ఇప్పుడే మీ ఈ మాట చూసాను. చాలా సంతోషముగా ఉంది. తెలుగు సాహిత్యాభిమానులకు ఒక చక్కని వేదిక లభించింది. నేను సంస్కృత ఉపయాసకుడిని. ప్రతిజ్నా యౌగంధరాయణం పిల్లలకు చెప్పుతుంటాను. ఆ అంకకథలను, పుస్తక సమీక్షను మీకు పంపవలెననుకుంటున్నా. ప్రచురిస్తారా? బరహ. 8 లొ పంపవచ్చా? తెలియజేయండి.
మీ కొరిడే విశ్వనాథ శర్మ
[ప్రచురణార్హత నియమాలకు రచయితలకు సూచనలను చదవండి. యూనికోడ్‌లోకి మార్చగలిగిన ఏ ఫాంట్ అయినా వాడవచ్చును. – సం.]
మీ పత్రిక చూసి చాలా సంతోషమయింది. కాని, నాకు సులభంగా దొరుకుందనుకున్న భక్త రామదాసు కీర్తన కనిపించక నిరుత్సాహ పడ్డాను. నా వెతకటంలో లోపమేమో అనుకుంటాను. నాకు కావల్సింది “అయ్యయ్యో రఘు రామయ్యా” అనే కీర్తన రచన,తెలుగులో. అన్నిటి కన్నా ముందు “రామదాసు” అని శోధిస్తే ఏమి దొరక్క చాలా బాధేసింది.
శోధన లో మార్పు కావాలనుకుంటాను.
నేను ఏ రకంగా నయినా సహాయపడ గలిగితే సంతోషం.
రమేశ్ హరి గూడూరు
మెల్బోర్న్,ఆస్ట్రేలియా
[మీ శోధనలో లోపమేమీ లేదు. ఈమాటలో కీర్తనల పూర్తి పాఠాలు సామాన్యంగా ఉండవు. మీకు కావలిసిన కీర్తన ఇక్కడ దొరుకుతుంది, lyric and audio కూడా. ..సం]
మల్లికార్జునశర్మగారూ,
మీరడిగిన ప్రశ్న సబబైనదే. అనువాదాలను నేనే ప్రచురించవచ్చుగాని copy right & distribution సమస్యలు ఉంటూనే ఉంటాయి. అమ్ముడుపోతాయనే నమ్మకం ఉంటే పబ్లిషర్లు ఎలాగూ ముందుకువస్తారు కదా!
చందమామలో తాను రాసిన కథలకి తన పేరు పెట్టకుండా ఉండని చక్రపాణిగారి పద్ధతికి మా నాన్న అభ్యంతరం చెప్పలేదుగాని తన స్వంతకథలను అందులో ఎక్కడా రాయలేదు. (అంతకుముందు అందరిలా చెయ్యలేదు. ఇదంతా capitalist exploitation అని ఆయనకు తెలుసు.
కథాసరిత్సాగరం, జాతకకథలూ, భువనసుందరి (Iliad), రూపధరుడి యాత్రలు (Odyssey), సింద్‌బాద్ వగైరా అరేబియన్ నైట్స్ కథలు, పంచతంత్రం, వ్యాసభారతం, వాల్మీకి రామాయణం వగైరాలన్నీ ఆయన చేసిన సరళానువాదాలే. అదంతా జర్నలిజమేనని ఆయన భావించి ఉండవచ్చు. తన సాహిత్యంగా మటుకు అనుకోలేదని నాకు తెలుసు.
ప్రస్తుతం 60 ఏళ్ళు గడిచిన పత్రికలకు copy right వర్తించదు కనక కినిమా వంటివి re-post చెయ్యవచ్చు. చందమామ హక్కులను కొత్త management కొనుక్కుని అప్పుడప్పుడూ పాత కథలనూ, చిత్రా బొమ్మలనూ సైతం recycle/ copy paste పద్ధతుల్లో వాడుకుంటోంది.
ఏది ఏమైనా వీటన్నిటినీ పునర్ముద్రించటానికి విరసంవారికి ఆసక్తి ఉంటుందా అనేది అనుమానాస్పదమే. మరెవరైనా ముందుకు వస్తారేమో తెలియదు.
సిరుల సంక్రాంతి నచ్చినందని మీ స్పందనని తెలియ చేసినందుకు కృతజ్ఞతలు ఋషి! తనకి సంక్రాంతి అంటే చాలా ఇష్టం. బొమ్మల కొలువులో – పార్కులు, మంచు కొండల అమరికలు తన ప్రత్యేకతలు. లావణ్యా! ఋషికి ఈమాట ని పరిచయం చేసినందుకు థాంక్స్ రా!
రచయితలకు సూచనలు గురించి koride vishwanatha sharma అభిప్రాయం:
03/21/2012 3:19 am
సంపాదకులకు, నమస్కారములు .
ఇప్పుడే మీ ఈ మాట చూసాను. చాలా సంతోషముగా ఉంది. తెలుగు సాహిత్యాభిమానులకు ఒక చక్కని వేదిక లభించింది. నేను సంస్కృత ఉపయాసకుడిని. ప్రతిజ్నా యౌగంధరాయణం పిల్లలకు చెప్పుతుంటాను. ఆ అంకకథలను, పుస్తక సమీక్షను మీకు పంపవలెననుకుంటున్నా. ప్రచురిస్తారా? బరహ. 8 లొ పంపవచ్చా? తెలియజేయండి.
మీ కొరిడే విశ్వనాథ శర్మ
[ప్రచురణార్హత నియమాలకు రచయితలకు సూచనలను చదవండి. యూనికోడ్‌లోకి మార్చగలిగిన ఏ ఫాంట్ అయినా వాడవచ్చును. – సం.]
మల్లెపూల మధూలిక గురించి Vamsi అభిప్రాయం:
03/20/2012 11:13 pm
చాలా బావుందండీ
About eemaata గురించి hari goodooru అభిప్రాయం:
03/19/2012 6:04 pm
మీ పత్రిక చూసి చాలా సంతోషమయింది. కాని, నాకు సులభంగా దొరుకుందనుకున్న భక్త రామదాసు కీర్తన కనిపించక నిరుత్సాహ పడ్డాను. నా వెతకటంలో లోపమేమో అనుకుంటాను. నాకు కావల్సింది “అయ్యయ్యో రఘు రామయ్యా” అనే కీర్తన రచన,తెలుగులో. అన్నిటి కన్నా ముందు “రామదాసు” అని శోధిస్తే ఏమి దొరక్క చాలా బాధేసింది.
శోధన లో మార్పు కావాలనుకుంటాను.
నేను ఏ రకంగా నయినా సహాయపడ గలిగితే సంతోషం.
రమేశ్ హరి గూడూరు
మెల్బోర్న్,ఆస్ట్రేలియా
[మీ శోధనలో లోపమేమీ లేదు. ఈమాటలో కీర్తనల పూర్తి పాఠాలు సామాన్యంగా ఉండవు. మీకు కావలిసిన కీర్తన ఇక్కడ దొరుకుతుంది, lyric and audio కూడా. ..సం]
మల్లెపూల మధూలిక గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
03/19/2012 1:54 pm
ఓ! ఎంత ఆనందంగా వుందో! థాంక్యూ.. థాంక్యూ!
మీకూ నా హృదయపూర్వక నూతన సంవత్సర పండగ శుభాకాంక్షలు తెలియ చేసుకుంటూ..
– ఆర్.దమయంతి.
కినిమా పత్రిక నుంచి – 2 గురించి Rohiniprasad అభిప్రాయం:
03/19/2012 10:26 am
మల్లికార్జునశర్మగారూ,
మీరడిగిన ప్రశ్న సబబైనదే. అనువాదాలను నేనే ప్రచురించవచ్చుగాని copy right & distribution సమస్యలు ఉంటూనే ఉంటాయి. అమ్ముడుపోతాయనే నమ్మకం ఉంటే పబ్లిషర్లు ఎలాగూ ముందుకువస్తారు కదా!
మల్లెపూల మధూలిక గురించి సోమార్క అభిప్రాయం:
03/19/2012 7:03 am
దమయంతి గారూ!అత్యద్భుతం మీ ఉగాది కవిత.నిజంగా మధు మాసం రాకుండానే మల్లె పూల సౌరభాన్ని గుబాళించింది మీ “మల్లెపూల మధూలిక.”నా హృదయ పూర్వక ప్రశంసలు.
కినిమా పత్రిక నుంచి – 2 గురించి mallikarjuna sarma అభిప్రాయం:
03/19/2012 6:52 am
రోహిణీప్రసాద్ గార్కి,
నమస్తే. ఇంత వివరణ ఇచ్చేట్టు చేసినందుకు క్షంతవ్యుడిని.
కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి హరి చరణ ప్రసాదు అభిప్రాయం:
03/18/2012 3:41 pm
చక్కని చిన్న నిడివి సినిమా తీయడానికి పనికి వచ్చే మంచి కథ.
కినిమా పత్రిక నుంచి – 2 గురించి Rohiniprasad అభిప్రాయం:
03/18/2012 10:49 am
చందమామలో తాను రాసిన కథలకి తన పేరు పెట్టకుండా ఉండని చక్రపాణిగారి పద్ధతికి మా నాన్న అభ్యంతరం చెప్పలేదుగాని తన స్వంతకథలను అందులో ఎక్కడా రాయలేదు. (అంతకుముందు అందరిలా చెయ్యలేదు. ఇదంతా capitalist exploitation అని ఆయనకు తెలుసు.
కథాసరిత్సాగరం, జాతకకథలూ, భువనసుందరి (Iliad), రూపధరుడి యాత్రలు (Odyssey), సింద్‌బాద్ వగైరా అరేబియన్ నైట్స్ కథలు, పంచతంత్రం, వ్యాసభారతం, వాల్మీకి రామాయణం వగైరాలన్నీ ఆయన చేసిన సరళానువాదాలే. అదంతా జర్నలిజమేనని ఆయన భావించి ఉండవచ్చు. తన సాహిత్యంగా మటుకు అనుకోలేదని నాకు తెలుసు.
ప్రస్తుతం 60 ఏళ్ళు గడిచిన పత్రికలకు copy right వర్తించదు కనక కినిమా వంటివి re-post చెయ్యవచ్చు. చందమామ హక్కులను కొత్త management కొనుక్కుని అప్పుడప్పుడూ పాత కథలనూ, చిత్రా బొమ్మలనూ సైతం recycle/ copy paste పద్ధతుల్లో వాడుకుంటోంది.
ఏది ఏమైనా వీటన్నిటినీ పునర్ముద్రించటానికి విరసంవారికి ఆసక్తి ఉంటుందా అనేది అనుమానాస్పదమే. మరెవరైనా ముందుకు వస్తారేమో తెలియదు.
సిరుల సంక్రాంతి గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
03/18/2012 10:22 am