పుడు నేను రాసింది ప్రచురించండి.

    మీరు మీ లీగల్ రైట్స్ పరిథిలోనే ఉన్నారో, నేను అబ్జెక్షనబుల్ మాటలు రాసానో, అవి ఎవరిగురించి రాసానో, నిర్ణయించే వారు మీ సంపాదక బృందం మాత్రమే కాదు. There is a bigger world.

    Will you kindly publish my writing in exactly the format I mailed to you? Thank You.
    Lyla

    (How many editors are currently in your team? How many are in USA? How many in other countries? Is the owner of this publication still Suresh Kolichala? Do the magazine have malpractice insurance? Thank you.)

    [We refuse to entertain a dialogue with you further. And no! your previous comment will not be reverted to as sent by you. Ed.]

  10. జూన్ 2018 గురించి lyla yerneni అభిప్రాయం:

    06/02/2018 4:12 pm

    “బైదివే, మీరు కోట్ చేసిన ముందుమాటకూ మీ అభిప్రాయానికి ఏ సంబంధమూ లేదు. గమనించగలరు.”

    లేదంటారా సంపాదకులు గారూ? ఉందో లేదో తేల్చాలంటే, ముందుగా నేను రాసిన వాక్యాలు రాసినవి రాసినట్టుగా ప్రచురించాలిగా? మీరలా చెయ్యందే. అలా అని మీరు పూర్తిగా విరమించనూ లేదు. నే రాసింది, మీకిష్టమైనట్టు మార్చి ప్రచురించారు. ఎందుకని?

    మీరు, నేను రాసిన మెటీరియల్ అంతగా మార్చదలుచుకుంటే, ఆ మార్పులు, చేసిన ఎడిటింగ్ ముందు నాకు పంపి నాకు సమ్మతమైతేనే ప్రచురించాలి. ఆ తర్వాతే సమాధానమివ్వాలి. మీరెంతో మార్చేసిన నా రైటింగ్ ను నేను రాసినదిగా చూపిస్తూ, దానికి మీ సమాధానం ప్రచురించటం సరికాదు. మీ నిడువైన సంపాదకీయం చివరలో రచయితల నుండి మార్పులు ఏవేవో ఆశిస్తున్నామంటూ రాసిన మీరు, నా కిచ్చిన సమాధానంలో, మా పంథా మారదు, you better get used it. -అన్నారు. అలాటి లొంగదీతల హెచ్చరికలు మీనుండి నాకు ఎంత మాత్రమూ సమ్మతం కాదు.

    సంపాదకులు: మీరిచ్చిన సమాధానం లోని పదార్థం కూడా నాకు తెలియలేదు. నా రాతను మార్చేసి చదువుకున్నందున, మీకు సమాధానం ఇవ్వటం చేతకాలేదేమో. ఏవో అతురు బొతుకు మాటలున్నాయి. ‘అలా ఒకరిని నిందించటం మీకు తగదు. ‘అన్న వాక్యం ఒకటీ తెలిసింది కాని, మిగతాదంతా తెలియనప్పుడు, అదికూడా తెలియనట్టే.
    అందువల్ల;

    Please publish this letter of mine, in total. And, if only acceptable to you, in your response make it known that you have made substantial changes to my writing and published it without my consent. Therefore you will be removing all of the material, pertaining to these letters. Post it for all readers of magazine to read and understand what happened here. And if I see no problems, you can remove them from the magazine in a week. That works for me, hope it works for you. I reserve all my legal rights.Thank you.

    Have a nice day! – Lyla Yerneni, M.D.

    [Your comment is published in full as you asked for. For the record, we did edit your “గుంటకాడి నక్కలు గుర్తుకొస్తున్నాయి అసహ్యంతో కక్కులొస్తున్నాయి.” about other writers as we found it objectionable. And, to paraphrase from పాఠకులకు సూచనలు:”మీ అభిప్రాయాలని పరిష్కరించి ప్రచురించడానికి, అసంగతమైన అభిప్రాయాలు తొలగించడానికీ, సంపాదకులకు అధికారం ఉంటుంది. సంపాదకుల నిర్ణయాలపై ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.” It further talks about ఉత్తరాలలో వ్యక్తిగత నిందలూ, అసభ్యమైన భాషా. By the way, before posting your comment you did agree to “ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను” clause. So, we are the ones well within our legal rights here. – Ed]