పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. వేటూరి పాట గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    08/18/2011 1:26 pm

    “ప్రమథ లోక హిమ దీపం” అంటే?
    ప్రమథ గణం = శివుని సేవించే సమూహం (a class of demons attending Siva)

    అన్వయం కుదరటం లేదేమో?

  2. రామతత్వం గురించి yaddanapudi kameswari అభిప్రాయం:

    08/17/2011 3:07 pm

    యెర్నేని లైలాగారి కథనంలో రాముడితో పోలిక ఎంతో బాగుంది. పోకిరి సినిమా అందరికి తెలిసిందే. నాకు లైలాగారిలాగే ఆ సినిమాలో రాముడితో, రామాయణంతో పోలికలు కనిపిస్తాయి. “ఒకసారి కమిటైతే నామాట నేనే వినను” అన్నహీరో డైలాగు నాకు శ్రీరాముని సత్యసంధతను గుర్తుకు తెస్తుంది. రాముడి అరణ్యవాసం, సీతను రావణుని బారినుండి కాపాడుకోవటం, దుష్టశిక్షణ, ప్రజలరక్షణ ఇవన్నీ నాకు ఆ కథానాయకునిలో, ఆకథతో రామాయణంతో కనిపించే పోలికలు. ఎన్నో సంవత్సరాల విదేశీ జీవనంలో కూడా తెలుగుసాహిత్యాన్ని మరువని లైలాగారికి అభినందనలు.

    డా.యద్దనపూడి కామేశ్వరి

  3. వేటూరి పాట గురించి Bhaskar Kompella అభిప్రాయం:

    08/17/2011 1:16 pm

    నాగ మురళి గారికి:
    పాట పాడినప్పుడు, ఎస్పీగారు “ప్రమథాలోక” అని సంగీతపరమైన కారణాలవల్ల పాడారు గాని, కవితాపరంగా
    “కైలాసాన కార్తీకాన శివరూపం
    ప్రమిదే లేని ప్రమథ లోక హిమదీపం”
    (కార్తీకం, చలికాలం, హిమాలయంలోని కైలాసం, మంచు – శివుడు తెల్లని వాడు, స్వయం జ్యోతిస్వరూపుడు – ఇంధనం అక్కర్లేని దీపం – ప్రమిదే లేని దీపం – ఆ దీపం చల్లనిది , వెచ్చనిదికాదు. )
    పదాల ఉచ్చారణ ఇలా మారడం, అర్ధాలు మరుగుపడడం ఇదివరలో కూడా జరిగింది.. (” లాహిరీ నడి సంద్రములోనా, లంగరుతో పని లేద” న్నప్పుడు కూడా)

    ఓ పాపా లాలి అన్న పాట.. సినిమాలో సందర్భంతో అర్ధం చూస్తే మంచి భావప్రదమైన పాట.

    నార్ల దగ్గర పాత్రికేయుడిగా పని చేసిన వేటూరి, అర్ధాన్ని విస్మరించారని అనుకోలేం. కవితావేశంలో అనర్ధాలు కవులకి మామూలే.

    “ప్రతి భారత సతి మానం
    చంద్రమతీ మాంగల్యం”
    లాంటి భావాల్ని వెదజల్లిన కవులెంతమంది మన తెలుగులో..

  4. ప్రేమ కవితలు గురించి ajaykumar అభిప్రాయం:

    08/16/2011 4:34 am

    మీ కవిత చాలా బాగున్నాయి.

    మీ కవితలు చదువుతుంటే నాకు కవితలు రాయాలని అనిపిస్తుంది. నిజంగా అంత బాగున్నాయి.

  5. వేటూరి పాట గురించి srinivas అభిప్రాయం:

    08/15/2011 9:33 am

    వేటూరి గారి గురించిన వ్యాసం చాల బాగుంది. ఒక ఇరవై ఏళ్ల తెలుగు పాటలన్నిటిని స్పృశించి వదలివేసారు. ఒకప్పుడు చక్రవర్తి సంగీతాన్ని వేటూరి పాటల్ని మేము చాల చిన్న చూపుతొ మాట్లాడుకొనె వాళ్లం. ఇపుడు వచ్చే పాటలతో పొలిస్తే అవే శ్రవణానందకరంగ వున్నై అనిపిస్తంది. ఏది ఏమైతేనేమి మళ్ళీ మా కాలంలొ విహరిస్తున్న భావన కలిగింది. వ్యాసకర్త కి ధన్య వాదములు.

  6. శ్రీ శ్రీ గురించి మూడు మాటలు… గురించి B.Mangeswara Sastry అభిప్రాయం:

    08/15/2011 6:54 am

    Had Sri Sri been born into any other language and produced the same output of literary excellence, he would have secured the Nobel and many more well known awards. It is a horrible trait of the Telugu people to run down their contemporaries regardless of their fields of excellence. I say this with some confidence because I had been a student of Mrs.A.V.N.College at Visakhapatnam between the years 1964 and 1968 (where incidentally, Sri Sri was also a student ) and was able to observe the cynical and irrelevant comments being made about the great poet, such as 1. he was a drunkard, 2. he wrote mainly for cinemas, 3. he was a communist etc. Irrespective of whether any of the accusations was correct or not, his poetic genius towered above everybody else which fact was lost sight of in that cacophony. No doubt, there were many people around him and among the public at large who readily acknowledged his greatness, but cheap and senseless comments hurt him to some extent.

  7. నీళ్ళు కాచే పనిపిల్ల గురించి sobhan అభిప్రాయం:

    08/14/2011 7:18 am

    పొగలూరే పొయ్యి కింద
    తాపీగా కాలుతాయి కట్టెలు

    -చాలా బాగుంది

  8. గానభారతి గురించి మోహన అభిప్రాయం:

    08/13/2011 3:09 pm

    కొందరికి సాంప్రదాయిక సాహిత్యములోని పద్యములయందు వాడెడి భాష సులభముగా అర్థము కాకపోవచ్చు. వాటిని అర్థము చేసికొనడానికే నిఘంటువులు, పదకోశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక సంగతిని గుర్తు ఉంచుకోవాలి. కొన్ని కథలలోని మాండలికాలు కూడా చదవడానికి, అర్థము చేసికొనడానికి కష్టముగా ఉంటుంది. అందుకని వాళ్లు వ్రాసిన మంచి కథలను చదవకుండా ఉండడము లేదు. కవిత్వ భాష కూడ ఒక మాండలికమే. ఈ మండలము కవుల మండలము. కథలలోని మాండలికాన్ని ఆదరించే వాళ్లు కవితామాండలికాన్ని ఆదరించడానికి ఎందుకు ఉత్సాహము చూపడము లేదో? శ్రీశ్రీలాటి కవుల భాష కూడ సులభమైనది కాదు. కవితలోని క్రియాస్వరూపాలు అర్థమైనా నామవాచకాలకు, విశేషణాలకు కొన్ని చోట్లలో నిఘంటువులను వెదకక తప్పదు. ఇక పోతే వృత్తాలను, జాత్యుపజాతులను కూడ వ్యావహారిక భాషలో వ్రాయవచ్చును. ఛందస్సు ఒక చట్రము మాత్రమే. అది ఒక సీసావంటిది. ఆ “సీసాల”లో ద్రాక్షారసాన్ని నింపవచ్చు, ఆముదాన్ని నింపవచ్చు. అది వైయక్తికము. విధేయుడు – మోహన

  9. వేటూరి పాట గురించి Akella Suryanarayana Murthy అభిప్రాయం:

    08/13/2011 7:59 am

    విశ్లేషణ బాగానే ఉందికానీ వారు ఉన్నప్పుడు వ్రాసి ఉంటే బాగుండేది. కొంత మెచ్చుకోలూ, కొంత అక్కసూ కనిపిస్తున్నాయి.

  10. స్మరణ: కథ నచ్చిన కారణం గురించి Dr.Sudhakar అభిప్రాయం:

    08/13/2011 7:15 am

    మా గొఖలే గారి ‘స్మరణ’ కధ క్లుప్తము గానూ గొప్ప గానూ వున్నది.
    It narrates how jealousy, greed and domination overtake human values.
    Gokhale was a great artist and story writer too.
    I am fortunate enough to see the print of one of M. Gokhale’s paintings titled ‘పెళ్ళి చూపులు’.
    I still remember that beautiful picture reflecting telugu culture vividly.
    I am not aware of any museum exibiting this great telugu artist’s works.
    Thanks for Veluri Venkateswara rao gaaru for introducing Maa Gokhale to telugu people via EEMAATA.

    Dr.Sudhakar
    UK.