నమ్మశక్యం కాని హాస్యాస్పదమైన వాస్తవిక ప్రపంచం, వెంబడిస్తున్న స్వప్నంలోని సత్యం. ఈ రెంటి మధ్య ఉంది బైరాగి ఆత్మ. దాస్కవిస్కీని చదివినట్టే ఉంది. థ్యాంక్స్ ఈమాట.
శ్రీనివాస్ గారు, మీ ప్రోత్సాహనికి ధన్యవాదాలు. జిమ్ గ్రే తరం వారిలో ఇద్దరు ముగ్గురు తప్ప, అందరూ ఉద్యోగం నుండో, లోకం నుండో విరమించినట్లే. వారు మొదలెట్టిన సైన్సు విజయవంతంగా సాగుతున్నా, అకాలంలో అదృశ్యమైన వారి స్మరణ అశ్రువులు రాల్పిస్తుంది:
The boat tilts frozen on the storm’s wild wave.
The concert has halted between two notes.
An interregnum, sufficiently extended,
becomes an absence. When wise
and kindly men die, who will restore
disappeared excellence to its throne?
— From “Stolen,” by John Updike.
మీరు నాకు 6వ తరగతి నుండి 10వ తరగతి భౌతిక శాస్త్ర విషయాల నుండి చాలా అంశాలను ఉత్తేజకరమైన రీతిలో గుర్తు చేశారు. ఈ వాస్తవాలను వివిక్త పద్ధతిలో నేర్చుకున్నాను. వాటిని కాలక్రమానుసారం నేర్చుకోవడం ఆసక్తికరంగా ఉంది.
కథనం నాకు యాకోవ్ పెరెల్మాన్ (రష్యన్ రచయిత) పుస్తకాలను గుర్తు చేసింది.
సీరియల్‌గా వచ్చిన యండమూరి నవలల కోసం వేచి చూసినట్లుగా, తదుపరి భాగాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
హృదయాన్ని కదిలించే కథనం. నాకు గ్రే తెలియదు, కానీ చెప్పిన కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోగలిగాను. మీ కథనం చాలా చదవదగినది గా ఉంది. అతను మిమ్మల్ని, మీ కొడుకును విందులో కలిసినప్పుడు ఏమి జరిగిందో తెలుసుకోవాలనుకున్నాను. మీ కథన శైలి ఆకర్షణీయంగా ఉంది. సైన్స్‌కు సంబంధించిన వివిధ అంశాలపై రాయడం కొనసాగించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.
ఒక సారి కాదు. పది సార్లు చదివి పూర్తిగా ఆకళింపు చేసుకుని ఆనందిచదగ్గ అద్భుతమైన తులనాత్మక వ్యాసం అందించిన ఆత్మీయులు రచయిత విజయ సారథికి, ఈమాట రధసారధి సురేష్ కొలిచాల కీ ధన్యవాదాలు. అభినందనలు.
చక్కని విశ్లేషణ. తులనాత్మక పరిశీలన చేయాలంటే మామూలు విషయం కాదు. అటు వాల్మీకి శ్లోకాలను, ఇటు విశ్వనాథ వారి పద్యాలను ఎన్నిసార్లు చదువుకున్నారో! ఎంతగా వాటి భావాల సారాన్ని గుండెల్లోకి ఒంపుకున్నారో! చాలా కష్టపడిన గుర్తులు వాక్య నిర్మాణాలలో కనపడుతున్నాయి. అనుభూతిని అక్షరంగా మార్చి ఈ వ్యాసాన్ని వ్రాసిన వ్యాసరచయిత శ్రీ విజయ సారధి గారికి హృదయ పూర్వక అభినందనలు. 🙏
జేబు దొంగ గురించి gs rammohan అభిప్రాయం:
10/04/2025 12:41 am
నమ్మశక్యం కాని హాస్యాస్పదమైన వాస్తవిక ప్రపంచం, వెంబడిస్తున్న స్వప్నంలోని సత్యం. ఈ రెంటి మధ్య ఉంది బైరాగి ఆత్మ. దాస్కవిస్కీని చదివినట్టే ఉంది. థ్యాంక్స్ ఈమాట.
అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
10/02/2025 8:21 pm
శ్రీనివాస్ గారు, మీ ప్రోత్సాహనికి ధన్యవాదాలు. జిమ్ గ్రే తరం వారిలో ఇద్దరు ముగ్గురు తప్ప, అందరూ ఉద్యోగం నుండో, లోకం నుండో విరమించినట్లే. వారు మొదలెట్టిన సైన్సు విజయవంతంగా సాగుతున్నా, అకాలంలో అదృశ్యమైన వారి స్మరణ అశ్రువులు రాల్పిస్తుంది:
The boat tilts frozen on the storm’s wild wave.
The concert has halted between two notes.
An interregnum, sufficiently extended,
becomes an absence. When wise
and kindly men die, who will restore
disappeared excellence to its throne?
— From “Stolen,” by John Updike.
కొడవళ్ళ హనుమంతరావు
నకులుని గుఱ్ఱం గురించి రమేష్ పేరి అభిప్రాయం:
10/02/2025 12:35 pm
చాలా మంచి సాహిత్యం.
ఏనుగు, మర్రిచెట్టూ… చలం! గురించి S R Parimi అభిప్రాయం:
10/02/2025 11:05 am
చలం ఆలోచనలను పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీ శ్రమకు జోహార్లు.
సూడోసైన్స్‌పై వైదిక సనాతనుల ధిక్కారం గురించి harichandan అభిప్రాయం:
10/02/2025 11:02 am
ఈ వ్యాసము వ్రాసిన ఆ రచయితగారు ఎవరు ? 17-21 శతాబ్దుల సమన్వయం బాగుంది. ఉద్దేశ్యం ఆ హేతువు అర్థమవుతున్నది. చూసే కోణం స్పష్టమవుతున్నది.
[రచయిత పేరు జత చేసినాము – సం.]
కంప్యూటర్ చిప్ కథ – 6: రసాయనాన్ని విద్యుత్తుతో సంధించిన హంఫ్రీ డేవీ ప్రయోగాలు గురించి Srinivas అభిప్రాయం:
10/02/2025 10:55 am
వాస్తవ కథ యొక్క మరో మనోహరమైన భాగం.
మీరు నాకు 6వ తరగతి నుండి 10వ తరగతి భౌతిక శాస్త్ర విషయాల నుండి చాలా అంశాలను ఉత్తేజకరమైన రీతిలో గుర్తు చేశారు. ఈ వాస్తవాలను వివిక్త పద్ధతిలో నేర్చుకున్నాను. వాటిని కాలక్రమానుసారం నేర్చుకోవడం ఆసక్తికరంగా ఉంది.
కథనం నాకు యాకోవ్ పెరెల్మాన్ (రష్యన్ రచయిత) పుస్తకాలను గుర్తు చేసింది.
సీరియల్‌గా వచ్చిన యండమూరి నవలల కోసం వేచి చూసినట్లుగా, తదుపరి భాగాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే గురించి Srinivas అభిప్రాయం:
10/02/2025 4:07 am
హృదయాన్ని కదిలించే కథనం. నాకు గ్రే తెలియదు, కానీ చెప్పిన కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోగలిగాను. మీ కథనం చాలా చదవదగినది గా ఉంది. అతను మిమ్మల్ని, మీ కొడుకును విందులో కలిసినప్పుడు ఏమి జరిగిందో తెలుసుకోవాలనుకున్నాను. మీ కథన శైలి ఆకర్షణీయంగా ఉంది. సైన్స్‌కు సంబంధించిన వివిధ అంశాలపై రాయడం కొనసాగించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.
బహు సుందరుడు సుందరకాండ చందురుడు గురించి వంగూరి చిట్టెన్ రాజు అభిప్రాయం:
10/02/2025 3:47 am
ఒక సారి కాదు. పది సార్లు చదివి పూర్తిగా ఆకళింపు చేసుకుని ఆనందిచదగ్గ అద్భుతమైన తులనాత్మక వ్యాసం అందించిన ఆత్మీయులు రచయిత విజయ సారథికి, ఈమాట రధసారధి సురేష్ కొలిచాల కీ ధన్యవాదాలు. అభినందనలు.
పంచర్ గురించి v.srinivasa rao అభిప్రాయం:
10/02/2025 3:00 am
చాలా బావుంది కథ.
బహు సుందరుడు సుందరకాండ చందురుడు గురించి prof. T. Patanjali అభిప్రాయం:
10/02/2025 2:05 am