పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    05/10/2019 4:28 am

    కొంత ఆలస్యంగా పై అభిప్రాయం చూసా!

    బృందావని – బృందావని సారంగ రాగాల మధ్య ఉన్న తేడాల పై అనుభవజ్ఞులైన విద్యాంసులలో ఎన్నో అభిప్రాయ బేధాలున్నాయి.

    అతి దగ్గరగా వినిపించే ఈ రాగాల మధ్య ఒక ముఖ్య బేధం అవరోహణలో వాడే “గాంధారం” స్వరం. ఈ రాగాల స్వరాల ఆరోహణ-అవరోహణ (నాకు తెలిసినంత వరకు) ఈ విధంగా ఉంటాయి. ఈ విషయంలో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి.

    రాగం ఆరోహణ అవరోహణ
    బృందావని-సారంగ స రి2 మ1 ప ని2 స స ని1 ప మ1 రి2 గ2 రి2 స
    బృందావని స రి2 మ1 ప ని2 స స ని1 ప మ1 రి2 స

    ఈ రెండు రాగాల్లో బృందావని సారంగా రాగం ఎక్కువ ప్రాచుర్యం పొందిన రాగం. బృందావని అతి తక్కువగా వినపడే రాగం!

    గూగుల్ లో ఈ రాగాలపై ఉన్న వివరణ చూస్తుంటే, ఇప్పటికే ఈ రెండు రాగాల మధ్య ఉన్న అయోమయం మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది!

    వ్యాసంలో ఉదాహరించిన బాలమురళి తిల్లాన ఇక్కడ వినవచ్చు.

    http://www.youtube.com/watch?v=cSIe2-VKSfQ

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  2. నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుడు చూపిన తల్లిప్రేమ గురించి తః తః అభిప్రాయం:

    05/09/2019 11:28 am

    ‘అరుణ గభస్తి బింబముదయాద్రి పయింబొడతేర, గిన్నెలోఁ
    బెరుఁగును….’
    ముస్లిముల పాలన తదనంతరం ఆంగ్లేయుల ‘మ్లేచ్చ ‘పాలన బహు కాలం సాగి ముగిసిన తరువాతి ఆధునిక కాలాన కూదా , ఏడో/ఎనిమిదో ఏడు రాంగానే ఉపవీతియై ఉదయ సంధ్యలో తండ్రి తో కలిసి సంధ్యావందనం చేసుకుంటుంటేచూసి మురిసిపోయే (బ్రాహ్మణ] తల్లులు’ఉన్న దేశంలో పొద్దు పొడవగానే ‘గిన్నెలోఁబెరుఁగును, వంటకంబు, వడపిందియలుం గుడువంగబెట్టి’ ఆ తల్లి చేజేతులా పిల్లాణ్ణి చెడగొట్టుకుందా!

  3. చివరి వాల్‌పోస్టర్… గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    05/09/2019 2:38 am

    మోహన్‌కు ముందున్న కళ తాలూకు ఆ వంపులు, సొంపులు, వాలుకళ్ళు, పారాణి కాళ్ళు తప్ప ఏవీ ఎరగని ఆ సెక్స్ సింబల్ తెలుగు బొమ్మాయి నడుముకు చెంగు బిగించి పొలికేక నేర్పించింది, కళ్ళు ఉరమడం దిద్దింది మోహన్ కుంచె.

    అన్వర్ అక్షరాలకే చెల్లింది అలా రాయడం.

  4. ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    05/06/2019 2:14 am

    “బాలమురళి తిల్లానాలతో బాగా పరిచయమైన వారికి ‘సొగసులూర హొయలుమీర’ తిల్లానా గుర్తుండే ఉంటుంది. ఈ తిల్లానా కూడా బృందావన సారంగ రాగంలో స్వరపరిచారు బాలమురళి. ”

    అది బృందావని కదా. రెండూ ఒకటి కాదు అని అనుకుంటున్నాను.

  5. ఇద్దరు పిల్లలు గురించి dasaraju ramarao అభిప్రాయం:

    05/05/2019 10:08 am

    కథనం ఆసక్తిదాయకం.

  6. తోడు గురించి nagamurali అభిప్రాయం:

    05/05/2019 2:05 am

    చెత్త కథ అన్న కామెంటు చూసి కథ చదివేను (లేకపోతే చదవకపోదును). మంచి సైకాలజీ కథ. యాక్ ఫీలింగ్ ని దాటగలిగితే, నచ్చే కథ. నాకు గొప్పగా అనిపించిన కథ.

  7. తోడు గురించి Lalitha TS అభిప్రాయం:

    05/03/2019 5:42 pm

    రచయితలకు సూచనలు అన్న శీర్షిక కింద వున్న ఈమాట ఆశయాల్లో ఏ సదాశయాన్ని ప్రతిబింబిస్తోందో ఈ కథ అనాలోచించి, ఇంకాలోచించలేక ఈ కమెంట్ రాస్తున్నా. తెలుగు అక్షరం కనిపిస్తే చదివెయ్యాల్సిందే అన్న నా కుతూహలాన్ని నేనే తిట్టుకుంటున్నా.

  8. చివరి వాల్‌పోస్టర్… గురించి Lalitha TS అభిప్రాయం:

    05/03/2019 5:06 pm

    “అది మోహన్ మాత్రమే అయి ఉండాలి. ఆ దారి చిత్తప్రసాద్ మాత్రమే వేసినది అయి ఉండాలి.”

    ఆ మోహన్, చిత్రప్రసాద్ గార్లు ఎవరో, వారేం చేసేవారో / చేస్తున్నారో ఇంకొంచెం context ఇచ్చుంటే the-ignorantly-blissed-me కి ఇంకొంచెం బాగా అనిపించేది.

  9. ఇద్దరు పిల్లలు గురించి Lalitha TS అభిప్రాయం:

    05/03/2019 4:58 pm

    మాటను సాగదీస్తూ చెప్పారాయన: “ఇక్కణ్నే… ఇప్పుడే… పిల్లల్ది ఎంత సేపు.”

    నిజం! పిల్లలు కలిసినట్లు కలవాలంటే పెద్దలకి జీవితకాలం పడుతుంది – అప్పటికీ కుదరదేమో కొందరితో.
    పెద్దలందరూ కనీసం పలకరింపు వరకూ పిల్లలైతే ఎంత బాగుండునో! నాకు మీ ఈ write-up చాలా నచ్చింది, రాజిరెడ్డిగారు!.

  10. ఉద్యమ కవితా శివసాగరం గురించి సూఫీ అభిప్రాయం:

    05/03/2019 10:16 am

    థాంక్ యూ సర్… 🙂