పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. గడినుడి – 30 గురించి swatee అభిప్రాయం:

    04/04/2019 8:28 am

    బాగుంది

  2. సింహాసనం గురించి murthy అభిప్రాయం:

    04/04/2019 3:48 am

    ఈ బ్రిటిష్ వెధవలు అన్ని దేశాల సంపదలూ ఇలాగే దోచుకున్నారు. మనస్సు బరువెక్కే కథ.

  3. మల్లిక్ పాటలు, మరికొన్ని సంప్రదాయ పాటలు గురించి EVB Satyanarayana అభిప్రాయం:

    04/04/2019 2:37 am

    కృష్ణమ్మా గోపాలబాల కృష్ణమ్మా could not be played.
    Nostalgia. I used to listen these songs in the radio when I was very young.

  4. కాల్వీనో కథల నుంచి – 7 గురించి తః తః అభిప్రాయం:

    04/02/2019 5:40 pm

    “రచన గురించి కాక అది ఏ ప్రక్రియ అని ఆలోచించే ధోరణిని, మాత్రమే మేము తప్పు పట్టాం”

    అంటే – ఒక పద్యాన్ని గురించి కాక ఆ పద్యం ఏ చందస్సుల్లో ఉన్నది అని ఆలోచించే ధోరణి వంటిది అని అనుకోవచ్చా? Trying to understand and analyse a ‘ప్రక్రియ’ is also a study. I do not think it is a positive attitude to denounce ‘thinking about prakriyaas’.
    Thanks
    తః తః

  5. కాల్వీనో కథల నుంచి – 7 గురించి తః తః అభిప్రాయం:

    04/02/2019 12:33 pm

    సంపాదకులు క్షమించాలి, మీరు పేర్కొన్న విషయాలు చదివిన తరువాత వెలిబుచ్చిన అనుమానం కావటంవల్లనే “అంత నమ్మకమున్నప్పుడు…” అని అనటం జరిగింది. ‘పాత వాసనలు ఇంకా ఎందుకు!’ అని-

    తఃతః

    [ఏది ఎవరు ఎలా చెప్పినా అది కథే అన్న అంత నమ్మకం ఉండబట్టే! అందువల్ల కాల్వీనో రచనలను కథలు అనడంలో మాకు ఏ అభ్యంతరమూ లేదు. మా ముందుమాటలో ఎక్కడా దేనినీ కథ అని అనమని మేమనలేదు. ఇలా ఉంటేనే కథ, ఇలా ఉంటే కాదు అన్న ధోరణిని, రచన గురించి కాక అది ఏ ప్రక్రియ అని ఆలోచించే ధోరణిని, మాత్రమే మేము తప్పు పట్టాం. ఈ విషయం ముందుమాటలో మేము స్పష్టంగానే చెప్పామనే అనుకుంటున్నాం. ఉదాహరణకి, ఈ శీర్షికలోని కథలను అనువాదాలు అనవచ్చునా? అని మీరే ప్రశ్నించారు ఈమాటలోనే, అదీనూ కేవలం ‘అనువాదాలు’ అన్న బ్రాడ్ కేటగిరీలో ఉండడం వలనే! – సం.]

  6. చిన్న పత్రిక గురించి Anil battula అభిప్రాయం:

    04/02/2019 12:05 pm

    ప్రతి గురువారం[అనువాదం: యెన్.ఆర్.చందూర్] ఈ బుక్ లింక్.

  7. కాల్వీనో కథల నుంచి – 7 గురించి తఃతః అభిప్రాయం:

    04/02/2019 11:45 am

    “….సాహిత్యాన్ని ప్రక్రియల పావురాల గూళ్ళల్లో పెట్టే ధోరణి కొంతైనా పోతుందని మా నమ్మకం.”

    అంత నమ్మకమున్నప్పుడు కాల్వీనో రచనల నుంచి అనలేదేమండీ?
    తఃతః

    [తఃతఃగారు ఎప్పటిలానే భలే అనుమానం వెలిబుచ్చారు! ఐనా, ఈ “కాల్వీనో కథల నుంచి” అనేది 2012లో మొదలైన శీర్షిక కొనసాగింపు అని గమనించివున్నా, ఆ ముందుమాట కొంచెం శ్రద్ధగా చదివివున్నా ఈ అనుమానం వచ్చేది కాదేమో! – సం]

  8. నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుడు చూపిన తల్లిప్రేమ గురించి చిం. ల.న. శాస్త్రి. అభిప్రాయం:

    04/01/2019 7:20 pm

    శ్రీనాథుని కవిత్వ విమర్శ బాగుంది. శ్రీనాథుని జీవితానికి, సాహితీ సేవకు బహుశా సంబంధం ఉందేమో! అతని గ్రంథస్తం ఐన సుకుమారుని వ్యక్తిత్వంలో కవిగారి ప్రత్యక్ష పరిశీలన ఉండి ఉండవచ్చు. జీవితం కేవలం భోగానికే అన్నవిధమైనట్లున్న శ్రీనాథుని తాత్వికతే, అతని అంత్యదశలో అతని ఈతిబాధలకు కారణమైనదనుకుంటున్నాను. బృందావనరావుగారి విపులీకరణ దీనిని బలపరుస్తుంది. తెనాలి రామకృష్ణులవారి నిగమశర్మకు, ఈ సుకుమారునికి కొంత తేడా ఉన్నదేమో కదా.

  9. మల్లిక్ పాటలు, మరికొన్ని సంప్రదాయ పాటలు గురించి సూర్య వెంకట సుబ్రహ్మణ్యం నూకిరెడ్డి అభిప్రాయం:

    04/01/2019 9:19 am

    వీనుల విందైన శబ్దతరంగాలు వినిపిస్తున్నారు, నమస్కారములు. మీకు వీలుంటే అన్నమయ్య సంగీత రూపకం వినిపించగలరు.

    సూర్య వెంకట సుబ్రహ్మణ్యం నూకిరెడ్డి

  10. హంపి నుండి నూనేపల్లె… గురించి సాయి గోరంట్ల అభిప్రాయం:

    04/01/2019 6:31 am

    నాకిప్పటికీ చెప్పులంటే ఆ కాలం హవాయి చెప్పులే గుర్తుకొస్తాయి. ఐనా మన తరానికి ఎన్ని జ్ఞాపకాలు అన్వర్..

    “హనుమంతూ, నాకు పుస్తకం వద్దు కానీ డబ్బులు ఇస్తాను, చెప్పులు కొనుక్కుంటావా? ఊరికే ఇస్తున్నావని తప్పుగా అనుకోవద్దు, నాకూ నీ మాదిరి కొడుకు ఉన్నాడు. వాడు చెప్పులు లేకుండా తిరిగితే నాకు బాధ అనిపించదా?” (గాడ్దె కొడకా! నిజంగా నీ కొడుక్కు చెప్పులు లేకపోతే నీ కాలికి ఉన్నవి గబగబా విప్పి వాడి కాలికి తొడగవా” ఈమాటలు నావి కూడా.