పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి Vijay Konda అభిప్రాయం:

    04/24/2020 1:48 pm

    అంజలిదే మానవోత్తమా పాట(4) చిత్తరంజన్ గారువపాడినది వేసారు. మోహన్‌రాజు గారు కూడా పాడారు గాని మీరు వినిపించినది చిత్తరంజన్ గార వర్షన్.

    ఎన్నిసారులు అన్నదొ… మోహన్‌రాజు గారు పాడినది

    ధన్యవాదాలు

  2. కొన్ని లలితగీతాలు గురించి Vijay Konda అభిప్రాయం:

    04/24/2020 12:53 pm

    అద్భుతమైన పాటలు వినిపించారు శ్రీనివాస్ గారు. చాలా చాలా ధన్యవాదాలు. అయితే ఇందలో ఎ.ఎమ్. రాజాగారు (3వ పాట)పాడిన బోయి భీమన్నగారి గీతం “హృదయమా కదులుమా” వేరే ట్యూన్ (మంచాళ జగన్నాథరావుగారు చేసిన బాణిలో) మా నాన్నగారు కె.బి.కె. మోహన్‌రాజుగారు పాడారు. Last week నాన్నగారి FBలో అప్లోడ్‌ చేసాను.

    ధన్యవాదాలు

  3. ఇంటి మొగుడు గురించి viswanadh అభిప్రాయం:

    04/24/2020 6:49 am

    చాలాబావుంది బులుసుగారూ! కధనం అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.

    ‌‌

  4. నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి Swathi అభిప్రాయం:

    04/24/2020 2:02 am

    https://youtu.be/vrOhi7fdKXw

    అటజని కాంచె.. మా అబ్బాయి 31/2 వయసు వాడు చెప్పింది.

  5. రాజకీయాందోళనము గురించి పాలపర్తి ఇంద్రాణి అభిప్రాయం:

    04/23/2020 10:44 pm

    ఇంతటి అపురూపమైన వ్యాసం ప్రకటించి ఈమాట తన స్థాయిని పెంచుకుందనడంలో అతిశయోక్తి లేదు.
    దిగవల్లి వారి వ్యాసాలు మరిన్ని ప్రచురించ ప్రార్థన.

    ధన్యవాదాలు.
    పాలపర్తి ఇంద్రాణి.

  6. మల్లిక్ పాటలు, మరికొన్ని సంప్రదాయ పాటలు గురించి Pala Varaprasada Rao అభిప్రాయం:

    04/21/2020 7:09 pm

    ఈ ఆణి ముత్యాలు download చేసుకోవడం వీలవుతుందా? ఒకవేళ ఆ వెసులుబాటు ఉంటే తెలియచెయ్యగలరు

  7. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి sairam అభిప్రాయం:

    04/21/2020 12:03 pm

    సాకేత నికేతన అన్న కృతి కన్నడ రాగంలో ఉంది. కానడ కాదు.

  8. ఏదైనా రాలిపోవాల్సిందే గురించి Lyla Yerneni అభిప్రాయం:

    04/21/2020 11:17 am

    “ఇక గూగులమ్మ ఇచ్చిన కవి పరిచయం: జాని తక్కెడశిల వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన తెలుగు యువకవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు. తెలుగుతో పాటు హిందీ, ఆంగ్లంలోనూ కవిత్వం రాస్తున్న బహు భాషా కవి.”

    నమస్కారం రామయ్యగారు!
    చాల శ్రద్ధతో తెలుగు సాహితీకారుల whereabouts, what other things they are into, తెలుపుతున్నారు. Very nice of you!

    నేను ఇలాటి విశేషాలు చదువుకుంటూ, ఇల్లు సర్దుకుంటూ, చుట్టూ పక్షుల కూతలు వింటూ, తోటలో కొత్త కొత్త పూలు ఏం పూసినవో చూస్తూ, ఏరోజు సుఖం ఆ రోజుకి కేష్ చేసుకుని, జాలీగా ఉంటానా;
    మధ్యే మధ్యే ఎంతో జాలి గొంతుతో, “అయ్యో, అమ్మో, వెంటిలేటర్లు చాలక, ఒక వయసు దాటిన వాళ్లని హాస్పిటల్ లో వెంటిలేటర్ల మీద పెట్టటం లేదంట, నువ్వు జాగ్రత్తగా ఉండాలి,” అని ఫోన్లు వస్తూంటాయి.

    నాకు వళ్లు మండి;
    “ఎవడేడిసాడు ఇప్పుడు నన్ను వెంటిలేటర్ మీద పెట్టమని, నువ్వు రోజూ హాస్పిటల్ కెళ్లొస్తావు, నువ్వే జాగ్రత్తగా ఉండు, ఇప్పటిదాకా హాయిగా ఊపిరాడతా ఉంది. ఇప్పుడు నీమీద అరిసి, అనవసరమైన ఆయాసం. గో డిక్టేట్ యువర్ మెడికల్ ఛార్ట్స్, డోంట్ బాదర్ మీ” -అంటాను నేను.

    ఇంకో పక్కనుండి ఇండియా లో వాళ్లకు తెల్లారింది కదా అని, నాకు అర్ధరాత్రో, అపరాత్రో గమనించకుండా, పనిమాలా నాకు ఫోన్ చేసి;
    మా అమ్మ చచ్చిపోయినప్పుడు నువ్వు నాకు ఫోన్ చెయ్యకపోవటం తనకు చాలా బాధ కలిగించిందంటుంది ఇంకో చుట్టం! అంతకు ముందు వారం వారం, ఆ 100 దశకం లోని అమ్మ, అనారోగ్యం మూలాన తనతో చేయించే సర్కస్ తనే ఫోన్ చేసి నాతో చెప్పుకున్నది కదా! విన్నది నేనే కదా! మరి, ఇప్పుడు వాళ్లమ్మ చావు తనకు బాధే కలిగించిందో, రిలీఫ్ ఇచ్చిందో తనే కొంచెం సోల్ సర్చ్ చేసుకుని మాట్లాడితే న్యాయం! నా మీద ఈ తెలుగు ట్రెడిషనల్ గిల్ట్ ట్రిప్ ఎందుకు! ఇంతలోనే ఆమెకు మాయ ఏమ్నీషియా!
    నేను ఏమీ చచ్చు లేకుండా, ఫ్రాంక్లీ మై డియర్! ఐ డోంట్ గివ్ ఏ డామ్! ఐ డోంట్ కేర్! అన్నాను! ఈ ట్రాజిక్ క్వీన్లందరినీ వీళ్ల ప్రతి ఆనవాయితీ ‘టైమ్ ఆఫ్ నీడ్’ లో నేను సపోర్ట్ చెయ్యలేను.

    జెన్యుయైన్ గా -ఆనందించటంలో నాకెక్కువ ఆసక్తి ఉంది. తెచ్చిపెట్టుకుని విషాదించటమంటే పరమ విరక్తి.

    అసలుకి ఆ పోయిన నా పెద్దచుట్టం, అమెరికాలో ఉన్నప్పుడు, ఇన్నీ అన్నీ తెలుగు సామెతలు గావు నాకు చెప్పినవి! ప్రతి సందర్భానికీ ఒక సామెతుండేది ఆమె వద్ద. మా సంభాషణ ఆమె గాని వినుంటే “ ఏడిసి తద్దినం పెట్టించుకున్నట్టుంది’ ‘కడుపులో లేనిది కావిలించుకుంటే వస్తుందా’ ‘చచ్చిన గొడ్డు ఎక్కువ పాలిస్తుందంట’ ‘తంగేళ్లు దాటాక భ్రమత లెక్కువ’ ఇందులో ఏదో ఒకటి ఆమే అనుండేది.

    నన్ను విచ్చలవిడిగా వదిలేస్తే, నేనిలా రాసుకుంటూ పోతుంటాను. అసలెందుకు రాస్తున్నట్టు నేను!

    రామయ్యగారూ! “మీలాటి సాహితీ పెద్దలు” అని మీరు ఒక సమాసం వేసి ఈ pandemic time లో నన్ను పెద్దల్లో కలిపేసారు, అని నవ్వొచ్చి రాసాను. ఈ కవి – ఇంగ్లిష్ లో, హిందీలో కూడా కవిత్వం రాస్తారని మీరు చెపితే సంతోషించి రాసాను. ఎంతమందో భారతీయులు చక్కని ఇంగ్లిష్ రాస్తారు. నారాయణరావు ఇంగ్లీషులో తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కవులను ప్రపంచానికి పరిచయం చేసాడు. Did he enrich Telugu Literature? Or did he enrich English Literature! నా ఉద్దేశంలో నారాయణరావు -ప్రేమతో, దీక్షతో, తెలుగు సాహిత్యాన్ని, ఆ పైన ప్రపంచ సాహిత్యాన్నిపెంపొందించాడు. తెలుగు భాషను ప్రపంచ భాష చెయ్యటం అంటే ఏమిటి! ఏ పార్లమెంట్ లోనో ఓట్ చేయించి, రాజకీయంగా ప్రజలను ఒప్పించటమా! లేదండి! సాహిత్యం తనంత తానే మెప్పించి ఒప్పించాలి. ‘ఈమాట’ లో సాహిత్యం మీద కన్నా, తెలుగులో రాయాలా, ఇంగ్లీష్ లో రాయాలా, కలగలుపు భాష రాసే దుర్మదాంధులను ఏం చెయ్యాలి! -ఇలాటి డిస్కషన్స్ శాతం ఎక్కువ! సాహిత్యం మీద మనసు లగ్నం చేస్తే, ఈ మేగజీన్ కి పులిట్జర్ ప్రైజ్లు వచ్చునేమో! అని ఆశతో రాసాను.

    As I write this prose, I hear the singing of Thrush. This decastich I wrote sometime before, stealthily found it’s way back, into my conscience.

    “Don’t ever please pen a song
    If no lover is climbing a ladder rung
    To tumble you in hay, to have a fling
    Don’t you then please sing a song
    The nightingale will forget its notes
    The azalea bush will shed its buds
    The shrill sounds of your throat
    Will kill all that is lovely and sweet
    The sky unwraps its gloomy dark cloud
    April will go and wear a shroud.”

    -Lyla

  9. పలుకుబడి: వ్యుత్పత్తి, నిరుక్తము గురించి Praveenkumar అభిప్రాయం:

    04/21/2020 2:58 am

    Hi sir, this is praveen kumar i read above matter, i need telugu sahithyam books and vythparthalu books please send me by mail. I want to know about telugu sahithyam. Please send me It’s my request.

    Thanking you sir
    Praveen Kumar

  10. ఏదైనా రాలిపోవాల్సిందే గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    04/17/2020 10:18 am

    డా. లైలా ఏర్నేని గారూ.. నమస్కారములు.

    కవి జాని తక్కెడశిల గారిని ఆశ్వీరదిస్తున్న యీ నాగరాజు గారి (వీరు శ్రీ పప్పు నాగరాజు గారై ఉందురా) పదబంధనాలని ఇలా విశదీకరించుకోవాలని ఉంది. ఆపై దీని టీకా తాత్పర్యాలు మీలాంటి సాహితీ పెద్దలను అడిగి తెలుసుకుంటాను.

    ” కవిగారూ ….పద్యమై, గద్యమై, వచనమై, గణయతిప్రాసాను ప్రాసలమయమై …రహితమై… పరహితమైన పదబంధమై… జనరంజిత అక్షరమై… ప్రక్షేపిత కిరణమై… ప్రక్ష్వేడనమై… ( ప్రక్ష్వేడన=బాణములయొక్క ) ప్రతిధ్వనించగలరు….! ”

    పులివెందుల, అనంతపురం, సింగమనేని నారాయణలతో జతపడి ఉన్నాడని తెలిసి మురిసిపోతూ… వర్ధమాన కవి జాని తక్కెడశిల గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.

    ~ ఇట్లు త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు.

    ఇక గూగులమ్మ ఇచ్చిన కవి పరిచయం: జాని తక్కెడశిల వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన తెలుగు యువకవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు. తెలుగుతో పాటు హిందీ, ఆంగ్లంలోనూ కవిత్వం రాస్తున్న బహు భాషా కవి. సామాజిక సమస్యలను కవితా వస్తువులుగా స్వీకరించి విస్తృతంగా కవిత్వం రాస్తున్నారు. కవిత్వంతో పాటు కథలు, గేయాలు, విమర్శలు, సమీక్షలు, నానోలు, నానీలు, నక్షత్రాలు రాశారు. బాల సాహిత్యంలోనూ విశేష కృషి చేస్తున్నారు. వీరు రచించిన అనేక కవితలు, కథలు, వ్యాసాలు దిన, వార, మాస పత్రికలలో ప్రచురితమైనవి.

    మొదట సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా వివిధ సంస్థలలో పని చేశారు. ప్రస్తుతం ప్రతిలిపి తెలుగు సాహిత్య వెబ్ సైట్ కి మేనేజర్ గా ఉన్నారు.

    వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల వీరి స్వస్థలం. ప్రస్తుతం వృత్తిరీత్యా బెంగుళూరులో స్థిరపడ్డారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉండటంతో వీరి మొదటి పుస్తకం అఖిలాశ 2017లో జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ లోటస్ పాండ్ ఇంట్లో పుస్తకావిష్కరణ చేశారు. రెండవ కవితా సంపుటి విప్లవ సూర్యుడు వై.ఎస్ అవినాష్ రెడ్డి గారు 2017లో పులివెందుల ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆవిష్కరణ చేశారు. మూడవ కవితా సంపుటి నక్షత్ర జల్లులు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ గారితో అనంతపురంలో ఆవిష్కరణ చేశారు. నాల్గవ కవితా సంపుటి (హిజ్రాలపై దీర్ఘ కావ్యం) రాయలసీమ కథా శిఖరం సింగమనేని నారాయణ గారితో ఆవిష్కరణ చేశారు.