పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. మత్స్యకారుల జీవన ప్రతిబింబం: మున్నీటి గీతలు గురించి వంశీక్రిష్ణ అభిప్రాయం:

    11/07/2022 12:26 am

    చాలా బాగుందండి సమీక్ష.

  2. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి నెల గురించి venki అభిప్రాయం:

    11/06/2022 8:55 am

    చాలా బాగుంది సర్.
    ఏదో నేనే ఆ ట్రైనింగ్ లో ఉన్నట్టు ఉంది. మీరు చాలా బాగా రాస్తున్నారు.

  3. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి గంట గురించి venki అభిప్రాయం:

    11/06/2022 4:36 am

    చాలా బాగుంది సర్. మొదటిసారి ఒక మిలట్రీ నేపథ్యంలో క్రిందిస్థాయి అనుభవాలు చదవడం. దయచేసి ఇది మరింత కాలం కొనసాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.

  4. మత్స్యకారుల జీవన ప్రతిబింబం: మున్నీటి గీతలు గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:

    11/05/2022 3:40 pm

    మత్స్యకారుల గురించి వ్రాసిన మొట్టమొదటి తెలుగు నవల అని సమీక్షకులు వ్రాయటం పొరపాటు. చాలాయేళ్ల క్రితం చిట్టిబాబు అనే రచయిత పరమాద్భుతంగా వారి గురించి నవల వ్రాశారు. అయితే దీనివలన శ్రీనివాసరావుగారి మీద గౌరవం ఏమి తగ్గదు. చింతకిందివారి రచనలు తప్పక చదవతగ్గవి.

  5. బాలానందం గురించి RadhikaPrasad అభిప్రాయం:

    11/05/2022 1:04 pm

    ఏమని చెప్పాలి.. పాదాభివందనం చేయటం తప్ప. నా బాల్యం నాకు మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చి నన్ను ఆనంద బాష్పాలు తిరిగేటంత ఎమోషనల్ చేసిన వారికి నమస్కారాలు చెప్పటం తప్ప మరేం చేయలేను. ఎన్నెన్ని మంచి పాటలు. బాలానందం అంటే గుసగుసలు పోవటం కూడా నిషిద్ధం. అంత నిశ్శబ్దంగా వినేవాళ్ళం. ఆ తర్వాత మూడు గంటల సమయంలో వచ్చే నాటకం మరొకటి. ఇదంతా గతించి పోయిన బంగారు బాల్యం. ఇప్పుడు పిల్లలు నిజంగా ఎంత దురదృష్టవంతులు. పెరుగుతున్నారు. కానీ, అందమైన అనుభూతులు ఉన్న బాల్యాన్ని మాత్రం కోల్పోయారు. అంత అందమైన బాల్యాన్ని చవి చూసిన నేను అదృష్టవంతురాలిని. శత సహస్ర ధన్యవాదాలు.. 🙏

  6. గడినుడి – 73 గురించి శ్రీరాం నడిమింటి అభిప్రాయం:

    11/05/2022 8:53 am

    9, 10, 30, 32, 55, 56 అడ్డం లకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు ఉండే అవకాశాలున్నాయి. ఆధారాలను సవరించవలసి వస్తుంది.

  7. ఖాళీ కవిత గురించి శ్రీనివాస్ bandaa అభిప్రాయం:

    11/05/2022 6:04 am

    బావుందండి!

  8. Rhapsody in Woods గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:

    11/05/2022 6:00 am

    ఎంత కొత్తగా వుందో, అంత conformative గానూ అనిపించింది!

  9. సోల్జర్ చెప్పిన కథలు: కాదేదీ! గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:

    11/05/2022 2:59 am

    ఫ్యూడల్ / కలోనియల్ వంటి పదాలకి బయటి ప్రపంచంలో ఉన్న అర్థాలని సైన్యపు క్రమశిక్షణకి ఆపాదించలేం అనుకుంటానండి. సైన్యంలో కావలసినది ఇవ్వబడిన ఆదేశాలని పాటించడమే. అక్కడ ‘ఫలానా ఆదేశం తగినది కాదు, నేను దాన్ని పాటించను’ అనుకునే / అనే అవకాశమే లేదు. బయటి ప్రపంచంలో పెరిగి వచ్చిన యువకులని, నేర్పిన/ఇచ్చిన ఆదేశాలని పాటించే సైనికులుగా మార్చడానికి కొంత కాఠిన్యం అవసరమౌతుంది. ఆ కాఠిన్యం ఒక్కొక్కరికి ఒక్కోలా తోచవచ్చు. ఇక కలోనియలిజం – దీని ఛాయలు మన ప్రపంచంలోంచి పూర్తిగా సమసిపోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందనుకుంటున్నాను.

  10. వంద కుర్చీలు గురించి Amarendra Dasari అభిప్రాయం:

    11/05/2022 12:59 am

    పైన రామారావుగారి స్పందన…
    కథ సార్థకమయింది