భీష్ముడు తనెంతమందిని చంపగలడని యుద్ధానికి ముందు అతన్ని దుర్యోధనుడు అడిగితే దానికి భీష్ముడు పదివేల మందినని సమాధానం చెప్తాడు
ఇలా భీష్ముడు చంపుతానని చెప్పినది రోజుకి పదివేల మందిని అనుకుంటానండి; మొత్తం పదివేలమంది కాదు. ఈ పద్యాలలో అలాగ ఉన్నట్టుంది కూడా. (ఇవి కాపి పేస్ట్ కాదు కనక టైప్ చేసినప్పుడు తప్పులు దొర్లి ఉండొచ్చు). వీళ్లని చంపడానికి నీకెంతకాలం కావాలి అంటే భీష్ముడు చెప్పడం ఇలా ఉంది.
వ. అట్లుగా నాకయ్యంబు సేయుదివసంబులలోన
క. పదివేల జంపగా నో,
పుదు నే ననునెత్తికోలు వుట్టినయది నీ
పదునొకడక్షౌహిణులను
జదురున నడిపింతు నెదిరి సైన్యము గలతున్
వ. అని పలికి వెండియు
క. నీవడిగిన పని యేర్పడం
గావిను మే నొక్కనెల దెగం జేయుదు నా
నావిధ దివ్యాస్త్రంబుల
లావున నప్పాండవుల బలంబుల నెల్లన్
[ఉద్యోగ పర్వం, చతుర్ధాశ్వాసం 408 ..411]
మొదటి వచనంలో చెప్పినట్టు రోజుకి పదివేల చొప్పున 30 రోజులకి మూడు లక్షలే కదా మరి ఏడు అక్షౌహిణులు ఎలా చస్తారా అంటే, అందరూ చావక్కర్లేదు కదా యుద్ధంలో గెలవడానికి. చూచాయగా ఓ నెల రోజుల్లో యుద్ధం అవగొట్టగలను అని అర్ధం అనుకుంటా. అదీగాక ఇలా చెప్పేముందు, భీష్ముడు రధికులని విభజిస్తూ చెప్పిన విషయం – హరి అటువైపు అర్జునుడితో ఉన్నంతకాలం అసలు కౌరవులు గెలిచే ప్రశ్నే లేదు; అయినా అడిగావు కనక చెప్తున్నా ఓ నెల రోజులు అని (రెండో కందంలో)
“కాలిదాసు నుంచి కవిసమ్రాట్ దాకా, కాఫ్కా నుంచి కాల్వీనో దాకా, కారా నుంచి వేవేరా దాకా, ఇంకా ఎంతమందున్నారో ఎవరు లెక్కెట్టేరు; వారందరి కథలకూ ఈ కథకూ ఉన్న ఒక్క తేడా ఏమిటం” — ఇది రిపీట్ అయింది.
అనుసృజన బాగున్నది. చదువుతున్నట్లు కంటే, వింటున్నట్లు ఉన్నది. పద విన్యాసం బాగా తెలుస్తుంది!
1 నవల కన్నా చిన్నది కథ కన్నా చాల పెద్దది
2 Readability బాగుంది
3 కథను బాగా లాగారు
4 అన్ని విషయాలు తడిమారు. దానివల్ల ప్రధానమైన విషయాలు మరుగున పడ్డాయి.
5 కథ మధ్యలో బాగా బోర్ కొట్టింది.
6. కథలో ఆర్టిఫిషల్ అంశాలు కొన్ని వున్నాయి.
7 1976 ప్రాతం లో ఇంట పెద్ద కథలను పాఠకులు ఎలా చదవ గలిగారో ఆశ్చర్యంగా ఉంది.
8 కథ విస్తృతి పెద్దది. బాగుంది.
ఇది రామాయణం లో పిడకల వేట లాటి కామెంట్ – భారత యుద్ధం గురించి ఒక పాఠకుడిక్కడన్న మాట ఈ ఆలోచనకి ప్రేరణ. వారన్నది – “మొత్తం పద్ధెనిమిది అక్షౌహిణిలూ కొట్టుకు చచ్చినది భూమి కోసం కదా?”
ఈ పద్దెనిమిది అక్షౌహిణులనే లెక్కని నేనెప్పుడూ “లిటరల్” గా తీసుకోలేదు. ఐనా సరదాగా ఒక్కక్షణం లెక్కలేసి చూద్దాం. ఒక అక్షౌహిణిలో లక్షకి కొంచెం పైగా పదాతులుంటారు. గుర్రాలు, ఏనుగులు, రథాల్ని కాసేపు పక్కనపెట్టి కేవలం మనుషుల్ని మాత్రం లెక్కేస్తే పద్దెనిమిది అక్షౌహిణుల్లో పద్దెనిమిది లక్షల మంది. ఒక మనిషికి సగటున 24 చదరపు అడుగుల స్థలం కనీసం కావాలి. పడుకోవటానికైతే ఆరుగుడుగుల పొడవు, నాలుగడుగుల వెడల్పు జాగా కనీసం కావాలి కదా. నిలబడ్డా ముందూ వెనకా కలిసి నాలుగైదు అడుగులు, అలాగే రెండు పక్కలా నాలుగైదు అడుగులూ. పద్దెనిమిది లక్షల మందికి 432 లక్షల చదరపు అడుగులు ఊరికే నిలబడటానికి కావాలి, యుద్ధం మాట దేవుడెరుగు. ఒక మైలుకి 5280 అడుగులు కనక ఒక చదరపు మైలుకి దాదాపుగా 279 లక్షల చదరపు అడుగులు. యుద్ధం చెయ్యాలి గనక మొత్తం కనీసం నాలుగు చదరపు మైళ్లయినా స్థలం కావాలి. తీరా చూస్తే (తెలుగు భారతాన్ని ప్రమాణంగా తీసుకుంటే) భారత యుద్ధం జరిగిన స్థలం పెద్ద విశాలమైందిగా కనిపించదు. ఉదాహరణకి దుర్యోధనుడు చివర్లో ఒక్కడే గద బుజానేసుకుని నడుచుకుంటూ సరస్సుకి వెళ్లిపోయాడు. అలాగే అంతటి యుద్ధం లోనూ భీముడు అరిస్తే ఒకచోటినుంచి మరోచోటికి వినిపించేదట. భీముడి ఊపిరితిత్తుల సామర్థ్యం వల్ల యుద్ధ కోలాహలం మధ్య మైళ్ల దూరం అతని గొంతు వినిపించిందని నమ్మటం అసాధ్యం. పైగా యుద్ధం జరిగింది చదునైన ప్రదేశంలో. పక్కనే అడవులు వున్న చోట ఎంత చదునైన ప్రదేశం దొరుకుతుంది? (అడవులున్నాయని ఎలా తెలుసంటే దుర్యోధనుడు మడుగు దగ్గర వుండగా ఆ పక్కనే వెళ్తున్న ఆటవికులు భీముడి కోసం వేట మాంసాలు తీసుకెళ్తూ అతన్ని చూశారు.) మరో అంశం – భీష్ముడు తనెంతమందిని చంపగలడని యుద్ధానికి ముందు అతన్ని దుర్యోధనుడు అడిగితే దానికి భీష్ముడు పదివేల మందినని సమాధానం చెప్తాడు. అక్కడ సందర్భం యుద్ధం లో గెలవటం ఎవరికి ఎన్నాళ్లు పడుతుందని లెక్క వేసుకునేది. కనక మిగిలిన లెక్కలెలా వున్నా భీష్ముడి లెక్కలో పదివేలమందిని చంపటంతో యుద్ధం ఐపోతుందన్న సూచన కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే పాండవుల వైపు పదివేలు, కౌరవుల వైపు పదిహేను వేలు మొత్తం పాతిక వేలు దాకా యుద్ధం లో పాల్గొన్నారని అనుకోవటం నిజానికి కొంత దగ్గర కావొచ్చు (భీష్ముడి పదివేల సంఖ్య ‘ఉతారుగా’ వేసినది కాకుండా గట్టిగా లెక్క పెట్టిందే అనుకుంటే). పాతికవేల చావులు తక్కువని కాదు గాని పద్దెనిమిది లక్షల కంటే మెరుగే కదా ! అసలు అప్పటి లెక్కల్లో లక్ష ఇప్పడు మనం అనుకుంటున్న లక్షకి సమానమని భావించటం సరైనది ఔనో కాదో కూడ చెప్పలేం. అలాగే వేలూ !!
——————————–
ఇంక అసలు విషయానికి వస్తే – ఈ సంభాషణని అందరికీ అందుబాటులోకి తెచ్చిన పరుచూరి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. నారాయణరావు గారి ఒంటరిపోరు పూర్తిగా వెలుగులోకి రావలసి వుంది. ఇండియాలోని తెలుగువాళ్లకి ఎలాగూ పట్టటం లేదు, పట్టిన వాళ్లకైనా ఆ ఆలోచనల తీరు వంటబట్టటమూ లేదు. విద్యాలయాల ‘పరిశోధకులు’ వాళ్ల గానుగుల్లో వాళ్లు చుట్టూ తిరుగుతూనే వుంటారు, అక్కడినుంచి బయటకి రాలేరు. దేశం బయటవున్న వాళ్ల మీదే మిగిలివున్న ఆశ.
నమస్కారమండీ! వెల్చేరు నారాయణరావు గారు కృషి చేసి తీసుకువచ్చిన ఆంధ్రప్రభ సంపాదకులు వాసుదేవ దీక్షితులుగారి “ఖడ్గధార” పుస్తకాలు చదివాను. వాటికి ఆయన ముందుమాట రాశారు. దానిలో ఆయన “ఎవరా ఇంత హాయిగా తెలుగులో రాస్తున్నారు అని నేను పరిశీలించాను” అని రాశారు. అది నాకెంతో నచ్చింది. తర్వాత ఈనాడులో వారి ఇంటర్వ్యూ వచ్చిందొకసారి. ఎప్పుడైనా, ఏ విషయం పైనైనా, లోతైన విశ్లేషణ, స్పష్టమైన అభిప్రాయ వ్యక్తీకరణ, చదివిన వారిలో కొత్తకోణంలో ఆలోచనల ఆవిష్కరణ చేయించడం ఆయన విశిష్టత. ఇలాంటి మహానుభావుల అభిప్రాయాలు తరచూ మన తెలుగు నేలపై ప్రవహిస్తేనే మనమేంటో మనకు తెలుస్తుంది. మరొక్కమాట. ఇంతకీ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఈ ఇంటర్వ్యూ లో చెప్పినది నాకు పూర్తిగా అర్థం కాలేదు. వీలైతే చెప్పవలసినదిగా కోరుతున్నాను.
మహాభారతం పశువులు ఆధారంగా వుండే నాగరికత లోంచి వొచ్చిన కథ
దీనికి కాస్త వివరణ ఇస్తారా? మొత్తం పద్ధెనిమిది అక్షౌహిణిలూ కొట్టుకు చచ్చినది భూమి కోసం కదా? నాకు తెల్సినంతలో ఇక్కడా అక్కడా పాండవులూ కౌరవులూ పశువులని దానం ఇచ్చినా, కృష్ణుడు గోవులు కాసుకున్నా మొత్తం కధ పశువుల మీద ఆధారపడినదా? త్రేతాయుగంలో రాముడు కూడా పశువులు దానం ఇచ్చినట్టూ, అరణ్యకాండలో జంతువులని వేటాడి తిన్నట్టూ ఉంది. ఏ కారణంతో “మహాభారతం పశువుల ఆధారంగా ఉండే నాగరికత” అనేది కుతూహలంతో అడుగుతున్నాను.
ఈ కథ గురించి Chandrasekhar Cheerla అభిప్రాయం:
03/23/2019 2:19 am
Beautiful satire!
వెల్చేరు నారాయణరావుతో ముఖాముఖీ గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
03/22/2019 11:24 am
మరి కొంత వేట.
ఇలా భీష్ముడు చంపుతానని చెప్పినది రోజుకి పదివేల మందిని అనుకుంటానండి; మొత్తం పదివేలమంది కాదు. ఈ పద్యాలలో అలాగ ఉన్నట్టుంది కూడా. (ఇవి కాపి పేస్ట్ కాదు కనక టైప్ చేసినప్పుడు తప్పులు దొర్లి ఉండొచ్చు). వీళ్లని చంపడానికి నీకెంతకాలం కావాలి అంటే భీష్ముడు చెప్పడం ఇలా ఉంది.
వ. అట్లుగా నాకయ్యంబు సేయుదివసంబులలోన
క. పదివేల జంపగా నో,
పుదు నే ననునెత్తికోలు వుట్టినయది నీ
పదునొకడక్షౌహిణులను
జదురున నడిపింతు నెదిరి సైన్యము గలతున్
వ. అని పలికి వెండియు
క. నీవడిగిన పని యేర్పడం
గావిను మే నొక్కనెల దెగం జేయుదు నా
నావిధ దివ్యాస్త్రంబుల
లావున నప్పాండవుల బలంబుల నెల్లన్
[ఉద్యోగ పర్వం, చతుర్ధాశ్వాసం 408 ..411]
మొదటి వచనంలో చెప్పినట్టు రోజుకి పదివేల చొప్పున 30 రోజులకి మూడు లక్షలే కదా మరి ఏడు అక్షౌహిణులు ఎలా చస్తారా అంటే, అందరూ చావక్కర్లేదు కదా యుద్ధంలో గెలవడానికి. చూచాయగా ఓ నెల రోజుల్లో యుద్ధం అవగొట్టగలను అని అర్ధం అనుకుంటా. అదీగాక ఇలా చెప్పేముందు, భీష్ముడు రధికులని విభజిస్తూ చెప్పిన విషయం – హరి అటువైపు అర్జునుడితో ఉన్నంతకాలం అసలు కౌరవులు గెలిచే ప్రశ్నే లేదు; అయినా అడిగావు కనక చెప్తున్నా ఓ నెల రోజులు అని (రెండో కందంలో)
https://archive.org/details/andhramahabharat025924mbp/page/n333
ఈ కథ గురించి ramarao kanneganti అభిప్రాయం:
03/22/2019 8:46 am
“కాలిదాసు నుంచి కవిసమ్రాట్ దాకా, కాఫ్కా నుంచి కాల్వీనో దాకా, కారా నుంచి వేవేరా దాకా, ఇంకా ఎంతమందున్నారో ఎవరు లెక్కెట్టేరు; వారందరి కథలకూ ఈ కథకూ ఉన్న ఒక్క తేడా ఏమిటం” — ఇది రిపీట్ అయింది.
అనుసృజన బాగున్నది. చదువుతున్నట్లు కంటే, వింటున్నట్లు ఉన్నది. పద విన్యాసం బాగా తెలుస్తుంది!
మా ఈజిప్ట్ యాత్ర గురించి Suseela అభిప్రాయం:
03/22/2019 4:53 am
అద్భుతమైన వివరణ సార్! నా మనసులో కలిగిన భావాలకు అక్షరరూపం మీ మాటలు.తెలియని అనుభూతి కలిగింది. ధన్యవాదాలు మీకు.
నాకు నచ్చిన పద్యం: హృదయాన్ని తాకే మొల్ల కవిత్వం గురించి Balu అభిప్రాయం:
03/21/2019 1:42 pm
‘నాకు నచ్చిన పద్యం’ లో ప్రతీ పద్యం ఎలా పాడాలో ఆడియో చేసి అందిస్తే చదవటమే కాకుండా మా పిల్లలకు నేర్పడానికి ఉపయోగపడుతుంది.
పరిధి గురించి M.k.kumar అభిప్రాయం:
03/21/2019 1:37 pm
1 నవల కన్నా చిన్నది కథ కన్నా చాల పెద్దది
2 Readability బాగుంది
3 కథను బాగా లాగారు
4 అన్ని విషయాలు తడిమారు. దానివల్ల ప్రధానమైన విషయాలు మరుగున పడ్డాయి.
5 కథ మధ్యలో బాగా బోర్ కొట్టింది.
6. కథలో ఆర్టిఫిషల్ అంశాలు కొన్ని వున్నాయి.
7 1976 ప్రాతం లో ఇంట పెద్ద కథలను పాఠకులు ఎలా చదవ గలిగారో ఆశ్చర్యంగా ఉంది.
8 కథ విస్తృతి పెద్దది. బాగుంది.
వెల్చేరు నారాయణరావుతో ముఖాముఖీ గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
03/21/2019 11:41 am
ఇది రామాయణం లో పిడకల వేట లాటి కామెంట్ – భారత యుద్ధం గురించి ఒక పాఠకుడిక్కడన్న మాట ఈ ఆలోచనకి ప్రేరణ. వారన్నది – “మొత్తం పద్ధెనిమిది అక్షౌహిణిలూ కొట్టుకు చచ్చినది భూమి కోసం కదా?”
ఈ పద్దెనిమిది అక్షౌహిణులనే లెక్కని నేనెప్పుడూ “లిటరల్” గా తీసుకోలేదు. ఐనా సరదాగా ఒక్కక్షణం లెక్కలేసి చూద్దాం. ఒక అక్షౌహిణిలో లక్షకి కొంచెం పైగా పదాతులుంటారు. గుర్రాలు, ఏనుగులు, రథాల్ని కాసేపు పక్కనపెట్టి కేవలం మనుషుల్ని మాత్రం లెక్కేస్తే పద్దెనిమిది అక్షౌహిణుల్లో పద్దెనిమిది లక్షల మంది. ఒక మనిషికి సగటున 24 చదరపు అడుగుల స్థలం కనీసం కావాలి. పడుకోవటానికైతే ఆరుగుడుగుల పొడవు, నాలుగడుగుల వెడల్పు జాగా కనీసం కావాలి కదా. నిలబడ్డా ముందూ వెనకా కలిసి నాలుగైదు అడుగులు, అలాగే రెండు పక్కలా నాలుగైదు అడుగులూ. పద్దెనిమిది లక్షల మందికి 432 లక్షల చదరపు అడుగులు ఊరికే నిలబడటానికి కావాలి, యుద్ధం మాట దేవుడెరుగు. ఒక మైలుకి 5280 అడుగులు కనక ఒక చదరపు మైలుకి దాదాపుగా 279 లక్షల చదరపు అడుగులు. యుద్ధం చెయ్యాలి గనక మొత్తం కనీసం నాలుగు చదరపు మైళ్లయినా స్థలం కావాలి. తీరా చూస్తే (తెలుగు భారతాన్ని ప్రమాణంగా తీసుకుంటే) భారత యుద్ధం జరిగిన స్థలం పెద్ద విశాలమైందిగా కనిపించదు. ఉదాహరణకి దుర్యోధనుడు చివర్లో ఒక్కడే గద బుజానేసుకుని నడుచుకుంటూ సరస్సుకి వెళ్లిపోయాడు. అలాగే అంతటి యుద్ధం లోనూ భీముడు అరిస్తే ఒకచోటినుంచి మరోచోటికి వినిపించేదట. భీముడి ఊపిరితిత్తుల సామర్థ్యం వల్ల యుద్ధ కోలాహలం మధ్య మైళ్ల దూరం అతని గొంతు వినిపించిందని నమ్మటం అసాధ్యం. పైగా యుద్ధం జరిగింది చదునైన ప్రదేశంలో. పక్కనే అడవులు వున్న చోట ఎంత చదునైన ప్రదేశం దొరుకుతుంది? (అడవులున్నాయని ఎలా తెలుసంటే దుర్యోధనుడు మడుగు దగ్గర వుండగా ఆ పక్కనే వెళ్తున్న ఆటవికులు భీముడి కోసం వేట మాంసాలు తీసుకెళ్తూ అతన్ని చూశారు.) మరో అంశం – భీష్ముడు తనెంతమందిని చంపగలడని యుద్ధానికి ముందు అతన్ని దుర్యోధనుడు అడిగితే దానికి భీష్ముడు పదివేల మందినని సమాధానం చెప్తాడు. అక్కడ సందర్భం యుద్ధం లో గెలవటం ఎవరికి ఎన్నాళ్లు పడుతుందని లెక్క వేసుకునేది. కనక మిగిలిన లెక్కలెలా వున్నా భీష్ముడి లెక్కలో పదివేలమందిని చంపటంతో యుద్ధం ఐపోతుందన్న సూచన కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే పాండవుల వైపు పదివేలు, కౌరవుల వైపు పదిహేను వేలు మొత్తం పాతిక వేలు దాకా యుద్ధం లో పాల్గొన్నారని అనుకోవటం నిజానికి కొంత దగ్గర కావొచ్చు (భీష్ముడి పదివేల సంఖ్య ‘ఉతారుగా’ వేసినది కాకుండా గట్టిగా లెక్క పెట్టిందే అనుకుంటే). పాతికవేల చావులు తక్కువని కాదు గాని పద్దెనిమిది లక్షల కంటే మెరుగే కదా ! అసలు అప్పటి లెక్కల్లో లక్ష ఇప్పడు మనం అనుకుంటున్న లక్షకి సమానమని భావించటం సరైనది ఔనో కాదో కూడ చెప్పలేం. అలాగే వేలూ !!
——————————–
ఇంక అసలు విషయానికి వస్తే – ఈ సంభాషణని అందరికీ అందుబాటులోకి తెచ్చిన పరుచూరి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. నారాయణరావు గారి ఒంటరిపోరు పూర్తిగా వెలుగులోకి రావలసి వుంది. ఇండియాలోని తెలుగువాళ్లకి ఎలాగూ పట్టటం లేదు, పట్టిన వాళ్లకైనా ఆ ఆలోచనల తీరు వంటబట్టటమూ లేదు. విద్యాలయాల ‘పరిశోధకులు’ వాళ్ల గానుగుల్లో వాళ్లు చుట్టూ తిరుగుతూనే వుంటారు, అక్కడినుంచి బయటకి రాలేరు. దేశం బయటవున్న వాళ్ల మీదే మిగిలివున్న ఆశ.
రంగు బలపం: పులక్ బిశ్వాస్ గురించి ప్రశీ అభిప్రాయం:
03/21/2019 11:34 am
“హృదయంలో దీపం కనుక్కోవడం” ఎంత తపన కావాలి మిత్రమా…
వెల్చేరు నారాయణరావుతో ముఖాముఖీ గురించి వలివేటి అమరేంద్ర అభిప్రాయం:
03/20/2019 1:42 am
నమస్కారమండీ! వెల్చేరు నారాయణరావు గారు కృషి చేసి తీసుకువచ్చిన ఆంధ్రప్రభ సంపాదకులు వాసుదేవ దీక్షితులుగారి “ఖడ్గధార” పుస్తకాలు చదివాను. వాటికి ఆయన ముందుమాట రాశారు. దానిలో ఆయన “ఎవరా ఇంత హాయిగా తెలుగులో రాస్తున్నారు అని నేను పరిశీలించాను” అని రాశారు. అది నాకెంతో నచ్చింది. తర్వాత ఈనాడులో వారి ఇంటర్వ్యూ వచ్చిందొకసారి. ఎప్పుడైనా, ఏ విషయం పైనైనా, లోతైన విశ్లేషణ, స్పష్టమైన అభిప్రాయ వ్యక్తీకరణ, చదివిన వారిలో కొత్తకోణంలో ఆలోచనల ఆవిష్కరణ చేయించడం ఆయన విశిష్టత. ఇలాంటి మహానుభావుల అభిప్రాయాలు తరచూ మన తెలుగు నేలపై ప్రవహిస్తేనే మనమేంటో మనకు తెలుస్తుంది. మరొక్కమాట. ఇంతకీ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఈ ఇంటర్వ్యూ లో చెప్పినది నాకు పూర్తిగా అర్థం కాలేదు. వీలైతే చెప్పవలసినదిగా కోరుతున్నాను.
వెల్చేరు నారాయణరావుతో ముఖాముఖీ గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
03/19/2019 12:21 pm