పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. జూన్ 2018 గురించి Madhav అభిప్రాయం:

    06/07/2018 11:31 am

    (సందిగ్ధంలో ఉన్నాను, ఇలా చర్చ జరుగుతున్న సమయంలో నేను కామెంట్ పెట్టచ్చా? సాటి ఎడిటర్లేమనుకుంటారు? నేనుగా పెట్టాలా, ఎడిటర్‌గా పెట్టాలా? ఏ హ్యాట్ పెట్టుకోవాలి? అసలు పెట్టుకోవాలా? ఆ తేడా ఎవరైనా కనీసం గమనిస్తారా? అయినా సరే, ఒక రెండు ముక్కలు చెప్పకుండా ఉండలేక ఈ కామెంట్ రాస్తున్నాను. ఒకసారి పోస్ట్ చేసినాక దాన్ని ఏం చేస్తారో సంపాదకుల ఇష్టం. నేనైనా వారి నిర్ణయానికి కట్టుబడి ఉండవల్సిందే మరి.)

    1. రామారావు గారూ, మీ సూచనలు ఎప్పుడూ విలువైనవే. మీకు కృతజ్ఞతలు. రెండు విషయాలు.

    ఒకటి – I do not see any ‘escalation’ either from Lyla or from the editors. Initially the voices registered a slightly higher note, but then toned down. Looking at the published commentary, it appears to me that the problem here lies not with the decision but the execution of which, could have been a tad better. రచయితలకు, పాఠకులకు ఉన్నంత వాక్‌స్వేచ్ఛ సంపాదకులకు, నిర్వాహకులకు ఉండదు. వారికి నిగ్రహం మరింత అవసరం.

    రెండు – [Editor hat ON]ఈమాట రెగ్యులర్‌గా చదివే మీరు కూడానూ ఎవరి “మనోభావాలు దెబ్బతింటాయనో” సంపాదకులు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అనడం/అనుకోడం నిజంగా ఆశ్చర్యం. ఆమాట ఈమాట గురించి ఏనోటా వినలేదు ఇన్నేళ్ళలో నేను. పైపెచ్చు “మనోభావాలు” గాయపరుస్తున్నామని మమ్మల్ని తిట్టేవారే ఎక్కువ. That was, is and will be never our concern, but the standards and the etiquette of eemaata are. At times we err in our judgement. We learn from it and go on. కరవమంటే కప్పకు కోపం. విడవమంటే పాముకు కోపం. Our only job is to do our job the best we can.

    2. ఈమధ్యనే ఒక స్నేహితునితో అన్నాను అతని రచన గురించిన ప్రస్తావనలో. “మాకు రచన ముఖ్యం, రచయిత ఎవరు అన్నది అనవసరం. మామెక్కడైనా మామే కాని మొక్కజొన్న చేనుకాడ కాదని తెలుగులో ఒక మొరటు సామెత ఉంది. మాకూ అలానే ఈమాట దగ్గర అందరూ పరాయివారే”, అని. ప్రత్యక్షానుభవంతో చెప్తున్నాను – సంపాదకులు కేవలం వారి రచనల నాణ్యత మాత్రమే పరిశీలిస్తూ (చాతయినంతగానే అనుకోండి), వారి మనోభావాలకు, అహంభావాలకు, స్థాయీపరపతులకు విలువనివ్వనందువల్లే ఈమాటకు తమ రచనలు పంపని రచయితలు ఉన్నారు. అదే సమయంలో, ఆ ప్రొఫెషనాలిటీ, సాహిత్యం పట్ల గౌరవం శ్రద్ధాసక్తులు ఆశించి, పొందినందువల్ల తమ రచనలు మొదటగా ఈమాటకే పంపే రచయితలూ ఉన్నారు. నాణేనికి ఒకేవైపు ఎలా ఉండదో అలానే విమర్శ లేకుండా సాహిత్యం ఉండదు. రచయిత నుంచి వచ్చినది వచ్చినట్టు ప్రచురించగల స్థాయి ఏ కొద్ది రచనలకో ఉంటుందేమో. మొదట్లో మా విమర్శ తీసుకోలేకపోయినా, మా పరిష్కరణలను సందేహించినా, ఒకసారి మాతో కలిసి పని చేసినాక, ఈమాటపై తమ అభిప్రాయాలను పూర్తిగా మార్చుకున్న రచయితలూ ఉన్నారు. ఇంకా మా పద్ధతుల పట్ల అపోహల్లోనే ఉన్న రచయితలూ ఉన్నారు. It is a diverse world out there. అందువల్ల, ఇక్కడ పారేది పన్నీరా మురికినీరా అనేది ఎవరి దృక్పథం బట్టి వారు నిర్ణయించుకునేది. [Editor hat OFF]

    3. ఇకపోతే, I have known Lyla well and her wickedly sharp wit very well. I am sure, if their tone offended Lyla, she would have openly said so and the editors too would have offered her an unconditional apology. More importantly, what struck me here is the maturity and decorum she has shown. “సాహిత్యం మీదే ఆసక్తి. ఈ లోపల ఈ పత్రికలో వేరే ఆర్టికల్స్ చదువుతూనే ఉంటాను. వాటి మీద అభిప్రాయాలు ఈ మేగజీన్ లో రాస్తూనే ఉంటాను. ఎప్పటి మాదిరే. కొన్నేళ్లుగా ఈ పత్రికలో నేను రచన చేస్తూనే ఉన్నాగా. ఈ ఒక్క కామెంట్ మీద ఎక్కువ తక్కువ ఇంట్రస్ట్ ఏమీలేదు.” She didn’t take this episode personally. తన “మనోభావాలు” గాయపరచుకోలేదు.

    తెలుగులో రచయితలు ఈ పరిణితిలో కనీసం సగమైనా కలిగివుంటే ఎంత బాగుండునోనని నేను కలగన్నదీ నిజం! అలాగే, ఇక్కడ కొన్ని వ్యాఖ్యలలో కనిపించిన సృజనాత్మకత చూసి కొంత ముచ్చట పడి, అది కథల్లోనూ కవితల్లోనూ కూడా కనిపిస్తే ఎంత బాగుండునోనని నేను అనుకున్నదీ నిజం!

    4. చర్చ ఆ ముందుమాట మీద – కేవలం తెలుగులోనే ఎందుకు పాప్యులర్ రచయితలు, సీరియస్ రచయితలు అని రెండు కులాలు ఉన్నాయి అన్న విషయం మీద – జరిగి ఉంటే బాగుండేదని ఆశించాను. కాని, పక్కదారి పట్టింది. నెట్ స్వభావమే అంత. Personally I think it’s time for us to move on. (నేను చెప్పదలచుకున్న రెండు ముక్కలూ చెప్పేశాను కాబట్టి!)

    I hope I did not disappoint any one with my uncharacteristic humility!

    Regards
    మాధవ్

  2. జూన్ 2018 గురించి రాధిక అభిప్రాయం:

    06/07/2018 11:30 am

    ఈమాట సంపాదకులకు:
    ఇంతకు మునుపు వ్రాసిన నా అభిప్రాయంలో నా భయానికి కారణాన్ని (వ్రాసినదానిని “మార్చి” ప్రచురించే అవకాశాన్ని సంపాదకులు ఎలా ఉపయోగించుకుంటారో తెలియనపుడు ఏమి వ్రాస్తే ఏమవుతుందోనన్నది నన్ను భయపెట్టిన విషయమని) నేను స్పష్టంగా వ్రాశాను.

    అటువంటి భయం అర్థరహితం కాదనీ, అన్ని అభిప్రాయాల విషయంలో సంపాదకులు ఒకేరకంగా వ్యవహరించడం లేదనీ ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమయింది.

    “సాటి పాఠకులను నేరుగా సంబోధిస్తూ రాయకండి.” అన్న సూచనని పాటించకుండా వ్రాసిన ఒక వ్యాఖ్యని – అది కూడా హుందాగా కాక అపహాస్యం చేస్తూ వ్రాసిన వ్యాఖ్యని – ప్రచురించడం ద్వారా మీరు ఆ విషయాన్ని స్పష్టం చేశారు.

    అది అపహాస్యం కాదు కవిత్వం అనుకునేందుకు కూడా ఇపుడు అవకాశం లేదు. “మీ అభిప్రాయాలను కవితలుగా, ఆలాపనలుగా, కథానికలుగా రాయకండి. మీ సృజనకు అభిప్రాయాల పెట్టె వేదిక కాదు.” అన్న మీ కొత్త నిబంధనను అంగీకరిస్తూ వ్రాసినందువలన ఆ అభిప్రాయాన్ని సూటిగా చేసిన అవమానంగానే తీసుకుంటున్నాను.

    ఇలా అవమానింపబడినందుకు బాధపడుతూ ఇకపై ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నాను.
    అభినందనలు!

    [క్షమించాలి. అది కేవలం సరదాగా అన్న మాట అని, “సాటి పాఠకులను నేరుగా సంబోధిస్తూ రాయకండి.” అన్న సూచన ఉన్నప్పటికీ, కొన్నిసార్లు పాఠకుల మధ్య చర్చలో లైట్ బ్యాంటర్ వల్ల లాభమే కాని నష్టం లేదని అనుకోవడం చేత, ఆ వ్యాఖ్యలో మాకేమీ మీ పట్ల అవమానం కనిపించకపోవడం వల్లనే, ఆ వ్యాఖ్య ప్రచురించాం. -సం.]

  3. జూన్ 2018 గురించి రాధిక అభిప్రాయం:

    06/07/2018 10:25 am

    “పాఠకులకు సూచనలు” లో రెండో అంశాన్ని కొందరు పాఠకులు పాటిస్తున్నట్లు లేదు! ఆ విషయాన్ని సంపాదకులు పట్టించుకుంటున్నట్లూ లేదు!!

  4. జూన్ 2018 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    06/07/2018 9:58 am

    >> ‘అదిలింపు స్వరం’, ‘నాకయితే నిజంగానే భయం వేసింది’

    ఆంజనేయ దండకం రాదాండి మీకు? గూగిల్లో ఉచితంగానే దొరుకుతుంది 🙂

  5. జూన్ 2018 గురించి Amarendra Dasari అభిప్రాయం:

    06/07/2018 3:16 am

    ‘అదిలింపు స్వరం’, ‘నాకయితే నిజంగానే భయం వేసింది’ said Radhika garu. A very very valuable feedback !!

  6. జూన్ 2018 గురించి రాధిక అభిప్రాయం:

    06/06/2018 9:02 pm

    కేవీయస్ రామారావుగారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
    వ్యాఖ్యని మార్చడం వలన అర్థం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది.
    “కొందరు సప్లైదారు రచయితలు- వారి అభిమాన సాహితీవేత్తల చావుకు ముందే” – ఈ పేరాకి ముందు లైలా గారు బహుశా ఈ సంచికలోని రచనల నుండి కొంత పక్కకి వెళ్ళి ఇటువంటి వాటిపై సాధారణంగా తనకి ఉన్న అభిప్రాయాన్ని కవితారూపంలో వెల్లడించి ఉంటారనుకుంటున్నాను.
    ( పాఠకుల అభిప్రాయాలు రచనకు ప్రత్యక్షంగా సంబంధించి ఉండాలన్న నిబంధన ఉన్నది నిజమే కానీ ఇక్కడ ఈ అభిప్రాయం ఒక రచన గురించి కాదు కనుక, సంపాదకీయం గురించీ పత్రిక గురించీ కనుక ఇక్కడ అది పొసగుతుందని నా ఉద్దేశ్యం)
    సంపాదకులు ఆ భాగాన్ని తీసివేసి ప్రచురించడం వలన పైన పేర్కొన్న పేరాలోని మాటలు నేరుగా ఈ సంచికలోని రచయితలను ఉద్దేశించి అన్నట్లుగా తోచే అవకాశం వుంది. అలా ఉండకూడదనే బహుశా ఆవిడ ఆ విషయాన్ని కవితలా వ్రాసి ఉంటారు (ఒక మర్యాదని పాటించదలచి).
    దానిని తీసివేయడం ద్వారా, ఆవిడ ఆ విషయాన్ని పదే పదే చెప్తున్నా అదలింపు స్వరంతో జవాబివ్వడం ద్వారా – సంపాదకులు పాఠకులను భయపెడుతున్నారనిపించింది. నాకయితే నిజంగానే భయం వేసింది, వ్రాసినదానిని “మార్చి” ప్రచురించే అవకాశాన్ని సంపాదకులు ఎలా ఉపయోగించుకుంటారో తెలియనపుడు ఏమి వ్రాస్తే ఏమవుతుందోనని. అందుకే ఇప్పటివరకూ వ్యాఖ్య వ్రాసేందుకు సందేహించాను కానీ చూస్తూ ఊరుకోలేక ఇప్పుడు సాహసించాను. 🙂

  7. జూన్ 2018 గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    06/06/2018 2:59 pm

    ఈ వరసలో లైలా గారి తొలి post ఇప్పుడే చూశాను. అక్కడినుంచి ఈ వ్యవహారం ఎంత త్వరగా వేగం పుంజుకుని escalate అయిందో ఆశ్చర్యం కలిగించిన మాట నిజం. ఇలాటి సంఘటనల్లో ఇదివరకు నాకున్న కొంత first-hand experience కారణంగా (లేని పెద్దరికం మీద వేసుకుని) ఒక సలహా ఇస్తాను – సంపాదకులకి. మీరు తొందర పడ్డారు. అంత ఆవేశం చెందవలసిన విషయం లేదిక్కడ. విజ్ఞులైన పాఠకుల అభిప్రాయాలు – కఠినంగా అనిపించినా, మార్చకుండా ప్రచురించటం మంచి పద్ధతి. ఏవో కొన్ని పదాల మూలానే “మనోభావాలు దెబ్బతినేంత” సున్నిత మనస్కుల్ని కాపాడవలసిన బాధ్యత సంపాదకుల భుజాల మీద వేసుకోవలసిన అవసరం లేదు.

  8. జూన్ 2018 గురించి lyla yerneni అభిప్రాయం:

    06/06/2018 1:08 pm

    […However, we are sorry that we cannot delete/alter the published comment history here. -Ed.]

    సంపాదకులు ఈ విషయంలో నాతో తిరిగి మాటలు కొనసాగిస్తున్నందుకు సంతోషం.
    నేను మొదలుకు రాసిన రచన ఇప్పుడైనా ఇక్కడే మీరు పబ్లిష్ చేస్తే, అప్పుడు పాఠకులు జరిగింది జరిగినట్టుగా, వరసలో శుభ్రంగా అంతా చదువుకోవచ్చు. దానికి నాకు ఏం అభ్యంతరం లేదు.
    ఇప్పటికీ ఇక్కడి పాఠకులకు అసలు నేనేం రాసానో తెలియదు గద. ఒకవేళ గాని నా రచన మీరు పారేసుకుని ఉంటే, ఆ విషయం ఇక్కడే తెలియచేస్తే, మళ్లీ పంపిస్తాను. నా దగ్గర ఉంది.

    Thanks, Lyla.

    [తమ నిర్ణయాల గురించి చర్చ చేయకపోయినా పాఠకుల ప్రశ్నలకు జవాబివ్వాల్సిన బాధ్యత సంపాదకులకు ఉన్నది కద.

    క్షమించండి. మేము చెప్పింది స్పష్టంగా ఉన్నట్టు లేదు. మీ మొదటి వ్యాఖ్య అలానే మేము ప్రచురించగలిగి ఉంటే ఇబ్బంది ఏముంది? ఆ వ్యాఖ్యలోని కొన్ని వాక్యాలు మాకు ఇప్పటికీ అభ్యంతరకరమే కాబట్టి అది అలానే ప్రచురించలేము. అందువల్లనే మీరు ఆ వ్యాఖ్యను వేరొక వేదిక పైన ప్రచురించుకొనవచ్చు లేదా మీ దృక్పథాన్ని (ఇక్కడ ఒక కవిత రూపంలో కామెంట్ వలె కాకుండా) వ్యాసం రూపంలో వివరిస్తూ ఈమాటకు ఒక రచనగా పంపవచ్చును (దానివలన మీరు ఆశించినట్లుగా చర్చ కూడా జరగవచ్చును) అని సూచించినాము. ఆ వ్యాఖ్య మీ అభిప్రాయం అయితే అది వెలిబుచ్చిన తీరుపట్ల మాకు అభ్యంతరం ఉన్నది. అందువల్లనే అది ఎడిట్ చేసినాము. అది ఒక కవిత అని మీరు అన్నట్లయితే అది సృజనాత్మక రచన కావున దానికి అభిప్రాయవేదికలో చోటు లేదు. – సం.]

  9. సిలువ గుడి గురించి పి.విజయలక్ష్మి పండిట్ అభిప్రాయం:

    06/06/2018 9:13 am

    అమరేంద్రగారి ‘శిలువగుడి’ కథల సమీక్ష .. నాకు ఖదీర్ బాబు‘దర్గామిట్ట’కథలు, గోపిని కరుణాకర్ ’మా తిరుపతి కొండ కథలు’,మా పసలపూడి కథలు, గోపల్లె కథ – తమిళనాడులో తెలుగువారి పూర్వీకుల కథ(నారాయణరెడ్డి తెలుగు అనువాదము) మదిలో మెదిలాయి.

    వారి సమీక్ష ‘శిలువగుడి’ కథలను చదవాలనే ఆత్రుతను పెంచింది.

    బాల్యం కథలు గమ్మత్తుగా, ఆ రచయిత అనుభవాలు, ఆ కాలచరిత్రకు అద్దంపడతాయి.

  10. జూన్ 2018 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    06/06/2018 8:13 am

    బ్రహ్మానందం గారు, ధన్యవాదాలు. ఇతర రచయిత(త్రు)ల గురించి నాకు తెలియదు కానీ ఎప్పుడైతే నేను ఏదైనా రాసి పంపిస్తానో అప్పుడే దాని మీద విమర్శ కి సిద్ధంగా ఉంటాను. రచయితగా మీకు తెలిసే ఉండొచ్చు. “ఆహా, ఓహో” అనేవాళ్లతో మీకు ఏమీ ఉపయోగం లేదు – ఛాతీ అయిదంగుళాలు పెంచుకుని మరో కధో, కవితో రాయడానికి అది పనికివచ్చినా. అలా పెరిగిన ఛాతీ అక్కడే ఉండిపోదు కనక విమర్శ చేసేవాళ్లతోనే నాకు లాభం. వాళ్ళు సరైన విషయం, చేదు నిజం చెప్తారు. అయితే అందరూ ఒకేలాగ నెమ్మదిగా చెప్పరు కదా? ఒకరి భాష మరొకరికి రాకపోవచ్చు. కాని వాడిన భాష, వెక్కిరింపూ వదిలేసి అందులో అసలు ఏమి చెప్పదల్చుకున్నారు అనేది; వాళ్ళు చెప్పేది గ్రహించగలిగితే నా రచనలు మెరుగుపడతాయి. లేకపోతే మూసలో పొసినట్టు ఒకే రకం రచనలు రావడం తధ్యం. అంటే మొదటి రెండు పేరాలు చదవగానే ఇది ఫలానా శర్మ గారు రాసారు, చివర్లో ఇలా అవుతుంది గారంటీగా అని చెప్పేయవచ్చు. తెలుగు సినిమాల్లో లాగా మొదట్లో హీరో, నాలుగు గుద్దులూ, చివర్లో మళ్ళీ అందరూ ఒకోచోట ఫేమిలీ ఫోటో, శుభం కార్డు. ఓ సారి ఆ మూస పద్ధతీ, ముద్రా పడగానే ఇంక గొర్రె తోక రచనలు వస్తాయి. ప్రస్తుతం నావి అలాగే ఉన్నాయి కాబోలు.

    ఎప్పుడైతే ఒక పత్రికకి రచన పంపించానో అప్పుడే- ఆయా సంపాదకులు విమర్శిస్తారనీ, అందులో తప్పులూ, ఒప్పులూ ఎత్తి చూపుతారని సిద్ధంగా ఉండాలి. నేను రాసిన పదహారు పేజీల కధ ఒక్కోసారి నాలుగు పేజీల్లో రాయొచ్చు. కన్నెగంటి చంద్రగారు దీనికో ఉదాహరణ అనుకుంటా. ఒక్కోసారి దాన్ని పద్ధెనిమిది పేజీలకి పెంచవచ్చు. అయితే “ఈ సంపాదకుడు నేను అమెరికా రాకముందు బొడ్డూడని బచ్చా గాడు ఇప్పుడు నా రచనలనే దిద్దే అంతవాడా?” అనుకుంటే ఆ పత్రిక మీరు చెప్పినట్టు మురికినీరు అయ్యి కడుక్కోవడానిక్కూడా పనికిరాదు. అప్పుడు మరో చెరువు వెతుక్కోవచ్చు. అయితే అక్కడ కూడా ఇదే విధంగా మురికి నీరు ఎదురవ్వొచ్చు కదా? మరో విషయం ఏమిటంటే ఒక సంపాదకుడికి నచ్చని రచన మరోచోట బాగుండవచ్చు (గ్రిషాం, హారీ పాటర్ లాంటి రచయితలకి ఇదే సమస్య మొదట్లో)

    నేను రాసినది ప్రతీ అక్షరం పొల్లుపోకుండా వేసి తీరాలి అనుకుంటే బ్లాగు అంత ఉత్తమం మరోటి లేదు. అక్కడ కూడా మీరు మోడరేషన్ పెట్టుకోకపోతే ఎవరో ఒకరు ‘ఇది ఏడిసినట్టు ఉంది” అనడానికి అవకాశం ఉంది కదా? ఆఖరికి ఫేసు బుక్కులో కూడా లైకులు రాలేదంటే అర్ధం అది ఎవరికీ నచ్చకపోవడం కావొచ్చు – చదవక కాదు. అయితే ఆయా మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టూ రాస్తే ఏమౌతుందో రోజూ చూస్తూనే ఉన్నాం. అందువల్ల సంపాదకుల కత్తెర ఉండడం వల్ల లాభమే కానీ నష్టం లేదని నా అభిప్రాయం.

    సంపాదకుల పని మూడో కంటితో చదివి ఎలా ఉందో చెప్పడం. దాన్ని వేసుకుంటారా లేదా అనేది వేరే విషయం. ఒకోసారి బూతు కధ, సాహిత్య లోకంలో ఎవరికీ నచ్చనిది పత్రిక లాభం కోసం వేయవచ్చు. అందులో ముఖ్య సంపాదకుడు ఎంత గింజుకున్నా మిగతా సహ సంపాదకులవల్ల కురదరక పోవచ్చు – అచ్చు పత్రిక మనుగడ డబ్బు మీద ఆధారపడి ఉంటుంది కనక. ఇంతకీ ఏమి చెప్పదల్చుకున్నానంటే సంపాదకుల దిద్దుబాటుకి సిద్ధంగా లేకపోతే ఫలానా పత్రికకి పంపడం మానుకోవడమే మంచిది. ఇదే మీరు చెప్పిన మురికినీరు వాడకపోవడం. అయితే దీనివల్ల ఎవరికి నష్టమో రచయితకే బాగా తెలుస్తుంది. నా ఉద్దేశ్యంలో మారవల్సినది రచయితే. అలాగని మొత్తం మారిపోయి సంపాదకుల తొత్తుగా ఉండమని చెప్పట్లేదు.

    ఎప్పుడైతే “నేను షరతులకి కట్టుబడి ఉంటాను” అనే “ఆప్ట్ ఇన్” చెక్ బాక్స్ నొక్కి వ్యాఖ్య, కధా పంపించారో అప్పుడే మీరు సంపాదకుల కత్తెర కి ఒప్పుకున్నట్టు లెఖ్ఖ. అలాకాని పరిస్థితుల్లో వేరే చెరువు చూసుకోవడం ఉత్తమమే – రచయిత దృష్టిలో ఫలానా పత్రిక మురికినీరు కాబట్టి. దీన్నే అచ్చు పత్రికలలో ‘ఇందులో ఉత్తర ప్రత్త్యుత్తరాలకి తావు లేదు’ అని రాస్తారనుకుంటా. అయితే మూస పద్ధతిలోంచి బయటకి రావడం అసంభవం అనేది తెలిసి వస్తుంది త్వరలోనే – ఒక్కో చెరువూ మురికి అనుకుంటూ పోతే. మరో మాటండోయ్, నేను అంత పేరున్న రచయితనీ కాదు నన్నెవరూ “దయచేసి మా పత్రికకి రాయండి” అని అడగలేదిప్పటివరకూ. అందువల్ల ఆ విషయం నేను చెప్పలేను. నాకు తెలిసినంతలో సంపాదకులూ చదువరులూ చేసిన విమర్శల వల్ల (ఉదా: కవిత్వం మార్మికంగా ఉండాలి, ఓ చట్రంలోంచి బయటకి రావాలి, ఇందులో ఫలానా సన్నివేశం అనవసరం, ఆ మొదటిపేరా కంగాళీ తీసేయవచ్చు, ఫలానా వ్యాక్యం రాసాక మిగతా కధ అనవసరం, మీరు ప్రతి వ్యాఖ్యలు పెట్టి మరొకరెవరూ వ్యాఖ్య చేయకుండా చేస్తున్నారు [ఇంత ఆశ్చర్యం కలిగించిన కామెంట్ ఇప్పటిదాకా చూడలేదు]) నా రాతలు మెరుగుపడ్డాయని అనుకుంటున్నా.

    మరో విధంగా బ్లంట్ గా చెప్పాలంటే నేను రాసిన కధో, వ్యాఖ్యో ఫలానా పత్రిక వారు ఎందుకు వేయాలి? ఆఖరికి నన్ను నిజంగానే “మా పత్రికకి ఏదో ఒకటి రాయండి” అని అడగగానే, నేను రాసినది “ఏది పడితే అది” వేయాలా? ఆహ్వానించారు కదా అని ఏదో ఒకటి రాస్తే అది వాళ్లకి నచ్చవద్దా? రాయడం నా విశేషాధికారం అయితే దిద్దడం, వేయాలా వద్దా అనేవి వాళ్ల ప్రత్యేధికారం కాదా?

    చివరిగా, ఏదో చెప్దామనుకుని మరొకటేదో చెప్పినట్టు అనిపిస్తే క్షంతవ్యుడను. నమస్తే