పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. మన భాషలో అంకెలు, సంఖ్యలు గురించి రాణి. అభిప్రాయం:

    08/09/2011 6:56 am

    కన్నడంలో ఒకటిని ఒందు అంటారు. ఒండు కాదు.

  2. గానభారతి గురించి yasasvi అభిప్రాయం:

    08/08/2011 1:01 pm

    అయ్యా !! దేశికాచారి గారూ !!

    “కూడదని” నేనేల అనవలె గానీ.. “చందోబధ్ధమైన..సత్సంప్రదాయ ముకురాయమాన… అన్న విశేషణం మాత్రం మీ రచనలపై మీకున్న ఎక్కువ మక్కువ ని సూచిస్తోంది 🙂

    ఆధునిక జీవితాన్ని అందులోని సంఘర్షణనీ రాయడానికి మాత్రం ఈ రకమైన భాష నప్పదన్నది పాఠకులకి తెలిసే విషయమే! మరీ గబగబ ఏమీ ఘర్షణ వ్యక్తమ్ కాకుండా నడిపిన కధనంలా ఉంది. కాలం ఆధునికమే గానీ కధనంలో ఏమీ ఆధునికం కన్పించలా! ఇంక దీనికి మీరు వాడిన భాష సైతం అలాగే ఉంది. పాత కాలం నాటి వాడకం ఇదేం నప్పుతుందీ? కిరీటాలు పెట్టుకుని రోడ్లమీద నడిస్తే కొట్టొచ్చినట్టు కన్పిస్తుందే అలా ఉంటుంది. ఈ రకమైన భాషలో మనుచరిత్ర మాత్రమే చదివేందుకు ఎక్కువ బాగున్నట్టూ.. గానభారతికి ఈ రకమైన “సత్సంప్రదాయం” ఏమంత నప్పనట్టూ అన్పించే నేనా మాట రాసింది.

    ఇహ కవిగా మీ భావన మీది..పఠిత గా నా భావన నాదీను.

    యశస్వి.

  3. గానభారతి గురించి దేశికాచారి అభిప్రాయం:

    08/08/2011 10:20 am

    తమ వంగ్యాత్మకమైన సమీక్షను ఓపికతో వ్రాసినందుకుశ్రీ యశస్విగారికి ప్రశంసలు. నేను మనుచరిత్రను నెమరు వేసుకుంటూ వ్రాయకున్నా మనుచరిత్రరోమంథాన్ని మీకది కలిగించిందంటే నే నాశించినదానికంటె అధికప్రయోజనమే చేకూరింది!! ఇంతకంటె కావలసిన దేముంది? మీకు మనుచరిత్రతో నున్న పరిచయం మాట అటుంచి, మానవప్రకృతులు, విభావానుభావాలు కాలాతీతములూ, అందుచేత 15వ శతాబ్దిలో వ్రాసినా 25వ శతాబ్దిలో వ్రాసినా ఈ అనుభావాల, ప్రకృతుల సారూప్యత ఉంటుందనే అంశం ఈ రోమంథానికి మూలమనేది మీరు గ్రహించవలసిన విషయం. కథను ఏదో 70% ఇంగ్లీషుపదాలతో గూడిన “తెల్గీషు” భాషలో వ్రాస్తే కాని శంఖులోతీర్థం పోసినట్లు కానేరదనే అపోహ మీ వ్రాతలో చూచాయగా స్ఫురిస్తూ ఉన్నది. ఈ అపోహను తొలగించడానికే లాక్షణికమైన ఛందోబద్ధమైన శైలిలో నేనీ కథను వ్రాసినాను. ఇట్టి ఛందోబద్ధమైన సత్సంప్రదాయ ముకురాయితమైన రచనలకు 15వ శతాబ్దియే కాని 21వ శతాబ్ది తగదని మీ అభిప్రాయమా? మీరేమన్నను ఈమాట సంపాదకులకు మాత్రం ఇటువంటి భావం లేకపోవడం నావంటివారి అదృష్టం. అభినందనీయం.

  4. వేటూరి పాట గురించి Nageswara Rao Mutnuri అభిప్రాయం:

    08/07/2011 11:58 am

    వేటూరి గారు మొన్నటిదాకా మన మధ్యనే ఉన్నారు. ఆయన చాలా ఇంటర్వ్యూ లలో తానూ కొన్ని పాటలు ఎప్పుడు ఎందుకు ఎలా రాసిందీ వివరంగా చెప్పారు. వేటూరి గారు పుంభావ సరస్వతి. మన కావ్యాల మీద, సంస్కుతం లోను, తెలుగు జాతీయాలు, నుడికారాల మీద ఆయనకున్న అధికారం అపారమైనది. ఇన్ని తెలిసిన ఆయన ఇలా రాసారంటే దాని వెనక ఎంతో కొంత ఆలోచన ఉండే ఉంటుంది. ఈ వ్యాసం రామారావు గారు వేటూరి సజీవులుగా ఉన్నపుడు ప్రచురించి ఉంటే బాగుండేది. ఆయనకీ విమర్శలకు సమాధానం చెప్పే అవకాసం కలిగించిన వారయ్యి ఉండేవారు. నామట్టుకు నాకు ఇందులో రంద్రాన్వేషణ ఎక్కువగా కనిపించిది. రామారావు గారు ‘పోయటిక్ లైసెన్స్’ అనేది ఒకటి ఉందన్న వాస్తవాన్ని ఈ వ్యాసం రాసేటప్పుడు విస్మరించారని అనిపిస్తోంది. పింగళి వారు, భావం చెడకుండా అందంగా ఒదిగేటట్లయితే పదాలను కొంచెం అటూ ఇటూగా వాడుకోవడం లో తప్పు లేదని ఎప్పుడో చెప్పారు.

  5. గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి Mallesham అభిప్రాయం:

    08/06/2011 11:16 pm

    తెలుగు సాహిత్య మాగాణంలో పద్య సుమాలను విరబూయించిన మహోన్నత మహిమాన్వితుడు గుర్రం జాషువా గారు. పద్యాలు చక్కగా వినసొంపుగా ఉన్నాయి.
    ఇంత చక్కటి పద్యాలు అందించినందుకు చాలా చాలా ధన్యవాదములు.

  6. రెండు కవితలు గురించి Gurunath D అభిప్రాయం:

    08/06/2011 11:57 am

    మీ పత్రిక చాలా బాగుంది. కీబోర్దు మ్యాపింగు కూడా చాలా సులువుగా ఉంది. ధన్యవాదాలు.

  7. శ్రీ గరికిపాటి నరసింహా రావు గారి అష్టావధాన విశేషాలు గురించి SSVSRCM SASTRY అభిప్రాయం:

    08/06/2011 4:04 am

    శ్రీ గరికిపాటి వారికి నమస్కారములు. చక్కని పద్ద్యాలతొ మంచి కార్యక్రమం చూడగలిగాము. వారి సాగరఘోష కావ్యం
    ఇప్పటికి 11 గంటలు శ్రవణం చేశాము. త్వరలొ వారికి అత్యుత్తమ పురస్కారం లభించాలని ఆ శరదా మాత ను
    ప్రార్ధిస్తున్నాను.

  8. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    08/04/2011 11:12 pm

    ‘i love rain too’..ఎన్నాళ్ళకి విన్నానూ! సింపుల్ గా సొగసుగా చెప్పారు. జీవితంలో ఒక్క సారైనా ప్రేమలో పడని వారు, వాన లో తడవని వారు వుండ(లే)రట. నా ఈ ‘రెయిన్ ఫుల్ ధాట్స్’ – మీకు మీ మాతృమూర్తి తో బాటు మాతృదేశాన్ని కూడా తలపింపచేయడం గర్వించదగిన విషయం.
    సుధ గారూ!థాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్,ఐ రియల్లీ అప్రిషియేట్!
    శుభాభినందనలతో..
    ఆర్.దమయంతి.

  9. మూడు లాంతర్లు – 6 గురించి yasasvi అభిప్రాయం:

    08/04/2011 4:00 pm

    ఒక్క త్రిపురేనా పఠాభి కూడా అలాగే !! రాయాలనుకున్నది రాసేడు. రాస్తాడేమో అని అనుకున్నాకా అసలేమీ మరి రాయలేదు. ఏ ప్రశ్నకీ ఏ జవాబు లేకుండా తన మౌనంలో బతికేడు చివరిదాకా !! ఎవరిమీదా…[ అంతరంగానూ బాహ్యంగానూ].. ఏయే ప్రభావాలన్నా ఉండనివ్వండి గానీ తనదే అయిన ఒకానొక అస్తిత్వం తొణికిసలాడందే అతడు/ఆమె చెప్పే ఏ విషయానికైనా ఏం బలం ఉంటుందీ కనకప్రసాదూ??

    “ద్రవ్యం” ఎన్నిరాసి కూడబెట్టుకున్నా..ఏ లబ్ధప్రతిష్టులమెప్పు సంపాదించి ఎంత ధనవంతులే అయినా లేక కవితావంతులే అయినా అసలు ఆ ఉండాల్సినదేదో లేకపోతే ఏ లబ్ధప్రతిష్టులు ఏయే కితాబులిస్తే మాత్రం అవి నిలిచేనా?? అలా కితాబులిచ్చిన వాళ్ళ పరువు పోయేను గానీ 🙂

    మీరు రాసే దాంట్లోని యాస నాకు బాగా అర్ధమయ్యే యాస గనక నాకు సుఖంగా ఉంటుంది. ఒక నలభై ఏళ్ళ వెనక్కి వెళ్ళీ ఆ వీధులన్నీ ఆ పేటలన్నీ తిరిగినట్టే ఉంటుంది. “మట్టీసి” పదాన్ని విని ఎన్నాళ్ళైందో?? మీలో ఇంకా మరీ నాగరీకం ప్రవేసించినట్టు లేదు కాబోలు. ఇంకా ఇవన్నీ గుర్తున్నాయి. అయితే గుర్తుండన్నంతమాత్రాన ఆ భాష “జూటా” ఏమీ కాదుగానీ ..యాస దారి యాసది. మీరు రాసినవన్నీ చదువుతున్నానా అయినా సరే మీ సమస్య నాకు ఏమీ ఎక్కడం లేదు. మీకు సరిగా చెప్పడమే రావడమ్ లేదో?? లేక నాకు మిమ్మల్ని చదవడమే రావడం లేదో??

    యశస్వి.

  10. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి Sudha అభిప్రాయం:

    08/03/2011 11:48 am

    Lovely one !! Yeah, and i love rain too … 🙂
    It reminds me of my mom, my childhood days, and India !!
    Thanks for such a great attempt and i totally appreciate your style of writing ..
    – Sudha