పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి Subrahmanya Sarma అభిప్రాయం:

    04/05/2012 6:11 am

    మీరు చెప్పిన కధ చాల బాగుంది. మాది కూడా అమలాపురం స్వస్థలం. మంచి కాఫీ తాగిన అనుభుతి కలిగింది మీ కధ చదివిన తరువాత.

  2. శివోహం! శివోహం! గురించి Balakrishna Pillalamarri అభిప్రాయం:

    04/05/2012 12:23 am

    ధన్యవాదాలు. ఉదయం భక్తిరంజని లొ వచ్చే “శివోహం శివోహం” Internet లో చాల వెదికాను. ఆ recording దొరకలేదు, మళ్ళి ఇప్పుడే వినటం.
    వేరె వాళ్ళు ముఖ్యంగా హిందుస్తాని సాంప్రదాయం వాళ్ళు పాడినవి Internet లొ చాల ఉన్నాయి. మచ్చుకి ఇవి చూడండి.
    పండిట్ జస్ రాజ్ గారి అద్భుతమైన Rendition. ఎవరు పాడారో తెలియదు కాని చాల మంచి rendition. Visuals are very good and add value to the song.

    I think the opinion expressed by Srinivas Nagulapalli is that what I feel after listening to the older version of T Sooryakumaari. I feel a strong sorrow feeling when I here this song. All said and I would like to thank you very much for uploading this rare recording.

    Balakrishna

  3. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    04/04/2012 6:06 pm

    భావనారాయణగారు: ఈరోజు “బహుత్ దిన్ హుయె”లో పాటలన్నీ (త్వరత్వరగా – fast forward చేసుకుంటూ) విన్నాను. “చందా చమ్‌ కే నీల్ గగన్ మె” అన్న పాట నిస్సందేహంగా శంకరశాస్త్రిగారి బాణీనే. ఆపాటలో ఆయన వీణ వాయించడం కూడా వినవచ్చు. లత చాలా గొప్పగా పాడిన పాట!

    రాజా నాకు తెలిసి ఈ సినిమాలో ఒక్క పాటే పాడాడు. చాలా చిన్న బిట్: “ఓ చలా అకేలా నిర్జన్ వన్ మె” అన్నది. తెలుగు “బాలనాగమ్మ” ఆధారంగా తీయబడ్డ ఈ సినిమాలో యుగళ గీతాలు లేవు.
    ఇంక మీరడిగిన ప్రశ్నకి జవాబు, క్లుప్తంగా, రాజాకి, జెమినీ సంస్థకి మొదటి నుంచి వున్న మంచి సంబంధమే. ఆయనకు సినిమాల్లో మొదటి అవకాశమిచ్చింది జెమినీ వాసన్. (సంసారం – 1950, తమిళంలో; చూ: రాజాపైన ఇదే పత్రికలో వచ్చిన వ్యాసం. తరువాత కొద్ది కాలానికే “సంసారం” హిందీలో (1951) తీయదలచినప్పుడు రాజా గొంతు ఆడిషన్ చేయడం జరిగింది. అప్పట్లో జెమినీలో హిందీ విభాగానికి incharge గా ఉన్న ప్రముఖ గాయని: వక్కలంక సరళగారు రాజా గాత్రం హిందీలో ఒప్పటంలేదని అనడంతో అవకాశం దొరకలేదు. ఆ తరువాతి సంవత్సరం తీసిన “మిస్టర్ సంపత్”లో మరొక కొత్త గాయకుడికి (పి.బి.శ్రీనివాస్) హిందీలో పాడే అవకాశం దొరికింది. 1953లో, హిందీలో పాడకపోయినా, రాజ్ కపూర్ ఏక కాలంలో 3 భాషల్లో నిర్మించదలచిన “ఆహ్/ప్రేమలేఖలు” తెలుగు తమిళ వెర్షన్లకు పాడటంకోసం జిక్కి, రాజాలు బొంబాయిలో ఉన్నారు. (Check Arudra’s essay on this film production in his “సినీమినీ కబుర్లు” for fascinating anecdotal information.) చివరిగా 1954లో జెమినీ ద్వారానే హిందీలో పాడే అవకాశం దొరికింది. I don’t think that any north Indian producer”d have taken him :).

    As to the “equation between Saluri and Eemani” I can’t say much. Nor do I think that there is much to say. Saluri was certainly *the* lead composer for Gemini between 1942 and 1948/49 (he did one more film: మంగళ-1951). The other two in the music department; viz. M.D. Parthasaradhi and Eemani took care of orchestration and at times background music. SS Vasan, the totalitarian, didnot duely credit the talent (not only i.r.t music but in other departments too!). During his 7 year stay at Gemini Saluri did just 4 films, for he couldnot work for any other companies.

    Regards, — Sreenivas

  4. కొవ్వుపుంజి గురించి Narayanaswamy అభిప్రాయం:

    04/04/2012 5:37 pm

    చలం కథ ఒకటి లేదూ ఇదే సంఘటనని తెలుగునాటికి దిగుమతి చేస్తూ? మీ అనువాదం బావుంది. అక్కడక్కడా తెలుగుజాతీయాలు చక్కగా వాడారు. కోడి అంటే మోటుగా ఉంటుందనా, చికెన్ అని రాశారు?

  5. నన్ను ఎవరో చదివారు గురించి Radha Krishna Bojja అభిప్రాయం:

    04/04/2012 5:28 am

    కొత్తదనానికి మచ్చుతునకలా వుంది
    ఆంగ్ల వాడుక “Think out of the box” అంటే ఏమిటో చూపించారు

  6. రచయితలకు సూచనలు గురించి Radha Krishna Bojja అభిప్రాయం:

    04/04/2012 5:02 am

    ” ఇంత తెలుగు ఇంకా బ్రతికి వుందా
    అందులోను ఈ అంతర్జాల లోకంలో !!! ”
    ఇవీ నాకు మీ “ఈమాట” చూసిన వెంటనే కలిగిన ఆలోచన.
    నిజంగా ఇక్కడ రచయితల తెలుగు చూసాకా ప్రాణం లేచి వచ్చినట్లైంది
    మహదానందంగా ఉన్నది
    నాకు ఈమాట ను సిఫార్సు చేసిన సోదరుడు ఫణి గారికి ధన్యవాదాలు

  7. స్నానాల గదిలో గురించి Radha Krishna Bojja అభిప్రాయం:

    04/04/2012 4:41 am

    నాకు ఇలాంటి సరదా కవితలంటే చాలా ఇష్టం …
    పైగా మీ కవిత చాలా సరళంగా అందరికీ (ముఖ్యంగా నాకు) అర్థమయ్యే విధంగా ఉండడంతో నా వోటు మీకే !!!

  8. శివోహం! శివోహం! గురించి sreedhar parigi అభిప్రాయం:

    04/03/2012 1:20 pm

    శ్రీనివాస్ గారు, ఈ పాట నేను ఎన్ని సార్లో పాడుకుంటూంటాను. చిన్నప్పుడు రేడియోలో భక్తి రంజనిలో విన్న గుర్తు ఉంది. చాలా సంతోషంగా అనిపించింది ఈ రోజు విని. మీకు నా హృదయపూర్వక అభినందనలు.
    అలాగే “శివాయ చంద్రశేఖరాయ నమ ఓం ” అనే పాట కూడ భక్తి రంజని లో వచ్చేది. దొరికితే నాకు లింకు పంపండి.

    శ్రీధర్ పరిగి

  9. ఈమాట గురించి గురించి Krishna Moorthy Veloori అభిప్రాయం:

    04/03/2012 11:47 am

    Dear Sri Venkateswara Rao Garu,
    I was delighted to read the EEMAATA web magazine first when I was in Sydney on a holiday during last October. I very much appreciate the efforts being taken by yourself and the editorial team in bringing out such a classy magazine for those telugu readers the world over interested in telugu literature. You are doing great service to the cause of Telugu literature. Today I happen to read an article from earlier issues (2000) on Translation by Vallampati Venkatasusbbiah (Anuvaadakudika Naa Anubhavaalu) and was extremely happy to understand the intricacies of translation, since I am translating some Kannada novels into Telugu, my mother tongue.

    V. Krishna Moorthy
    Mysore

  10. సంగీతరస పానశాల ఘంటసాల గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    04/03/2012 5:16 am

    రావులపర్తి భద్రిరాజు:
    http://www.ghantasala.info/lyrics/lyric00027.txt
    http://www.ghantasala.info/lyrics/lyric00028.txt

    A.Vengugopal:
    శ్రీ వినాయక చతుర్థి కథ, శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రభాత ప్రార్థన, శ్రీరామ రామేతి
    శ్రీరామ దండకం, జయ జయ జయ శ్రీ వేంకటేశా, శ్రీ వేంకటేశ్వర ప్రభాత ప్రార్థన
    వినాయక చతుర్థి కథా విధానము
    For the lyrics, check the above website. For Ghantasala’s lyrics check V.A.K.Rangarao’s (Ed) భువనవిజయం (1971).

    Regards,
    Sreenivas