పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. ఏదైనా రాలిపోవాల్సిందే గురించి సిరిపురపు శ్రీనివాస శర్మ అభిప్రాయం:

    04/05/2020 3:11 am

    మీ కవితా శిల్పం అద్భుతం. కాకుంటే, మొదటి మూడు పేరాల్లో ఉన్న ఆక్రోశం, ఆవేదన ఒక్కసారిగా నాలుగో పేరాలో మాయమైంది. ఆ టెంపో సడలకుండా దీన్ని నడిపిస్తే బాగుండేదేమో.

  2. Tara and the Teacher గురించి తః తః అభిప్రాయం:

    04/04/2020 2:38 pm

    కనీసం ఆ రాసిన ఇంగ్లీషు పద్యాలకు అర్ధం తెలుగులో వివరించి చెప్పండి

    మళ్ళీ అదిగూడానా – కొంచెం కృషి చేస్తే మూలమే బాగా అర్థమౌతుందేమో – మీవంటి వారికి.
    నమస్కారాలతో – తః తః

  3. Tara and the Teacher గురించి తఃతః అభిప్రాయం:

    04/04/2020 2:27 pm

    గురువు మీద పద్యాలు రాసి పరీక్ష పాసైపోటం (అవతలి ఒడ్డు చేరుకోటం)!

    విద్య యొసగు వినయము ……” భర్తృహరి (తెలుగులో) ప్రసిద్ధమైన సుభాషితానికి ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో యాభై ఏళ్ళ క్రితమే ప్రచారంలో ఉన్న పాఠాంతరం “విద్య నొసగు వినయము”

    తఃతః

  4. కొన్ని లలితగీతాలు గురించి తః తః అభిప్రాయం:

    04/04/2020 2:07 pm

    శ్రీ పరుచూరి:
    మీకు ఎంతోమంది లలిత సంగీత ప్రియులు, నాతో సహా, ఎంతో ఋణపడి ఉంటారు. ఈ విడతలో వింజమూరి లక్ష్మి (అందమైన చందమామ), పద్మ ప్రియల (పాటలే) పాటలు బాగులేవని చెప్పటానికి ఏమాత్రం సంకోచించను. ‘పాటలే’ బాలమురళి గొంతులో విన్నవాళ్ళకు పద్మప్రియ పాట నచ్చే ఆస్కారం ఏమాత్రం లేదు. ఈ పాట ఆయన గొంతులో అమృతపు ఊట.

    బెజవాడ రేడియోలో శ్రీరంగం గోపాలరత్నం, వి బి కనకదుర్గగార్లతో పోల్చినప్పుడు లక్ష్మిగారు చాలా పేలవంగా (నా చిన్నతనంలోనే) అనిపించేవారు. నా అప్పటి ఈ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశాన్ని ఆమె ఎప్పుడూ కలిగించలేదు. 9, 10, 11 తరగతులలో బెజవాడ సత్యనారాయణపురంలో తర్వాతి కాలంలో ‘మంగళంపల్లి బాలమురళీ కృష్ణ వీథి’గా పేరుమార్చబడ్డ లైబ్రరీ వీథి మొగదలలో ఉన్న హైస్కూల్లో నా తోటి విద్యార్థిని వింజమూరి సూర్యసుబ్బలక్ష్మి పాడిన (పిల్లల) పాటలు, ’అక్షరాలూ దిద్దు నాకూ ఆట బొమ్మ లెందుకింక – అబ్బిగాడి కిచ్చివేస్త’ వంటివి వీలైతే వినిపించగలరా! బెజవాడ రేడియోలో శ్రీ ఏడిద కామేశ్వరరావు, కుమారి వింజమూరి లక్ష్మిగార్లు నడిపిన పిల్లల కార్యక్రమాలు చాలా సుబ్బలక్ష్మిగారి పాటతోనే మొదలయ్యేవి. ‘అందమైన చందమామ’ కూడా ఆమె పాడినట్టు గుర్తు.

    అన్నట్టు హేమామలినిగారు నిర్మించిన టి వి సీరియల్ ‘నూపుర్’లో కనకదుర్గగారితో పాడించిన భైరవి స్వరజతి చాలా మధురంగా ఉంటుంది.

    నమస్కారాలతో
    తః తః

  5. కొన్ని లలితగీతాలు గురించి Dr. I.A.P.S. Murthy అభిప్రాయం:

    04/03/2020 8:41 pm

    చక్కని పాటలు. అన్నిటా లాలిత్యం వెల్లివిరిసింది.

    దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వ్రాసిన ‘ఖుదా నీదే అదే పిలుపు, సదా నీదే కదా గెలుపు’, బహుశః వేదవతీ ప్రభాకర్ పాడినది, ఎంత ప్రయతించినా దొరకలేదు. ఉంటే అందించండి.

  6. Tara and the Teacher గురించి Lyla yerneni అభిప్రాయం:

    04/03/2020 1:45 pm

    ఈ పద్యాలలో పాండిత్య ప్రకర్ష ఉందా? అంత భాగ్యమెక్కడ!

    రిబాయత్ -ఫిట్జెరాల్డ్ ఇంగ్లిష్ అనువాదం చదువుకున్న వాళ్లు, దువ్వూరి రామిరెడ్డి తెలుగు అనువాదం చదువుకున్నవాళ్లు -ప్రతి పద్యం లోని భావ సౌందర్యానికి చలిస్తారు. ఈ పద్యాలలో అసలు ఏమి చెప్పబడినట్టు?

    ప్రతి వంశ మూలపురుషుడు వేదవ్యాసుడు కాడు. ఘంటం పట్టిన ప్రతివాడు గణపతి కాడు. సరస్వతి, తంత్రము, యంత్రము, మహావిద్య – ఇలాటి మాటలు వాడేస్తే చాలు, అందులో ఏవో వేదాంత రహస్యాలున్నయ్యనీ, ఇక ఆ రమణుడి పాదాలు కడిగేసి విబూది తీసుకోటమే పాఠకుల పని అనుకుంటున్నారు. కనీసం ఆ రాసిన ఇంగ్లీషు పద్యాలకు అర్ధం తెలుగులో వివరించి చెప్పండి.

    గురువు మీద పద్యాలు రాసి పరీక్ష పాసైపోటం ( అవతలి ఒడ్డు చేరుకోటం) అతి పాతపడిన విద్య. ఇంకా ఎన్నిసార్లు నేర్పిస్తారండీ!
    – Lyla

  7. తథాగతుని అడుగుజాడలలో గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    04/03/2020 8:08 am

    చక్కని సవివరాత్మక, సోదాహరణ పరిచయం.

  8. ఆకురాలిన చప్పుడు గురించి శ్రీ వశిష్ఠ సోమేపల్లి అభిప్రాయం:

    04/03/2020 3:28 am

    థాంక్యూ సర్

  9. ఏదైనా రాలిపోవాల్సిందే గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    04/03/2020 12:07 am

    ఎవరీ తక్కెడశిల జాని గారు?

    తక్షశిల నుండి వచ్చిన వాడిలా హేవిటీ వైరాగ్యం?! హేవిటీ వేదాంతం? “ప్రయాణం ఒంటరిదని… ఏదైనా రాలిపోవాల్సిందేనని..” అంటూ మా గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు.

    నాకింకా జ్ఞాపకం ఉంది, “అహమా నిదానించు… మృత్యువు చెంతనే పొంచి ఉంది” అంటూ విశాఖ జగధ్ధాత్రి అక్క అన్న మాటలు.

    వీరు కవో, కవయిత్రో కూడా తెలీదు! ఆలోచించటం లేదు!

    కానీ వారు ఇకపై “తక్షశిల” అని కానీ “ఏకాంత వంధ్యశిల” అనే కలం పేరుతో కానీ రచనలు చెయ్యమని చెప్పరా?

    ~ ఇట్లు, త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు

  10. చూడు చూడు! గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    04/02/2020 12:49 pm

    ఈ twist in the tail బాగుంది. చి న