పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. ప్రేమ కవితలు గురించి rajana srinivasarao అభిప్రాయం:

    07/16/2011 7:15 am

    మీ కవితలు చాలా బాగున్నాయి.

  2. పుస్తక పరిచయం: వేమూరి వెంకటేశ్వర రావు ‘అమెరికా అనుభవాలు’ గురించి sudhakar అభిప్రాయం:

    07/16/2011 6:44 am

    Sir, it is indeed very wonderful of you to write a book in telugu particularly after having been staying in USA for the last several decades. I am not sure that USA is heaven on earth but the most important thing I observed about USA is accountability to people- may be with in its own limitations.
    Regards
    Sudhakar

  3. పలుకుబడి: సంఖ్యా పదాలు – 1 గురించి రాకేశ్వర రావు అభిప్రాయం:

    07/15/2011 5:31 pm

    ఒంగోలు నుండి మా మిత్రుడొకడుండేవాడు. వాడినాటపట్టించడానికి మేము ఈ కథ చెప్పేవాళ్లం. అప్పటిలోనే లగాన్ సినిమా కూడా విడుఁదలయ్యింది (ఆరుదల పారుదల ఇక్కడ విడుదల). కథేంటంటే,
    అప్పిటిలో ఏదో కారణం చేత మన తెలుఁగు వారు అదీ నేటి ఒంగోలు వారు తెల్లవారితో ఒక కీలకమయిన కాల్బంతులాట ఆడవలసివచ్చింది. మిగిలిన నాటకీయత మీరు లగాన్ సినిమానుండి అరువు తెచ్చుకుంటే, కడకు జరిగిందేమిటంటే, మా నెయ్యడి తాత చివరిగా ఒక గోలు చేసి, మన తెలుఁగు వారి మానం మర్యాద పన్నులూ మిగిల్చినందుకుగాను స్మృతిగా ఆ వూరిని one goal అనగా ఒంగోలు అని పిలచారని.
    కథ ఎలావున్న, మీరు ఓరుఁగల్లును కూడా ఉదహరించివుండవలసింది.

    ఒరు పదానికీ ఒరులు (ఇతరులు) అన్నమాటకూ ఏమైనా సంబంధం వుందా

  4. పలుకుబడి: వ్యుత్పత్తి, నిరుక్తము గురించి రాకేశ్వర రావు అభిప్రాయం:

    07/15/2011 5:14 pm

    పలుకుఁబడి – మాట అనిపించుకొని
    పలుకు బడి – పలికే బడి (కర్మధారయం)
    పలుకుబడి – పలుకులు నేర్పేబడి (తత్పురుషం)
    పలుకుబడి

    అని నాలుగర్ధాలు చెప్పుకోవచ్చుఁ. నాలుగర్థాలు చెడ్డసమాసవాడకాన్ని క్షమించగలరు. చెడ్డసమాసం, క్షిమించగలగడం వంటి చెడ్డసమాసాలను సైతం క్షమించగలరు.

    నా రెండేళ్ళ ఆంధ్రవాసంలో నాకు తగలిన రెండు మంచి పదాలు పారుదాల ఆయని పెద్దన్న ఆరుదల. పారుదల పోనీలే ఫ్లో అనుకోవచ్చుఁ. మఱి ఆరుదలని సరిగా ఆంగ్లంలోనికి అనువదింపలేముకూడా.

  5. ఏదైనా ఒక వేడి వస్తువు గురించి భావకుడన్ అభిప్రాయం:

    07/15/2011 4:55 pm

    చదవగానే రాసుకున్న అభిప్రాయం
    ఇదీ జీవితం చూడటం అంటే.!
    విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు…..ఏ కాలంలో లేవు ఆగ్రహారాలు, కుల పట్టింపులూ ?
    ఒకనాడు శాస్త్రులూ శర్మలూ అవధానులూను, నేడదే సాఫ్ట్ వేర్లూ, ఎన్నారైలూ.

    పైన వ్యాఖ్యలు చదివిన తరవాత రాయాలనుకున్నది…..రచనా వ్యాసంగం ఒకొక్కరికి, ఒకో సందర్భంలో ఒకోక్క్కందుకు
    ఇక్కడ రచయిత తన బాధను వెళ్ళగక్కుకోటానికే ఈ ప్రయత్నం అని చెప్పారు. అక్కడితో ఇక సత్యాసత్యాల అన్వేషణ ఆగిపోవాలేమో. ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేవి రచనా వ్యాసంగంలో “ఎదగాలి” అనుకుని “కృషిచేసిన” వాటికి వర్తింపచేయాలేమో?

  6. పలుకుబడి: ముందుమాట గురించి రాకేశ్వర రావు అభిప్రాయం:

    07/15/2011 4:47 pm

    లోకస్తదనువర్తతే అంటే, నేను నిజంగా locus అలా అనువర్తిస్తుందేమో అనుకున్నాను. locusలయొక్క స్వధర్మమే అనువర్తించడం కాబట్టి, ఆ రకంగా చూస్తా లోకస్సునకూ లోకస్సునకూ ఒకే పలుకూ ఒకే ప్రవృత్తి వున్నప్పుడు అవి ఒకటికాక వేఱు ఎలా కాగలవు?

  7. పలుకుబడి: ముందుమాట గురించి రాకేశ్వర రావు అభిప్రాయం:

    07/15/2011 4:43 pm

    ఏదైనా ఒక విద్య మీద వ్యాసం వ్రాస్తూ, ఇది అపరావిద్యలలోనిది అని మన్ముందే చెప్పడం అశుభం.
    జనులు, కాస్తో కూస్తో బుఱ్ఱ వున్నవాళ్ళు, వేంటనే ఇది అపరమైతే పరమైన విద్య ఏదో వుందిగా, అది ఏమిటి అని అడుగవచ్చుఁ. అలా మీరు చెప్పదలఁచుకొన్న విద్యపై వారికి ఆసక్తి నశిస్తుంది.

    సరి అయితే ఇంతకీ ఆ పరావిద్య గుఱించి ఒక నాలుగు మాటలు చెప్పవచ్చుగా, అపరమైనది ఎంత నేర్చి ఏం లాభం.

  8. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి pawan అభిప్రాయం:

    07/14/2011 12:42 pm

    చాలా బాగా చెప్పారు.నాకు నా బాల్యమ్ గుర్తుకువచ్చేలా చేశారు.ధన్యవాదాలు.

  9. నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి bendapudi subbarao అభిప్రాయం:

    07/14/2011 10:08 am

    అలసాని “కనుపపులు” అని చెప్పుట విడ్డూరము. ఈగడ్డి అక్కడ పెరగదు.

  10. ఏదైనా ఒక వేడి వస్తువు గురించి swamy అభిప్రాయం:

    07/13/2011 1:34 am

    కథకు ఎదైనా ఒక వేడి వస్తువు అని చక్కగా పేరుపెట్టిన రచయిత కథనంలో ఒకేడివస్తువు అని చెప్పలేదు. ఇదొక ట్రాష్. మాండలికం పేరుతో ఒకప్పుడు వచ్చిన సాహిత్యం ఇప్పుడు తెలుగునాట వెర్రితలలు వేస్తూ ఉంది. మాదసలు తెలుగే కాదు పొమ్మంటూ ఉంది. వికృతశిశువు వికృత చేష్టలు మనం నిస్సహాయంగా చూస్తుండి ఊరుకుంటున్నాం.

    త్రిపుర పేరు చెప్పుకుని బతికేవాళ్ళు ఎక్కువైపోయారు. త్రిపుర రచయితగా కంటే వ్యక్తిగా ఇంకా ప్రత్యేకమైన వాడు. నామిని వ్యక్తిగా ఉత్త డొల్ల . ఉత్త జూటా. వాళ్ళ ప్రస్తావనకి కథకీ పొంతనేంటీ. మధ్యలో నోమ్ చాంస్కీ, డెరిడా ఎందుకొచ్చారో రచయితకే ఎరుక. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లుగా ఉంది రచయిత పరిస్థితి.