పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. తోడు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    05/02/2019 10:55 pm

    ” కొత్త పంథాలో కథలు అందించిన ఇజ్రాయిల్ కు చెందిన రచయిత, సినీ దర్శకుడు “ఎట్గర్ కెరెట్”. ఈయన హిబ్రూలో రాసిన కథలను ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి. “అనువాదం తర్వాత నా కథలో మిగిలింది పిప్పి మాత్రమే. హ్రిబ్రూ భాషలోని గమ్మత్తంతా అనువాదంలో మిస్ అయిపోతుంది” అని ఆయనే ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పారు. ” ~ పూర్ణిమ
    http://pustakam.net/?p=16356

    Etgar Keret ( born on August 20, 1967 ) is an Israeli writer known for his short stories, graphic novels, and scriptwriting for film and television. His books had been published in more than thirty languages. Keret has received the Prime Minister’s award for literature, as well as the Ministry of Culture’s Cinema Prize. In 2010, Keret received the Chevalier (Knight) Medallion of France’s Ordre des Arts et des Lettres.

    “Not Completely Alone” is a psychological profile, outlined in just a little over two pages, of a kind only Etgar Keret can draw. It’s this kind of writing that makes his work worth reading.

    “Etgar Keret is a genius…” — New York Times

    “A brilliant writer…completely unlike any writer I know. The voice of the next generation.” — Salman Rushdie

  2. చివరి వాల్‌పోస్టర్… గురించి Himabindu అభిప్రాయం:

    05/02/2019 10:32 pm

    “ఆకాశం ఊదే మెరుపుదెబ్బ వంటి అక్షరాలు కాగితంపై ఉరిమి చూడాలంటే ఆర్టిస్ట్ కావాలి. “ ఎంతో బాగుంది మీ రచన .
    ఆభినందనలు .

  3. తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – చివరి భాగం గురించి మురళీకృష్ణ అభిప్రాయం:

    05/02/2019 2:41 pm

    అగ్నిసంస్కారాలు తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవాలనుంది..

  4. ఇద్దరు పిల్లలు గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    05/02/2019 12:51 pm

    అదేదో సినిమాలో పాట ఉంది.
    “పిల్లలూ, దేవుడూ చల్లని వారే
    కల్లకపటమెరుగని కరుణామయులే”
    అది గుర్తు వచ్చింది.

  5. చరమరాత్రి గురించి ఉరుపుటూరి శ్రీనివాస్ అభిప్రాయం:

    05/02/2019 4:48 am

    కథ లింకు కనబడడం లేదు?

    [ఒకప్పుడు స్క్రిబ్‌డ్ సర్వర్ మీద పెట్టిన రచనల లింకులు పనిచేయటం లేదు. ఆ రచనలన్నిటినీ ఈమాటకు మారుస్తున్నాం. కొద్ది సమయం వేచిచూడండి. – సం.]

    [3/5/19: పిడిఎఫ్ ప్రతి లింక్ జతచేయబడినది – సం.]

  6. ఉద్యమ కవితా శివసాగరం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    05/01/2019 11:57 pm

    ” మహాసంకల్పం ఎర్రజెండాగా ఎగిరే చోట ”
    సూరీడూ! నీ కోసం ఎదురు చూస్తాం.

  7. కొన్ని దూరాలంతే! గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    05/01/2019 12:39 pm

    కోగంటి గారు
    “ధన్యవాదాలు” అనే పదం పైన ఉన్న వాక్యం అనవసరం అని నేను అనుకుంటున్నానండి. మీరు ఎప్పుడైతే ఒక కవితో కథో ఒకటి పబ్లిగ్గాచదవడానికి పెట్టారో అప్పుడే దాని మీద వచ్చే “ఎటువంటి” వాఖ్య కైనా సిద్ధంగా ఉండాలి. మీరో ఐడియాతో రాస్తే చదివే వారికి మరో కోణం కనిపిస్తుంది. అందుకే “డైవర్సిటీ” అనేది చాలా ముఖ్యం అంటారు. మీకు కవిత్వం తెలిసిన/వచ్చినవాళ్ల దగ్గర్నుంచి మాత్రమే ఏదైనా వెనక్కి రావాలని అనుకుంటే ఆ మాట చెప్పవచ్చు – ఇదిగో మీకు కవిత్వం రాకపొతే ఏమీ కామెంటకండి అని. ఎప్పుడైతే వాఖ్య మీకు నచ్చినట్టూ రాదో అదే మీకు ఒక మంచి విషయం; ఎందుకంటే ఆ కామెంట్ లోంచి మీకు మరో కోణం, మరో కవితకో కథకో స్ఫూర్తి రావొచ్చు. ఆహా ఓహో అనేవారితో మీకు ఉపయోగం పెద్దగా ఉండదనుకుంటున్నాను. కనీసం ఇది నా స్వంత అభిప్రాయం; నాకు రాయడంలో దోహదం చేసినది.

    మరో విషయం, ఏదైనా కథో, కవితో చదివినప్పుడు చదివే మనుషుల మానసిక స్థితి కూడా కామెంటడంలో సహకరిస్తుంది. పెద్దన అందుకే కాబోలు కవిత్వం చెప్పాలంటే సుష్టుగా భోంచేసి తాంబూలం వేసుకుని హాయిగా ఉయ్యాలలో ఊగుతుంటే బాగుంటుందంటాడు (నాకు గుర్తున్నంతలో).

    ఇదంతా నా స్వంత స్వకపోల విషయం; మిమ్మల్ని వెక్కిరించడానిక్కాదు. నమస్కారం.

  8. ఉద్యమ కవితా శివసాగరం గురించి Kurmanath అభిప్రాయం:

    05/01/2019 6:54 am

    బాగుంది, సూఫీ.

    కొత్త తరాలకి శివసాగర్ పరిచయం చెయ్యడం అవసరం. కవిత్వం పేరుతో భావకవిత్వం, ఆత్మాశ్రయ కవిత్వం కుప్పలుతెప్పలుగా వస్తున్న రోజుల్లో శివసాగర్ గురించి రాయడం అత్యవసరం.

    ఇంకా వివరంగా కూడా రాయాలి.

    శివసాగర్ ప్రపంచ విప్లవ సాహిత్యంలోనే అరుదైన, అపురూపమైన కవి. విప్లవాన్ని కాంక్షించి, శ్వాసించిన శివసాగర్, ప్రతి కవితలోనూ విప్లవ అశావాదాన్ని పలికించి స్ఫూర్తి కలిగించాడు.

    శివసాగర్ లేని తెలుగు సాహిత్యాన్ని, విప్లవసాహిత్యాన్ని ఊహించడం కష్టం.

    కలిసింది కొన్నిసార్లే అయినా అ ఆత్మీయకలయికల warmth ఇప్పటికీ వుంది.

  9. కొన్ని దూరాలంతే! గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:

    05/01/2019 2:07 am

    కుమార్ గారికి నమస్సులు.

    మీరు కవిత చదివినందుకు ధన్యవాదాలు. విమర్శ చేయాలని ప్రయత్నించినందుకూ ధన్యవాదాలు. కవిత్వమంటే అన్నీ వివరంగా విశదీకరించటం కాదు అని నాకు తెలిసినంతవరకూ. వెలుతులు పూడ్చడం, సమాధానాలు చెప్పడం కవిత్వం కాదు. ఒక మనోస్థితిని ప్రతీకల ద్వారా వర్ణించడమే నేను చేయ దలుచుకున్న పని. కవికి పాజిటివ్ నెగటివ్ దృక్పథాలు ఉండవు.

    కవిత్వ విమర్శ చేసే ముందు ఇంకొంచెం లోతుగా కవిత్వం గురించి తెలుసుకుంటే బాగుంటుందేమో.

    ధన్యవాదాలు.

  10. వసంతం గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:

    05/01/2019 1:48 am

    ధన్యవాదాలండీ