ఈనాటి సంగీత సాహిత్యాల గురించి వేటూరిగారు చెప్పిన విషయాలు కొంతవరకు నిజమే. కానీ, పంచభర్తృకలై కవులు పాటలెందుకు వ్రాయాలి? అసలు దర్శకుడు పాట ఏ సందర్భంగా కావాలో చెప్పకపొతే రచయిత ఏమి వ్రాస్తాడు? సంగీత దర్శకుడు ఏ స్వరాలు కూరుస్తాడు? గాయకుడేమి పాడుతాడు? నిర్మాత, దర్శకుల బావమరుదులు చెప్పటమేమిటి వీరు వ్రాయడమేమిటి? ఉన్నత శిఖరాలు అధిరోహించిన కవులు తమ ఔన్నత్యాన్ని తగ్గించుకొని ఎందుకు వ్రాయడం?
తెలుగులో మంచి కథలు ఈమధ్య చాలా తక్కువగా వస్తున్నై. అందుకు కారణం కథకులలో సమకాలీన సమస్యలపట్ల సరియైన అవగహన లేకపొవటమే. అంతేగాక భాషమీద కూదా పట్టు ఉండడంల లేదు. ఉన్నవారికి తీరిక ఉండదు.
నేను మూడేళ్ళ క్రితం రాసిన వ్యాసానికి ఇప్పుడు వచ్చిన ప్రతిస్పందన చూసి ఆశ్చర్యపోయాను. నేను భాషాశాస్త్రం గురించి రాసిన మొదటి వ్యాసం కాబట్టి కాస్తా బెరుకు, బెరుకుగా జంకుతూనే రాసాను. నేను ఈ వ్యాసం రాసేనాటికి తెలుగుభాష ప్రాచీనత గురించిన వాదాలు కానీ, తెలుగుభాషను శ్రేష్ఠభాషగా గుర్తించాలన్న నినాదాలు కానీ లేవు. ఈమధ్య కాలంలో ఈ వ్యాసం రాసుంటే కొంత దూకుడుగా, కుశాస్త్రనిందతో మొదలుపెట్టి రాసేవాడినేమో.
వేమూరి గారు: మీ అభిమానానికి కృతజ్ఞతలు. “తెలుగదేలయన్న …” అన్న అంశం మీద మీరు చక్కగా రాసారు. నేను డెట్రాయిట్ సదస్సులో కూడా ఈ అంశంపై కాస్తా మాట్లాడటానికి ప్రయత్నించాను. ఆ సదస్సులో నేను మాట్లాడిన విషయాలను వ్యాసరూపంగా వచ్చే నెలలో పొద్దు పత్రికలో మీరు చూడవచ్చు.
శ్రీనివాస్ నాగులపల్లి గారు: భారత ఉపఖండంలో లిపుల చరిత్రకు, భాషల చరిత్రకు అంతగా సంబంధం లేదు. భాషలు, భాషాకుటుంబాల చరిత్ర మహా ప్రాచీనమైతే, వర్తకులకు, రాజులకు, కవులకు మాత్రమే అవసరమయ్యే లిపులు అతి నవీనమైనవి. ఇప్పుడు భారతదేశంలో వాడే లిపులన్నింటికీ మూల మాతృక బ్రహ్మీ లిపి. ఈ బ్రహ్మీ లిపి 2500 సంవత్సరాలకు పూర్వం వాడినట్టుగా ఎక్కడా ఆధారాలు లేవు! వేద సాహిత్యం చాలాకాలం వరకూ మౌఖిక సాహిత్యంగానే ఉండేదన్న విషయం మనందరికీ తెలిసిందే.
తెలుగు-కన్నడ లిపుల పరిణామాన్ని సూచించే ఈ కింది చిత్రపటం భద్రిరాజు కృష్ణమూర్తి గారి Dravidian languages పుస్తకం లోనిది [79 వ పేజీ].
బాబ్జీలుగారు: ఈ వ్యాసం తిరిగి రాయాల్సి వస్తే “మగవాడి జీతం, వయస్సు” అనకుండా “శూరుల జన్మంబు, సురుల జన్మంబు, ఏరుల జన్మంబు ఎరుగ తరమే”అన్న పల్నాటియుద్ధపు పద్యాన్నో, “ఋషిచే కూళ్ ఆణి నదీచే మూళ్ శోధూ నయే! (ఋషుల కులాన్ని నదుల మూలాన్ని శోధించవద్దు)” అన్న మరాఠీ సామెతనో ఉటంకిస్తూ రాస్తాను లెండి :-).
Classical Language అన్న పద బంధాన్ని “ప్రాచీన భాష” అని అనువదించడం లోనే వచ్చింది అసలు చిక్కు. క్లాసికల్ అన్న మాటలో కాలానికన్నా గుణానికే ఎక్కువ ప్రాధాన్యత కాబట్టి ఆ పదాన్ని శ్రేష్ఠభాష అని అనువదించుకొని ఉండుంటే తెలుగు భాషను సుమేరియన్లతో, తెలిమన్లతో ముడిపెట్టి ద్రవిడ ప్రాణాయామం చెయ్యాల్సిన అగత్యం తప్పేదేమో. ఇప్పటికైనా, ఆ శ్రేష్ఠ భాషా ప్రతిపత్తితో పాటు సాధించిన కోటి రూపాయలతో తెలుగు భాష, చరిత్రల గురించి ఉన్నత స్థాయిలో శాస్త్ర పరిశోధనలు జరపడానికి కావలిసిన వ్యవస్థని నెలకొల్పడానికి పూనుకుంటారని ఆశిద్దాం.
హలో సారూ,
మీరు చేసిన పరిశోధన చాలా బాగా సాగింది. నిజంగా చెప్పాలంటే, మీరు సరదాగా రాసినా, రాసింది మాత్రం సమకాలీన సమస్యే. ఇదే విధంగా అత్తాకోడళ్ళ మధ్య జరిగితే, ఇంత సులువుగా ఆగదు కూడా.
ఇంక విషయానికి వస్తే, మీరు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారో, ఆంధ్రాలో తెలుగుపండితులో అర్థంకాలేదు. వివిధ గ్రంథాలమీద మీకు మంచి అవగాహన ఉందనిమాత్రం అవగతమయ్యింది. చక్కని తెలుగును, మంచి హాస్యాన్నీపండించారు.
బ్రాహ్మణ కుటుంబాల్లో పాటించే ఆచారాలనూ చక్కగా చిత్రించారు. అభినందనలు.
అపర్ణ యేలూరిపాటి, న్యూజర్సీ.
చాలా బాగుంది ఈ కథ. ఈ కథ చదివాక కొంచెం ఆత్మావలోకనం చేసుకోకుండా ఎవరూ ఉండలేరేమో. చాలా విషయాల్లో అసమర్థులం అని గ్రహించిన తరువాత కొంచెం బాధ పడకుండా ఉండలేం. జీవితంతో compromise అయ్యి అసమర్థులుగా ఉండేది ఎందరో.
Although I could not understand some of the images, It was great to see the description of modern life in classical telugu meters. When everything is being made easy in the name of convenience, beacons like you are needed. తెలుగులో రాయనందుకు క్షమించాలి.
వేలూరి గారికీ, వారికంటే ముందు నిడదవోలు గారికీ అభినందనలు. రచనలోని వస్తువు ఆనాటి రచయిత్రుల శైలి గురించి అయినప్పుడు, తెలుగులోనే రాస్తే మరింత హత్తుకునేదేమో! మీరు పేర్కొన్న రచయిత్రుల రచనలు చదివి వుండడంచేత, కొంత సహజమైన కుతూహలంతో వ్యాసమంతా ఏకబిగిన చదివేను. పదిలంగా వున్న జ్ఞాపకాలు, ఈ వ్యాసం తెలుగులో వుండివుంటే, మరింత ఉక్కిరి బిక్కిరి చెయ్యవా అనిపించింది. ఏ వుద్దేశంతో మూల రచనని ఆంగ్లంలో చేసేరోగానీ, ఉపశీర్షికలతో (సబ్ టైటిల్సు) “మాయా బజారు” చూడమన్నట్టుంది.
ఢారావాహికలూ, నవలలూ తెలుగు సాహిత్యంలో హెచ్చవడంలో రచయిత్రుల పాత్ర విశిష్టమైంది. రచయిత్రులకి ఎంత ఆదరణ వుండేదంటే, కొంతమంది రచయితలుకూడా రచయిత్రులుగా కలం పేరుతో రాసేవారు. నాకు జ్ఞాపకమున్న పేర్లు : బీనాదేవి, లల్లాదేవి, ఎం.డీ సౌజన్య, వీరపల్లె వీణావాణి, తోటకూర ఆశాలత మొ. వారు.
తిరుగుబాటు ధోరణి కాకుండా, పాఠకులని పాత్రల ద్వారా ప్రభావితం చేసిన రచయిత్రి మాలతీ చందూర్. ఎన్నో రచనలని చేసిన జొన్నలగడ లలితాదేవి, కావలిపాటి విజయలక్ష్మి, విలక్షణంగా తమ పేరు రాసుకునే ఆరెకపూడి (కోడూరి) కౌసల్యా దేవి, తురగా (మోచర్ల) జయశ్యామల లని మూల రచనలో ప్రస్తావించి వుంటారనుకుంటాను.
పెద్దలెవరైనా పూనుకుని ఈ మూల రచనని తెనిగించరా అని నా ఆశ.
సేకరణ అద్భుతం. ధ్వని కూడా బహు నాణ్యంగా వుంది. రచన పూర్తి పాఠం విడిగా ఇవ్వడం చాలా బాగుంది.
అప్పట్లో రేడియో నాటకాలు ఆదివారం మధ్యాహ్నం రెండూ మూడూ మధ్య వచ్చేవి. అన్ని కేంద్రాల్లోనూ (హైదరా, విజయ,, విశాఖ, కడప) ఒకేసారి ప్రసారమయ్యేవి. ఏ కేంద్రం వారు నిర్మిస్తే వారి పేరు ముందొస్తుంది. సినిమాకి ముందు పేర్లేసినట్టు, రేడియో నాటకానికి ముందు పేర్లు చదివేవారు. ” ఇందలి పాత్రలూ, పాత్రధారులూ… ” అంటూ “శబ్ద” దానం చేసిన వారి పేర్లూ, అటు వెంబడి “నిశ్శబ్దంగా” వెనుక పనిచేసిన వారి పేర్లూ చదివేవారు. వాటిలో ఎక్కువగా వినిపించి నాకు జ్ఞాపకమున్న పేర్లు – శారదా శ్రీనివాసన్ (పాత్రధారి), వాడ్రేవు పురుషోత్తం (నిర్వాహకులు).
శ్రోతల ఆదరణ పొందిన మరో నాటకం “దీక్షాంతం”. ఇందులోనూ ఊర్వశి పాత్ర వుంటుంది. ఎవరి గొంతో జ్ఞాపకం లేక పోయినప్పటికీ, నిర్వాహకులు మాత్రం శ్రీ వాడ్రేవు పురుషోత్తం.
మీ కృషి శ్లాఘనీయం. మరిన్ని అజరామరమైన రేడియో నాటకాలని వినిపిస్తారని ఆశిస్తాను.
తెలుగు భాష వయస్సెంత? గురించి rama అభిప్రాయం:
12/22/2008 6:15 am
సురేష్ గారు, “శూరుల జన్మంబు…” నన్నయగారి పద్యం. రమ.
తానాలో వేటూరి సుందరరామమూర్తి ప్రసంగం కొన్ని విషయాలు గురించి Sairamraju అభిప్రాయం:
12/22/2008 5:23 am
ఈనాటి సంగీత సాహిత్యాల గురించి వేటూరిగారు చెప్పిన విషయాలు కొంతవరకు నిజమే. కానీ, పంచభర్తృకలై కవులు పాటలెందుకు వ్రాయాలి? అసలు దర్శకుడు పాట ఏ సందర్భంగా కావాలో చెప్పకపొతే రచయిత ఏమి వ్రాస్తాడు? సంగీత దర్శకుడు ఏ స్వరాలు కూరుస్తాడు? గాయకుడేమి పాడుతాడు? నిర్మాత, దర్శకుల బావమరుదులు చెప్పటమేమిటి వీరు వ్రాయడమేమిటి? ఉన్నత శిఖరాలు అధిరోహించిన కవులు తమ ఔన్నత్యాన్ని తగ్గించుకొని ఎందుకు వ్రాయడం?
తెలుగు కథల పోటీ గురించి Sairamraju అభిప్రాయం:
12/22/2008 4:39 am
తెలుగులో మంచి కథలు ఈమధ్య చాలా తక్కువగా వస్తున్నై. అందుకు కారణం కథకులలో సమకాలీన సమస్యలపట్ల సరియైన అవగహన లేకపొవటమే. అంతేగాక భాషమీద కూదా పట్టు ఉండడంల లేదు. ఉన్నవారికి తీరిక ఉండదు.
తెలుగు భాష వయస్సెంత? గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
12/21/2008 6:28 pm
నేను మూడేళ్ళ క్రితం రాసిన వ్యాసానికి ఇప్పుడు వచ్చిన ప్రతిస్పందన చూసి ఆశ్చర్యపోయాను. నేను భాషాశాస్త్రం గురించి రాసిన మొదటి వ్యాసం కాబట్టి కాస్తా బెరుకు, బెరుకుగా జంకుతూనే రాసాను. నేను ఈ వ్యాసం రాసేనాటికి తెలుగుభాష ప్రాచీనత గురించిన వాదాలు కానీ, తెలుగుభాషను శ్రేష్ఠభాషగా గుర్తించాలన్న నినాదాలు కానీ లేవు. ఈమధ్య కాలంలో ఈ వ్యాసం రాసుంటే కొంత దూకుడుగా, కుశాస్త్రనిందతో మొదలుపెట్టి రాసేవాడినేమో.
వేమూరి గారు: మీ అభిమానానికి కృతజ్ఞతలు. “తెలుగదేలయన్న …” అన్న అంశం మీద మీరు చక్కగా రాసారు. నేను డెట్రాయిట్ సదస్సులో కూడా ఈ అంశంపై కాస్తా మాట్లాడటానికి ప్రయత్నించాను. ఆ సదస్సులో నేను మాట్లాడిన విషయాలను వ్యాసరూపంగా వచ్చే నెలలో పొద్దు పత్రికలో మీరు చూడవచ్చు.
శ్రీనివాస్ నాగులపల్లి గారు: భారత ఉపఖండంలో లిపుల చరిత్రకు, భాషల చరిత్రకు అంతగా సంబంధం లేదు. భాషలు, భాషాకుటుంబాల చరిత్ర మహా ప్రాచీనమైతే, వర్తకులకు, రాజులకు, కవులకు మాత్రమే అవసరమయ్యే లిపులు అతి నవీనమైనవి. ఇప్పుడు భారతదేశంలో వాడే లిపులన్నింటికీ మూల మాతృక బ్రహ్మీ లిపి. ఈ బ్రహ్మీ లిపి 2500 సంవత్సరాలకు పూర్వం వాడినట్టుగా ఎక్కడా ఆధారాలు లేవు! వేద సాహిత్యం చాలాకాలం వరకూ మౌఖిక సాహిత్యంగానే ఉండేదన్న విషయం మనందరికీ తెలిసిందే.
తెలుగు-కన్నడ లిపుల పరిణామాన్ని సూచించే ఈ కింది చిత్రపటం భద్రిరాజు కృష్ణమూర్తి గారి Dravidian languages పుస్తకం లోనిది [79 వ పేజీ].
లిపుల గురించి రోహిణీప్రసాదు గారు రాసిన మౌఖిక సాహిత్యం, లిపుల ఆవిర్భావం అన్న వ్యాసంకూడా మీకు ఉపయోగపడవచ్చు.
బాబ్జీలుగారు: ఈ వ్యాసం తిరిగి రాయాల్సి వస్తే “మగవాడి జీతం, వయస్సు” అనకుండా “శూరుల జన్మంబు, సురుల జన్మంబు, ఏరుల జన్మంబు ఎరుగ తరమే”అన్న పల్నాటియుద్ధపు పద్యాన్నో, “ఋషిచే కూళ్ ఆణి నదీచే మూళ్ శోధూ నయే! (ఋషుల కులాన్ని నదుల మూలాన్ని శోధించవద్దు)” అన్న మరాఠీ సామెతనో ఉటంకిస్తూ రాస్తాను లెండి :-).
Classical Language అన్న పద బంధాన్ని “ప్రాచీన భాష” అని అనువదించడం లోనే వచ్చింది అసలు చిక్కు. క్లాసికల్ అన్న మాటలో కాలానికన్నా గుణానికే ఎక్కువ ప్రాధాన్యత కాబట్టి ఆ పదాన్ని శ్రేష్ఠభాష అని అనువదించుకొని ఉండుంటే తెలుగు భాషను సుమేరియన్లతో, తెలిమన్లతో ముడిపెట్టి ద్రవిడ ప్రాణాయామం చెయ్యాల్సిన అగత్యం తప్పేదేమో. ఇప్పటికైనా, ఆ శ్రేష్ఠ భాషా ప్రతిపత్తితో పాటు సాధించిన కోటి రూపాయలతో తెలుగు భాష, చరిత్రల గురించి ఉన్నత స్థాయిలో శాస్త్ర పరిశోధనలు జరపడానికి కావలిసిన వ్యవస్థని నెలకొల్పడానికి పూనుకుంటారని ఆశిద్దాం.
అంటు, అత్తగారు గురించి aparna yeluripati అభిప్రాయం:
12/21/2008 12:52 pm
హలో సారూ,
మీరు చేసిన పరిశోధన చాలా బాగా సాగింది. నిజంగా చెప్పాలంటే, మీరు సరదాగా రాసినా, రాసింది మాత్రం సమకాలీన సమస్యే. ఇదే విధంగా అత్తాకోడళ్ళ మధ్య జరిగితే, ఇంత సులువుగా ఆగదు కూడా.
ఇంక విషయానికి వస్తే, మీరు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారో, ఆంధ్రాలో తెలుగుపండితులో అర్థంకాలేదు. వివిధ గ్రంథాలమీద మీకు మంచి అవగాహన ఉందనిమాత్రం అవగతమయ్యింది. చక్కని తెలుగును, మంచి హాస్యాన్నీపండించారు.
బ్రాహ్మణ కుటుంబాల్లో పాటించే ఆచారాలనూ చక్కగా చిత్రించారు. అభినందనలు.
అపర్ణ యేలూరిపాటి, న్యూజర్సీ.
అసమర్థులు గురించి vaMSI అభిప్రాయం:
12/20/2008 2:24 pm
చాలా బాగుంది ఈ కథ. ఈ కథ చదివాక కొంచెం ఆత్మావలోకనం చేసుకోకుండా ఎవరూ ఉండలేరేమో. చాలా విషయాల్లో అసమర్థులం అని గ్రహించిన తరువాత కొంచెం బాధ పడకుండా ఉండలేం. జీవితంతో compromise అయ్యి అసమర్థులుగా ఉండేది ఎందరో.
హిమపాతము గురించి Bhanu Gandluri అభిప్రాయం:
12/20/2008 12:58 pm
Although I could not understand some of the images, It was great to see the description of modern life in classical telugu meters. When everything is being made easy in the name of convenience, beacons like you are needed. తెలుగులో రాయనందుకు క్షమించాలి.
A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి శ్రీనివాస్ అభిప్రాయం:
12/20/2008 11:59 am
వేలూరి గారికీ, వారికంటే ముందు నిడదవోలు గారికీ అభినందనలు. రచనలోని వస్తువు ఆనాటి రచయిత్రుల శైలి గురించి అయినప్పుడు, తెలుగులోనే రాస్తే మరింత హత్తుకునేదేమో! మీరు పేర్కొన్న రచయిత్రుల రచనలు చదివి వుండడంచేత, కొంత సహజమైన కుతూహలంతో వ్యాసమంతా ఏకబిగిన చదివేను. పదిలంగా వున్న జ్ఞాపకాలు, ఈ వ్యాసం తెలుగులో వుండివుంటే, మరింత ఉక్కిరి బిక్కిరి చెయ్యవా అనిపించింది. ఏ వుద్దేశంతో మూల రచనని ఆంగ్లంలో చేసేరోగానీ, ఉపశీర్షికలతో (సబ్ టైటిల్సు) “మాయా బజారు” చూడమన్నట్టుంది.
ఢారావాహికలూ, నవలలూ తెలుగు సాహిత్యంలో హెచ్చవడంలో రచయిత్రుల పాత్ర విశిష్టమైంది. రచయిత్రులకి ఎంత ఆదరణ వుండేదంటే, కొంతమంది రచయితలుకూడా రచయిత్రులుగా కలం పేరుతో రాసేవారు. నాకు జ్ఞాపకమున్న పేర్లు : బీనాదేవి, లల్లాదేవి, ఎం.డీ సౌజన్య, వీరపల్లె వీణావాణి, తోటకూర ఆశాలత మొ. వారు.
తిరుగుబాటు ధోరణి కాకుండా, పాఠకులని పాత్రల ద్వారా ప్రభావితం చేసిన రచయిత్రి మాలతీ చందూర్. ఎన్నో రచనలని చేసిన జొన్నలగడ లలితాదేవి, కావలిపాటి విజయలక్ష్మి, విలక్షణంగా తమ పేరు రాసుకునే ఆరెకపూడి (కోడూరి) కౌసల్యా దేవి, తురగా (మోచర్ల) జయశ్యామల లని మూల రచనలో ప్రస్తావించి వుంటారనుకుంటాను.
పెద్దలెవరైనా పూనుకుని ఈ మూల రచనని తెనిగించరా అని నా ఆశ.
రంగు తోలు గురించి Motorolan అభిప్రాయం:
12/20/2008 2:48 am
The real color is only skin-deep.
Excellent write-up ma’am !
పురూరవ: శ్రవ్య నాటిక గురించి శ్రీనివాస్ అభిప్రాయం:
12/19/2008 9:29 am