దేశికాచారి గారూ! “గానభారతి” మీదకి చర్చని మళ్ళించినందుకు మీరు నన్ను మెచ్చుకోవాలి:) ఇటువంటి చర్చ అనివార్యంగా కవితారూపం మీదకి మళ్ళే పరిస్థితి వస్తుంది. పద్యం రాసే వారిగా మీకు పద్యరూపం మీద ఇష్టమ్ ఎక్కువ ఉండటం సహజమే అయినా మీరు మీ వ్యక్తీకరణ పరిమితులని కూడా తప్పక ఒప్పుకోవాలి.
తెలుగువారికి గర్వకారణమతాది పద్యం. అందులో ఎటువంటి విభేదమూ లేదు. కానీ ప్రతీ అంశమూ పద్యానికి వ్యక్తీకరణలో నప్పదన్నదే నా అభిప్రాయం. అలాగే పద్యంలో రాసినదంతా కవిత్వమేనన్న ఊహ పొరపాటు అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇంక కధలకి “పద్యాన్ని” వాడటం కొత్తేముందీ?? మన మహాభారతం మొదలుకుని కొనసాగిన ప్రాచీన తెలుగు సాహిత్యం అంతా కధల్ని ఛందోరూపంగా గద్య పద్యాత్మకమైన రీతిలోనీ మణిప్రవాళ భరిత భాష లోనీ చెప్పినదే కద!! మీరు ఇతివృత్తం ఆధునికం కాలం రీత్యా అని చెప్పడమే తప్ప కధని చెప్పడం పద్యాల్లో కొత్త ఏమీ కాదు.
కాలంలో మార్పు అనేక విషయాల్లోనూ మార్పుకి కారణమ్ అయితీరుతుంది. దాన్నించి.. ఏ కళారూపమూ తనతీరుని మార్చుకోకుండా ఉండలేదు. శ్రీనాధుడి కవితా వస్తువునించి విడివడడానికే పెద్దన కొత్తదైన వస్తువుని ఎన్నుకోవలసి వచ్చింది. దానికి ఒక కొత్త పేరునీ పెట్టుకుని తనకవిత్వమ్ తత్పూర్వమ్ కన్నా భిన్నమైనదని చెప్పుకోవలసీ వచ్చింది. ఇది కాలంరీత్యా వచ్చిన రాక తప్పని మార్పై కన్పిస్తుంది సాహిత్యంలో !! అయితే వస్తువులో కొత్త అడుగు వేసిన అల్లసాని కవితా రూపంలో మాత్రం కొత్త అడుగు వేయలేకపోవడానికి కారణం తత్భిన్నమైన కవితా రూపం ఒకటి తేవొచ్చని తెలియకపోవడమేనని అనుకోవాలి. అలా తెలియడానికీ వస్తువులోనూ కధని చెప్పవలసిన ఒక తప్పనిసరి పరిస్థితిని వదుల్చుకోవడమ్ లోనూ ఆధునిక కాలం, ఇతర దేశాల సంపర్కం ఉపయోగపడ్డాయి 19వ శతాబ్దపు కవులకి. కధన రితిని వారు విసర్జించి భావప్రధానమైన వస్తువుని కవిత్వంలో తీసుకుని రావడమూ, రూపంలో సైతమ్ ఎంతోకొంత మార్పుకి తొలినాళ్ళలో ప్రయత్నించడమూ భావకవులు చేసారు. అది కూడా ఒక మూసగా మారిన స్థితిలోనే పఠాభి ఆరీతి మీద తిరుగుబాటు కవిత్వమ్ రాసేడు. వీళ్ళంతా పద్యాలు రాయలేక కాదు వచనకవిత్వమ్ వేపు మళ్ళింది. శ్రీశ్రీ గాని పఠాభి గాని కృష్ణశాస్త్రి గానీ చాలా మంచి పద్యాలు రాయగల్గినవాళ్ళూ.. రాసినవాళ్ళే! వాళ్ళు కవితా రూపాన్ని మార్చుకోవలసిన ఆవశ్యకతని గుర్తించారు గనక మారేరు. ఇది ఒక సాహిత్య వాస్తవం! పద్యం ఎన్నిటికో అనువైనది కాదు.ఆధునిక జీవితలోని సంక్లిష్టతకి ఆ కవితా రూపం ఏమీ నప్పలేదు. చందస్సుల నడ్డి విరగ్గొడతానని పఠాభి ప్రకటించింది ఆ ఇరుకునించి తన భావప్రకటనా విధానాన్ని తప్పించుకుందికి మాత్రమే! అంతేగానీ పద్యరూపం ఆయనకి తెలియకా కాదు. పద్యం రాయలేకా కాదు.
ఈ తెగతెంపు వల్ల కవితావస్తువులోనీ కవితా వ్యక్తీకరణలోనీ కవికి అపారమైన స్వేచ్చ లభించడమ్ వల్లనే మనకి ఆధునిక కవిత్వంలో ఎన్నో ప్రయోగాలూ ఎన్నో మంచి వచనకవితలూ కూడా రాగలిగాయి. అయితే వచన కవితా రూపాన్ని సైతమ్ ఒక నిరర్ధక స్థితికి కవులు తీసుకు రాలేదా అన్న ప్రశ్న వస్తే అందుకు ఔననే జవాబు చెప్పాలి. ఎలాగైతే చంధస్సులో రాసినదంతా కవిత్వం కాదో రూపాన్ని మార్చుకుని వచనకవిత్వాన్ని స్వీకరించి రాసినదంతా కూడా కవిత్వమ్ కాలేదు. అందుకు కవుల భావన, ఊహల లోపమ్ కారణమ్ తప్ప కవితా రూపం కారణమ్ కాదు. మంచి చంధో నిబధ్ధ పద్యమూ రాయవచ్చు. మంచి వచన కవితా కూడా రాయవచ్చు. వ్యక్తీకరణ ఊహా భాష గొప్పవి అయితే!! కాలం రీత్యా కవితా రూపం మారడమ్ కారణంగా అనేక వర్గాల వారూ అనేక జాతుల వారూ తమ తమ వ్యక్తీకరణలని స్వేచ్చగా సాహిత్యం లోకి తీసుకుని రాగలిగారు. అలాగే ఆ సందర్భాన్ని నిరుపయోగం కూడా చేసుకున్నారు.
దానాదీనా చెప్పొచ్చేదేమంటే ఆధునిక భాషని వాడడానికి చాలని కవితా రూపంలో ఆధునిక కధానిక మీరు రాస్తే అది మీ శ్రమని వృధా చేసుకోవడమే తప్ప “బాగా” రాయగలగడం ఏమంత వీలు కాదు. అయితే రాసే స్వేచ్చ మీకుంటుంది. కానీ మీరు ఇతరత్రా రాసిన పద్యాలంత బలమ్ ఇందులో ఉండే వీలు లేదు.
కాలానికీ సాహిత్య రూపానికీ ఉన్న సంబంధాన్ని మీరు గానీ నేను గానీ కాదని అనలేము మరి.
యశస్వి.
[యశస్వి గారూ – తెలుగులో సున్నా రావాలంటే m కాకుండా M టైపు చేయండి. అలానే మీరు రాసిన అభిప్రాయం మీరే మరొక్కసారి చదివి ఒక్కసారి అచ్చుతప్పులు దిద్దుకుంటూ వుంటే మాకు ప్రతిసారీ శ్రమ కొంచెం తప్పించినవారవుతారు. -సం]
యశస్విగారూ, నేను రాసినది సరిగా అర్థం కాకపోతే వదిలెయ్యండి. సంగీతం, సాహిత్యం అనేవాటి ప్రాముఖ్యత ఎక్కడ, ఎలా ఉంటుందో నాకు (మీ అంత కాకపోయినా) కొంత తెలుసు. అదంతా ఇక్కడ వర్ణించడం అనవసరం. అయినా దీన్ని గురించి అభ్యంతరం ఉండవలసినది జయప్రభగారికేనేమో. నేను నా అభిప్రాయం రాసేటప్పుడు ఆవిడ వ్యాసం చదవనైనాలేదు.
గానభారతి ఇటువంటి చర్చలకు మూలం కావడం ముదావహంగానే ఉన్నది. నేను పేర్కొన్నట్లుగా కాల మేదైనా మానవుల ప్రకృతులు కాలాతీతములు. యశస్వివంటివారు ఇటువంటి ఇతివృత్తం గల కథను ఇంకా వివరంగా “తెల్గీషు” గద్యంలోవ్రాస్తే ఆనందిస్తారనటంలో సందేహంలేదు. కాని ఒకవిషయం గమనించాలి. తెల్గీషులో చదివి ఆనందించవలసిన భాషా సౌందర్యం గాని, పదశిల్పంగాని, ఆలంకారికప్రయోగాలు గానీ, వర్ణనావైదగ్ధ్యం గాని, లయవిన్యాసాలు గాని వెతకడం పొరపాటే ఔతుంది. అట్లాగే గానభారతివంటి కవితా కథానికలలో ఈ అంశాలను విస్మరించి, తెల్గీషుభాషలో పద్యం వ్రాయలేదే అని వాపోవడంకూడ పొరపాటే ఔతుంది. అందుచేత వ్రాసిన మాధ్యమంలో ఆ మాధ్యమానికి లక్షణభూతమైన అంశాలను దృష్టిలో నుంచుకొని అందాన్ని ఆస్వాదించడం సహృదయుల ధర్మం. ఉదాహరణానికి పొడిమాటలతో సాగే డ్రామాను ఓపెరాగానో, బ్రాడ్వే సంగీతరూపకంగానో వ్రాసినప్పుడు వీనిని ఆస్వాదించే ప్రేక్షకులు, వాటిని తోలనంచేసే ప్రమాణాలూ వేఱుగా ఉంటాయి. గద్యేతర కవితామాధ్యమంలో కథను వ్రాసినప్పుడు (ఈనాటి వ్వవహారికభాష వాడటం లేదే అని వాపోకుంటే) ఈనాటి వచనకవిత్వంకంటె పద్యమే కథాకథనానికి సమర్థంగా, హృద్యంగా ఉంటుందనటంలో సందేహం లేదు. నేను వ్రాసినది సమర్థంగా ఉన్నా లేకున్నా ఇటువంటి కవితాకథానికా ప్రయోగాలు ఇంకా విరివిగాసాగాలనే ఉద్దేశ్యంతోనే నేనీ ప్రయోగాన్ని చేస్తున్నాను.
లైలాగారి సందేహాలకు సమాధానాలు:
1. రోమంథము = నెమరువేయుట . పోతనభాగవతంలోను, ముక్కుతిమ్మనగారి పారిజాతాపహరణంలోను ఈ పదం థకారయుక్తంగా ఉన్నది గాని సూర్యరాయాంధ్రనిఘంటువులో రోమంధము అని ధకారయుక్తరూపమున్నది. ఈ పదాన్ని వాడిన శ్రీకృష్ణమురళీగానపరవశములైన గోవులను వర్ణించే పోతనగారి పద్యం:
3, గానభారతిలో దౌహృదవర్ణనపద్యాన్ని మార్చి నేను మాదవ్ గారికి సంస్కృతప్రతిని జూలై సంచిక రాకముందే పంపినాను గాని, ప్రాతప్రతియే అంతర్జాలంలో వారు ప్రచురించినారు. ఈ సంస్కృతపద్యరూపాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఇందులో దౌహృదవర్ణన వాచ్యంగా కాక చాలా మట్టుకు సూచ్యంగా మార్చబడ్డది.
“తెలుగువారి సంగీతాభిరుచి పెరగాలంటే వారు సాహిత్యం పై శ్రధ్ధ పెట్టడం తగ్గించి…” ఇదేం వ్యాఖ్యానం ?? సంగీతం మీద అభిరుచిని పెంచుకోవడానికీ సాహిత్యాన్ని పట్టించుకోనఖ్ఖరలేదని ఓ సలహా పారేసే ముందు అసలు ఆ వాక్యానికి ఉన్న బలం ఏమిటోనన్నా ఆలోచించుకోలేదే రోహిణీ ప్రాసాదు గారు? సరిగ్గా ఆయన అభిప్రాయానికి భిన్నంగా ఉన్న జయప్రభ గారి అన్నమయ్య విశ్లేషణ పదంలోని సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యత ఎంతటిదో చెప్పకనే చెబుతోంది మరి!! సంగీతంలో ఎప్పుడైనా రాగాలూ స్వరాలూ ఇవి మాత్రమే ముఖ్యమైనవట!! దీని అర్ధమేమో రోహిణీ ప్రసాదు గారు వివరించాలి. ఆయన సాహితీ విశ్లేషకులని చూసి ఇబ్బంది పడుతున్నారా?? లేక సంగీతానికి ఆ పదాల్లోని సాహిత్యం ప్రతిబంధకం అని అనుకుంటున్నారా?? ఆయన సమస్య ఏమిటో నాకు స్పస్టం కాలేదు.
ఒకసారి రాజమండ్రిలో పద్యనాటకాల ప్రాభవం బాగా ఉండే రోజుల్లో సంగీతం ముఖ్యమా? సాహిత్యం ముఖ్యమా అని చర్చలు చేసుకునే రోజుల్లో భమిడిపాటి కామేశ్వరావు గారు స్టేజీ మీద ఏకబిగిన రాగాన్ని ఆలాపన చేసి ఊరుకున్నారట!! పద్యం పాడటం అయిపోయింది అని చెప్పేసేరట. అదేమిటీ పద్యం అంటే సాహిత్యం ఏదీ అది వినిపించకపోతే ఇంక అందులో సొగసేమిటి పద్యం చదవండి మొర్రో అని జనం మొత్తుకున్నారట!! అలా ఆయన సంగీతంలో రాగం చాలు సాహిత్యం అనవసరమ్ అని భావించేవారికి తనదైన తరహాలో జవాబు చెప్పి ఉన్నారు. ఇది ఏనాడో ముగిసిపోయిన చర్చ. అలాగే ఘంటసాల గారికి ప్రియ శిష్యుడైన సంగీతరావు గారు సాహిత్యం లో ఉండే ప్రాముఖ్యతకి సదా ముగ్ధులైన వ్యక్తి. పాట తాలుకు బలం అంతా ఆ పాటలోని సాహిత్యానిదే నని తాను స్వయంగా సంగీతకారుడై ఉండిన్నీ.. గాయకుడై ఉండిన్నీ బలంగా నమ్మిన వ్యక్తి. సాహిత్యం తాలుకు ప్రాభవం అంత సరిగ్గా తెలియని వారెవరో అక్షరాన్ని గురించి ఆలోచించలేకపోయి ఉంటారు. కానీ సంగీతంలో అక్షరమే ముందు నడిచేదనీనీ స్వరం ఎప్పుడైనా దాన్ని అనుసరించే సాగవలసినదనీనీ సాహిత్యం తెలిసిన వారెవరైనా భావిస్తారు. అందుకనే అన్నమయ్య సాహిత్యం అంత ప్రాచుర్యం పొందగలిగింది. ఆయన పదాన్ని ఎవరేయే రాగాలలో.. పాడుకుంటున్నా కూడా ఆయన పదాలలోని ఆ కవితామాధుర్యమే చెవికింపుగానూ మనసుకి సుఖంగానూ ఉంటుంది. అక్షరాన్ని మినహాయించే సంగీతం మనలేదు. అందువల్ల రోహిణీప్రసాదు గారు ఒక పక్షపాత ధోరణితో ఆ మాటలు అన్నారని భావించేలా ఉంది. ఆయనకి సాహిత్యం మీద మక్కువ లేనంత మాత్రాన తెలుగువారికందరికీ ఉండకూడదని ఏమీ లేదు.
లైలా గారూ !! మీరు రాసిన కొన్ని వాక్యాలకి నేను ఇంకా అలా నవ్వుతూనే ఉన్నాను.” కడుపొచ్చ్చినంత సులువుగా సంగీతం రాదు” 😉
మనుచరిత్ర ప్రభావం అన్నది ఒంటిగా ఉన్న అమ్మాయిని వెళ్ళి పలకరించి కుశల ప్రశ్నలు వేసి ఆ అమ్మాయి యోగక్షేమాలు కనుక్కునే నెపంతో సంభాషణ మొదలుపెట్టడం..ఇంకా గర్భిణీ స్త్రీ లక్షణాలు వర్నించడం ఇత్యాదుల్లో !! అంతదాకానే !!
ఇకపోతే పద్యరచనలో తిరుమల దేశికాచార్యులవారిది అందె వేసిన చెయ్యే !! అందులో ఇసుమంత కూడా సందేహం లేదు. అయితే, ప్రతీదీ పద్యంలోకి ఇరికిస్తే అది నప్పదు. అందుకు ఉదాహరణ గానే ఈ “గానభారతి”. లైలా అన్నట్టూ ఇది ఈ కాలం కధ అయితే ఈ కాలం ఆడపిల్ల వ్యవహారం ఇందులో ఏం లేదు. ఈ గానభారతి కవి గారి ఊహల్లో రూపొందిన అమ్మాయి. ఇవాళ్టి సమాజంలోని అమ్మాయే అయితే లైలా చెప్పినట్టూ ముందుగా గైనకాలజిస్టునే సంప్రదిస్తుంది మరి.
చాదస్తం భాష లో ఉన్నప్పుడు కవి సహజం గానే విషయాన్ని సైతం అంతే చాదస్తమ్ గా రాయక తప్పదు. dress code ని మార్చుకున్నారు గానీ భాష విషయలోనూ కధా కల్పనలోనూ మాత్రం ఈ చాలా మంది పద్య కవులు కాలాన్ని ఇంకా శతాబ్దాల పొలిమేరని దాటనివ్వడం లేందే?? పద్యం బాగుంటుంది కదా అని అన్నిటికీ పద్యాన్నే వాడితే అది ఇదిగో ఇలాగే ఉంటుంది. పైగా కాలం ఆధునికం అన్న సూచన స్వయంగా చేస్తూ కవి ఆ ఆధునిక కాలం లో స్త్రీని మాత్రం బేలగా కవి సలహా లేనిదే అడుగు ముందుకు వేయలేని దానిగా చిత్రించడం ఏమిటీ??
ముక్తకాలైన భావాలకి పద్యం నప్పుతుంది. ప్రకృతి వర్ణనలకి కూడా ఇప్పటికీ పద్యమ్ నప్పుతుంది. దేశికాచార్యులవారే జలప్రపాతాన్ని వర్ణించే పద్యాలు రాసేరు. కానీ ఆధునిక కధ అందునా సంక్లిష్టమైన ఇతివృత్తం తప్పని సరిగా ఆధునికమైన భాష లోనే ఉండటం సముచితంగా ఉంటుంది. లేనప్పుడది కృతకంగానే ఉంటుంది. మన బతుకులో చాలా ప్రాంతాల ప్రమేయం చాలా నాగరికతల ప్రమేయం ఉన్నప్పుడు “తెల్గిష్” నప్పినంతగా మణిప్రవాళమ్ నప్పదు. పైగా ఇదివరలో వేరే భాషలని తెలుగు గ్రహించనట్టూ ఇప్పటికిప్పుడే ఇటువంటి పరిస్థితి ఏదో తెలుగులో తలెత్తినట్టూ దేశికాచార్యుల వారు అనడం వింత . భాష జీవద్భాష అయితే అది అన్నిటినీ కలుపుకుని నడుస్తుంది. లేకపోతే చస్తుంది. అప్పారావు గారి కన్యాశుల్కం లోని వాక్యాలకి ఆ ప్రాచుర్యం వచ్చిందీ అంటే అందుకు కారణం ఆయన సుబ్బరంగా “తెల్గిష్” ని తన నాటకంలో వాడటమే కద!!
విశ్వనాథ సత్యనారాయణ వసుచరిత్రము (ఎమెస్కో ప్రచురణ) కు పీఠిక రాస్తూ, వసుచరిత్ర కావ్యము చదవటానికి ఇప్పటి పాఠకులు అధ్యైర్య పడనక్కరలేదనీ, – “మానవజాతిలో నది యొక అవివేకము. ప్రతివాడును తనకేమియు తెలియదనుకొనును. ఆ యనుకొనుట మానివేసినచో మన కావ్యములు కూడ చాలవరకు మనకు తెలియగలవు. నాల్గు మాటలు చదివిన తరువాత నైదవమాట కర్థము తెలియదు. నాకు తెలియుటే లేదని యా పుస్తకము నవతల పారవేయును. ఆ మాట యర్థము కానిచో తక్కిన మాటల కర్థమేమి? పద్యమంతయు చదివినచో నేదో కొంత తెలియదా? ఒక పద్యము తెలియలేదు. రెండవ పద్యము తెలియదా?” – అంటూ కావ్యాలు తప్పక చదవమని సలహా ఇస్తారు.
విశ్వనాథ సలహా నాకు నచ్చింది. ఆయన ఎంతమంది విద్యార్థులకో చదువు చెప్పిన పంతులయ్యె. నేను పద్యాలు అలాగే చదువుతున్నాను. చదివిన కొద్దీ అర్థమవుతున్నయి.
దేశికాచారి గారి పద్యాలు మధురంగా ఉంటాయి. నేను చదువుతున్నా. ఇందులో అన్ని పద్యాల్లో అన్ని మాటలూ అర్థం కాకపోయినా, కథ అర్థమయ్యింది. ఇది ఇప్పటి కాలపు కథ కాదంటానికి వీల్లేదు.
కొంచెం బాగోనట్టు ఎక్కడ అనిపించిందంటే; 🙂 కవితో కథానాయిక .. ఆమె… ఆమె…. – O! What the hell. I will say that horrible word in Telugu – ఆమె తన గర్భిణీ చిహ్నాలను వర్ణించి వర్ణించి చెప్పినప్పుడు. ఈ కాలపు స్త్రీ, ఆ సోదంతా అంత వివరంగా కవికి ఒక లతా నికుంజంలో ఎందుకు చెపుతుంది? అంతకు ముందెప్పుడో తన గైనకాలజిస్ట్ కి హాస్పిటల్లో చెప్పి ఉండొచ్చు.
అంతే. అందుకని. అంతకు మించి నచ్చనిది ఏం లేదు.
ఒంటరిగా, విచారంగా, ఉన్న ఒక స్త్రీని “ఏమిటమ్మా నీ కష్టం?” అని ఒక మగాడు కల్పించుకుని అడగటం ఈ రోజుల్లో జరగదా? అంటే జరుగుతుంది. సరే, కవి తర్వాత కుంచెం, వైద్యుడు, సలహాదారుగా ప్రవర్తించాడు అనుకోండి. అది ఈ రోజుల్లో ఆశ్చర్యం కలిగించే విషయమా అంటే అదీ కాదు. అలా రోజూ ఎడా పెడా లక్ష సలహాలు ఇస్తూనే ఉంటారు చాలామంది మనుషులు. కాని ఇక్కడ ఇచ్చిన సలహా అంత చచ్చుగానూ లేదు. నా కర్థమైనంత వరకూ ఆ కవి, ఆమె మనసు నొచ్చుకునే మాటలు అన్నట్టు లేదు. ఆమెను ఏ చెరువులోనూ దూకించలేదు. పైగా ఆమె కిష్టమయ్యి, ఆమె అదే పొదరింట్లో మరొకరితో సంభోగించితే , కవికి కష్టం కలిగేట్లూ లేదు.
అందువల్ల కవి సహృదయుడు అనిపిస్తున్నది.
అరే! ఒకటి రెండు కూజితాల్లోనే ఆమె కోయిల అని కవికి ఎలా తెలిసింది? అంటే – అదీ అంత నమ్మలేని విషయంలా అనిపించటం లేదు. 🙂 “తాళ్” సినిమాలో ‘మానవి’ /ఐష్వర్యారాయ్ సందేహిస్తూ “జీ. మై క్యా బోలూ” అనంగానే ఆ ధ్వనికి మురిసి ఆమె బాగా పాడుతుందని, స్టార్ క్వాలిటీ అని అనిల్ కపూర్కి తెలిసిపోయి, తన సంగీతం డాన్స్ కంపెనీతో కాంట్రాక్ట్ సైన్ చెయ్యమనలా:-)
ఐతే ఈ కథలో కవి, తన సలహానే ఆ స్త్రీ పాటించి, అందువల్లే ‘గానభారతి’ ఐపోయిందని, మనసులో అనుకున్నాడా? ఏమో మరి. తెలియదు. కానీ, సలహా ఇచ్చినప్పుడు సంగీతం ఆవిడకు మర్నాటికల్లా వస్తుందని అపోహ మాత్రం పడలేదు. కడుపొచ్చినంత సులువుగా సంగీతం రాదు. సంవత్సరాలు పడుతుందనే అనుకున్నాడు. “ఈ మాట” లో సంగీతం వ్యాసాలు రాసే రచయితలు మాత్రం, – వద్దులెండి, ఇక్కడ ఆ సంగతులు – వాళ్ళు రెండు దరువులు వేస్తే, నే బేరుమంటే, మళ్ళీ సుకవులు … 🙂 ఎందుకు గానీ ‘రోమంధము’, ‘ముకురాయితమైన’ అన్న మాటలకు అర్థాలు చెపితే, ప్రస్తుతానికి చాలు.
చెప్పొద్దూ – వరూధినీ, ప్రవరుడు అని వినిపించేసరికి కుతూహలం కలిగిన మాట వాస్తవం. ఎత్తుగడ అలా అనిపింపజేస్తుంది కూడ. ఐతే మిగిలిన ఏ విషయాల్లోనూ ఎలాటి పోలికా లేదని మనుచరిత్ర తొలి రెండు ఆశ్వాసాలూ చదివిన వారు ఇట్టే పోల్చుకోగలరు (నిజానికి నేను ఆ రెండు ఆశ్వాసాలు “ఈమాట”లో చాలాకాలం క్రితం పెట్టిన గుర్తు, ఇంకా ఉండి ఉండవచ్చు).
ముందుగా, ఇంకా పట్టుపట్టి ఛందోబద్ధమైన పద్యాల్ని రాస్తున్నందుకు తిరుమల దేశికాచార్యుల్ని అభినందించాలి.
ఐతే ఛందోబద్ధమైన పద్యాలు రాసేవారు భాష విషయంలో ఏమైనా కొత్తదనాన్ని తీసుకురావటానికి ప్రయత్నిస్తే ఇంకా పాఠకులకు అందుబాటులో వుండే అవకాశం ఉంటుందేమో ! సమకాలీన పాత్రలు సంస్కృతసమాసభూయిష్టమైన సంభాషణలు చేస్తుంటే తమాషాగానూ ఎబ్బెట్టు గానూ ఉంటుంది. అంతే కాదు సంప్రదాయ భాషలో సమకాలీన భావాల్ని చెప్పలేరు కూడ. అందుకే భావకవులు వస్తువుకి అనుగుణమైన భావజాలాన్నీ భాషనీ తయారుచేసుకున్నారు (వసుచరిత్ర తర్వాత వచ్చిన ఏ రచననీ చదివే ఉద్దేశం లేదని కవిగారు ఇదివరకు అన్నగుర్తు; కాబట్టి ఈ మాటలు వారిని ఉద్దేశించినవి కావు – ఇంకెవరన్నా పద్యాలు రాద్దామనుకుంటే వారికీ ఈ మనవి.) తర్వాత పద్యాలు రాసిన నండూరి వారు కాని, కోవెల వారు కాని భాషని ఆధునీకరించటానికి బాగానే ప్రయత్నించారు వస్తువు పౌరాణికమైనదైనా (ఉదాహరణకి నండూరి “శీర్ణమేఖల”). రామాయణాన్ని రాసిన విశ్వనాథ కూడ చాలా ఆధునిక భాషని భావజాలాన్ని వాడాడు. శ్రీశ్రీ, ఆరుద్ర లాటి వాళ్లు సంప్రదాయ ఛందస్సుల్లో అధునాతన భావాలని చెప్పగలిగారు, అందుకు అనుకూలంగా భాషనీ మలుచుకుని. ఎంతోమంది “సెటైర్లు”, “పేరడీ”లకు ఛందోపద్యాల్ని బాగానే ఉపయోగించుకున్నారు.
ఇప్పటికీ చారిత్రక పౌరాణిక నాటకాలకు కొత్త తరం కవులు పాతరకం పద్యాలు రాస్తున్నారు; శ్రోతలూ వింటున్నారు. చిక్కల్లా సమకాలీన పాత్రలు అదే ఒరవడిలో నడవబోయినప్పుడే. కొత్తభాషని తయారుచేసుకోవటం మాటలు కాదు; కాని కష్టే ఫలిః .
గానభారతి గురించి yasasvi అభిప్రాయం:
08/13/2011 3:07 am

నిలువు నూరు వండేటి మొలక: అన్నమయ్య పదం గురించి Rohiniprasad అభిప్రాయం:
08/12/2011 9:41 pm
యశస్విగారూ, నేను రాసినది సరిగా అర్థం కాకపోతే వదిలెయ్యండి. సంగీతం, సాహిత్యం అనేవాటి ప్రాముఖ్యత ఎక్కడ, ఎలా ఉంటుందో నాకు (మీ అంత కాకపోయినా) కొంత తెలుసు. అదంతా ఇక్కడ వర్ణించడం అనవసరం. అయినా దీన్ని గురించి అభ్యంతరం ఉండవలసినది జయప్రభగారికేనేమో. నేను నా అభిప్రాయం రాసేటప్పుడు ఆవిడ వ్యాసం చదవనైనాలేదు.
గానభారతి గురించి దేశికాచారి అభిప్రాయం:
08/12/2011 5:08 pm
గానభారతి ఇటువంటి చర్చలకు మూలం కావడం ముదావహంగానే ఉన్నది. నేను పేర్కొన్నట్లుగా కాల మేదైనా మానవుల ప్రకృతులు కాలాతీతములు. యశస్వివంటివారు ఇటువంటి ఇతివృత్తం గల కథను ఇంకా వివరంగా “తెల్గీషు” గద్యంలోవ్రాస్తే ఆనందిస్తారనటంలో సందేహంలేదు. కాని ఒకవిషయం గమనించాలి. తెల్గీషులో చదివి ఆనందించవలసిన భాషా సౌందర్యం గాని, పదశిల్పంగాని, ఆలంకారికప్రయోగాలు గానీ, వర్ణనావైదగ్ధ్యం గాని, లయవిన్యాసాలు గాని వెతకడం పొరపాటే ఔతుంది. అట్లాగే గానభారతివంటి కవితా కథానికలలో ఈ అంశాలను విస్మరించి, తెల్గీషుభాషలో పద్యం వ్రాయలేదే అని వాపోవడంకూడ పొరపాటే ఔతుంది. అందుచేత వ్రాసిన మాధ్యమంలో ఆ మాధ్యమానికి లక్షణభూతమైన అంశాలను దృష్టిలో నుంచుకొని అందాన్ని ఆస్వాదించడం సహృదయుల ధర్మం. ఉదాహరణానికి పొడిమాటలతో సాగే డ్రామాను ఓపెరాగానో, బ్రాడ్వే సంగీతరూపకంగానో వ్రాసినప్పుడు వీనిని ఆస్వాదించే ప్రేక్షకులు, వాటిని తోలనంచేసే ప్రమాణాలూ వేఱుగా ఉంటాయి. గద్యేతర కవితామాధ్యమంలో కథను వ్రాసినప్పుడు (ఈనాటి వ్వవహారికభాష వాడటం లేదే అని వాపోకుంటే) ఈనాటి వచనకవిత్వంకంటె పద్యమే కథాకథనానికి సమర్థంగా, హృద్యంగా ఉంటుందనటంలో సందేహం లేదు. నేను వ్రాసినది సమర్థంగా ఉన్నా లేకున్నా ఇటువంటి కవితాకథానికా ప్రయోగాలు ఇంకా విరివిగాసాగాలనే ఉద్దేశ్యంతోనే నేనీ ప్రయోగాన్ని చేస్తున్నాను.
లైలాగారి సందేహాలకు సమాధానాలు:
1. రోమంథము = నెమరువేయుట . పోతనభాగవతంలోను, ముక్కుతిమ్మనగారి పారిజాతాపహరణంలోను ఈ పదం థకారయుక్తంగా ఉన్నది గాని సూర్యరాయాంధ్రనిఘంటువులో రోమంధము అని ధకారయుక్తరూపమున్నది. ఈ పదాన్ని వాడిన శ్రీకృష్ణమురళీగానపరవశములైన గోవులను వర్ణించే పోతనగారి పద్యం:
మమతన్ మోములు మీఁది కెత్తుకొని, రోమంథంబు సాలించి, హృ
త్కమలాగ్రంబులఁ గృష్ణు నిల్పి, మురళీగానామృతశ్రేణి క
ర్ణములం గ్రోలుచు మేఁతమాని, గళితానందాశ్రులై చిత్రితో
పమలై గోవులు చూచుచున్న వదిగో పద్మాక్షి! వీక్షించితే!
2. సత్సంప్రదాయముకురాయితమైన = సత్సంప్రదాయమునకు అద్దమువలె నాచరించుచున్న, అనగా సత్సంప్రదాయమునకు అద్దము బట్టినట్లున్న, ముకుర మనగా అద్దము.
3, గానభారతిలో దౌహృదవర్ణనపద్యాన్ని మార్చి నేను మాదవ్ గారికి సంస్కృతప్రతిని జూలై సంచిక రాకముందే పంపినాను గాని, ప్రాతప్రతియే అంతర్జాలంలో వారు ప్రచురించినారు. ఈ సంస్కృతపద్యరూపాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఇందులో దౌహృదవర్ణన వాచ్యంగా కాక చాలా మట్టుకు సూచ్యంగా మార్చబడ్డది.
ఆ మఱునాఁటినుండియె మదంగమునం దెవొ నూత్నచిహ్నముల్
గోముగఁ గాననయ్యెఁ, బలుగొంచెపుఁగౌఁను క్రమక్రమంబుగా
లేమినిఁ బాయఁజొచ్చె, లవలీదళపాండురమయ్యె గండముల్,
కామవరప్రసాదమనఁగన్ సమకూడిన గర్భమందునన్.
4.విశ్వనాథవారు చెప్పినది అక్షరాలా నిజం. “తినగ తినగ వేము తియ్యనగును” అనే వేమనలైనుకూ ఇదేఅర్థం.
గానభారతి గురించి మోహన అభిప్రాయం:
08/12/2011 2:56 pm
మనుచరిత్ర నాయిక పేరు వరూథిని, వరూధిని కాదు. ఆమె ప్రవరునితో మాట్లాడుతూ తన్ను వరూథిని అని పిలువమంటుంది 🙂
పేరు వరూథిని విప్రకు-
మార, ఘృతాచీ తిలోత్తమా హరిణీ హే-
మా రంభా శశిరేఖ లు-
దారగుణాఢ్యలు మదీయ లగు ప్రాణసఖుల్ – మనుచరిత్ర (2.44)
విధేయుడు – మోహన
పిల్లల కోసం గురించి Sreenivas అభిప్రాయం:
08/12/2011 2:52 pm
Chaala Baagunnai.
గానభారతి గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
08/12/2011 1:41 pm
రోమంథము = నెమరు (గుర్తుకు రావటం అనే అర్థంలో వాడినట్లున్నారు)
ముకురాయితమనే మాట కొరుకుడు పడలేదింకా (ముకురము = అద్దము/మల్లెపూవు; ఆయితము = సన్నాహము, సిద్ధము). సత్సంప్రదాయానికి “అద్దం పట్టే “అని అర్థం లాగవచ్చునా?
నిలువు నూరు వండేటి మొలక: అన్నమయ్య పదం గురించి yasasvi అభిప్రాయం:
08/12/2011 2:17 am
“తెలుగువారి సంగీతాభిరుచి పెరగాలంటే వారు సాహిత్యం పై శ్రధ్ధ పెట్టడం తగ్గించి…” ఇదేం వ్యాఖ్యానం ?? సంగీతం మీద అభిరుచిని పెంచుకోవడానికీ సాహిత్యాన్ని పట్టించుకోనఖ్ఖరలేదని ఓ సలహా పారేసే ముందు అసలు ఆ వాక్యానికి ఉన్న బలం ఏమిటోనన్నా ఆలోచించుకోలేదే రోహిణీ ప్రాసాదు గారు? సరిగ్గా ఆయన అభిప్రాయానికి భిన్నంగా ఉన్న జయప్రభ గారి అన్నమయ్య విశ్లేషణ పదంలోని సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యత ఎంతటిదో చెప్పకనే చెబుతోంది మరి!! సంగీతంలో ఎప్పుడైనా రాగాలూ స్వరాలూ ఇవి మాత్రమే ముఖ్యమైనవట!! దీని అర్ధమేమో రోహిణీ ప్రసాదు గారు వివరించాలి. ఆయన సాహితీ విశ్లేషకులని చూసి ఇబ్బంది పడుతున్నారా?? లేక సంగీతానికి ఆ పదాల్లోని సాహిత్యం ప్రతిబంధకం అని అనుకుంటున్నారా?? ఆయన సమస్య ఏమిటో నాకు స్పస్టం కాలేదు.
ఒకసారి రాజమండ్రిలో పద్యనాటకాల ప్రాభవం బాగా ఉండే రోజుల్లో సంగీతం ముఖ్యమా? సాహిత్యం ముఖ్యమా అని చర్చలు చేసుకునే రోజుల్లో భమిడిపాటి కామేశ్వరావు గారు స్టేజీ మీద ఏకబిగిన రాగాన్ని ఆలాపన చేసి ఊరుకున్నారట!! పద్యం పాడటం అయిపోయింది అని చెప్పేసేరట. అదేమిటీ పద్యం అంటే సాహిత్యం ఏదీ అది వినిపించకపోతే ఇంక అందులో సొగసేమిటి పద్యం చదవండి మొర్రో అని జనం మొత్తుకున్నారట!! అలా ఆయన సంగీతంలో రాగం చాలు సాహిత్యం అనవసరమ్ అని భావించేవారికి తనదైన తరహాలో జవాబు చెప్పి ఉన్నారు. ఇది ఏనాడో ముగిసిపోయిన చర్చ. అలాగే ఘంటసాల గారికి ప్రియ శిష్యుడైన సంగీతరావు గారు సాహిత్యం లో ఉండే ప్రాముఖ్యతకి సదా ముగ్ధులైన వ్యక్తి. పాట తాలుకు బలం అంతా ఆ పాటలోని సాహిత్యానిదే నని తాను స్వయంగా సంగీతకారుడై ఉండిన్నీ.. గాయకుడై ఉండిన్నీ బలంగా నమ్మిన వ్యక్తి. సాహిత్యం తాలుకు ప్రాభవం అంత సరిగ్గా తెలియని వారెవరో అక్షరాన్ని గురించి ఆలోచించలేకపోయి ఉంటారు. కానీ సంగీతంలో అక్షరమే ముందు నడిచేదనీనీ స్వరం ఎప్పుడైనా దాన్ని అనుసరించే సాగవలసినదనీనీ సాహిత్యం తెలిసిన వారెవరైనా భావిస్తారు. అందుకనే అన్నమయ్య సాహిత్యం అంత ప్రాచుర్యం పొందగలిగింది. ఆయన పదాన్ని ఎవరేయే రాగాలలో.. పాడుకుంటున్నా కూడా ఆయన పదాలలోని ఆ కవితామాధుర్యమే చెవికింపుగానూ మనసుకి సుఖంగానూ ఉంటుంది. అక్షరాన్ని మినహాయించే సంగీతం మనలేదు. అందువల్ల రోహిణీప్రసాదు గారు ఒక పక్షపాత ధోరణితో ఆ మాటలు అన్నారని భావించేలా ఉంది. ఆయనకి సాహిత్యం మీద మక్కువ లేనంత మాత్రాన తెలుగువారికందరికీ ఉండకూడదని ఏమీ లేదు.
యశస్వి.
గానభారతి గురించి yasasvi అభిప్రాయం:
08/11/2011 2:02 pm
లైలా గారూ !! మీరు రాసిన కొన్ని వాక్యాలకి నేను ఇంకా అలా నవ్వుతూనే ఉన్నాను.” కడుపొచ్చ్చినంత సులువుగా సంగీతం రాదు” 😉
మనుచరిత్ర ప్రభావం అన్నది ఒంటిగా ఉన్న అమ్మాయిని వెళ్ళి పలకరించి కుశల ప్రశ్నలు వేసి ఆ అమ్మాయి యోగక్షేమాలు కనుక్కునే నెపంతో సంభాషణ మొదలుపెట్టడం..ఇంకా గర్భిణీ స్త్రీ లక్షణాలు వర్నించడం ఇత్యాదుల్లో !! అంతదాకానే !!
ఇకపోతే పద్యరచనలో తిరుమల దేశికాచార్యులవారిది అందె వేసిన చెయ్యే !! అందులో ఇసుమంత కూడా సందేహం లేదు. అయితే, ప్రతీదీ పద్యంలోకి ఇరికిస్తే అది నప్పదు. అందుకు ఉదాహరణ గానే ఈ “గానభారతి”. లైలా అన్నట్టూ ఇది ఈ కాలం కధ అయితే ఈ కాలం ఆడపిల్ల వ్యవహారం ఇందులో ఏం లేదు. ఈ గానభారతి కవి గారి ఊహల్లో రూపొందిన అమ్మాయి. ఇవాళ్టి సమాజంలోని అమ్మాయే అయితే లైలా చెప్పినట్టూ ముందుగా గైనకాలజిస్టునే సంప్రదిస్తుంది మరి.
చాదస్తం భాష లో ఉన్నప్పుడు కవి సహజం గానే విషయాన్ని సైతం అంతే చాదస్తమ్ గా రాయక తప్పదు. dress code ని మార్చుకున్నారు గానీ భాష విషయలోనూ కధా కల్పనలోనూ మాత్రం ఈ చాలా మంది పద్య కవులు కాలాన్ని ఇంకా శతాబ్దాల పొలిమేరని దాటనివ్వడం లేందే?? పద్యం బాగుంటుంది కదా అని అన్నిటికీ పద్యాన్నే వాడితే అది ఇదిగో ఇలాగే ఉంటుంది. పైగా కాలం ఆధునికం అన్న సూచన స్వయంగా చేస్తూ కవి ఆ ఆధునిక కాలం లో స్త్రీని మాత్రం బేలగా కవి సలహా లేనిదే అడుగు ముందుకు వేయలేని దానిగా చిత్రించడం ఏమిటీ??
ముక్తకాలైన భావాలకి పద్యం నప్పుతుంది. ప్రకృతి వర్ణనలకి కూడా ఇప్పటికీ పద్యమ్ నప్పుతుంది. దేశికాచార్యులవారే జలప్రపాతాన్ని వర్ణించే పద్యాలు రాసేరు. కానీ ఆధునిక కధ అందునా సంక్లిష్టమైన ఇతివృత్తం తప్పని సరిగా ఆధునికమైన భాష లోనే ఉండటం సముచితంగా ఉంటుంది. లేనప్పుడది కృతకంగానే ఉంటుంది. మన బతుకులో చాలా ప్రాంతాల ప్రమేయం చాలా నాగరికతల ప్రమేయం ఉన్నప్పుడు “తెల్గిష్” నప్పినంతగా మణిప్రవాళమ్ నప్పదు. పైగా ఇదివరలో వేరే భాషలని తెలుగు గ్రహించనట్టూ ఇప్పటికిప్పుడే ఇటువంటి పరిస్థితి ఏదో తెలుగులో తలెత్తినట్టూ దేశికాచార్యుల వారు అనడం వింత . భాష జీవద్భాష అయితే అది అన్నిటినీ కలుపుకుని నడుస్తుంది. లేకపోతే చస్తుంది. అప్పారావు గారి కన్యాశుల్కం లోని వాక్యాలకి ఆ ప్రాచుర్యం వచ్చిందీ అంటే అందుకు కారణం ఆయన సుబ్బరంగా “తెల్గిష్” ని తన నాటకంలో వాడటమే కద!!
యశస్వి.
గానభారతి గురించి lyla yerneni అభిప్రాయం:
08/11/2011 12:51 pm
విశ్వనాథ సత్యనారాయణ వసుచరిత్రము (ఎమెస్కో ప్రచురణ) కు పీఠిక రాస్తూ, వసుచరిత్ర కావ్యము చదవటానికి ఇప్పటి పాఠకులు అధ్యైర్య పడనక్కరలేదనీ, – “మానవజాతిలో నది యొక అవివేకము. ప్రతివాడును తనకేమియు తెలియదనుకొనును. ఆ యనుకొనుట మానివేసినచో మన కావ్యములు కూడ చాలవరకు మనకు తెలియగలవు. నాల్గు మాటలు చదివిన తరువాత నైదవమాట కర్థము తెలియదు. నాకు తెలియుటే లేదని యా పుస్తకము నవతల పారవేయును. ఆ మాట యర్థము కానిచో తక్కిన మాటల కర్థమేమి? పద్యమంతయు చదివినచో నేదో కొంత తెలియదా? ఒక పద్యము తెలియలేదు. రెండవ పద్యము తెలియదా?” – అంటూ కావ్యాలు తప్పక చదవమని సలహా ఇస్తారు.
విశ్వనాథ సలహా నాకు నచ్చింది. ఆయన ఎంతమంది విద్యార్థులకో చదువు చెప్పిన పంతులయ్యె. నేను పద్యాలు అలాగే చదువుతున్నాను. చదివిన కొద్దీ అర్థమవుతున్నయి.
దేశికాచారి గారి పద్యాలు మధురంగా ఉంటాయి. నేను చదువుతున్నా. ఇందులో అన్ని పద్యాల్లో అన్ని మాటలూ అర్థం కాకపోయినా, కథ అర్థమయ్యింది. ఇది ఇప్పటి కాలపు కథ కాదంటానికి వీల్లేదు.
కొంచెం బాగోనట్టు ఎక్కడ అనిపించిందంటే; 🙂 కవితో కథానాయిక .. ఆమె… ఆమె…. – O! What the hell. I will say that horrible word in Telugu – ఆమె తన గర్భిణీ చిహ్నాలను వర్ణించి వర్ణించి చెప్పినప్పుడు. ఈ కాలపు స్త్రీ, ఆ సోదంతా అంత వివరంగా కవికి ఒక లతా నికుంజంలో ఎందుకు చెపుతుంది? అంతకు ముందెప్పుడో తన గైనకాలజిస్ట్ కి హాస్పిటల్లో చెప్పి ఉండొచ్చు.
అంతే. అందుకని. అంతకు మించి నచ్చనిది ఏం లేదు.
ఒంటరిగా, విచారంగా, ఉన్న ఒక స్త్రీని “ఏమిటమ్మా నీ కష్టం?” అని ఒక మగాడు కల్పించుకుని అడగటం ఈ రోజుల్లో జరగదా? అంటే జరుగుతుంది. సరే, కవి తర్వాత కుంచెం, వైద్యుడు, సలహాదారుగా ప్రవర్తించాడు అనుకోండి. అది ఈ రోజుల్లో ఆశ్చర్యం కలిగించే విషయమా అంటే అదీ కాదు. అలా రోజూ ఎడా పెడా లక్ష సలహాలు ఇస్తూనే ఉంటారు చాలామంది మనుషులు. కాని ఇక్కడ ఇచ్చిన సలహా అంత చచ్చుగానూ లేదు. నా కర్థమైనంత వరకూ ఆ కవి, ఆమె మనసు నొచ్చుకునే మాటలు అన్నట్టు లేదు. ఆమెను ఏ చెరువులోనూ దూకించలేదు. పైగా ఆమె కిష్టమయ్యి, ఆమె అదే పొదరింట్లో మరొకరితో సంభోగించితే , కవికి కష్టం కలిగేట్లూ లేదు.
అందువల్ల కవి సహృదయుడు అనిపిస్తున్నది.
అరే! ఒకటి రెండు కూజితాల్లోనే ఆమె కోయిల అని కవికి ఎలా తెలిసింది? అంటే – అదీ అంత నమ్మలేని విషయంలా అనిపించటం లేదు. 🙂 “తాళ్” సినిమాలో ‘మానవి’ /ఐష్వర్యారాయ్ సందేహిస్తూ “జీ. మై క్యా బోలూ” అనంగానే ఆ ధ్వనికి మురిసి ఆమె బాగా పాడుతుందని, స్టార్ క్వాలిటీ అని అనిల్ కపూర్కి తెలిసిపోయి, తన సంగీతం డాన్స్ కంపెనీతో కాంట్రాక్ట్ సైన్ చెయ్యమనలా:-)
ఐతే ఈ కథలో కవి, తన సలహానే ఆ స్త్రీ పాటించి, అందువల్లే ‘గానభారతి’ ఐపోయిందని, మనసులో అనుకున్నాడా? ఏమో మరి. తెలియదు. కానీ, సలహా ఇచ్చినప్పుడు సంగీతం ఆవిడకు మర్నాటికల్లా వస్తుందని అపోహ మాత్రం పడలేదు. కడుపొచ్చినంత సులువుగా సంగీతం రాదు. సంవత్సరాలు పడుతుందనే అనుకున్నాడు. “ఈ మాట” లో సంగీతం వ్యాసాలు రాసే రచయితలు మాత్రం, – వద్దులెండి, ఇక్కడ ఆ సంగతులు – వాళ్ళు రెండు దరువులు వేస్తే, నే బేరుమంటే, మళ్ళీ సుకవులు … 🙂 ఎందుకు గానీ ‘రోమంధము’, ‘ముకురాయితమైన’ అన్న మాటలకు అర్థాలు చెపితే, ప్రస్తుతానికి చాలు.
లైలా
గానభారతి గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
08/09/2011 7:37 pm