పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. బిచ్చగత్తె శిశువు గురించి Uma Pochampalli అభిప్రాయం:

    03/26/2012 7:10 am

    అందాల అలరారు బంగారు బాలుని గని,
    అందించితివీవు అర్ద్రతతొ ఒక రూక
    వెలగట్టలేదులే వెలతి చెందకు మదిన,
    పాల్దాగు పసివాడి తల్లెట్ల తిరుపమయె
    తీర్పు చెప్పగ రావె ఆది భిక్షుక, పాహి!

  2. చేపలార్బరు దినాలు గురించి Uma Pochampalli అభిప్రాయం:

    03/26/2012 6:51 am

    Your poem is so melodious and in fact if we read the original, it surpasses the quality and content of it. తెలుగు లోని చక్కదనం తొంగిచూస్తుంది మీ అందమైన పదావళి చాలా బావుంది.

  3. స్నానాల గదిలో గురించి సురేష్ అభిప్రాయం:

    03/26/2012 6:43 am

    ఆడపిల్లా, అగ్గిపుల్లా, కుక్కపిల్లా, సబ్బుబిల్లా కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్లు, బావుంది
    మీ కవితా వస్తువూ, ప్రేంకుమార్ చమక్కు.

    సురేష్

  4. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి Rohiniprasad అభిప్రాయం:

    03/26/2012 6:37 am

    SBN garu,

    Emani was certainly one of the many Telugus that SS Vasan had managed to stifle. In spite of his efforts Emani’s name does not appear as MD for Avvayyar. As for your query, Paruchuri Sreenivas garu may be able to throw some light.

  5. మల్లెపూల మధూలిక గురించి సురేష్ అభిప్రాయం:

    03/26/2012 6:33 am

    మిమ్మల్ని కాని మీ కవితని కాని ఉద్దేశించి అనటంలేదు కానీ అంటూ ఒకసారి మీ కవితని చదివినవెంటనే అభిప్రాయాన్ని రాయటం మొదలుపెట్టాను. కానీ మరలా పైనుంచి కొసదాక చదివాను భావాన్ని ఎలా ప్రవహింపచేసారా అని. మీ విధానం, పదాలు, అల్లిక బాగుంది. చదువుతున్నపుడు ప్రతి పాఠకుడు తనకర్ధమైనంతవరకు వాక్యంలో రచయిత పొందుపరిచిన భావానికి లోనవుతాడు. ఒక వాక్యం నుండి మరో వాక్యానికి, ఒక పాదం నుండి మరో పాదానికి దాటుతున్న గ్రాహకుడికి, ఒక ప్రయాణకుడు మజిలీలు మజిలీలుగా పల్లకిలో పయణించి గమ్యాన్ని చేరుకున్న అనుభవం కలగాలి. ఒక్కోకవితలో నవరసాల్ని పండించవచ్చు ఐతే భాషతో పాటు భావాన్ని చక్కగా పరచగలిగితే. మన తెలుగు అందుకు ప్రసిద్ధం.

    ఓ పాఠకుడిగా నా అభిరుచిని వ్యక్తపరుస్తున్నానంతే. తప్పులుంటే క్షమించాలి.

    సురేష్

  6. చేపలార్బరు దినాలు గురించి సురేష్ అభిప్రాయం:

    03/26/2012 5:54 am

    ఒక భాష రచనని ఇంకో భాషలోకి ఇమడ్చడమంటే పరకాయ ప్రవేశంలా ఉండాలి. అనువాదం వేరు అన్వయం వేరు అనుకరణ వేరు.

    ఈనాడు ప్రకటనలను చూడండి, మనవాళ్లు మక్కీకి మక్కీ పదాలని ఒక భాషలోంచి ఇంకో భాషకి మార్చేస్తున్నరే తప్ప భాషా ధర్మాన్నీ, వ్యాకరణాన్నీ, వాక్యనిర్మాణక్రమాన్నీ, కనీసం కర్త, కర్మ, క్రియలు వచ్చే వరుసని కూడా చూడటం లేదు. కొన్నిరోజులకి తెలుగుని తెంగ్లీషుగు అనో తెహిందీలు అనో స్థిరపరిచేస్తారేమో.

  7. శివోహం! శివోహం! గురించి suresh అభిప్రాయం:

    03/26/2012 5:00 am

    పద్మశ్రీ గారూ, యుట్యూబ్ డౌన్లోడర్ ని వినియోగించి మీరు ఈ పాటని దించుకోవచ్చు.

    సురేష్

  8. కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి telidevara subbarao అభిప్రాయం:

    03/26/2012 4:43 am

    కథ చాలా చాలా బాగుంది. మా నాన్న గారు అంటుండేవారు కళాపూర్ణొదయము చదవరా అని. ఆయన ఎందుకనేవారొ యిప్పుడు తెలిసింది. మీకు నా కృతజ్ఞతలు.

    తెలిదేవర సుబ్బారావు
    బెంగళూరు

  9. మల్లెపూల మధూలిక గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    03/25/2012 7:39 pm

    వంశీగారూ! చాలా థాంక్సండీ, మీ స్పందన తెలియచేసినందుకు.
    శుభాకాంక్షలతో-
    ఆర్.దమయంతి.

  10. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి తః తః అభిప్రాయం:

    03/25/2012 5:42 pm

    శ్రీ సిద్దినేని అభిప్రాయం చూసింతర్వాత శ్రీ రోహిణీ ప్రసాద్ వ్యాసం చదివాను. శ్రీ ప్రసాద్ రాసిన వ్యాసాల్లో బాలమురళి గురించిన వ్యాసం మినహాయిస్తే ఈ యాసం నాకు చాలా నచ్చింది. 1970లలో నేను చాలా వీణ కచేరీలు విన్నాను. శ్రీ బాలచందర్, శ్రీ మొక్కపాటి, శ్రీ చిట్టి బాబు, శ్రీ దొరైస్వామి అయ్యంగార్, శ్రీ శ్యామ సుందర్ [ఆయన తమ్ముడు ఆంధ్రా యూనివెర్సిటీ అప్లయిడ్ ఫిజిక్స్ విద్యార్ధిగా ఓపెన్ ఎయిర్ థియేటర్ లో వీణ మీద సినిమా పాటలు వాయించారు], శ్రీ వాసా, మైసూరు నించి ఒక అందమైన యువకుడొకాయన , ముప్పయిల్లో ఉన్నారే మో అప్పుడు, [ఇప్పుడు రాజేష్ వైద్య లాగా] వారి పేరు జ్ఞాపకం లేదు ఇన్ని కచేరీలలో . శ్రీ ఈమని వీణ చాలా విలక్షణంగానూ గొప్పగానూ అనిపించేది . ఆల్ ఇండియా రేడియో నేషనల్ ప్రోగ్రాం లో ఒకసారి ఆయన ‘గాన మూర్తి’ విన్నాను, అది ఇప్పటి దాకా గుర్తుండి పోయింది. బాలచందర్ గారి గింజు/గుంజు కోడం విసుగు అనిపించేది. విశాఖపట్నంలో శ్రీ ఈమని సి డీ లు రెండే దొరికాయి. [‘నామకుసుమములతో’ ఉన్నదీ , ‘నాదలోలుడై’ ఉన్నదీ, వీటి గొప్పతనాన్ని గురించి నేనెక్కడ రాయగలను. కల్యాణ వసంతం విన్న వాళ్ళ వెంట వీణ తీగ పూల తీగై వస్తున్నట్టుగా వస్తుంది. ఇద్దరు ముగ్గురికి ఇది బహుమతిగా ఇచ్చాను].

    శ్రీ వాసా వీణ కచేరి గురించి ఒక సంఘటన: విశాఖ భారతి గాన సభ(?) వారు ఒక సారి వారి వార్షిక పరంపరలో పర్వీన్ సుల్తానా గారి కచేరీ ‘వివేకానంద హాల్’ లో ఏర్పాటు చేసారు. విశేషంగా హాలు నిండిపోయింది [కాల్ టెక్స్ లో పెద్దాయన శ్రీ చెడ్డాతో సహా] ఆమె ‘అనివార్య కారణాలవల్ల’ రాలేక పోయారు.ఆవిషయం కాలాతీతమైపోయిన్తర్వాత తెలిసినట్టుంది. నిర్వాహకులు శ్రీ వాసాను అభ్యర్దించారు. మూడు గంటల పాటు శ్రీ వాసా చాలా గొప్పగా ఉత్తరదేశ సంగీత బాణీలో కచేరీ చేశారు. ఆద్యంతం శ్రీ ముసునూరి తన్మయులై విన్నారు. [ఆరోజుల్లో ఆయన విజయనగరం సంగీత కళాశాల ప్రాంశుపాలురుగా ఉన్నట్టు గుర్తు. నాపక్కన ఆ సాయంత్రం ఆయన కూర్చున్నారు]. దాదాపు గంటన్నరా రెండు గంటల తరవాత శ్రీ చెడ్డా కోరిక మేరకు ‘దేశ్’ వాయించి , “ఫర్మాయి ఏ” అని కూడా అన్నారు.

    కచేరి అయిపోయిన తర్వాత నేను ముసునూరి వారిని “కచేరీ ఎలావుంది?” అని అడిగాను . ఇప్పటి భాషలో ఎమేజింగ్ అన్నట్టుగా చెప్పారు . నేను వారికి శ్రీ మంచాల గూడా ఉత్తరదేశ బాణీ లో వీణ వాయిస్తారు గదా అని గుర్తుచేశాను . ‘అది ఏ కొద్ది సేపో’ అని ‘ఇదొక అద్భుతం’ అని అనిపించే మాటలన్నారు .

    [ఆ కచేరీ తర్వాత కొద్దీ కాలానికే ఆయన కన్ను మూసినట్టు ఒక లీలా మాత్రమైన గుర్తు.]