భాషా భేషజానికి పెద్ద ఉదాహరణ ఈ రచన. ఆడంబరం తప్ప ఇందులో ఇంకేమీ ధ్వనించడం లేదు. పైగా శ్రీనాధుని శీర్షిక లో అరువు తెచ్చుకున్న లౌల్యమొకటి. తిలక్ ని అనుకరించి నడవగలనన్న ధీమా ఒకటి. ఇలాంటి రచనని ఆ రాసిన వాళ్ళు తప్ప బ్రహ్మదేవుడు కూడా చదవలేడు 🙂 :).
మహానీరసమైన పుట్టెడు రచనలకి మీ పత్రిక మాత్రం గొప్ప వేదిక. పైగా బోలెడంత మంది ‘పీరులు’ వీటినన్నిటినీ చదువుతూ ఔఔ నంటూ అచ్చువేసుకోవడం మీ పత్రికకి ఉన్న రచనల కొరతనీ, మీ పీర్ల (pun intended) శక్తి లేమినీ పట్టి ఇస్తోంది.
అయినా మీకొక క్లూ ఇవ్వాలనుకుంటున్నా. సెంటెర్ ఆఫ్ ద యూనివర్స్ లో సైమన్ రిచ్ సెలవిచ్చినట్టు ఈ అన్ ఫినిష్డ్ భూమి మీద ఆ వూరు ఎప్పుడో అప్పుడు పుట్టక మానదని నా ప్రగాఢ విశ్వాసం. అంతకంటే చిత్రమేమిటంటే ఈ మధ్య నేనెప్పుడు కంప్యూటర్ ముందు కూర్చున్నా నా కళ్ళు ‘శంబళ ‘ కోసం వెదుకుతున్నాయి.
మీరు సీతేతరులు గూడా ‘మరది లక్ష్మన్న’ అని అన్నారు గాబట్టి ‘లక్ష్మణ దేవర’ అన్నదాన్ని ‘మరిది లక్ష్మన్న’ కు పర్యాయముగా తీసుకోవటం సబబుగానే తోస్తోందని వివరించినా అలా అంటం లోనే ఏదో వెలితి ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే అసలు సందేహమే అది. తెలుగు సాహిత్యంలో మరొక చోట – జానపదం గానీ ఇతరత్రా గానీ – ‘దేవర’ ను మరిది అన్న అర్థంలో వాడిన సందర్భం ఉన్నట్టుగా తెలిసే దాకా [నాకు] ఇది అంతేనేమో.
ధన్యవాదాలతో
తఃతః
“సంభాషణలతో పనిలేని సాన్నిహిత్యాన్నీ, తీరికగా ఆస్వాదిస్తూ రాజ్యాధినేతల్లా
ఎదురెదురుగా కూర్చుంటాం నువ్వూ, నేను!” ఈ చివరి చరణం పై మూడు చరణాలకీ తలమానికంగా వుంది. అనుభూతి తప్ప అనటానికి మాటలురాని ఎన్నో భావాలున్నాయి. బాగా వ్రాశారు
తః తః గారు: నేనూ మొదట్లో మీలాగే ‘దేవర’ అన్నపదం మరిది అన్న అర్థంలో జానపదులు వాడలేదేమో అని సందేహపడ్డాను. అయితే, ఆ స్త్రీలపాటలను మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలిస్తే, అందులో సీత ప్రస్తావన డైరక్టుగా లేని సందర్భాలలో కూడా లక్ష్మణుడిని మరదిలక్ష్మన్నా అని ప్రస్తావించడం చూస్తే (చూ. స్త్రీల రామాయణ పాటలు, పే. 17) లక్ష్మణదేవర అన్న పదబంధాన్ని మరిది అన్న అర్థంలోనే వాడారన్న వివరణ సబబేనని నాకు తోస్తోంది.
“దేవర అన్న పదానికి ఉన్న రెండు అర్థాలలో …….. భర్త తోబుట్టువు అన్న అర్థం ఉన్న దేవర అన్న పదానికి ….. ”
నమస్తే సురేశ్ గారూ! ఈ వ్యవహారం యెంత ప్రయతించినా నాకు అర్థం అవటం లేదు.
‘దేవర’ అన్న పదం తెలుగు పదంగా తీసుకున్నట్టయితే అమాటకు ‘మరిది’ అన్న అర్థం ఉన్నది అని నిర్ద్వందంగా చెప్పినట్టుగా అనిపించలేదు. యెందుకంటే “మరిది’ [సహోదరి భర్త] అన్న అర్థంలో మీ ఉదాహరణ సంస్కృత ప్రయోగం నించి. అప్పుడు ‘లక్ష్మణ దేవర’ సంస్కృత శబ్దం అవుతుందేమో గదా. తెలుగు జానపదుల పాటకు ఇది నప్పుతుందా. దయ చేసి వివరించరా!
దీక్షా లాక్షా రాగ రేఖ గురించి rama bharadvaj అభిప్రాయం:
06/03/2012 12:02 am
భాషా భేషజానికి పెద్ద ఉదాహరణ ఈ రచన. ఆడంబరం తప్ప ఇందులో ఇంకేమీ ధ్వనించడం లేదు. పైగా శ్రీనాధుని శీర్షిక లో అరువు తెచ్చుకున్న లౌల్యమొకటి. తిలక్ ని అనుకరించి నడవగలనన్న ధీమా ఒకటి. ఇలాంటి రచనని ఆ రాసిన వాళ్ళు తప్ప బ్రహ్మదేవుడు కూడా చదవలేడు 🙂 :).
మహానీరసమైన పుట్టెడు రచనలకి మీ పత్రిక మాత్రం గొప్ప వేదిక. పైగా బోలెడంత మంది ‘పీరులు’ వీటినన్నిటినీ చదువుతూ ఔఔ నంటూ అచ్చువేసుకోవడం మీ పత్రికకి ఉన్న రచనల కొరతనీ, మీ పీర్ల (pun intended) శక్తి లేమినీ పట్టి ఇస్తోంది.
రమ.
నాకు నచ్చిన పద్యం: పోతనామాత్యుని జీవన దృక్పథం గురించి narayanababu అభిప్రాయం:
06/02/2012 11:00 pm
త త గారు
అనేక ధన్యవాదాలు
ఈమాట మే 2012 సంచికకు స్వాగతం! గురించి Prasad అభిప్రాయం:
06/02/2012 4:37 am
ఒక వేళ, నేను ఏమైనా కథలు లేదా కవితలు మీకు పంపాలంటే, పద్ధతి ఏమిటొ తెలుపగలరు.
[రచయితలకు సూచనలు అన్న పేజీలో అన్ని వివరాలు ఇచ్చాము – సం.]
బ్రహ్మ సృష్టి గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
06/01/2012 2:17 am
నమస్కారమండీ!
మీ బ్రహ్మ సృష్టి భలే నవ్వించేసింది.
అయినా మీకొక క్లూ ఇవ్వాలనుకుంటున్నా. సెంటెర్ ఆఫ్ ద యూనివర్స్ లో సైమన్ రిచ్ సెలవిచ్చినట్టు ఈ అన్ ఫినిష్డ్ భూమి మీద ఆ వూరు ఎప్పుడో అప్పుడు పుట్టక మానదని నా ప్రగాఢ విశ్వాసం. అంతకంటే చిత్రమేమిటంటే ఈ మధ్య నేనెప్పుడు కంప్యూటర్ ముందు కూర్చున్నా నా కళ్ళు ‘శంబళ ‘ కోసం వెదుకుతున్నాయి.
అభినందనలతో-
ఆర్.దమయంతి.
లక్ష్మణదేవర నవ్వు గురించి తఃతః అభిప్రాయం:
05/29/2012 4:29 pm
మీరు సీతేతరులు గూడా ‘మరది లక్ష్మన్న’ అని అన్నారు గాబట్టి ‘లక్ష్మణ దేవర’ అన్నదాన్ని ‘మరిది లక్ష్మన్న’ కు పర్యాయముగా తీసుకోవటం సబబుగానే తోస్తోందని వివరించినా అలా అంటం లోనే ఏదో వెలితి ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే అసలు సందేహమే అది. తెలుగు సాహిత్యంలో మరొక చోట – జానపదం గానీ ఇతరత్రా గానీ – ‘దేవర’ ను మరిది అన్న అర్థంలో వాడిన సందర్భం ఉన్నట్టుగా తెలిసే దాకా [నాకు] ఇది అంతేనేమో.
ధన్యవాదాలతో
తఃతః
తేనీటి సమయం గురించి శశిధర్ పింగళి అభిప్రాయం:
05/28/2012 1:55 pm
“సంభాషణలతో పనిలేని సాన్నిహిత్యాన్నీ, తీరికగా ఆస్వాదిస్తూ రాజ్యాధినేతల్లా
ఎదురెదురుగా కూర్చుంటాం నువ్వూ, నేను!” ఈ చివరి చరణం పై మూడు చరణాలకీ తలమానికంగా వుంది. అనుభూతి తప్ప అనటానికి మాటలురాని ఎన్నో భావాలున్నాయి. బాగా వ్రాశారు
లక్ష్మణదేవర నవ్వు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
05/27/2012 8:24 pm
తః తః గారు: నేనూ మొదట్లో మీలాగే ‘దేవర’ అన్నపదం మరిది అన్న అర్థంలో జానపదులు వాడలేదేమో అని సందేహపడ్డాను. అయితే, ఆ స్త్రీలపాటలను మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలిస్తే, అందులో సీత ప్రస్తావన డైరక్టుగా లేని సందర్భాలలో కూడా లక్ష్మణుడిని మరదిలక్ష్మన్నా అని ప్రస్తావించడం చూస్తే (చూ. స్త్రీల రామాయణ పాటలు, పే. 17) లక్ష్మణదేవర అన్న పదబంధాన్ని మరిది అన్న అర్థంలోనే వాడారన్న వివరణ సబబేనని నాకు తోస్తోంది.
లక్ష్మణదేవర నవ్వు గురించి తః తః అభిప్రాయం:
05/26/2012 2:34 pm
నమస్తే సురేశ్ గారూ! ఈ వ్యవహారం యెంత ప్రయతించినా నాకు అర్థం అవటం లేదు.
‘దేవర’ అన్న పదం తెలుగు పదంగా తీసుకున్నట్టయితే అమాటకు ‘మరిది’ అన్న అర్థం ఉన్నది అని నిర్ద్వందంగా చెప్పినట్టుగా అనిపించలేదు. యెందుకంటే “మరిది’ [సహోదరి భర్త] అన్న అర్థంలో మీ ఉదాహరణ సంస్కృత ప్రయోగం నించి. అప్పుడు ‘లక్ష్మణ దేవర’ సంస్కృత శబ్దం అవుతుందేమో గదా. తెలుగు జానపదుల పాటకు ఇది నప్పుతుందా. దయ చేసి వివరించరా!
తః తః
తేనీటి సమయం గురించి Seetha Kumari అభిప్రాయం:
05/24/2012 10:48 pm
మాకూ ఇవన్నీ తటస్సిస్తాయి. కానీ మేము అంత బాగా అనుభవించమా?? ఏమో మరి. ఎందుకు మేము కూడా వ్రాయలేము ఇలా? అందంగా? 🙁
చందవరం, ప్రకాశం జిల్లా గురించి Seetha Kumari అభిప్రాయం:
05/24/2012 10:44 pm
అలా ఎక్కడికో తీసుకుపోతాండీ …ప్రతీ చిన్న విషయాన్నీ ఎంతో చక్కగా చెబుతారు సుమా…I throughly enjoy reading your poem…