పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. వేటూరి పాట గురించి నచకి అభిప్రాయం:

    08/02/2011 2:27 am

    రామారావు గారి వ్యాసం (బహుశా స్థలాభావం వలన) కాస్త హడావుడిగా సాగినట్టు అనిపించినా చక్కని విశ్లేషణతో సాగింది. వేటూరి గారి పాటల్లో తలమానికమైన కిరాతార్జునీయం (భక్త కన్నప్ప చిత్రంలోనిది) కూడా ఆయన రచనల పైన పూర్వకవుల సాహిత్య ప్రభావాన్ని, చలనచిత్రగీతాల పరిధిలో వాటిని దాటించి తన కలాన్ని ఉఱికించల నేర్పును సాధికారంగా చూపిస్తుందని నా అభిప్రాయం.

    వేఱే రచయితలు వ్రాసిన రెండు పాటల విషయంలో వేటూరి గారివని పొరబడినట్టు కనిపిస్తుంది. రెండూ ఒకే చిత్రంలోనివి (పెళ్ళి సందడి) కావటం గమనార్హం. సౌందర్యలహరీ స్వప్నసుందరీ… అన్న పాటను శ్రీ సీతారామశాస్త్రి గారు వ్రాయగా నవమన్మథుడా, అతిసుందరుడా… అని సాగే పాట శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు రచించారు.

  2. గానభారతి గురించి yasasvi అభిప్రాయం:

    08/01/2011 3:11 pm

    తిరుమల కృష్ణదేశికాచార్యులవారూ!!

    పాపం ఇది మీ తప్పుకూడ కాదేమోలెండి…ఇది చదివిన వెంటనే మొట్టమొదట నాకళ్ళముందు ఆ వరూధినీ ఎందుకనో అలా తచ్చాడింది. ఆమె మాటల్లోంచి ఆ ప్రియుడు నాకు ప్రవరునిలాగే కన్పింఛాడు కూడా !! [ ఆయన యుధ్ధంచేసేందుకని వెళ్ళినట్టు తెలిసేదాకా కూడా:)] కవి ఆ అమ్మాయితో సంభాషించినప్పుడు కూడా నాకు ఆ గొంతుక వెనక పెద్దన గారి ప్రవరుడు ఎందుకనో విన్పించేసేడు. ఇది మీ తప్పుకాదేమో లెండి. నా మీద ఉన్న మనుచరిత్ర ప్రభావం బహుశా ఇందుకు కారణం కాబోలు.:) చివరికి ఆమెకి ఆ గానభారతి బిరుదు వచ్చిందని మీరు ఆ టీవీ లో చూసి చెప్పినదాకా కూడా నేను ఈ కధ ఏ ఐదారువందల ఏళ్ల వెనకటిదేమో అని అనుకుంటూ వచ్చేను.అలా అయితే నేనీ ఉత్తరం ఎందుకూ రాస్తానుగానీ.. ఇది మనకాలం లోనిదే నని నాకు అర్ధమ్ అయ్యేసరికి….. ఓహో!! వీణవాదన చేసిన ఆ వరూదిని కి ఆ కాలంలో” గానభారతి” దొరికి ఉండదనీనీ..అది మీకు కస్టం కలిగి ఒక పోయెటిక్ జెస్టిస్ చేయించేందుకు గానూ ఈ భారతిని సృష్టి చేసేరనీనీ గ్రహించాను. ఆ గవర్నరు గనక ఆమెకి ఆ ” గానభారతి” ని ఇచ్చిఉండకపోయి ఉంటే ..దాన్ని మీరు[ అదే మీ కవి గారు].. టీవీలో చూసినట్టు ప్రస్థావన చేసిఉండకపోయి వుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఆ రాయలవారి ఆస్థానంలో విన్పించవలసిన రచన . పొరపాటున జారిపోయి మీ ద్వారా ఇలా “ఈమాట” లో ప్రత్యక్షమైంది.

    యశస్వి.

  3. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Nilagiri Jayasankar అభిప్రాయం:

    07/30/2011 1:07 pm

    ఎన్నొ చక్కని విషయాలు తెలుసుకొనె అవకాశము దొరకినది. మీకు నా ధన్యవాదాలు.

    జయశంకర్

  4. వేటూరి పాట గురించి Jayaram అభిప్రాయం:

    07/29/2011 9:19 am

    ఏమండోయ్ వ్యాసకర్త గారు… ఇప్పుడు చెప్పండి ఆ పదానికి అర్థము ఉన్నట్టేగా?

  5. నీళ్ళు కాచే పనిపిల్ల గురించి Seetha Kumari అభిప్రాయం:

    07/29/2011 7:06 am

    మీ కవిత్వం ఎప్పుడూ మనసుకి హత్తుకుంటుంది…ఎతో సున్నితంగా వ్రాస్తారు….మీరు ఎల్లప్పుడూ మంచి కవిత్వం అందిస్తూ ఉండాలని కోరుకుంటుంన్నాను…..

  6. వేటూరి పాట గురించి పాటూరి అభిప్రాయం:

    07/28/2011 6:56 am

    స్వరసగాంధారాలు కి ఇంకా అర్థాలు చెప్పుకోవచ్చండీ.

    స్వ + రస గాంధారాలు – తమయొక్క రసవంతమైన సంగీతం. (గాంధారం అంటే ఒక స్వరమే అయినా, సంగీతం అన్న విస్తృతార్థంలో కవి వాడి ఉండొచ్చు.)

    పొలాలు సస్యశ్యామలంగా ఉండి రసవంతమైన సంగీతాన్ని తలపింపజేస్తున్నాయి.

    సు + అరస గాంధారాలు – అరసం అంటే ప్రదోష కాలం అనీ, హర్షము అనీ అర్థాలున్నాయి.
    ‘ఆ పొలాల యొక్క మంచి హర్షపూర్వకమైన సంగీతం’ అని అర్థం చెప్పుకోవచ్చు.

    సినిమా కవిత్వానిదేముందండీ, ఏమైనా రాసెయ్యొచ్చు. మన సరస హృదయ క్షేత్రాల్లో అర్థాలు పండించుకుంటూ ఉండడమే.

  7. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    07/28/2011 12:13 am

    హలో!
    voe గారూ! థాంక్స్ రాయాలా అన్నారు! తప్పనిసరిగా రాయాలండీ.
    రచన చదివి, తమ తమ అమూల్యమైన అభిప్రాయాలు వెలిబుచ్చే ప్రతి వారూ నా దృష్టి లో అపురూప గౌరవనీయులు. నా సాహితీ గడప లో అడుగుపెట్టే వారందర్నీ సాదరంగా పలకరించడం,సందర్బానుసారం ప్రతి స్పందించడం, బదులుగా ధన్యవాదాలు తెలియచేయడం నా అలవాటు. అదే మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయం కూడా. ఇక పర్సనల్ ఈ మెయిల్ నాకు ‘సరి పడదు’. ఇప్పుడు తెల్సిందా మీ కామెంట్ ఎందుకు వేసుకున్నారో ఈమాట వారు!? ..అవునూ, మీ నిక్ నేమ్ ప్రెటీ గా వుంది.గుర్తించారా!? గుడ్ లక్.

    అరె.చెప్పడం మర్చిపోలేదు.
    థాంక్యూ. థాంక్యూ వెరీ మచ్.
    ఆర్.దమయంతి.

  8. వేటూరి పాట గురించి Jayaram అభిప్రాయం:

    07/27/2011 4:52 pm

    పై వ్యాసంలో “స్వరస అనే పదం ఎక్కడా లేదు” అని వ్రాశారు.

    ఆ పూర్తిపదాన్ని (స్వరసగాంధారాలు) ఇలా చదవండి:
    స్వర+స+గాంధారాలు
    స్వర = గాత్రము (లేదా సంగీతస్వరము)
    స = కూడిన
    గాంధారాలు = కోయిలలు

    అంటే మంచి గాత్రధర్మము కలిగిన కోకిలలు అనే అర్ధము కానవస్తున్నది.

  9. వేటూరి పాట గురించి Jayaram అభిప్రాయం:

    07/27/2011 12:28 pm

    విశ్లేషణ చాలా బాగుంది. ఏది ఏమైనా పాటల అర్థాన్ని వెతికేటప్పుడు ఆ పాట యొక్క సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని నా అభిప్రాయం. పైన చెప్పిన “కంత్రి” చిత్రంలోని పాట వచ్చే సందర్భం అంత అర్థవంతమైనది కాదు. సినిమాకి ఆరు పాటలు ఉండాలన్న నియమం ప్రకారం ఏదో ఒక మూల ఇరికించిన పాట అది. వేటూరి ముందు వరకు ఇటువంటి పరిస్ఠితిలో పాటలు రాయడం ఏ రచయితకూ రాలేదేమో?

    ఇక “ఆకాశంలో ఒక తార…” పాట పాతదానికి పునఃసృష్టి. మరి ఆ పాట అలాగే ఉండటం సమంజసమేమో?

    వేటూరి లలితపదాల వాడకం నిజమే అయినా, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుచేసుకోవాలి. చలనచిత్ర గీతాల్ని విని ఆస్వాదించే వారిలో ఎక్కువమంది తెలుగు భాషాపండితులు కారు అన్నది నిజం. మరి అంతమంది వినే పాటని సరళంగా రాయడంలో తప్పులేదు అని నా అభిప్రాయం. ఒకందుకు ఈ సరళత్వమే ఆయన పాటను ఇంతకాలం నిలబెట్టాయేమో? ఇక వేటూరి చివరి దశలో కూడా తనకలం నుంచి నాణ్యమైన పాటలే ఇచ్చారు అనడానికి “వరుడు” చిత్రలో “బహుశా ఓ చంచలా…” ఒక చక్కని తార్కాణం. మొత్తానికి వ్యాసరచయిత వేటూరిలోని గొప్పదనం కంటే లోపాలు వెదకడానికి ఎక్కువగా ప్రయాస పడ్డారేమో అనిపించింది.

  10. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి voe paatakudu అభిప్రాయం:

    07/27/2011 1:18 am

    ప్రతీ కామెంటుకీ పత్రికాముఖంగా థేంక్సులు రాయాలా?.. ఎడిటర్లే కామెంటు రాసినవారి ఈమెయిలు అడ్రసు రచయిత్రిగారికి పంపితే సరిపోదా?.. నాణ్యమైన కామెంట్లుమాత్రమే వేస్కుంటారనుకున్నాను. ఈ-మేగజైను అయినంత మాత్రాన ఊకంతా (నా ఈ కామెటుని ఊక అని గుర్తించగలరు..) వేసుకోవాలా?