పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. పాత నెలవంక గురించి గిరిధర్ పొట్టేపాళెం అభిప్రాయం:

    05/07/2022 6:06 am

    అన్వర్ గారూ, మీ బొమ్మల్లో ప్రతి గీతలో ఉన్న డైనమిజంలా, మీ రాతల్లోనూ చాలా అనుభూతుల్లో తిప్పి వదిలేస్తారు. చదూతుంటే నా చిన్ననాటి మా ఊరు దామరమడుగులో పీర్ల పండగ, రంజాన్ రోజులు గుర్తుకొచ్చాయి.

  2. ఊహల ఊట 12 గురించి మహేశ్వరం రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయం:

    05/06/2022 10:18 am

    చదవడం మొదలు పెట్టి ఆసాంతం చదివించిన చక్కటి కథ. మళ్లీ తిరిగిరాని బాల్యపు లోగిలిలోకి జారవేసిన కథ. . రచయితకు నా హృదపూర్వక ధన్యవాదములు

  3. పెద్రో గురించి cbrao అభిప్రాయం:

    05/05/2022 11:28 am

    ఉక్రైన్ నేపధ్యంలో నేను చదివిన మొదటి కథ. యుద్ధ వాతావరణం చక్కగా విదితమయ్యింది. రష్యా అంటే వున్న అయిష్టతను, పెద్రో కాలకృత్య చర్య ద్వారా చూపించటం కథలో కొసమెరుపు.

  4. పాత నెలవంక గురించి C.Suseela అభిప్రాయం:

    05/04/2022 10:56 pm

    అన్వర్, ఎంత బాగా రాశారో.మీరు Painter కాదు మంచి writer కూడా! ఆ రంజాన్ పండుగరోజు మమ్మల్ని నడిపించారు. ఆ కీరు రుచి చూపించారు.ఎందుకు ఆ బాల్యంలొని అందాల్ని, సంతోషాల్ని, సుబరాల్ని పొందలేకపోతున్నాము.ఇప్పుడు ఎప్పుడు కావాలన్నా లభించె కొత్త బట్టలు, అన్ని. అప్పుడు ఆ పండుగకే పరిమితం.ఏమిటొ అన్ని కోల్పోయాము. మొత్తం మీద చాలా బాగా రాశారు.అభినందనలు.

  5. ఆత్మగోపాలుడి అనుభూతి తరంగం గురించి NS Murty అభిప్రాయం:

    05/04/2022 6:34 pm

    తఃతః గారూ,
    మీ స్పందనకు ముందుగా ధన్యవాదాలు.
    1. తిలక్ ని తప్పుగా కోట్ చేసినందుకు క్షంతవ్యుణ్ణి.
    2. మీకు తెలియనిదేం కాదు. నిశ్శబ్దం అన్నది రెండు రకాలు. చప్పుడు లేకపోవడం ఒకటి (complete silence). రెండవది మనకు వినిపించని frequency లో చేసే చప్పుడు. బహుశా దానినే తిక్కనగారు విరాటపర్వంలో, కీచకుడు భీముడూ నర్తనశాలలో “చప్పుడు చేయని నిగూఢ మర్దన ప్రహారముల తగన్ ‘ ముష్టియుద్ధం చేసినట్టు వ్రాసేరు. బహుశా ప్రాణావసానసమయంలో జీవులన్నీ చెట్టునుండి రాలిన ఆఖరి ఆకులాంటి నిశ్శబ్ద శబ్దాన్నే చేస్తాయేమో!

  6. పెద్రో గురించి ravikanth buggineni అభిప్రాయం:

    05/03/2022 3:14 pm

    అద్భుతమైన తుది ఘట్టం 🙂

  7. ఆత్మగోపాలుడి అనుభూతి తరంగం గురించి తః తః అభిప్రాయం:

    05/03/2022 11:05 am

    మూర్తీ: నిషిగంధ ‘జాజుల జావళి’ని – మీరు- కవితా సౌదర్యాన్ని దర్శించి పరిచయం చేశారు. మీకు అభినందనలు. రెండు మాటలు చెప్పక తప్పదు మూర్తీ: 1. తిలక్ “నా మాటలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు” అనలేదు, “నా మాటలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అన్నాడు. ‘అందమైన’ అని పెద్ద తప్పు చేశాడని నా అభిప్రాయం. 2. నిశ్శబ్దాన్ని ‘వినగలిగిన’ కవయిత్రి ‘నిశ్శబ్ద శబ్దం’ అని ఎందుకు అనవలసి వచ్చిందో తెలియలేదు. నమస్కారాలతో- తః తః

  8. పాత నెలవంక గురించి సనత్ అభిప్రాయం:

    05/03/2022 10:49 am

    అన్వర్, హృదయానికి హత్తుకునేలా చిన్ననాటి సంగతులు గుర్తుకు వచ్చేలా , చాలా బాగా వ్రాశారు. 🙏🙏👏👏👌👍

  9. ఆత్మగోపాలుడి అనుభూతి తరంగం గురించి నిషిగంధ అభిప్రాయం:

    05/03/2022 8:56 am

    హృదయపూర్వక ధన్యవాదాలు, మూర్తిగారు!!

    ఆమె దగ్గర అక్షరాలు అదృశ్యమైనా మిగిలే రహస్య భాష ఒకటి ఉంది.” ఈ వాక్యం దగ్గర చాలా సేపు ఆగిపోయాను… కవిత్వం ఆత్మని స్పృశించడం అంటే ఏమిటో అర్ధం అయింది. డే టూ డే బాధ్యతల మధ్య సఫొకేట్ అవుతున్న నా భాషకి కూడా కాస్త ఊపిరి దొరికింది.

    ఈ కాస్తన్ని కృతజ్ఞతలతో మీకు నమస్సులు!

  10. పాత నెలవంక గురించి Sudheer అభిప్రాయం:

    05/03/2022 1:52 am

    నా చిన్నతనం గుర్తుకు తెచ్చారు…