పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి Vamsi M Maganti అభిప్రాయం:

    12/15/2008 6:00 am

    పోయినోళ్ళందరూ మంచోళ్ళు. పోయాక వాళ్ల విలువ “ఆలస్యం” గా నైనా తెలుస్తుంది.

    ఒక సంగతి. నేను చాలా రోజులో, ఏళ్ళ క్రితమో ఒక “ఇస్మాయిలుని” కవిత / హైకూ చదివా :

    పచ్చని పొద
    ఒకటికి
    పోయాలనిపించింది […]

    మరి ఆ ఇస్మాయిలు, ఈ ఇస్మాయిలు ఒక్కరేనో కాదో నాకు తెలియదు. మళ్ళీ ఇస్మాయిలు అని పేరు కనపడితే ఉన్న “స్మైలు” కూడా పోయి … ఇంతే సంగతులు, చిత్తగించవలెను.

  2. రెండు తీరాలు గురించి రాకేశ్వర రావు అభిప్రాయం:

    12/14/2008 9:34 am

    చాలా బాగుంది.
    మీరు ఒక కావ్యం వ్రాయరాదు ?

  3. జనరంజని: మహానటి సావిత్రి గురించి vinaykumarnadella అభిప్రాయం:

    12/13/2008 10:29 am

    నటనకే భాష్యం చెప్పిన మహా నటి సావిత్రి స్వరం వినటం ఎంతో ఆహ్లాదకరం గా ఉంది. Most expressive face movie world had ever seen! NTR, ANR, SVR సరసన సూపర్‌స్టార్‌గా వుండదగిన ఏకైక నటీమణి మన సావిత్రి. Thousand thanks to eemaaTa for bringing back her memories. Thank you. Keep going!

  4. కుతంత్రం గురించి dvrao అభిప్రాయం:

    12/13/2008 1:42 am

    నాకూ మంజుల గారికి వచ్చిన సందేహం వచ్చినది.

  5. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Venkatachalam అభిప్రాయం:

    12/12/2008 5:28 am

    మీ వ్యాసం చాలా బాగుంది. మీ పరిశోధన కు నా హృదయపూర్వక అభినందనలు.
    ఘనరాగ పంచరత్న కీర్తనలు అంటే ఏమిటి? వాటికి ఆ పేరెలా వచ్చింది? ఈ విషయాలు తెలుపగలరు.
    కృతజ్ణతలు.

  6. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి శ్రీనివాస్ అభిప్రాయం:

    12/12/2008 4:08 am

    ఊరి బయటే వూరంతా (కళాకారులంతా) కనబడిపోతే వూళ్లోకి వెళ్లాల్సిన అవసరం కలగలేదనుకుంటాను. జోళ్లు అరుగుతాయి, మేజోళ్లు (సాక్సులు లేదా స్టాకింగులు) చిరుగుతాయి అనుకుంటున్నాను. మేకలు తోలుకునే పల్లెటూరమ్మాయి, మేజోళ్లేసుకోవడం నప్పలేదేమో!

    తప్పులెన్నువారు తండోపతండమ్ములు. భవిష్యత్తులో మరిన్ని మంచి కవితలు రాస్తారనీ ఆశిస్తాను.

  7. తెలుగు కథల పోటీ గురించి శ్రీనివాస్ అభిప్రాయం:

    12/12/2008 3:43 am

    పైన వెలిబుచ్చిన పెద్దల అభిప్రాయాలతో నేను ఏమాత్రం విభేదించక పోయినప్పటికీ, పోటీల వల్ల కధా సాహిత్యానికి కొద్దో గొప్పో మేలే జరుగుతుందని నా విశ్వాసం. పోటీ ప్రేరణతో కొత్త కధకులు పుట్టుకొస్తారు. ఈ పోటీలు పూర్తి తేజం తో జరిగే రోజుల్లో, చెయ్యి తిరిగిన రచయితలు ఈ లక్ష్య సిద్ధికే పోటీల్లో పాలు పంచుకునే వారు కాదు. ప్రస్తుతం వస్తున్న కధల్లో లోతూ, వాసీ లేకపోవడం చింతింపదగ్గ విషయమే. చెయ్యి తిరిగిన రచయితలు, చెయ్యి వేసి కధ కి వూపిరులూదవలసిన అవసరం వుంది.

  8. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి chavakiran అభిప్రాయం:

    12/12/2008 12:19 am

    పొయినోళ్లంతా గొప్పోళ్లు, మంచోళ్లు. ఈ లోకం వీడి పొయిన తరువాతనే వారి విలువ ఇప్పుడే పుట్టిన కుసుమాలకు తెలుస్తుందనుకుంటాను.

    బాబ్బాబూ, ఇలా అందరూ టపా కట్టాకనే మాకు వారి వారి గొప్పతనాన్ని వివరించక, కొంతమంది ఈ లోకంలో ఉండగానే వారి గురించి ఓ ముక్క చెపితే బాగుంటుంది కదా.

  9. “చందమామ” జ్ఞాపకాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    12/11/2008 12:34 pm

    [ఈ అభిప్రాయం ఎడిట్ చేయబడింది. -సం]

    1947 నించి వెలువడిన “చందమామ” పుస్తకాలను ఎలెక్ట్రానిక్‌గా Universal Digital Library లో దొరుకుతాయి. వాటిని సంచికలవారీగా డౌన్‌లోడ్ చేసుకోడానికి ఫణి కుమార్ గారు(బ్లాగాగ్ని బ్లాగర్) ఒక జావా ప్రోగ్రాం తయారు చేశారు. ఆ జావా ప్రోగ్రాం డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించే విధానం బ్లాగాగ్ని బ్లాగులో చదవవచ్చు.

  10. చేగోడీ కంప్యూటర్‌కంపెనీ గురించి BPhani Babu అభిప్రాయం:

    12/11/2008 10:03 am

    గురువు గారూ, ఇన్నాళ్ళకి మీరు వ్రాసిన పాత కథలు దొరికాయి. ఇంక నాకు కావలిసినంత కాలక్షేపం.