ఆ రోజులు సంతోష సాహిత్యాలు. ఎన్ని సార్లు చదివినా, ఎప్పటికప్పుడు మల్లె తోటలో మార్నింగ్ వాక్ చేసొచ్చినట్టుంటుంది.పూలు అక్క డే వుంటాయి. పరిమళాలే ప్రాణాలవుతాయి. మీరన్నదీ నిజమే. ఆ జ్ఞాపకాల తాజాదనం అలాంటిది మరి!
మనఃపూర్వక కృతజ్ఞతలతో..
ఆర్.దమయంతి.
Well, your short story is simply awesome-a mini epic. Have read this with my daughter beside and went back to those childhood days recollecting all those amazing moments we shared. These moments are always in my mind but the way you have elaborately written made them even more afresh! Thanks 🙂
ఈ-పుస్తకాల ధరలు అచ్చు పుస్తకాల ధరలకంటె ఎందుకు ఎక్కువ ఉండొచ్చో సమర్ధించవచ్చు. ఇలాంటి సమర్ధనలు సాంకేతికపరంగా ఎంత మంచివయినా వ్యాపారపరంగా అభిలషణీయం కాకపోవచ్చు. విపణివీధిలో ఈ-పుస్తకాలు నిలవాలంటే, పాఠకులు వీటి రుచి మరిగే వరకు ఈ-పుస్తకాలని అచ్చు ప్రతుల కంటె తక్కువ ధరకే అమ్మటం ఒక వ్యాపార సరళి. లేదా అచ్చు పుస్తకాలలో లేని వసతులని ఈ-పుస్తకాలలో చేర్చి, ఎక్కువ ధరకి ఆక్షేపణ లేకుండా చెయ్యాలి. డార్విన్ సిద్ధాంతం ఇక్కడ కూడ పని చేస్తుంది: యోగ్యత ఉన్నవారినే విజయలక్ష్మి వరిస్తుంది.
స్వామిగారూ,
మాండలికం అనేది ట్రాష్ కాదు.
అది జీవద్భాష.
నామిని డొల్ల కాదు. ఆయన తనని తాను అద్దంలో చూసుకున్నారు. దాన్ని యథాతథంగా రాయగలిగారు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడం ఒకవేళ జూటాతనం అనడం అంటే అది వాస్తవాన్ని నిరాకరించడమే అవుతుంది.
త్రిపురకీ మాండలికానికీ సంబంధం ఏమీలేదు.
నిజాయితీ నిబద్ధతలుంటే చాలు. సంపాదకులతో పరిచయాలు అక్కరలేదు. ఆపరిచయాలవల్ల చెత్తా చెదారాలన్నీ సాహిత్యంగా చెలామణీ కావడం తప్ప మరో ప్రయోజనం లేసదు.
చిరుగాలి చప్పుడుకి
గుండె తలుపు తెరుచుకుంటుంది వారగా!
గూట్లో-
చిన్ని రెక్కల పిట్ట
కువ కువలు పోతుంది తీయ గా!
నిజం.ఒక వెచ్చని జ్ణాపకం – ఆ కాలం.
అందమైన బాల్యం కోసమే పుడతాంట మనం. ఆ ఆనందానికి కాక పోతే, మనకేం పని ఈ భూమ్మీద!? అని అంటాడు ఓ రచయిత. ఎంత బాగా చెప్పాడు కదూ!
థాంక్సండి పవన్ గారు!
ఆర్.దమయంతి.
రాజగోపాల్‌గారికి నా కృతజ్ఞతలు. ఇలాంటి వ్యాసాలు శాస్త్రీయసంగీతమంటే బ్రహ్మపదార్థమని అనుకోకుండా ఉండటానికని నిర్దేశించినవి. ఏదైనా రాగాన్ని ఇష్టపడేవారు దాన్ని గుర్తించడం అలవాటు చేసుకోవాలంటే అందులో పాడిన పాటలన్నిటినీ వరసగా వింటూ ఉండడం ఒక పద్ధతి. ఆ ప్రయోజనం ఏమాత్రం సిద్ధించినా వ్యాసకర్త పని కొంతైనా నెరవేరినట్టే. ఊరికే రాగంలోని అందాలని అతిశయోక్తులతో వర్ణిస్తూపోతే బైటపడేది రచయిత కల్పనాశక్తి మాత్రమే. చదువుతూ వినగలిగే ఈమాట ఇటువంటి ప్రయత్నాలకు వీలైనది.
మంచి కథ. బావుంది. కథనంలో అంతర్లీనమైన ఆలోచన ద్యోతకమవుతోంది. ప్రత్యేకించి కొన్ని వాక్యాల్లోని గాఢత హృదయానికి హత్తుకుంటుంది. ఆసాంతం ఓపిగ్గా చదివిన వారికి ఒక్క వాక్యమైనా వేధించక మానదు!
నమస్తే,
శ్రి K.R.P. గారి మరొక interesting and educating article ప్రచురించినందుకు చాల Thanks. వారి articles చదివి, వారి audio links విని చాలా నేర్చుకున్నాను. వారికి నా ధన్యవాదాలు. ఇకముందు కూడా వారు ఇలాంటి articles present చేస్తారని ఆశిస్తాను.
Raja Gopal
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
07/24/2011 8:47 pm

జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి pasumarthy hema latha అభిప్రాయం:
07/23/2011 3:42 am
Well, your short story is simply awesome-a mini epic. Have read this with my daughter beside and went back to those childhood days recollecting all those amazing moments we shared. These moments are always in my mind but the way you have elaborately written made them even more afresh! Thanks 🙂
కినిగె.కాం తో నా అనుభవాలు గురించి వేమూరి అభిప్రాయం:
07/22/2011 5:17 pm
ఈ-పుస్తకాల ధరలు అచ్చు పుస్తకాల ధరలకంటె ఎందుకు ఎక్కువ ఉండొచ్చో సమర్ధించవచ్చు. ఇలాంటి సమర్ధనలు సాంకేతికపరంగా ఎంత మంచివయినా వ్యాపారపరంగా అభిలషణీయం కాకపోవచ్చు. విపణివీధిలో ఈ-పుస్తకాలు నిలవాలంటే, పాఠకులు వీటి రుచి మరిగే వరకు ఈ-పుస్తకాలని అచ్చు ప్రతుల కంటె తక్కువ ధరకే అమ్మటం ఒక వ్యాపార సరళి. లేదా అచ్చు పుస్తకాలలో లేని వసతులని ఈ-పుస్తకాలలో చేర్చి, ఎక్కువ ధరకి ఆక్షేపణ లేకుండా చెయ్యాలి. డార్విన్ సిద్ధాంతం ఇక్కడ కూడ పని చేస్తుంది: యోగ్యత ఉన్నవారినే విజయలక్ష్మి వరిస్తుంది.
వేటూరి పాట గురించి Rohiniprasad అభిప్రాయం:
07/22/2011 6:09 am
దాశరథి గురించిన ఒక వ్యాసం 22-07-2011 ఆంధ్రజ్యోతి దినపత్రికలో చదవవచ్చు. ఇది చూడడం వీలవకపోతే పీడీఎఫ్ లింక్ కూడా చూడవచ్చునేమో సంపాదకులు గమనించగలరు.
[ఈ వ్యాసం పీడీఎఫ్ ఈమాటలో ఉంచాము – సం.]
రాగలహరి: ఆభేరి గురించి Purushotham అభిప్రాయం:
07/20/2011 12:31 pm
పది సంవత్సరాల క్రితం రాసినా మీ ప్రయోగానికీ పరిశోధనకీ నా అభినందనలు తెలుపుతున్నాను
పురుషోత్తం
ఏదైనా ఒక వేడి వస్తువు గురించి రాణి. అభిప్రాయం:
07/20/2011 5:42 am
స్వామిగారూ,
మాండలికం అనేది ట్రాష్ కాదు.
అది జీవద్భాష.
నామిని డొల్ల కాదు. ఆయన తనని తాను అద్దంలో చూసుకున్నారు. దాన్ని యథాతథంగా రాయగలిగారు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడం ఒకవేళ జూటాతనం అనడం అంటే అది వాస్తవాన్ని నిరాకరించడమే అవుతుంది.
త్రిపురకీ మాండలికానికీ సంబంధం ఏమీలేదు.
నిజాయితీ నిబద్ధతలుంటే చాలు. సంపాదకులతో పరిచయాలు అక్కరలేదు. ఆపరిచయాలవల్ల చెత్తా చెదారాలన్నీ సాహిత్యంగా చెలామణీ కావడం తప్ప మరో ప్రయోజనం లేసదు.
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
07/19/2011 5:31 pm
చిరుగాలి చప్పుడుకి
గుండె తలుపు తెరుచుకుంటుంది వారగా!
గూట్లో-
చిన్ని రెక్కల పిట్ట
కువ కువలు పోతుంది తీయ గా!
నిజం.ఒక వెచ్చని జ్ణాపకం – ఆ కాలం.
అందమైన బాల్యం కోసమే పుడతాంట మనం. ఆ ఆనందానికి కాక పోతే, మనకేం పని ఈ భూమ్మీద!? అని అంటాడు ఓ రచయిత. ఎంత బాగా చెప్పాడు కదూ!
థాంక్సండి పవన్ గారు!
ఆర్.దమయంతి.
భావతరంగాల సింధువు: భైరవి గురించి Rohiniprasad అభిప్రాయం:
07/18/2011 10:11 pm
రాజగోపాల్‌గారికి నా కృతజ్ఞతలు. ఇలాంటి వ్యాసాలు శాస్త్రీయసంగీతమంటే బ్రహ్మపదార్థమని అనుకోకుండా ఉండటానికని నిర్దేశించినవి. ఏదైనా రాగాన్ని ఇష్టపడేవారు దాన్ని గుర్తించడం అలవాటు చేసుకోవాలంటే అందులో పాడిన పాటలన్నిటినీ వరసగా వింటూ ఉండడం ఒక పద్ధతి. ఆ ప్రయోజనం ఏమాత్రం సిద్ధించినా వ్యాసకర్త పని కొంతైనా నెరవేరినట్టే. ఊరికే రాగంలోని అందాలని అతిశయోక్తులతో వర్ణిస్తూపోతే బైటపడేది రచయిత కల్పనాశక్తి మాత్రమే. చదువుతూ వినగలిగే ఈమాట ఇటువంటి ప్రయత్నాలకు వీలైనది.
ఈ కానుకనివ్వలేను గురించి Nithin అభిప్రాయం:
07/18/2011 5:49 pm
మంచి కథ. బావుంది. కథనంలో అంతర్లీనమైన ఆలోచన ద్యోతకమవుతోంది. ప్రత్యేకించి కొన్ని వాక్యాల్లోని గాఢత హృదయానికి హత్తుకుంటుంది. ఆసాంతం ఓపిగ్గా చదివిన వారికి ఒక్క వాక్యమైనా వేధించక మానదు!
-నితిన్
భావతరంగాల సింధువు: భైరవి గురించి T.Raja gopal అభిప్రాయం:
07/18/2011 11:54 am
నా అభిమాన ఈమాట పత్రిక సంపాదకులకు: