పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16437

  1. రెండో పాత్ర గురించి కోటగిరి చిట్టిబాబు అభిప్రాయం:

    05/24/2026 12:52 pm

    బాగుంది. ఎంతో ఆర్ద్రత ఉంది. పెద్ద కవి మా విన్నకోట.

  2. నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/22/2026 2:00 pm

    Janamaddi saibaba గారు, let my writings and deeds reveal if I’m a man of hatred/weakness, but my perspective aligns with Nanduri’s intellectual legacy. Would you attribute hatred/weakness to him too? From his “విశ్వదర్శనం – భారతీయచింతన”:

    “నాసదీయసూక్తం ఈనాటికీ ఆశ్చర్యం కొలిపేటంత గంభీరమైన తత్వ వివేచనతో అలరారుతున్నది. మూడు వేల ఏళ్ళనాడు సప్తసింధునదీ తీరాలలో నక్షత్ర ఖచిత విశాల వినీలాకాశం క్రింద, ఉషోదేవి తూర్పున బంగారు వాకిళ్ళు తెరుస్తున్న సమయాలలో, నిబిడారణ్యాల తమాలతరుచ్ఛాయలలో, ఆశ్రమ వాటికలలో, సూర్యునికి అర్ఘ్యం విడుస్తూ హోమ గుండాన్ని పరివేష్టించి ఆసీనులై, భారతీయులైన కవులు, ఋషులు విశ్వ రహస్య ద్వారాలను తెరవడానికి ప్రయత్నం చేస్తూ తెరమరుగున దాగిన సత్యాన్ని కనుగొనడానికి తహతహలాడుతూ, ఈ సూక్తం పఠిస్తూ వుండేవారా అన్న ఊహే మనస్సులను ఏదో ఔదాత్యంతో నింపివేస్తున్నది.”

    పదార్థ నిర్మాణం గురించి ప్రాచీనుల అవగాహన గురించి ఇటీవల ఓ వ్యాసంలో (https://eemaata.com/em/issues/202605/42657.html), “అయితే, వీటిని చూసి గ్రీకులు గానీ, భారతీయులు గానీ ఆధునిక పరమాణు సిద్ధాంతాన్ని పూర్వమే కనుగొన్నారని అనుకోకూడదు. వారు చేసిన అసలైన మేలు, ప్రకృతిలోని సంక్లిష్టమైన విషయాలను సరళీకరించి (Reductionism) విశ్వ రహస్యాలను తెలుసుకోవచ్చునని చూపడం,” అని రాశాను.

    I responded to a comment by రాళ్ళబండి శ్రీధర్ గారు claiming Vedas had relativity and other modern scientific theories. Would you agree with him? Based on what? Let me end with a note from a renowned scientist [1]:

    “In short, the claims that all modern discoveries of science are of Vedic origin do not stand up to scientific scrutiny. In fact, they are counterproductive because they divert attention from the genuine discoveries attributable to ancient India. That our Vedic ancestors had the same scientific curiosity that drives modern science cannot be denied. The questions asked in Nasadiya Sukta of Rig Veda bear a striking resemblance to the questions asked by modern cosmologists. That they were curious about the universe is beyond doubt. But that they knew what modern science talks about today cannot be accepted.”

    మన సువిశాల సాహిత్యాన్ని చదివి గర్విద్దాం. కానీ, అందులోనే ఆధునిక విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలన్నీ ఉన్నాయని భ్రమపడకుండా, వాస్తవాల్ని అంగీకరించే వినమ్రతను కూడా అలవర్చుకుందాం.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] Jayant V. Narlikar. “The Scientific Edge: The Indian Scientist from Vedic to Modern Times.” Penguin Books. 2003.

  3. నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి Janamaddi saibaba అభిప్రాయం:

    05/22/2026 3:48 am

    Namaste. Gone through the comments by Sri Hanumantha Rao. Though he is at liberty to comment as he wishes, instead of blaming others as egoistic, he would have understood the Vedas by properly studying the same and analyzing with respect to the existing modern science and comment on the Vedas or those who are trying to understand. By calling people as egoistic, those people who are proud of their culture, literature, etc., I think he is only exposing his hatred/weakness.

    Let us try to understand our vast literature or leave it to those who are trying to do so.

  4. నాకు నచ్చిన పద్యం: భీష్మస్తుతి గురించి Kota Gopal అభిప్రాయం:

    05/19/2026 6:13 pm

    I read explanation that as Bheeshma continued his destruction without break 💔 Krishna warned him that if don’t stop war against Pandav army 🪖 he doesn’t hesitate to violate promise to not use weapons in kurukshetra & eliminate him. As Bheeshma realised super power of Bhagavan Krishna surrendered and he himself initiated Shikandi with Arjun Ratha and completed his eternal journey plan. The message is to For Dharma Himsa & Leaving ago of keeping word of promise must & Yudhishtar Lie of Aswadhama Athaha kunjaraha , is another occasion

  5. కంప్యూటర్ చిప్ కథ – 12: మార్కోనీ సాధించిన తీగలు లేని ప్రపంచం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    05/12/2026 7:50 pm

    విజయవాడ కేంద్రం 357.1 కాని 358 కాదండి.

    ఉదయం లేచీలేవగానే రేడియో పెట్టి భక్తిరంజని వినటం ముఖ్యంగా ఉండేది.

    రోజూ మధ్యాహ్నం పన్నెండున్నరకు కార్మికుల కార్యక్రమం వచ్చేది. శనివారం మధ్యాహ్నం రెండున్నరకు విజయవాడ కేంద్రం బొమ్మరిల్లు అని చిన్నపిల్లలకోసం కార్యక్రమం వేసేది. అదేసమయంలో హైదరాబాదు కేంద్రం నుండి బాలానందం వచ్చేది.

    అలాగే తెలుగుసినిమా ఆదివారం మధ్యాహ్నం మూడుగంటలకు వచ్చేది సంక్షిప్తశబ్దచిత్రంగా ఒక గంటపాటు. రేడియో వారు లవకుశ సినిమానూ గుటలోనికి కుదించగలిగారు విచిత్రం.

    రాత్రి తొమ్మిదింటికి ఇంగ్లీషులో వార్తల తరువాత మంచి సంగీతకచేరీ కాని, నాటకం కాని, హరికథకాని వచ్చేది. మానాన్నగారు అవి తప్పక వినేవారు.

    ప్రతి మకరసంక్రాంతినాడు మధ్యాహ్నం వైజయంతి అనే ప్రత్యేకకార్యక్రమం ఉండేది. ప్రతి ఉగాదినాడు ఉదయం పదింటికి రేడియోలో కవిసమ్మేళనం ఉండేది. మొదట్లో అందరూ మంచిరసవంతమైన పద్యకవిత్వం వినిపించేవారు. రానురానూ ఉగాదికవిసమ్మేళనాల నిండా ప్రతిలైనూ రెండేసిమార్లు చదివే వచనకవితలే ఉండటంతోనూ అవి అంత రసవంతంగా తోచకపోవటంతోనూ విసుగొచ్చి మానాన్నగారు ఆకవిసమ్మేళనం వినటం మానేసారు.

    ఇవి కాక ప్రతిసాయంత్రం నాలుగింటికి సిలోన్ నుండి మీనాక్షీ పొన్నుదొరై వేసే తెలుగు సినిమాపాటలు, బుధవారం రాత్రి ఎనిమిదింటికి వచ్చే బినాకా గీత్ మాలా హిందీ సినీమాపాటలూ యువతరానికి నచ్చేవి. ఇవన్నీ కాక వివిధ్ భారతి కూడా యవతకు బాగా నచ్చేది.

    అప్పటి రేడియో కళాకారుల పేర్లు ఇప్పటికీ పెద్దలందరికీ గుర్తే.

    ఆ రేడియోరోజులే వేరు. అన్నీ మధురస్మృతులే.

  6. కంప్యూటర్ చిప్ కథ – 12: మార్కోనీ సాధించిన తీగలు లేని ప్రపంచం గురించి G.RANGARAO అభిప్రాయం:

    05/12/2026 7:10 am

    ఈ వ్యాసం చదువుతుంటే 50 ఏళ్లనాటి జ్ఞాపకాలు కళ్ళముందు కదిలాడాయి. ఏవే రేడియో రోజులు. ఆ కాలంలో రేడియో ఒక చిన్న సైజు టీవీ పెట్టెలా ఉండేది. టీవీ లాగే ఒక చోటే స్థిరంగా ఉండేది. అటుఇటు కదల్చటానికి వీలుండేది కాదు. దానికి సిగ్నల్ రావటానికి ఇంటి ముందు రెండు బొంగులకు పొడవైన వైరు కట్టేవాళ్ళు. దాన్నే ఏరియల్ అనేవాళ్ళు.

    అవి కరెంటు లేని రోజులు. రేడియో బ్యాటరీ మీద నడిచేది. స్థితిమంతుల ఇళ్లలోనే ఉండేది రేడియో. దాని చుట్టూ జనం చేరేవాళ్ళు. ఆ కాలంలో రేడియో ఒక్కటే ప్రసార సాధనం. వార్తాపత్రికలు విజయవాడ నుంచి వచ్చేవి. పల్లెటూర్లకి ఆలస్యంగా వచ్చేవి. పత్రికలు చదివితే నిన్న ఏమి జరిగిందో తెలుస్తుంది. రేడియో వింటే ప్రస్తుతం ఏమి జరుగుతుందో తెలుస్తుంది. అంత తేడా రేడియోకి పత్రికలకు. వ్యవసాయం, వాతావరణం, రామాయణం, మహాభారతం మీద వ్యాఖ్యానం, వార్తలు, కార్మికుల కార్యక్రమం, సినిమా పాటలు, శాస్త్రీయ సంగీతం, హరికథ, బుర్రకథ అబ్బో ఒకటేమిటి ఎన్నో కార్యక్రమాలు వచ్చేవి. శ్రోతలను అలరించేవి. రేడియోలో సినిమా కూడా వచ్చేది. దాన్ని సంక్షిప్త శబ్ద చిత్రం అనేవారు. అంటే కేవలం ఆడియో అన్న మాట.

    ఆ తర్వాత రేడియో రూపాంతరం చెంది ట్రాన్సిస్టర్ గా మారిపోయింది. అది ఆ కాలంలో గొప్ప విప్లవాత్మక మార్పుగా భావించారు. ట్రాన్సిస్టర్ ఖరీదు తక్కువ. చేతితో పట్టుకొని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. మొదట్లో పెద్దదిగా వున్నా రానురాను చిన్న సైజు ట్రాన్సిస్టర్లు వచ్చాయి మార్కెట్లోకి. మర్ఫీ, బుష్, బాగా పేరుపొందిన బ్రాండ్లు. ఆ తర్వాత ఫిలిప్స్ వచ్చి మిగిలిన బ్రాండ్లను మార్కెట్లో లేకుండా చేసింది. ఖరీదైన ట్రాన్సిస్టర్‌లో బ్యాండ్లు ఉండేవి. మీడియం వేవ్, షార్ట్ వేవ్ 1, షార్ట్ వేవ్ 2 లాగా. మీడియం వేవ్ లో స్థానిక స్టేషన్ల ప్రసారాలు వచ్చేవి. రేడియో టైం అంటే కచ్చితమైన సమయం అనుకునేవారు.

    రోజూ ఉదయాన్నే 5.55 కి వాల్టర్ కాఫ్మన్ అనే పాశ్చాత్య సంగీత పండితుడు కంపోజ్ చేసిన సంతక స్వరంతో మొదలై వినసొంపైన కంఠం పలికేది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358 మీటర్లు అనగా 857 కిలోహెర్ట్స్ మీద జరిగే ప్రసారాలు అన్న మాటలతో మొదలయ్యేది ప్రసారం. వివిధ భారతిలో జనరంజని కార్యక్రమంలో రోజుకు మూడుసార్లు తెలుగు సినిమా పాటలు వచ్చేవి. అన్ని ఇళ్లలో ఆ సమయంలో అదే కార్యక్రమాన్ని చాలా ఇష్టంగా వినేవారు. పలానా పాట కావాలని ఉత్తరం రాసిన శ్రోతల పేర్లు కూడా చదివేవారు. పిల్లలు తప్పిపోతే రేడియోలో ప్రకటన చేయించేవాళ్ళు. అనేక వస్తువుల ధరలు కూడా రేడియోలో చెప్పేవాళ్ళు. పురాణాల మీద ఉషశ్రీ వ్యాఖ్యానం కోసం ఎదురుచూసి మరీ వినేవాళ్ళు.

    మాది ప్రకాశం జిల్లా. మాకు విజయవాడ కార్యక్రమాలు బాగా వచ్చేవి. తర్వాత కడప నుంచి కూడా వచ్చేవి. విశాఖపట్నం హైదరాబాద్ కార్యక్రమాలు బలహీనంగా వచ్చేవి. సిగ్నల్ సరిగా లేనందువలన. షార్ట్ వేవ్ మీద సిలోన్ నుంచి వచ్చే బైబిల్ కార్యక్రమంలో సినిమా పాటలు మాత్రం వినేవాళ్ళు!

    రేడియోలో వార్తలు చదివే వాళ్లకు మంచి గుర్తింపు ఉండేది. మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, అద్దంకి మన్నార్, కందుకూరి సూర్యనారాయణ లాంటి పేర్లు ఇప్పటికీ గుర్తే. వీరు ఢిల్లీ నుంచి వచ్చే తెలుగు వార్తలు చదివేవారు. ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ నుంచి రిలే అయ్యేవి. ఆదివారం రాత్రి భోజనాలు అయ్యాక సంక్షిప్త శబ్ద చిత్రం కోసం రేడియో చుట్టూ జనం మూగేవాళ్ళు. శనివారం రాత్రి 9.30 నుంచి 11 గంటల వరకు జాతీయ సంగీత కార్యక్రమం వచ్చేది. మంగళంపల్లి సహా అందరూ తమ సంగీత ప్రయాణాన్ని రేడియో ద్వారానే ప్రారంభించేవాళ్లు. బి అని బి హై అని, ఏ అని ఏ హై అని గ్రేడ్లు ఉండేవి సంగీత కళాకారులకు. రేడియో ఆర్టిస్ట్ అంటే అదో పెద్ద గౌరవం కళాకారులకు. క్రికెట్ మ్యాచ్ గురించి కామెంట్రీ వినాలంటే రేడియో ఒక్కటే మార్గం. రేడియోకి ఒక ఆదర్శం ఉండేది. అల్లరి చిల్లరి కార్యక్రమాలు అందులో వచ్చేవి కావు. ప్రతి కార్యక్రమంలో ఒక అభ్యుదయం నిమిడి ఉండేది.

    ట్రాన్సిస్టర్ రాకముందు పల్లెటూళ్లలో కమ్యూనిటీ రేడియో అని ఉండేది. అక్కడికి చేరేవారు పురుష జనం అంతా! రేడియోని గురించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే రేడియోకి లైసెన్స్ ఉండేది 1970 దశకం చివరి వరకు. అలాగే సైకిల్‌కి కూడా లైసెన్స్ ఉండేదట! ఏడాదికి ఒకసారి పోస్ట్ ఆఫీస్ లో కట్టాలి రేడియో లైసెన్స్ ఫీజు.

    ట్రాన్సిస్టర్ వచ్చాక కట్నం కింద రేడియో, సైకిల్, చేతి వాచీ లాంటివి కూడా చేరేవి. ఆ రోజులు చాలా బాగుండేవి. మనిషికి తెలిసిన రేడియోని రూపొందించటానికి ఎన్నో దశాబ్దాలుగా శోధించి, శ్రమించి విజయాన్ని సాధించిన శాస్త్రవేత్తల గురించి హనుమంతరావు గారి వ్యాసం చదువుతుంటే మనసంతా నోస్టాల్జిక్ జ్ఞాపకాలతో నిండిపోయింది. మళ్ళీ రావుకదా ఆ తీపి రోజులు. ఒక్కసారిగా కాలాన్ని 50 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లిన కొడవళ్ళ హనుమంతరావు గారికి కృతజ్ఞతలు.

  7. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2 గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/09/2026 6:21 pm

    1983 ప్రాంతంలో “అతడు-ఆమె,” “బతుకుపుస్తకం” చదవడాన తఃతః గారి January 18, 2019 వ్యాఖ్య మనసులో ఉండిపోయింది. ఇవాళ వికాసం వారి 2024 ప్రచురణ, “వుప్పల లక్ష్మణరావు రచనలు,” తెరిస్తే మొదట కనిపించింది 1971 నాటి వుప్పల ఉత్తరం:

    “మీ స్రుజనాత్మక సాహితీ క్రుషికీ, తెలుగు తల్లి మీద మీకున్న భక్తి గౌరవాలకీ నేనెంతో సంబరపడ్డానని నేనంటే నా మాటలు నీటిమూటలు కావు – నిజంగా నమ్మండి. మీ జట్టు కూడాలనుంది నాకు. నన్ను కూడా మీలో వొహణ్ణిగా తీసుకోండని నా మనవి.”

    కొత్తగా తెలుసుకున్న విషయం—తన జీవిత చరిత్రకు ఆయన మొదట పెట్టుకున్న పేరు “అసమర్థుని జీవయాత్ర.” వికాసం సభ్యులు గగ్గోలు పెట్టడంతో, దేవి (డా. దేవరకొండ సహదేవరావు?) గారి సూచన మేరకు “బతుకుపుస్తకం” పేరుకు ఒప్పుకున్నారు.

    కొడవళ్ళ హనుమంతరావు

  8. పలుకుబడి: ఋతువులు, కాలాలు గురించి హరి ప్రసాద రావు అభిప్రాయం:

    05/08/2026 10:16 pm

    ఇప్పుడు నాకు 55 ఇయర్స్..ఇలాంటి సబ్జెక్ట్ చూడటం చదవటం ఇదే ప్రథమం..చాలా బాగున్నది .. కాలాలను ఇలా కూడా సూచించారు అనే విషయం మాకు ఏ స్కూల్ లో మాకు చూచాయగా కూడా చెప్పలేదు

  9. కంప్యూటర్ చిప్ కథ – 12: మార్కోనీ సాధించిన తీగలు లేని ప్రపంచం గురించి రామకృష్ణ శిష్ట్లా అభిప్రాయం:

    05/08/2026 1:19 pm

    మీ వ్యాసాలు చాలా బాగున్నాయి. మీరు ఎంచుకున్న విషయం క్లిష్టమైనదైనా పాఠకులకు సరళంగా అర్ధమైయ్యేట్లు అద్భుతం గా అందించారు.

  10. మధ్యమవ్యాయోగము – సమూలానువాదం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    05/07/2026 7:05 pm

    శ్రమించి చక్కటి అనువాదం అందించిన శ్రీనివాస్ గారికి అభినందనలు, కృతజ్ఞతలు.

    భాస నాటకాలు చాలావరకు స్వకపోలకల్పితాలే. పాత్రలు పరిచితాలే ఐన సందర్భాల్లో కూడ కథలు అతనివే. ఇందుకు ప్రముఖ ఉదాహరణలు ప్రతిమా, ఊరుభంగం, ఈ మధ్యమ వ్యాయోగం. అతని అద్భుతకల్పనాశక్తికి అంజలి ఘటించి ఆస్వాదించగలగటం అదృష్టం.

    ఇకపోతే, భాసుని గురించి కొందరి సాహితీవిమర్శలు పట్టించుకోవలసినవి కావని నా అభిప్రాయం. రచనల్లో కులవ్యవస్థను చూపిన తీరునుబట్టి కవుల కాలాన్ని నిర్ణయించటమంటే రామాయణ భారతాల్నీ, మనుధర్మశాస్త్రాన్నీ, కాళిదాసు తర్వాత వచ్చినవిగా పరిగణించాల్సి వస్తుందన్న ఆలోచన కూడ వారికి తట్టినట్టు లేదు. రామాయణంలో విశ్వామిత్రుడి కథ సైతం వారికి తెలియదా? ఏమైనా ఇది ఇంతటితో ఆపుదాం.

    [Comment edited — సంపాదకులు.]