పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. జింకపిల్ల గురించి a v subrahmanyam అభిప్రాయం:

    05/20/2019 10:57 am

    చాలా బాగుంది

  2. చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి nivas అభిప్రాయం:

    05/19/2019 8:20 am

    పద్యాలకు పూర్తిగా మీనింగ్ తెలుగులో ఇవ్వలేదు ఇక్కడ. అందువలన పూర్తిగా ఆస్వాదించలేకపోయాను. దయచేసి అర్థాలను దానితోపాటు వాటిని వివరించే వ్యాఖ్యానాన్ని జతచేస్తే మావంటి పాఠకులకు సహాయం చేసిన వారవుతారు.

  3. సాహిల్ వస్తాడు, రాక తప్పదు! గురించి Paresh Doshi అభిప్రాయం:

    05/17/2019 11:09 am

    Thank you Vijay Koganti garu

  4. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

    05/17/2019 2:50 am

    తెలుగులో రాళ్ళపల్లి ఒక అద్భుతం . ఆయన సాహిత్య విమర్శలు – సంగీత పరామర్శలు ఎంతో హృద్యంగా ఉంటాయి . ఈ ఉపన్యాసం ఒక్కటి చాలు ఆయన స్థాయి తెలపడానికి. లైలా గారి అభిప్రాయాలు ఎన్న దగినవి .

    రవిశంకర్ పేర్కొన్న సంగీతజ్ఞుడు విష్ణు నారాయణ్ భాత్ఖండే ( హిందూస్థానీ సంప్రదాయాన్ని గ్రంథస్థం చేసి – నేర్పడానికి వీలుగా స్వరలిపిని జతపరచినవాడు – రాజాశ్రయం పొంది సంగీత కళాశాలలు స్థాపించాడు . అందులో ఒకటి -భాత్ఖండే music institute – లక్నో -ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ . చాలా మంది ఉత్తరాదిలో ఈ సంస్థ ద్వారా సంగీత శిక్షణ పొంది – సంగీతాన్ని వృత్తిగా ఎంచుకుంటారు.. వారిదగ్గర భాత్ఖండే రచించిన హిందుస్తానీ సంగీత పధ్ధతి ( నాలుగు ఉద్గ్రంథాలు -దాదాపు నాలుగువేల పుటలు) చూడవచ్చు. మరిన్ని వివరాలకు వికీ లింకు
    చూడండి : https://en.wikipedia.org/wiki/Vishnu_Narayan_Bhatkhande

  5. మాదీ, రాజుగారిదీ! గురించి Lyla yerneni అభిప్రాయం:

    05/16/2019 3:31 pm

    That’s funny! Enjoyed the vignette. Thank you!

  6. సాహిల్ వస్తాడు, రాక తప్పదు! గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:

    05/15/2019 9:47 pm

    Very interesting and balanced review. Congratulations Paresh garu.

  7. త్రిపథ: కొన్ని రామాయణ విశేషాలు గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:

    05/15/2019 9:44 pm

    చాలా ఆసక్తికరంగా కొన్ని గూఢమైన విషయాలు తెలియచేస్తూ ప్రచారంలో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న కొన్ని అపోహలను తప్పుడు వుద్దేశ్యాలను యీ పుస్తకం తప్పక తొలగిస్తుంది. తప్పక చదవవలసిన పుస్తకం.

  8. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం గురించి Lyla yerneni అభిప్రాయం:

    05/15/2019 2:23 pm

    ప్రసంగం నాకు నచ్చింది. మాట్లాడుతున్నదెవరు! మరి! ‘సారస్వతాలోకము’ అన్న తన వ్యాససంపుటిలో ఒక వ్యాసం లో ‘కావ్యమునకు జీవనము రసము’ అంటూ ‘రసము’ అంటే ఏమిటని తెలియ చెప్పిన వారు. (Pages 99 – 101, నవోదయ పబ్లిషర్స్, హైదరాబాద్.) వీరి ప్రసంగం రసవిహీనంగా ఉంటుందా? No way!

    రాళ్లపల్లి తమ ఆలోచనలు, స్పష్టమైన మాటల్లో, స్పష్టమైన చక్కని స్వరంలో చెపుతారు. బయటి ప్రపంచంలో -తను మాట్లాడదలచిన విషయంలో విభిన్నతలు ఉంటే, అవి ఏమిటో వారి ఉపన్యాసం లోనే చెపుతారు. సైంధవి రాగం దక్షిణ భారతంలో మునుపటి నాలుగు రకాల వాడుకలు ఎంత ఓర్పుతో విడదీసి చెప్పారు!
    ఈ వక్త, విషయం ఏదైనా అర్థం కాకపోతే కాలేదని చెపుతారు. ప్రసంగం లో ఒకచోట (listen at 3.50 of tape) ‘మ’ ‘పూర్ణంగా’ ఉండాలి అంటే ఏమో నాకు అర్థం కాలేదన్నారు రాళ్లపల్లి. నేననుకోటం, దాని అర్థం, composer is instructing the musician to – Hold the note for its full value. (Tenuto.)

    ప్రసంగం లో వసుచరిత్రలోనుంచి ఉదహరించిన పద్యం గురించి:
    ఈ ప్రసంగం లో లాగే, చక్కని వివరణలు రాజన్నకవి – (వసుచరిత్ర కవితా విపంచి) వ్యాసంలోను, అలాగే వ్యాఖ్యాన సహితమైన వసుచరిత్ర డిజిటల్ వర్షన్ లోనూ గమనించ వచ్చును. రచయితల అభిప్రాయాలలో చిన్ని తేడాలున్నవి. అన్నీ చదువుకుంటే చాలా సరదా కలుగుతుంది. పద్యం లోని విశేషార్థము బాగా తెలుస్తుంది. సింధుకన్యకలు ఇందులో ముగ్గురు. సింధు ప్రాంతంలో పుట్టిన రాగం, లక్ష్మి, కావ్య నాయిక గిరిక కూడాను. కాని పద్యాన్ని సైంధవి/ సింధూర రాగానికి లక్షణ పద్యంగా ఎవరం అనుకోనక్కర్లేదు. (పాఠక మిత్రులు వసుచరిత్ర కావ్యంలో ఈ పద్యం కన్నా మరో రెండు పద్యాల ముందర, ఒక సీస పద్యంలో – గిరిక, వసురాజుల పెళ్లి అప్పటి ఆర్కెస్ట్రా, పెళ్లి కోలాహలం కూడా వినొచ్చు.)

    సంగీత రాగాల పేర్లు, పుట్టుకలు, గుర్తించటాల గురించి:
    ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి -అని, ఇప్పుడు ఖరారుగా బతికి ఉన్న ఒక్కొండు రచయితలు పన్నెండు సార్లు చెప్పేకన్నా, ( అదీ ఒక విషయమే అనుకోండి ) ప్రతి పిక్కి పిక్కి స్వర విభేదానికీ ఒక కొత్తపేరు తగిలించే కన్నా ( అదీ ఒక పనే అనుకోండి. ) నా ఉద్దేశంలో – ఏ శాస్త్రం లో నైనా, క్లాసిఫికేషన్స్ బేసిస్ తెలపగలగటం/తెలుసుకోటం ఎక్కువ ఉపయోగకరం. ఉంటాయి విభేదాలు. కాని ప్రతి సంగీతం విషయం గురించి సందిగ్ధతలు మాత్రమే ఉండటానికి సంగీతం రెలిజన్ కాదు కదా? సంగీతం శాస్త్రమయ్యె. ఈ సైన్స్ లోనూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ యా శాస్త్రజ్ఞులు సంభాషించుకోటం వెసులుబాటు కోసం, దానికో సాంకేతిక భాష, విభజన పథకాలుంటం, అవి అవసరాన్ని బట్టి అప్డేట్ చెయ్యబడటం జరుగుతుంది. సంగీత రాగాల ( అలాగే ఛందస్సు) విభజన పథకాల బేసిస్ ఏమిటి అని తెలిస్తే, ‘కొందరు’ ఎవరికి వారే రాగాలు, స్వర స్థానాలు డిరైవ్ చేసుకోగలరు. కొన్ని పాటలు (పద్యాలు) వారే డిజైన్ చేసుకోగలరు.

    రవిశంకర్ My music, My Life అన్న పుస్తకం లో (109 వ పేజీ) హిందూస్తానీ రాగాలు (థట్) ప్రధానమైనవి పట్టుమని పది ఉన్నాయని, అవి బిలావల్, కళ్యాణ్, ఖమాజ్, కాఫీ, అసావరి, భైరవి, భైరవ్, పూర్వీ, మార్వా, తోడి – అని తెలిపాడు. ఇది 20 వ శతాబ్ది ‘వి. ఎన్. భక్తఖండే’ ప్రతిపాదించిన విభజన అనీ, దీనికన్న పదిహేడవ శతాబ్ది ‘వెంకట మఖి’ 72 మేళకర్తల విభజన ఉత్తమమైనదని అంటాడు.
    In Ravi Shankar’s words (page 30):
    “I myself however, as well as a number of other musicians, do not feel that these ten scales adequately accommodate a great variety of ragas. For there are many ragas that use notes not contained in these ten Thats. We therefore think it is more reasonable and scientific to follow the old Melakartha system of the south, because it can almost sustain any raga, no matter how unusual its ascending and descending structures.”

    సంగీత విద్వాంసులు రచించిన సంగీతవిషయకమైన గ్రంథాలు, (జీవిత చరిత్రల పోసుకోలు కాదు) కొన్నైనా చదవటం నాకిష్టం. The next book in queue for me is – ‘The infinite variety of music’ by Leonard Bernstein.

    అన్నమయ్య పాట గురించి:
    అనంతకృష్ణ శర్మ గారు, సైంధవి రాగంలో అన్నమయ్య పాడినట్టు లేదన్నారు. పాడలేదేమో. కాని ఇక్కడ విజయవాడ రేడియోకేంద్రం వారి ఆర్టిస్టులు వినిపించారు.
    There you go. Another feather in the cap of Bezwada. Thanks for the lovely broadcast! -Lyla

  9. ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి కందుకూరి వేంకటేశ్వర్లు అభిప్రాయం:

    05/14/2019 2:17 am

    ఈమాట వేదిక నలంకరించిన వారికి నమస్కరించి, ఘంటసాల గారి స్వరం నుండి వచ్చిన పద్యాలు బాగున్నాయి.ఇవి నన్ను చాలా చిన్నప్పటి జ్ఞాపకాలకు మళ్ళించాయి. అందించినవారి కృతజ్ఞతలు. రేడియోలో నా చిన్నప్పుడు విన్నటువంటి పద్యాలలాగా అనిపించడం లేదు. ఎలా తెలపాలో తెలియడం లేదు. కాకపోతే దయచేసి ఇంకా అటువంటి గానాలు, ఇంకా ఎవరివైనా సరే కందపద్యాలు ఉండివుంటే ఎవరైనా తెలుపగలరని కోరుకుంటున్నాను.

    విశ్వకర్మ

  10. కొలమానం గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    05/13/2019 8:05 am

    మొన్న రెక్కలావు!

    ఈ రోజిక్కడ కత్తిమేక రెండూ రెండే!!