ఎంత బారాసావమ్మాయ్ ! ఎంత ఓపికగా, పొందికగా, అందంగా అల్లావు! పిచుక గూడు అల్లినంత శ్రద్ధగా, గుబురుగా, ఆత్మీయంగా, ప్రేమగా ఉంది ఈ కథ!
అనేకానేక అర్బన్ కథల మధ్య ఈ మట్టివాసన చాలా బావుంది. పల్లెలు, పేదలు అనగానే “typical” కష్టాలు రాస్తావేమో అనుకుంటూ మొదలుపెట్టా! వాళ్లల్లో ఉన్న ఆశలు,కళల పట్ల మక్కువ, తీరని కోరికలు ఎంత ఆప్యాయంగా పొదివి పట్టుకున్నావో!
మధ్యమ పురుషలో చదవడం తమాషాగా ఉంది. ఆ మధ్య పూర్ణిమ కథ చదివాను మధ్యమ పురుషలో. మళ్లీ నీది. రాస్తూ ఉండు.
swathi gAru,
your story reminded me of this poem by Borges (don’t ask me why 🙂 )
an impromptu translation:
అతడు
గతమో, సంగతులో లేక కాలమో
అరగదీసాయి అతన్ని
అలసిపోయాడు, పాపం ముసలాడు
చావుకోసం కూడా ఎదురుచూడటం మరచిపోయినవాడు
(మరణం ఒక ఘటన, అంతకన్నా ఏముంది దాన్లో?
అయితే, ప్రతిమనిషిని నిన్నుమాత్రమే
చరిత్రలో చిరంజీవిని చేస్తానని ఊరిస్తుందది)
దాహానికి నీరు, సమయానికి నిద్ర, విశేషమేమీ మిగల్చని రోజులు
వీటి విలువ తెలిసినవాడు, వాటికి ఉదయాన్నే నమస్కరించేవాడు
అప్పుడప్పుడు అనుకోకుండా ఎదురయ్యే కొత్త అర్థాలలోనో
ప్రాచీన కావ్యాలలో ఒకానొక పద్యంతోనో
ముప్పై ఏళ్లక్రితం వదిలివెళ్లిపోయిన ప్రియురాలిని కూడా
మనస్తాపం లేకుండా నెమరు వేసుకోగలవాడు
గడుస్తున్న ప్రతిక్షణమూ అజ్ఞాతభవిష్యత్తేనని ఎరిగినవాడు
ఒక నమ్మకద్రోహం చేసినవాడు
మరొకనమ్మకద్రోహం అనుభవించినవాడు
నమ్మకం, విశ్వాసం వైపునుంచీ కాకుండా
సనాతనమైన అమాయకత్వంలోంచో
తన పునాదుల్లోంచో,
లేదా సర్వవ్యాపకుడైన భగవంతుడినుంచో
హఠాత్తుగా ఒక ఆనంద వీచిక ఒకటి,
వీధిదాటుతుండగా
అతన్ని అప్పుడప్పుడు పలకరిస్తుంటుంది
దేన్నీ అతిగా విశ్లేషించకూడదని తెలుసునతనికి
పంజా విసిరే పెద్దపులికన్నా ఘోరమైన కారణాలు
అతని దౌర్భాగ్యాన్ని నిరూపిస్తూ ఉంటాయి
ఆ రవ్వంత కీర్తినిమాత్రం సంతోషంగా స్వీకరిస్తాడు.
బహుశా, మరణంతో
బూడిద ధూళిలో కలిసిపోయినప్పుడు
మనం చిరంజీవులం అవుతామేమో
నిగూఢమైన ఆ మూలంలోంచే
మళ్లీ మళ్లీ చిగురిస్తాం
సత్తో, చిత్తో
మనకి మాత్రమే దక్కే
ఏకాంతపు స్వర్గంలోకో, నరకంలోకో
(Translation of “Someone”, from The Self and the Other, 1964, Jorge Luis Borges)
‘అడవి నుండి అడవికి’ అంటున్న జయతి బిడ్డ అంతరాళాన్ని అర్ధంచేసుకుని తమ ఆత్మీయతను, అభినందనలను, ఆశీస్సులను తనకు తెలియచేసారు :
కాశీభట్ల వేణుగోపాల్ గారు ( మో – వేగుంట మోహనప్రసాద్ , త్రిపురలకు అత్యంచ ఆప్తుడు); చెన్నై సోదరి డా. రాయదుర్గం విజయలక్ష్మి ( అంతరించిపోతున్న అరుదయిన మానవత్వ జీవనశైలికి నిలువెత్తు నిదర్శనంగా బ్రదికిన, మానవతావాది అమేయ చైతన్యస్వరూపి Peoples’ IAS Officer శంకరన్ అంటూ రాసిన కొత్తగూడెం సోదరి ), డా. మైథిలి అబ్బరాజు గారు ( “నిమగ్న” సారస్వత వ్యాస రచనతో తమ అసమాన్య సాహితీ ప్రతిభ చూపిన ) , వర్ధమాన ప్రతిభావంత కవయిత్రి రేఖాజ్యోతి గారు ( నువ్వొచ్చిన వసంతంలో నుంచి నువ్వు లేని గ్రీష్మంలోకి జారిపోవడానికి, నాక్కాస్త సమయం పడుతుంది! అన్న – – – ఆ కోనేటిరాయుడి దీవెనల నీడల ఉంటున్న రేఖాజ్యోతి గారు ), అన్నమయ సంకీర్తనల అభిమాని అవినేని భాస్కర్.
ఏడు కవితలు
గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:
11/17/2018
3:55 pm
తః తః గారు “మళ్లీ ఒక సారి చదివాను, ‘ఏ వ్యక్తీకరణం ఎప్పుడు తప్పుచేయగలదు?’ ఈ వాక్యం మరీ faithful ఉన్నట్టుంది,” అని రాసిన తర్వాత, నేనూ నా తెలుగు అనుసృజన – ఒరియా మూలం మరోసారి చదివాను.
I hate to disappoint Sri తఃతః. That line is neither faithful nor beautiful. I wondered how my co-author,and I missed it. Here I give the two relevant lines from the original poem in diacritical Roman script.
‘ఇప్పుడు వాటికర్థం లేదు, అర్ధంలేకపోవచ్చు
కాని, ఏ మాటలు ఏ సమయంలో తప్పుటర్థం యిస్తాయో?’
అని రాసి వుంటే బాగుండేది.
This might come close to being faithful and closer to being beautiful.
Anyway, I do not subscribe to Sri Ronamki, or the un-named French writer, or for that matter Professor Google who credits Yevgeny Yevtushenko for the irrelevant, irresponsible and insensitive implication in the quotation that compares translations to women. Fortunately, the women I knew are beautiful and faithful. I have to pity those blessed scholars for their misfortune.
ఏ. ఎస్. మూర్తి గారు
అవునండి భలే చెప్పారు. మరీ 116/58/28 డాలర్లంటే నాసి కదా? మీకు తెలియకపోతేనే సుమండీ, ఈ బహుమతులకి డబ్బులు జనం మీద దండి తెచ్చేవి. జనం అంటే సభ్యులు, తెలుగంటే (ఇంకా) చిరాకు పడని కొంతమంది మర్యాదస్తులూ, బిజినెస్ వారూను. అడిగేవారు – ఎవరు ఎలా మొహమ్మీద తిట్టి ఉమ్మేసినా పాపం గడప గడపా తొక్కుతూ మొహం మీద ఉమ్ము తుడుచుకుంటూ, పెళ్ళాం పిల్లలు వారాంతాలు ఈ పని మీద సమయం తగలేస్తున్నందుకు తిట్టే తిట్లు భరిస్తూ – చెప్పులూ, ఫోనులూ అరిగేలా తిరిగి సంపాదించినవి ఈ బహుమతి డబ్బులు.
ఇలా కామెంటడం బదులు మీరు ఓ పదివేలు పారేస్తే పక్కన సున్న చేర్చడం పని సెకనుల పని. ఇంకా సమయం ఉంది. త్వరపడండి. ధన్యవాదాలు.
నీతి: గాజు భవనాల్లో నివసించే వారు ఇతరుల మీద రాళ్ళు విసరరాదు.
కవులు రాసే కథల్తో నాకు చాలానే ఇబ్బంది. కవిత్వం వాళ్ళని ఓ పట్టాన వదిలి పెట్టదు. ఆ ఇబ్బంది పక్కనబెట్టి చదివాను. చాలా బాగా రాశారు.
అందరూ మెచ్చుకోళ్ళు మాత్రమే కురిపిస్తే ఎలా? దిష్టి చుక్కలాగా రెండు విమర్శలు పెడతాను.
మధ్యమ పురుష (ద్వితీయ పురుష కాదు, ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నా, కోకపోయినా ఇంగ్లీషు మనల్ని ఎంత ఆవహించి ఉందో!) నిర్వహించడం కష్టం. దీన్ని ఇంకెవరో కూడా ప్రస్తావించారు. ఎలాగూ కథ చెప్పే స్వరం సర్వజ్నాని స్వరం కాబట్టి ప్రథమ పురుష కథనం ఇంకాస్త రాణించేదేమో?
దానికి తోడు వచన కవిత్వం లాంటి వాక్య నిర్మాణం ఒకటి. “..వేరేపక్కకి తిరుగుతావు.” సాధారణ భూతకాలం కాకుండా ఇలాంటి వర్తమాన సూచక క్రియా రూపంతో సాధించిన అదనపు ప్రయోజనం ఏదన్నా ఉందా? కొన్ని చోట్ల భూతకాల రూపం తొంగి చూస్తూనే ఉంది.
ఒకే సంచికలో రెండు మధ్యమ పురుష కథలు – తమాషాగా అనిపించింది.
మొత్తానికి కలాన్ని కదిలించారు. ఈ అక్షరాల్తో పాఠకుల్నీ కదిలించారు. అభినందనలు.
బాగుంది చంద్రా.
మధ్యమ పురుష కథనం కత్తి మీద సాములాంటిది. ఈ కథనం సంఘటనలతో పేరుకున్న కథ కాకపోవడం కొంత సులభతరం చేసిందేమో. దీన్ని ఆత్మ పరిశీలన కథనం అనొచ్చునేమో.
జీవనసంధ్య గురించి ఆ. సౌమ్య అభిప్రాయం:
11/20/2018 12:35 am
ఎంత బారాసావమ్మాయ్ ! ఎంత ఓపికగా, పొందికగా, అందంగా అల్లావు! పిచుక గూడు అల్లినంత శ్రద్ధగా, గుబురుగా, ఆత్మీయంగా, ప్రేమగా ఉంది ఈ కథ!
అనేకానేక అర్బన్ కథల మధ్య ఈ మట్టివాసన చాలా బావుంది. పల్లెలు, పేదలు అనగానే “typical” కష్టాలు రాస్తావేమో అనుకుంటూ మొదలుపెట్టా! వాళ్లల్లో ఉన్న ఆశలు,కళల పట్ల మక్కువ, తీరని కోరికలు ఎంత ఆప్యాయంగా పొదివి పట్టుకున్నావో!
మధ్యమ పురుషలో చదవడం తమాషాగా ఉంది. ఆ మధ్య పూర్ణిమ కథ చదివాను మధ్యమ పురుషలో. మళ్లీ నీది. రాస్తూ ఉండు.
మౌనశంఖం నారాయణబాబు అమోఘకావ్యం: తొలిభాగం గురించి శ్రీనివాసరావు అభిప్రాయం:
11/19/2018 8:57 am
చాలా చాలా బాగుంది సార్.మిగిలిన భాగం లింక్ పంపగలరు
బురద గురించి Chandra Sekhar అభిప్రాయం:
11/19/2018 3:42 am
గొగోల్నో, చెహోవ్నో చదూతున్నట్టూ, ఎక్ హార్ట్నో, జిడ్డు కృష్ణమూర్తినో వింటూన్నట్టూ వుంది.
జీవనసంధ్య గురించి నాగరాజు పప్పు అభిప్రాయం:
11/18/2018 1:41 pm
swathi gAru,
your story reminded me of this poem by Borges (don’t ask me why 🙂 )
an impromptu translation:
అతడు
గతమో, సంగతులో లేక కాలమో
అరగదీసాయి అతన్ని
అలసిపోయాడు, పాపం ముసలాడు
చావుకోసం కూడా ఎదురుచూడటం మరచిపోయినవాడు
(మరణం ఒక ఘటన, అంతకన్నా ఏముంది దాన్లో?
అయితే, ప్రతిమనిషిని నిన్నుమాత్రమే
చరిత్రలో చిరంజీవిని చేస్తానని ఊరిస్తుందది)
దాహానికి నీరు, సమయానికి నిద్ర, విశేషమేమీ మిగల్చని రోజులు
వీటి విలువ తెలిసినవాడు, వాటికి ఉదయాన్నే నమస్కరించేవాడు
అప్పుడప్పుడు అనుకోకుండా ఎదురయ్యే కొత్త అర్థాలలోనో
ప్రాచీన కావ్యాలలో ఒకానొక పద్యంతోనో
ముప్పై ఏళ్లక్రితం వదిలివెళ్లిపోయిన ప్రియురాలిని కూడా
మనస్తాపం లేకుండా నెమరు వేసుకోగలవాడు
గడుస్తున్న ప్రతిక్షణమూ అజ్ఞాతభవిష్యత్తేనని ఎరిగినవాడు
ఒక నమ్మకద్రోహం చేసినవాడు
మరొకనమ్మకద్రోహం అనుభవించినవాడు
నమ్మకం, విశ్వాసం వైపునుంచీ కాకుండా
సనాతనమైన అమాయకత్వంలోంచో
తన పునాదుల్లోంచో,
లేదా సర్వవ్యాపకుడైన భగవంతుడినుంచో
హఠాత్తుగా ఒక ఆనంద వీచిక ఒకటి,
వీధిదాటుతుండగా
అతన్ని అప్పుడప్పుడు పలకరిస్తుంటుంది
దేన్నీ అతిగా విశ్లేషించకూడదని తెలుసునతనికి
పంజా విసిరే పెద్దపులికన్నా ఘోరమైన కారణాలు
అతని దౌర్భాగ్యాన్ని నిరూపిస్తూ ఉంటాయి
ఆ రవ్వంత కీర్తినిమాత్రం సంతోషంగా స్వీకరిస్తాడు.
బహుశా, మరణంతో
బూడిద ధూళిలో కలిసిపోయినప్పుడు
మనం చిరంజీవులం అవుతామేమో
నిగూఢమైన ఆ మూలంలోంచే
మళ్లీ మళ్లీ చిగురిస్తాం
సత్తో, చిత్తో
మనకి మాత్రమే దక్కే
ఏకాంతపు స్వర్గంలోకో, నరకంలోకో
(Translation of “Someone”, from The Self and the Other, 1964, Jorge Luis Borges)
పుస్తక పరిచయం: అడవి నుండి అడవికి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
11/18/2018 8:11 am
ప్రియమైన అమరేంద్ర గారూ!
‘అడవి నుండి అడవికి’ అంటున్న జయతి బిడ్డ అంతరాళాన్ని అర్ధంచేసుకుని తమ ఆత్మీయతను, అభినందనలను, ఆశీస్సులను తనకు తెలియచేసారు :
కాశీభట్ల వేణుగోపాల్ గారు ( మో – వేగుంట మోహనప్రసాద్ , త్రిపురలకు అత్యంచ ఆప్తుడు); చెన్నై సోదరి డా. రాయదుర్గం విజయలక్ష్మి ( అంతరించిపోతున్న అరుదయిన మానవత్వ జీవనశైలికి నిలువెత్తు నిదర్శనంగా బ్రదికిన, మానవతావాది అమేయ చైతన్యస్వరూపి Peoples’ IAS Officer శంకరన్ అంటూ రాసిన కొత్తగూడెం సోదరి ), డా. మైథిలి అబ్బరాజు గారు ( “నిమగ్న” సారస్వత వ్యాస రచనతో తమ అసమాన్య సాహితీ ప్రతిభ చూపిన ) , వర్ధమాన ప్రతిభావంత కవయిత్రి రేఖాజ్యోతి గారు ( నువ్వొచ్చిన వసంతంలో నుంచి నువ్వు లేని గ్రీష్మంలోకి జారిపోవడానికి, నాక్కాస్త సమయం పడుతుంది! అన్న – – – ఆ కోనేటిరాయుడి దీవెనల నీడల ఉంటున్న రేఖాజ్యోతి గారు ), అన్నమయ సంకీర్తనల అభిమాని అవినేని భాస్కర్.
ఏడు కవితలు గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:
11/17/2018 3:55 pm
తః తః గారు “మళ్లీ ఒక సారి చదివాను, ‘ఏ వ్యక్తీకరణం ఎప్పుడు తప్పుచేయగలదు?’ ఈ వాక్యం మరీ faithful ఉన్నట్టుంది,” అని రాసిన తర్వాత, నేనూ నా తెలుగు అనుసృజన – ఒరియా మూలం మరోసారి చదివాను.
I hate to disappoint Sri తఃతః. That line is neither faithful nor beautiful. I wondered how my co-author,and I missed it. Here I give the two relevant lines from the original poem in diacritical Roman script.
ebe sēguḍikara artha nāhĭ, artha nathāe
keŭ bhāṣā bā ketebēḷe bhul karipāre?
‘ఇప్పుడు వాటికర్థం లేదు, అర్ధంలేకపోవచ్చు
కాని, ఏ మాటలు ఏ సమయంలో తప్పుటర్థం యిస్తాయో?’
అని రాసి వుంటే బాగుండేది.
This might come close to being faithful and closer to being beautiful.
Anyway, I do not subscribe to Sri Ronamki, or the un-named French writer, or for that matter Professor Google who credits Yevgeny Yevtushenko for the irrelevant, irresponsible and insensitive implication in the quotation that compares translations to women. Fortunately, the women I knew are beautiful and faithful. I have to pity those blessed scholars for their misfortune.
వేలూరి వేంకటేశ్వర రావు
TAGS ఆధ్వర్యంలో శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
11/17/2018 1:06 pm
ఏ. ఎస్. మూర్తి గారు
అవునండి భలే చెప్పారు. మరీ 116/58/28 డాలర్లంటే నాసి కదా? మీకు తెలియకపోతేనే సుమండీ, ఈ బహుమతులకి డబ్బులు జనం మీద దండి తెచ్చేవి. జనం అంటే సభ్యులు, తెలుగంటే (ఇంకా) చిరాకు పడని కొంతమంది మర్యాదస్తులూ, బిజినెస్ వారూను. అడిగేవారు – ఎవరు ఎలా మొహమ్మీద తిట్టి ఉమ్మేసినా పాపం గడప గడపా తొక్కుతూ మొహం మీద ఉమ్ము తుడుచుకుంటూ, పెళ్ళాం పిల్లలు వారాంతాలు ఈ పని మీద సమయం తగలేస్తున్నందుకు తిట్టే తిట్లు భరిస్తూ – చెప్పులూ, ఫోనులూ అరిగేలా తిరిగి సంపాదించినవి ఈ బహుమతి డబ్బులు.
ఇలా కామెంటడం బదులు మీరు ఓ పదివేలు పారేస్తే పక్కన సున్న చేర్చడం పని సెకనుల పని. ఇంకా సమయం ఉంది. త్వరపడండి. ధన్యవాదాలు.
నీతి: గాజు భవనాల్లో నివసించే వారు ఇతరుల మీద రాళ్ళు విసరరాదు.
జీవనసంధ్య గురించి S. Narayanaswamy అభిప్రాయం:
11/17/2018 11:45 am
కవులు రాసే కథల్తో నాకు చాలానే ఇబ్బంది. కవిత్వం వాళ్ళని ఓ పట్టాన వదిలి పెట్టదు. ఆ ఇబ్బంది పక్కనబెట్టి చదివాను. చాలా బాగా రాశారు.
అందరూ మెచ్చుకోళ్ళు మాత్రమే కురిపిస్తే ఎలా? దిష్టి చుక్కలాగా రెండు విమర్శలు పెడతాను.
మధ్యమ పురుష (ద్వితీయ పురుష కాదు, ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నా, కోకపోయినా ఇంగ్లీషు మనల్ని ఎంత ఆవహించి ఉందో!) నిర్వహించడం కష్టం. దీన్ని ఇంకెవరో కూడా ప్రస్తావించారు. ఎలాగూ కథ చెప్పే స్వరం సర్వజ్నాని స్వరం కాబట్టి ప్రథమ పురుష కథనం ఇంకాస్త రాణించేదేమో?
దానికి తోడు వచన కవిత్వం లాంటి వాక్య నిర్మాణం ఒకటి. “..వేరేపక్కకి తిరుగుతావు.” సాధారణ భూతకాలం కాకుండా ఇలాంటి వర్తమాన సూచక క్రియా రూపంతో సాధించిన అదనపు ప్రయోజనం ఏదన్నా ఉందా? కొన్ని చోట్ల భూతకాల రూపం తొంగి చూస్తూనే ఉంది.
ఒకే సంచికలో రెండు మధ్యమ పురుష కథలు – తమాషాగా అనిపించింది.
మొత్తానికి కలాన్ని కదిలించారు. ఈ అక్షరాల్తో పాఠకుల్నీ కదిలించారు. అభినందనలు.
బురద గురించి S. Narayanaswamy అభిప్రాయం:
11/17/2018 11:24 am
బాగుంది చంద్రా.
మధ్యమ పురుష కథనం కత్తి మీద సాములాంటిది. ఈ కథనం సంఘటనలతో పేరుకున్న కథ కాకపోవడం కొంత సులభతరం చేసిందేమో. దీన్ని ఆత్మ పరిశీలన కథనం అనొచ్చునేమో.
TAGS ఆధ్వర్యంలో శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ గురించి A S Murthy అభిప్రాయం:
11/16/2018 4:35 pm
బహుమతులు మరీ నాశిగా ఉన్నయి, ఒక్క కమెంట్ కూడా లేదు చూసేరా, కుడి పక్కన ఒక సున్నా చేర్చాలి