పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. ఏడు గంటల వార్తలు గురించి M.S.Prasad అభిప్రాయం:

    07/08/2009 3:51 am

    చాలా బాగుంది. రచయిత గారి సెలెక్షన్ అభివందనీయం.

    భవదీయుడు

  2. పడమట సంధ్యారాగం గురించి M.S.Prasad అభిప్రాయం:

    07/08/2009 1:53 am

    ఈ కధలో చివరి ఒకటో-రెండో పేజీలు సంపాదకులు ఎక్కడో పారవేసుకొని ఉన్నవాటినే యమర్జెంటుగా ప్రచురించినట్లు తోస్తోంది. ధారా వాహికగా తదుపరి సంచికలో మిగిలిన భాగం (దొరికితే) ప్రచురిస్తారని ఆశిస్తాను. కధ ఇంతే అని బుకాయిస్తే మాత్రం ఇది ఈమాట పాఠకులపై ప్రయోగించిన Practical Joke అని భావించాల్సి వుంటుంది.

    భవదీయుడు

  3. అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    07/07/2009 6:03 pm

    ‘తెలుగునాడి’ ఆగిపోవడానికి కారణాలను మన దగ్గరే ఉన్న చెట్టంత మనిషి, జంపాలగారు వివరిస్తే బాగుంటుంది. కాని, ‘తెలుగునాడి’ నడవడానికి, అంటే కనీసం వెయ్యి మంది చందాదారులతో నడవడానికి, చిన్న కారణం చెప్పగలను. ఏమీ లేదు- marketing! వజ్రమైనా, గిట్టుబాటుధరకు వ్యాపారికావాలేమో!

    మొత్తం అమెరికా దేశంలోని భారతీయ కూరగాయల దుకాణాలలో cashier దగ్గర కాపీలు పెడితే, ప్రతిపది మందిలో ఒక్కరైనా, తెలుగు రానివారైనా సరే, అట్టచూసో, అందం చూసో(అదే బాపుబొమ్మల అందం!), మొహమాటపడో- కొన్నా, వెయ్యి కాపీలు అమ్ముడుపోవడం, పత్రిక నడవడం పెద్ద విషయం కాదు. పత్రిక నడవడం కాదు, నడవకపోవడానికే పెద్ద కారణాలు వెతకాలనుకుంటాను, ఆర్థిక మాంద్యం ఇవ్వాళున్నస్థితి కాని, ఐదు ఏళ్ళుగా చందాదారుల సంఖ్య పెరగకపోవడానికి అది కారణం కాదనే అనిపిస్తుంది.
    ==========
    విదేయుడు
    -Srinivas

  4. అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి రాఘవ అభిప్రాయం:

    07/07/2009 3:14 am

    తెలుగునాడి అంతర్జాలంలో కూడా ప్రచురిస్తే ఇంకా నిలిచి వుండేదా?

    నేను భారతదేశంలోనే ఉండడం వల్లనో, లేక ఈ పత్రిక భారతదేశంలో దుకాణాల్లో కనబడకపోవడం వల్లనో ఏమోగానీ, నా వఱకూ నాకు తెలియనే తెలియదండీ తెలుగునాడి అనే పత్రిక కూడా ఉందని!
    మీ ప్రశ్నకి నా సమాధానం… అంతర్జాలంలో “కూడా” ప్రచురిస్తూ ఉంటే కాగితపుటచ్చు ఆగిపోయినా అంతర్జాలంలో కనీసం కొనసాగగలిగేదేమో!

    అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న. ఈమాట అచ్చుపత్రికగా కూడా ప్రచురిస్తూ ఉండుంటే ఇప్పటిదాకా మనగలిగేదా?

    అచ్చు పత్రికగా కూడా ప్రచురిస్తే ఇంకా భేషుగ్గా ఉండేది. అచ్చు పత్రికగా మాత్రమే ప్రచురిస్తే బహుశా మఱొక తెలుగునాడిని తలపించి ఉండేది.

    అసలు నేను ఇంతవఱకూ తెలుగునాడి చదవలేదు కాబట్టి తెలుగునాడి ఆగిపోవడం గుఱించి ఏమీ మాట్లాడలేను. కానీ భాషాసేవ చేసే ఒక పత్రిక ఆగిపోయిందే అన్న బాధ మాత్రం ఉంది.

  5. అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/06/2009 11:32 pm

    మీకంతా మరి ఇప్పుడు ఇంత కష్టంగా అన్పిస్తోంది కదా!! మరి ఈ సంగతిని గురించే కదా నేను మరొక విధంగా హెచ్చరించానూ!! రాసే వాళ్ళ కృషి ని కూడా పత్రికలు “అప్పనంగానే”..కొట్టేయ్యాలని చూడటం లేదూ??! ఎందరి రచయితల ఊహా శక్తిని ఊరికే ఆశించడం లేదూ అన్ని పత్రికలూనూ? ఇది మాత్రం ఎవరికీ ఇబ్బందిని కల్గించనేలేదే??రాసేవాళ్ళ contribution ని చాలా casual గా చూడబట్టే కదా ఎక్కువ వైవిధ్యం ఉన్న రచనల్ని పత్రికలు సంపాదించలేకపోతున్న దీ?? పత్రికలు ఆగిపోయేయంటే ఆగిపోవూ?! మీరెంత “అప్పనంగా” అందిస్తున్నామని అనుకుంటూన్నా..ఒకనాటికి ఈ webzines కి కూడా ఈ పరిస్థితి తప్పదు. అంతేకాదు మంచి రచనల విషయంలోనూ..కవి, రచయితల విషయంలోనూ వారివారి పుస్తకాల్ని “కొని” చదివే విషయంలోనూ కూడా తెలుగువారిలో కొనసాగుతున్న ఉదాసీన త వల్ల తెలుగులో ఉత్తరోత్తరా వారి సంఖ్య కూడా క్షీణించే ప్రమాదం లేకపోలేదు. “ఎందుకు రాయాలీ?..”ఎవరి కోసం రాయాలీ??” అని సున్నిత స్వభావులైన వారు భావించే వీలుంది.ప్రోత్సాహం అన్న ది పనిచేసే వారికి చాలా అవసరం. ఆ దృక్పధాన్ని ఆ జాతి ఎమ్ త గాడంగా కలిగి ఉంటే ఆ జాతిలో..ఆ భాషలో సృజనకి సంబధించిన అన్ని రంగాలూ వికశిస్తాయి..లేదా అనివార్యంగా క్షీణిస్తాయి. ఇది తప్పదు.విజ్నులైనవారు ఈ అన్నింటిని గురించి ఆలోచించాలి..విస్తృతంగా చర్చించాలి. ఏదో “కాలక్షేప వ్యవహారం” లాగా న డిపే ఏ పత్రికలకైనా చివరికి ఈ పరిస్థితి తప్పదు. అందుకని ముందుచూపు అవసరం!!

    రమ.

  6. నిద్రిత నగరం వైదేహి ప్రపంచం గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    07/06/2009 9:38 pm

    “పుస్తకం అందింది, వెల, పేజీలు, లభించే చోటు” అంటూ మాత్రమే సమీక్షలు వచ్చే ఈ రోజుల్లో ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివి, సహృదయతో తూకంవేసే ఇటువంటి సమీక్షలు/పరిచయాలు చదివి ఎన్నాళ్లయ్యింది.
    గిరిధరరావు గారికి నమస్కారములు, కవయిత్రి అదృష్టవంతులు. (ఎంతమందికి ఇంతటి అపూర్వ అవకాశం దక్కుతుందన్న విషయంలో)

    ఈ సమీక్ష ద్వారా ఈ పుస్తకం నా విష్ లిస్ట్ లో చేరింది.
    thank you everyone
    బొల్లోజు బాబా

  7. హాయిహాయిగా ఆమని సాగే గురించి mOhana అభిప్రాయం:

    07/06/2009 4:22 pm

    హిందీ “ఆద్మీ” సినిమా తెలుగు “గుడిగంటలు” (తమిళంలో “ఆలయమణి”) కి అనుసరణ. “ఆద్మీ” లోని మరొక మంచి పాట “కల్ కే సప్నే ఆజ్” అనే లతాగారి పాట. దీని స్థానములోని తమిళము పాట సుశీలగారు పాడిన పాటలలోని అత్యుత్తమమైన వాటిలో ఒకటైన “ఆలయమణియిన్ ఓశైయై నాన్ కేట్పేన్ ” అన్నది.
    విధేయుడు – మోహన

  8. అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి Rao Vemuri అభిప్రాయం:

    07/06/2009 3:27 pm

    అంతర్జాలంలో అప్పనం (free) గా దొరుకుతూన్న సరుకులకి డబ్బిచ్చి కొనుక్కోవలసిన అవసరం ఏముంది? అన్నింటిని అప్పనంగా అనుభవించటానికి అలవాటు పడిపోయేం. ఆంధ్రాలో అయితే “విద్యుత్తుని అప్పనంగా అనుభవించటం మీ జన్మ హక్కు” అని ప్రభుత్వమే ప్రజలని రెచ్చగొట్టి ఓట్లు వేయించుకుంటోంది. ఈ దృక్పథం ఇండియా సొత్తేమీ కాదు. తొంభయి తొమ్మిదేళ్ళు నిండి, కాటికి కాళ్ళు జాపుకున్న వ్యక్తి కూడ భీమా కంపెనీ చెల్లిస్తున్నాది కదా అని తొమ్మిది మిలియన్లు ఖర్చు అయినా, వైద్యం చెయ్యమంటాడు. “గూగుల్‌”లా ఏదో కొత్త పంథా “బిజినెస్‌ మోడల్‌” కనిపెట్టే వరకూ అంతర్జాల పత్రికలకి, అచ్చు పత్రికలకి ఈ దుస్థితి తప్పేటట్లు లేదు.

  9. హాయిహాయిగా ఆమని సాగే గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/06/2009 2:13 pm

    ఆద్మీ” పాటలు.

  10. హాయిహాయిగా ఆమని సాగే గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/06/2009 2:04 pm

    సువర్ణసుందరి పాటలకు మరొక లింక్ కూడా ఉంది http://www.bollycircle.com/index.php/hindi-videos/suvarna-sundari-telugu-movie-mp3-songs-download/.