పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. పహాడీ రాగం అందాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    03/27/2012 10:34 pm

    కొండగాలి పాట మలయమారుతం రాగంలో చేసినది. మాటకు సరిపోయే రాగం వాడడం పెండ్యాల గొప్పదనం.

  2. మల్లెపూల మధూలిక గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    03/27/2012 11:55 am

    సురేష్ గారూ! మీ స్పందన మొత్తం చదివాను. చాలా బాగా రాసారు. అందుకు ముందుగా నా ధన్యవాదాలు తెలుపనీయండి. మీరు విమర్శించినందుకో, ప్రశంసించినందుకో కాదు, కానీ, ఒక పాఠకుడిగా మీ అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తపరిచినందుకు సాటి తెలుగు వారిగా మిమ్మల్నిఆనందంగా – అభినందిస్తున్నా..(ఎందుకంటే చాలా మంది చదువుతారు..కాని చెప్పరు..హార్లిక్స్ ప్రకటనలో లా….) అందుకే మీ ఒకో సందేహానికి ఒక్కో సమాధానాన్నిక్కడ పొందుపరుస్తున్నాను.
    @ ” మిమ్మల్ని కాని మీ కవితని కాని ఉద్దేశించి అనటంలేదు కానీ” …
    *.. అంటూ ఆగారే! ఇందులో వెనకాడేందుకేముందీ?.. మీరు నా కవిత నుద్దేశించే ఇదంతా రాశారు. (లేకపోతే నేనింత గా ప్రతిస్పందించే అవకాశం నాకెక్కడిదనీ !?)
    @ ‘ ఒకసారి మీ కవితని ‘చదివినవెంటనే ‘ అభిప్రాయాన్ని రాయటం మొదలుపెట్టాను. కానీ ‘ మరలా పైనుంచి కొసదాక చదివాను’ భావాన్ని ఎలా ప్రవహింపచేసారా అని.,,’
    * చాలా తక్కువమందికి మాత్రమే అలవడే ఒక మంచి అలవాటు ఇది. (నాకు లేని మంచి లక్షణాలు ఎవరిలో వున్నా మెచ్చుకోకుండా వుండలేను మరి! .)
    ముందొచ్చే ఆలోచన్లన్నీ – సముద్రపు తుఫాన్లు. ఆ వెనకొచ్చేవే అసలైన తేట తనపు ప్రవాహాలు. – ఇలా రెండో ఆలోచన దగ్గర ఆగి, ఆలోచించి రాసే వారి మాటలే నిజానికి – అందర్నీ ఆలోచింపచేస్తాయి. అందుకే మాట్లాడేటప్పుడు…తెలివైన వారు మాత్రమే – కాసేపాగి, నిదానించి సమాధానమిస్తారు.

    @ ” మీ విధానం, పదాలు, అల్లిక బాగుంది.’
    * నిజమే. కవిత్వం అంటే – మంచుదారాల పోగులు, మలయ పవనాల పరిమళాలు – కలిపి నేసిన విరిమబ్బుల కోక వంటిది. థాంక్యూ!

    @ ‘చదువుతున్నపుడు ప్రతి పాఠకుడు తనకర్ధమైనంతవరకు వాక్యంలో రచయిత పొందుపరిచిన భావానికి లోనవుతాడు..’
    * అప్పుడే రచయిత గుర్తుండిపోతాడు. మన తెలుగు లో అలాంటి వారిని వేళ్ళమీద లెక్కించొచ్చు.. (ఆ వరసలో చేరాలనుకోవడం – నా వరకు నాకు ఖచ్చితంగా అత్యాశే అవుతుంది. కాదనను. కాని, ప్రయత్నించడంలో తప్పు లేదు కదా అని..)

    @ “ఒక వాక్యం నుండి మరో వాక్యానికి, ఒక పాదం నుండి మరో పాదానికి దాటుతున్న గ్రాహకుడికి, ఒక ప్రయాణీకుడు మజిలీలు మజిలీలుగా పల్లకిలో పయ నించి గమ్యాన్ని చేరుకున్న అనుభవం కలగాలి.”
    * అంటే మీ వుద్దేశం లో – అక్షరాలు పల్లకీలు, భావాలు మనసుని మోసే బోయీలూ కా వా లంటారు.. అవునా!?
    @ “ఒక్కోకవితలో నవరసాల్ని పండించవచ్చు ఐతే భాషతో పాటు భావాన్ని చక్కగా పరచగలిగితే. మన తెలుగు అందుకు ప్రసిద్ధం.”
    * మీరంటోంది నిజమే! నేనూ ఒప్పుకుంటాను. మన తెలుగు భాషకున్న విశిష్టత ఏమిటంటే – రచనల్లో నవరత్నాల్ని గుమ్మరించ వచ్చు.. పున్నమి గుత్తులనూ పూయించనూవచ్చు..

    @ ‘ఓ పాఠకుడిగా నా అభిరుచిని వ్యక్తపరుస్తున్నానంతే.’
    * అంతే అనకండి. ఇంత అద్భుతంగా..అందరూ వ్యక్త పరచలేరు! మంచో, చెడో..తప్పో..ఒప్పో..నిష్టూరమో..నిగ్గదీయడమో..ఏదో ఒక దాని గురించి మన తెలుగు వాళ్ళం స్వేచ్చగా మాట్లాడుకోవాలి. సాహిత్యపరమైన విషయాలు చరిచించుకోవాలి. అభిప్రాయాలు, వ్యక్తపరచుకోవాలి. విస్తృత పరిధిలో వెల్లడించుకోవాలి. అసలిందుకే గా – ఈమాట నిర్వాహకులు మనకిక్కడ ఈ స్పేస్ ఇచ్చింది? మీకు దొరికిన అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. అభినందనలు.
    @ “తప్పులుంటే క్షమించాలి.’
    * ఎందుకండీ..అంత పెద్ద మాట!..సాహితీ ప్రియుల అంచనా మేరకు రాయలేకపోతున్నందుకు.. ఇలా – నేనే అడగాలేమో! .( రాయకుండా నన్ను నేను బాధపెట్టుకుంటే సరిపోయేదానికి..రాసి అందర్నీ బాధిస్తు న్నానేమో ననే శంక కలుగుతూ వుంటుంది అప్పుడప్పుడు!
    మూల్గుతున్న నక్క మీద తాటి పండు .. అన్న సామెత చందంలా..- ఈసారి సంపాదకుల వ్యాసం ‘ ఎమితిని సెపితివె.’. చదివాక నా భయం మరింత హెచ్చిందంటే నమ్మండి!)
    సురేష్ గారూ! అందరి రచన్ల మీదా.. మీ అభిప్రాయాల్ని – నిర్భయంగా, నిర్మొహమాటంగా మీరిలాగే అభివ్యక్తీకరించాలని అభిలషిస్తూ…
    ముందు కాలంలో కూడా మీ విలువైన అభిప్రాయాలను ఈ రీతిలోనే మాకందచేస్తారని ఆకాంక్షిస్తూ..
    మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేసుకుంటూ..మరి వుంటాను.
    నమస్సులతో –
    – ఆర్.దమయంతి.

  3. త్రిపురాంతకేశ్వరా! గురించి vadluri murthyraju అభిప్రాయం:

    03/27/2012 9:47 am

    “విషయా విషాదన నిచయా” వాక్యం చాల నచ్చింది మరియు పల్లవి హృద్యంగా వుంది.

  4. పిలూ రాగం గురించి Snkr అభిప్రాయం:

    03/26/2012 10:54 pm

    1. ఓఓ వాలు కన్నుల దానా
    .. మురిపించే అందాలే అవినన్నే చెందాలే
    2. నినుచేర మనసాయెరా నా స్వామీ
    అనే బొబ్బిలియుద్ధం లోని పాటలు కాపి/పిలు లా వుంటాయండి.

  5. పహాడీ రాగం అందాలు గురించి Snkr అభిప్రాయం:

    03/26/2012 10:35 pm

    ప్రసాద్ గారు,
    కొండగాలి తిరిగింది,
    గుండెవూసులాడింది
    గోదావరి వరదలా కోరిక చెల రేగింది ఆ..ఆ..
    ఇది ఖచ్చితంగా పహాడీ అయివుంటుందనిపిస్తోందండి. ఎంత హాయిగా వుంటుందో.

  6. 88 ఏళ్ళ యువకులు గురించి Rohiniprasad అభిప్రాయం:

    03/26/2012 7:49 pm

    భావనారాయణగారూ,
    మా అమ్మ చిన్నప్పుడు పాడేది. సంగీతమేమీ నేర్చుకోలేదు.

  7. నాకు నచ్చిన పద్యం: శృంగార నైషధంలో హంస వేడుకోలు గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    03/26/2012 2:06 pm

    బృందావనరావు గారూ,
    శ్రీనాథుడి సీసం, తిక్కన కందం, Wordsworth Daffodils, హైస్కూలు రోజూలూ…. You steered the sketch in such way that the evocative pull has rendered us to turn again to Haravilasam and to Naishadham. You have driven me to feel nostalgic and in my case, the preference for the single most memorable high school piece from the same poet is another seesam.
    ” రాయంచ యంచు చీరకు జొక యగు గాక పచ్చి ఏనిక తోలు పచ్చడంబు ”
    Thank you for retrieving the volition for Sreenatha. by your deft handling of undercurrent in the selection of the poet from the indigenous lexicon and the native prosody.

    ..Yours
    Siddineni Bhava Narayana

  8. పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం గురించి తః తః అభిప్రాయం:

    03/26/2012 2:03 pm

    శ్రీ రోహీణీప్రసాద్ ఘంటసాల పాడినట్లుగా రాసేసినట్లున్నారు.
    “అకటా దయలేనివారు మీ యాడవారు”లో ‘అకట’ అని ఉండాలి. దయ చేసి దీన్ని కూడా సవరించండి. పద్యాలని పాడేవాళ్ళు ఇవి గమనించరనిపిస్తుంది. నిజానికి పద్యాలను పాడకూడదు. ‘అకట’ అని ఉన్న దాన్ని అలాగే ఉంచి పాడ(లే)క పోవటం తప్పే.

  9. పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం గురించి తః తః అభిప్రాయం:

    03/26/2012 10:12 am

    యౌవనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి మ

    అన్న పాదం లొ ‘ఆ పయి’ అని ఉండాలి , ‘ఆపై’ అని కాదు. రొహిణీ ప్రసాద్ గారికి అక్షరాలు చూసే వాళ్ళంటే చిరాకయినా అలా రాయకపోతే కవికి చందస్సు తెలీదనిపించే ప్రమాదముంది.

    [సవరించాము. కృతజ్ఞతలు – సం.]

  10. రచయితలకు సూచనలు గురించి dasthagiri అభిప్రాయం:

    03/26/2012 8:13 am

    నమస్తే, రచనలు పంపడానికి మీరు ఇచ్చిన ఈ మైల్ submissionsATeemaata.com not recognized అని వస్తున్నది. తగు సలహా ఇవ్వగలరు.

    -దస్తగిరి

    [AT కి బదులుగా @ అని ఉంచి మెయిల్ పంపండి. – సం.]