పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2 గురించి మద్దిపాటి కృష్ణారావు అభిప్రాయం:

    01/20/2019 6:54 pm

    ఇప్పటికి కూడా తెలుగు భాష కవిత్వం, కథలు, నవలలు రాసుకునే భాష అయింది కానీ కొత్త ఆలోచనలు తయారు చేసే భాష కాలేదు.

    కొత్త ఆలోచనలు తెలుగు విద్యార్ధుల్లో పుట్టించడానికి తెలుగు మాధ్యమంలో బోధన ప్రారంభించి తెలుగు అకాడమీ వారితో పుస్తకాలు రాయస్తే దాని ఫలితం amphiphloic siphonostele కు అనువాదం ‘ఉభయత్ర పోషక కణజాలయుత నాళికాకార పోషక కణజాలము’ అయ్యింది! ఇది కేవలం సాంకేతిక పదజాలాన్ని తయారు చెయ్యటానికి పూనుకున్న వారి బద్ధకం, నిర్లక్ష్యం, అంతకు మించి తెలుగుకు చేసిన (చేస్తున్న) ద్రోహం. ఎప్పుడో, ఎక్కడో ఒక గిడుగో, ఒక సామినేనో, ఒక టేకుమళ్ళో పూనుకున్నా, పట్టుదలతో ఉద్యమంగా నడిచిందెప్పుడైనా ఉందా? పైగా మనం ఇప్పుడు ఇంగ్లీషు పండితులం మరి!

  2. మరణ మృదంగం గురించి sreehari అభిప్రాయం:

    01/20/2019 9:34 am

    చక్కని అనువాదం. ధన్యవాదములు.

  3. శ్రీనాథుని చాటుపద్యములు గురించి N. S. PAVAN KOUSHIK అభిప్రాయం:

    01/20/2019 5:06 am

    నాకు శ్రీనాధుని కాశీఖండం పద్యాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా?

  4. నేనొక చిత్రమైన చిక్కుముడి: 3. తార్కికంగా తర్కాన్ని తోసిరాజన్న తర్కం గురించి తః తః అభిప్రాయం:

    01/19/2019 2:42 pm

    సమవాయం : వస్తువు దాని ప్రాధమిక ధర్మము లలో ఒకదానినుండి మరొకదానిని విదదీస్తే రెండూ లేకుండా పోవటము ‘అసలైన’ సమవాయం అయిఉండాలి . ‘ఆవుదనం’ అనబడుతున్నది లేకపోతే ఆవు లేనట్టే ‘ఆవు’ అన్నది లేకపోతే ‘ఆవుదనం’ లేదు . తెల్ల గులాబి లో తెల్లదనానికీ గులాబి తనానికీ ఇది వర్తించదు తెల్ల దనం లేకుండా గులాబి ఉండగలదు గులాబి లేకుండా తెల్లదనం ఉండగలదు .కానీ తెల్లదనం లేకుండా ‘ తెల్ల గులాబి ‘ ఉండదు . ఇటువంటిది trivial సమవాయం అనిపిస్తోది .గుణాత్మక, క్రియాత్మక సమవాయాలలో తెల్లదనమూ /నడవటమూ వంటివి గులాబి లోనే /మనిషిలోనే కాక తదితర పదార్థాలలొ కూడా ఉండటాన్ని గమనించినప్పుడు ‘సమవాయం’ అని అనిపించినది trivial సమవాయమేమో ! అలాగే మట్టి – కుండ కూడా , కుండ అనే పదార్థం లేకుండా మట్టి అనే పదార్థం ఉండగలదు. కుండకీ మట్టి కీ అవినాభావ సంబంధం లేదు
    తః తః

  5. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2 గురించి Bhaskar Kompella అభిప్రాయం:

    01/19/2019 11:40 am

    భేష్ ఎస్ కుమార్ గారూ!

    వ్యాసమంతా ఒక ఎత్తు, మీ ఉత్తరం ఒక ఎత్తు.

    తెలుగులో విజ్ఞానశాస్త్రాభ్యాసం (1స్త్ Batch లో) చేసిన నేను, వ్యావహారికభాషలో రాసిన తెలుగు అకాడెమీ పుస్తకాలు చదివినవాడిని. విషయాన్ని వివరించడంలో, జీవశాస్త్రం పుస్తకాలు మెరుగ్గా ఉండేవి. భౌతికశాస్త్రం పుస్తకాలు అంతంతమాత్రంగా ఉండేవి. కారణం, మీరు చెప్పినదే. పరిభాషని సృష్టించవలసిరావడం.

    ఏదో పరిశోధనాపత్రంగా భావిస్తే తప్ప, ఈ వ్యాసమంజరిలోని విశ్లేషణ ప్రజలకి ఉపయోగపడే తెలుగుని ముందుకు తీసుకుపోవడానికి ఎంతవరకూ ఉపయోగపడుతుందో నాకు అర్ధం కాలేదు. ఇదేదో ఈమాట బహుముఖత అనుకుని సర్దిపెట్టుకోవాలి.

  6. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ప్రసంగం గురించి Bhaskar Rao Gudluri అభిప్రాయం:

    01/19/2019 1:09 am

    దీపాల పిచ్చయ్య శాస్త్రిగారు మా గురువుగారు. నేను మినగల్లులో ఎనిమిది, తొమ్మిది మరియు పదో తరగతి చదివేప్పుడు మాకు శాస్త్రిగారు తెలుగు మాస్టారు. ఆయన ఛందస్సు నేర్పిన విధానము అమోఘం మరియు అతి సరళము. అయన పాఠాలు చెప్పే విధానం కూడా ఆకట్టుకునేది.

  7. నేనొక చిత్రమైన చిక్కుముడి: 3. తార్కికంగా తర్కాన్ని తోసిరాజన్న తర్కం గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:

    01/18/2019 10:29 pm

    Dr Kanneganti:

    I sincerely fail to see any meaning in your “if I define a set as x is in S, if x is not in S — is that set empty? It is not defined.”

    On the one hand you say “if I define” and in the same breath you say “It is not defined” Do you mean to say “it is not ‘well defined’?” Assuming of course, that what is meant by ‘being well defined’ is well understood. A ‘well posed problem’ is quite well defined in partial differential equations .)
    వాసుదేవ రావు ఎరికలపూడి

  8. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2 గురించి తఃతః అభిప్రాయం:

    01/18/2019 10:07 pm

    మాట్లాడేటట్లుగా ఏ భాషా ఎవరూ రాయడానికి ఉపయోగించరు

    నూటికి నూరు పాళ్ళు కాకపొయినా, కృతక గ్రాంధికాన్ని కాలదన్ని ‘గ్యాపకం’ వంటి మాటలతో, మాట్లాదుకునే భాషకు చాలా దగ్గరగా ఉండే భాషను రాసినాయన – జెర్మనీ లో బాటనీ లో రిసెర్చ్ చేసి, రష్యాలో – తెలుగు పుస్తకరంగం లో పనిచేసిన బరంపురం మనిషి – స్విస్ వనిత మెల్లీ షొలింగరు భర్త- నా చిన్నతనం లో బెజవాడ సిమెంట్ ఫాక్టరీ మానేజర్ గా ఉంటూ మా యింటికి దగ్గరగా మా చిన తాత గారిట్లో అద్దెకు ఉన్నాయన ‘బతుకు పుస్తకం’ రచయిత.

    తఃతః

  9. కొట్టివేత గురించి Giri అభిప్రాయం:

    01/14/2019 6:53 pm

    Simple and effective. Nice story.

  10. త్యాగరాజయ్య సాహిత్యము: సాహిత్యమును వెనుకకు నెట్టి నూతన సృష్టి చేసిన త్యాగయ్య గానప్రతిభ గురించి Kalyani SJ అభిప్రాయం:

    01/11/2019 9:48 pm

    పరమాద్భుతం… మరో మాట లేదు… ప్రచురించిన ఈమాట ఉత్తమాభిరుచికి నమస్సులు. ఏనాటికైనా English లోకి అనువదించాలని ఆశ పుడుతుంది.