ఈ ప్రపంచాన్ని తాదాత్య్మత చెందుతూ చూసే యాత్రా పధికుడు
ప్రియమైన శ్రీ దాసరి అమరేంద్ర గారూ !
అబ్బూరి ఛాయాదేవి గారు 2002 లో చైనాను సందర్శించారు. అక్కడి అనుభవాలను “చైనాలో ఛాయాచిత్రాలు “గా ప్రచురించారు.
బుక్కు ఎక్కడ దొరుకుతుందో మన గొరుసన్నను అడిగితే తెలుస్తుంది. లేదూ సి. ఆర్. హోమ్
( Chandra Rajeshwararao Old Age Home Kondapur, Hyderabad ) కి ఫోను చేసి మన ఏబికే ప్రసాద్ గారిని అడగొచ్చు. పోనీ తీరిక చేసుకుని మీరే ఓ సారి అటేపు కూడా వెళ్లి రాకూడదూ.
” మమతల తావినై మనసంతా నిండిపోవాలని
పరితపించి పరితపించి పరాజయం పాలయ్యాక
తీరా నేను విముక్తమయ్యాక!
గొంతు ఎండిపోయేలా దుఃఖిస్తూ ”
కలిగించిన గ్లూం నుండి తప్పించుకోవటానికి సతిగా అగ్నికి ఆహుతి అయ్యి తిరిగి పర్వత రాజ తనయగా జన్మించి రుద్రతాండవం చేసి విరాగిగా మారిన తన శివయ్యను చేరుకున్న పార్వతి పాదాలను ఆశ్రయించాను.
తనకు అర్ధం కానిదాన్ని తనకిష్టమైన దానితో పోల్చుకోవటం మానసిక దౌర్భలయం క్రిందికి వస్తుందేమో కదండీ డాక్టర్ లైలా ఏర్నేని గారూ !
“ఎందుకు?” అనబోయాను. ఫిరంగి “ఢాం” అంది. ఆ అదురుతో నదిరి యినుప చువ్వల కొనల రాక్షసి గోళ్ళకి అందనంత దూరంగా వెనక్కిపడ్డాను…
రెండూ కంచెల గురించే! కానీ ఒకటి కంచెల గురించి ఆలోచించమంటుంటే…
నేను ప్రస్తావిస్తున్న కధ విముక్తి ఆ కంచెలని, నిలువెత్తు గోడలని పగలగొట్టమంటుంది. మనకి ప్రస్తుతం కావల్సింది, వంతెనలు, నిచ్చెనలు. కంచెలు కాదు. కాని ఆ కంచెలు కట్టడానికే, ” “ఇక్కడ కట్టడాలకు సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయి.” దుకాణాలు వెలుస్తున్నాయి. ప్రజలు వాటి ముందు బారులు తీరుతున్నారు. ప్చ్.
” భగవాన్ రమణులను గుర్తించి లోకానికి పరిచయం చేసింది మహాతపస్వి కావ్యకంఠ గణపతి ముని. ‘స్వామీ, మీరు భగవాన్ రమణు’ లని గణపతి ముని అనగానే, అలాగే ‘నాయనా’ అని గణపతిమునికి నాయన అనే పేరును స్థిరపరిచారు భగవాన్ రమణులు.
1931-32 ప్రాంతాల్లో భగవాన్‌ను విడిచి నాయన శిరసి, కుళువే, గోకర్ణం, భువనేశ్వర్ ఇలా అనేక ప్రదేశాల్లో పర్యటించారు. తపస్సు చేసారు. అలాంటి సందర్భాల్లో నాయన రమణులకు ఉత్తరాలు రాసారు.
వీటికి 1978లో ఒక పుస్తక రూపం వచ్చింది. భక్తులకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అదే ” లేఖల్లో నాయన ” అనే ఫుస్తకం. దీనికి కొన్ని మెరుగులు తోడై 2006లో మలి ముద్రణ వచ్చింది. (ఈ మలి ముద్రణకు కృషి చేసింది న్యూయార్కులోని కావ్యకంఠ ఫౌండేషన్).
ఇందులో నాయన భగవాన్‌ను సంబోధించిన తీరును పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే, ప్రతీ ఉత్తరంలోను ఆయన భగవాన్‌ను భగవాన్ విశ్వగురో అనీ, భగవాన్ లోకాచార్య అనీ కారణగురో అనీ, మాయామానుష్య అనీ, భక్తవత్సలా అనీ-ఇలా ఒక ఉత్తరంలో వాడిన సంబోధన మరో ఉత్తరంలో లేదు. నాయన రమణులకు ఉత్తరాలు ఎక్కువగా సంస్కృతంలో రాసారు. వీటిని ఆనందాశ్రమ లేఖలు అని కూడా అంటుంటారు. మనబోటి వారికి ఆధ్యాత్మిక, తత్వ వివేచనము కలిగిస్తాయి ఆ ఉత్తరాలు. ఇవి గురుశిష్య సంబంధమైనవి.
అదేవిధంగా నాయన వివిధ సమయాల్లో వారి కుటుంబ సభ్యులకూ ఉత్తరాలు రాసారు. ఇవన్నీ ఎక్కువగా తెలుగులోనే రాయడం గమనార్హం.
కవిత చదివినప్పుడు ముందుగా కలిగిన తలపులు ఏమిటో మీరు చెప్పలేదు కాని; పార్వతి కథ, హిమాలయాల హిమం గురించిన ఆలోచనలు ఈ కవితలో లేవు. కవిత గాని అర్థం ఐఉంటే, మీకు కలిగిన తలపులు జనించే అవకాశం కూడా లేదండి.
The poem’s content is quite contemporary, and has nothing, nothing what so ever to do with Hindu mythology.
” తిరువణ్ణామలైలో అరుణగిరి విరూపాక్ష గుహలో దాదాపు ఎనిమిది సంవత్సరాలు, ఆ తరువాత ఆరు సంవత్సరాలు స్కందాశ్రమంలో మౌనంగా, ఎవ్వరితో మాట్లాడకుండా ఉండే “మౌనముద్ర” రమణమహర్షిని ( 1907 నవంబరు 18 న ) కావ్యకంఠ గణపతిముని ఎన్నో ప్రశ్నలు వేస్తే పలక మీదో, నేల మీదో స్వామి సమాధానాలు రాసి ఇచ్చిన వాటిని ‘‘నాన్ యార్’’( నేనెవరిని ) అనే గ్రంథంగా రూపొందించారు స్వామికి ఆకర్షితులైన మరో విరాగి శివప్రకాశం పిళ్ళై ” అని చదివాను ప్రియమైన శ్రీ దంతుర్తి శర్మ గారు.
యీ వ్యాసకర్త శ్రీ పప్పు నాగరాజు గారు అరుదైన కావ్యకంఠ గణపతిముని గారి ముని మనుమడు కదండీ శర్మ గారు.
1907 నవంబరు 18 న. కావ్యకంఠ గణపతిముని విరూపాక్షగుహలో వున్న రమణుని దర్శించి మనసుకు ప్రశాంతత ఏర్పడగా, సాష్టాంగనమస్కారం చేసి, వారి పాదాలను వదలక, కంపిస్తున్న స్వరంతో ” చదవవలసిందంతా చదివాను. వేదాంతశాస్త్రాన్ని తెలుసుకున్నాను. మంత్రజపం చేశాను. కానీ యింతవరకు నాకు తపస్సంటే యేమిటో అవగాహన కాలేదు. మీ పాదాలనే శరణని నమ్ముకున్నాను. నన్ను కరుణించి నాకు తపస్సు స్వభావం తెలపండి. ” అని వేడుకున్నారు.
1896 సెప్టెంబరులో తిరువన్నామలై వచ్చినప్పటి నుంచి నోరువిప్పి మాట్లాడని స్వామి పదిహేనునిముషాలపాటు స్థిరంగా గణపతిమునిని చూసి నెమ్మదిగా పెదవులను విప్పి
” ఈ నేను అన్నభావం యెక్కడ పుడుతుందో పరిశీలించినట్లయితే మనస్సు అందులో లీనమగును. అదేతపస్సు . మంత్రజపం చేసేటప్పుడు మంత్రనాదం ఎక్కడనుండి పుట్టునో గమనించిన మనస్సు అందులో లీనమగును.” అని అన్నారు.
స్వామిచెంత కొన్నిగంటలు గడిపిన తరువాత, స్వామి పేరు రామనామ బీజాక్షరాల మూలంతో ‘ శ్రీ రమణ ‘ నామంగా మార్చి గణపతి మునీంద్రులు స్వామిని ‘ భగవాన్ శ్రీరమణ మహర్షి ‘ అని పిలువ వలెనని ఆదేశించారు.
1896 సెప్టెంబరు 1 వ తేదీ నుండి, నిర్యాణం వరకు అనగా 1950 ఏప్రిలు 14 వరకు ఒక్కరోజు కూడా అరుణాచలక్షేత్రాన్ని వదలి భగవాన్ రమణులు వుండలేదు. తండ్రి భుజం పైన బిడ్డలా కొంతకాలం కొండమీద, తండ్రి ఒడిలోని బిడ్డలా తదుపరిరోజుల్లో కొండపాదాలచెంత గడిపారు రమణులు.
నిండైన జీవితం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
08/14/2019 7:58 pm
ఈ ప్రపంచాన్ని తాదాత్య్మత చెందుతూ చూసే యాత్రా పధికుడు
ప్రియమైన శ్రీ దాసరి అమరేంద్ర గారూ !
అబ్బూరి ఛాయాదేవి గారు 2002 లో చైనాను సందర్శించారు. అక్కడి అనుభవాలను “చైనాలో ఛాయాచిత్రాలు “గా ప్రచురించారు.
బుక్కు ఎక్కడ దొరుకుతుందో మన గొరుసన్నను అడిగితే తెలుస్తుంది. లేదూ సి. ఆర్. హోమ్
( Chandra Rajeshwararao Old Age Home Kondapur, Hyderabad ) కి ఫోను చేసి మన ఏబికే ప్రసాద్ గారిని అడగొచ్చు. పోనీ తీరిక చేసుకుని మీరే ఓ సారి అటేపు కూడా వెళ్లి రాకూడదూ.
~ ఇట్లు, గొరుసన్న గారి తంపులమారి రావయ్య
తీరా నేను విముక్తమయ్యాక! గురించి కె.కె రామయ్య అభిప్రాయం:
08/14/2019 10:13 am
లైలా ఏర్నేని గారూ !
” మమతల తావినై మనసంతా నిండిపోవాలని
పరితపించి పరితపించి పరాజయం పాలయ్యాక
తీరా నేను విముక్తమయ్యాక!
గొంతు ఎండిపోయేలా దుఃఖిస్తూ ”
కలిగించిన గ్లూం నుండి తప్పించుకోవటానికి సతిగా అగ్నికి ఆహుతి అయ్యి తిరిగి పర్వత రాజ తనయగా జన్మించి రుద్రతాండవం చేసి విరాగిగా మారిన తన శివయ్యను చేరుకున్న పార్వతి పాదాలను ఆశ్రయించాను.
తనకు అర్ధం కానిదాన్ని తనకిష్టమైన దానితో పోల్చుకోవటం మానసిక దౌర్భలయం క్రిందికి వస్తుందేమో కదండీ డాక్టర్ లైలా ఏర్నేని గారూ !
మంటో కథలు: సియా హాషియే 1 గురించి అనిల్ అట్లూరి (@AtluriAnil) అభిప్రాయం:
08/14/2019 7:31 am
Good work, and pleasant surprise, Purnima. You have come a long way.
నీ యీ అనువాదం చదువుతుంటే, విముక్తి కధలోని ఈ text జ్ఞాపకం వచ్చింది.
…
రెండూ కంచెల గురించే! కానీ ఒకటి కంచెల గురించి ఆలోచించమంటుంటే…
నేను ప్రస్తావిస్తున్న కధ విముక్తి ఆ కంచెలని, నిలువెత్తు గోడలని పగలగొట్టమంటుంది. మనకి ప్రస్తుతం కావల్సింది, వంతెనలు, నిచ్చెనలు. కంచెలు కాదు. కాని ఆ కంచెలు కట్టడానికే, ” “ఇక్కడ కట్టడాలకు సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయి.” దుకాణాలు వెలుస్తున్నాయి. ప్రజలు వాటి ముందు బారులు తీరుతున్నారు. ప్చ్.
ఇంద్రగీతమ్ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
08/13/2019 9:30 pm
” భగవాన్ రమణులను గుర్తించి లోకానికి పరిచయం చేసింది మహాతపస్వి కావ్యకంఠ గణపతి ముని. ‘స్వామీ, మీరు భగవాన్ రమణు’ లని గణపతి ముని అనగానే, అలాగే ‘నాయనా’ అని గణపతిమునికి నాయన అనే పేరును స్థిరపరిచారు భగవాన్ రమణులు.
1931-32 ప్రాంతాల్లో భగవాన్‌ను విడిచి నాయన శిరసి, కుళువే, గోకర్ణం, భువనేశ్వర్ ఇలా అనేక ప్రదేశాల్లో పర్యటించారు. తపస్సు చేసారు. అలాంటి సందర్భాల్లో నాయన రమణులకు ఉత్తరాలు రాసారు.
వీటికి 1978లో ఒక పుస్తక రూపం వచ్చింది. భక్తులకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అదే ” లేఖల్లో నాయన ” అనే ఫుస్తకం. దీనికి కొన్ని మెరుగులు తోడై 2006లో మలి ముద్రణ వచ్చింది. (ఈ మలి ముద్రణకు కృషి చేసింది న్యూయార్కులోని కావ్యకంఠ ఫౌండేషన్).
ఇందులో నాయన భగవాన్‌ను సంబోధించిన తీరును పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే, ప్రతీ ఉత్తరంలోను ఆయన భగవాన్‌ను భగవాన్ విశ్వగురో అనీ, భగవాన్ లోకాచార్య అనీ కారణగురో అనీ, మాయామానుష్య అనీ, భక్తవత్సలా అనీ-ఇలా ఒక ఉత్తరంలో వాడిన సంబోధన మరో ఉత్తరంలో లేదు. నాయన రమణులకు ఉత్తరాలు ఎక్కువగా సంస్కృతంలో రాసారు. వీటిని ఆనందాశ్రమ లేఖలు అని కూడా అంటుంటారు. మనబోటి వారికి ఆధ్యాత్మిక, తత్వ వివేచనము కలిగిస్తాయి ఆ ఉత్తరాలు. ఇవి గురుశిష్య సంబంధమైనవి.
అదేవిధంగా నాయన వివిధ సమయాల్లో వారి కుటుంబ సభ్యులకూ ఉత్తరాలు రాసారు. ఇవన్నీ ఎక్కువగా తెలుగులోనే రాయడం గమనార్హం.
– వజఝల వేంకట రమణ
లేఖల్లో నాయన
సంకలనకర్త: కీ.శే. గంటి శ్రీరామమూర్తి
పేజీలు: 135.. వెల: రు.80
ప్రతులకు: 1) ఠాగూర్ పబ్లిషింగ్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్
2) శ్రీమతి గంటి రమణి, బెంగుళూరు-76
చరవాణి – 09980936107, 09483163948
తీరా నేను విముక్తమయ్యాక! గురించి Lyla yerneni అభిప్రాయం:
08/13/2019 2:03 pm
కె. కె. రామయ్య గారు!
కవిత చదివినప్పుడు ముందుగా కలిగిన తలపులు ఏమిటో మీరు చెప్పలేదు కాని; పార్వతి కథ, హిమాలయాల హిమం గురించిన ఆలోచనలు ఈ కవితలో లేవు. కవిత గాని అర్థం ఐఉంటే, మీకు కలిగిన తలపులు జనించే అవకాశం కూడా లేదండి.
The poem’s content is quite contemporary, and has nothing, nothing what so ever to do with Hindu mythology.
Lyla
తీరా నేను విముక్తమయ్యాక! గురించి కె.కె రామయ్య అభిప్రాయం:
08/11/2019 2:28 pm
దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి అగ్నికి ఆహుతైన దక్ష ప్రజాపతి తనయ సతీదేవి తిరిగి హిమవన్ పర్వత రాజ తనయ పార్వతిగా జన్మించి శివుని అర్ధాంగిగా హిమ శీతల స్పర్శలో సేద తీరిన తలపులు కూడా కలిగాయి “తీరా నేను విముక్తమయ్యాక!” కవిత చదువుతుంటే. ధన్యవాదాలు నల్లపనేని విజయలక్ష్మి గారు.
ఇంద్రగీతమ్ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
08/09/2019 3:10 pm
” తిరువణ్ణామలైలో అరుణగిరి విరూపాక్ష గుహలో దాదాపు ఎనిమిది సంవత్సరాలు, ఆ తరువాత ఆరు సంవత్సరాలు స్కందాశ్రమంలో మౌనంగా, ఎవ్వరితో మాట్లాడకుండా ఉండే “మౌనముద్ర” రమణమహర్షిని ( 1907 నవంబరు 18 న ) కావ్యకంఠ గణపతిముని ఎన్నో ప్రశ్నలు వేస్తే పలక మీదో, నేల మీదో స్వామి సమాధానాలు రాసి ఇచ్చిన వాటిని ‘‘నాన్ యార్’’( నేనెవరిని ) అనే గ్రంథంగా రూపొందించారు స్వామికి ఆకర్షితులైన మరో విరాగి శివప్రకాశం పిళ్ళై ” అని చదివాను ప్రియమైన శ్రీ దంతుర్తి శర్మ గారు.
యీ వ్యాసకర్త శ్రీ పప్పు నాగరాజు గారు అరుదైన కావ్యకంఠ గణపతిముని గారి ముని మనుమడు కదండీ శర్మ గారు.
1907 నవంబరు 18 న. కావ్యకంఠ గణపతిముని విరూపాక్షగుహలో వున్న రమణుని దర్శించి మనసుకు ప్రశాంతత ఏర్పడగా, సాష్టాంగనమస్కారం చేసి, వారి పాదాలను వదలక, కంపిస్తున్న స్వరంతో ” చదవవలసిందంతా చదివాను. వేదాంతశాస్త్రాన్ని తెలుసుకున్నాను. మంత్రజపం చేశాను. కానీ యింతవరకు నాకు తపస్సంటే యేమిటో అవగాహన కాలేదు. మీ పాదాలనే శరణని నమ్ముకున్నాను. నన్ను కరుణించి నాకు తపస్సు స్వభావం తెలపండి. ” అని వేడుకున్నారు.
1896 సెప్టెంబరులో తిరువన్నామలై వచ్చినప్పటి నుంచి నోరువిప్పి మాట్లాడని స్వామి పదిహేనునిముషాలపాటు స్థిరంగా గణపతిమునిని చూసి నెమ్మదిగా పెదవులను విప్పి
” ఈ నేను అన్నభావం యెక్కడ పుడుతుందో పరిశీలించినట్లయితే మనస్సు అందులో లీనమగును. అదేతపస్సు . మంత్రజపం చేసేటప్పుడు మంత్రనాదం ఎక్కడనుండి పుట్టునో గమనించిన మనస్సు అందులో లీనమగును.” అని అన్నారు.
స్వామిచెంత కొన్నిగంటలు గడిపిన తరువాత, స్వామి పేరు రామనామ బీజాక్షరాల మూలంతో ‘ శ్రీ రమణ ‘ నామంగా మార్చి గణపతి మునీంద్రులు స్వామిని ‘ భగవాన్ శ్రీరమణ మహర్షి ‘ అని పిలువ వలెనని ఆదేశించారు.
1896 సెప్టెంబరు 1 వ తేదీ నుండి, నిర్యాణం వరకు అనగా 1950 ఏప్రిలు 14 వరకు ఒక్కరోజు కూడా అరుణాచలక్షేత్రాన్ని వదలి భగవాన్ రమణులు వుండలేదు. తండ్రి భుజం పైన బిడ్డలా కొంతకాలం కొండమీద, తండ్రి ఒడిలోని బిడ్డలా తదుపరిరోజుల్లో కొండపాదాలచెంత గడిపారు రమణులు.
http://sps-yogam.blogspot.com/2018/06/blog-post_7.html
కావ్యకంఠ గణపతిముని జీవిత చరిత్రపై పుస్తకం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వెబ్‌సైటులో
https://archive.org/details/in.ernet.dli.2015.391040
తీరా నేను విముక్తమయ్యాక! గురించి P.santhi అభిప్రాయం:
08/08/2019 8:13 am
అద్భుతం!!
ఇంద్రగీతమ్ గురించి వీరభద్రం అభిప్రాయం:
08/06/2019 5:01 am
భారత దేశానికి ఎటువంటి రాజ్యాంగం ఉండాలి, అనే విషయం మీద కూడా ఆలోచించి,ఈయన ఒక భారత రాజ్యాంగాన్ని సంస్కృతంలో వ్రాసారు. అది పెన్వలలో(internet) దొరుకుతుంది.
కొన్ని కథలు వినిపిస్తా, వింటావా? గురించి లలిత అభిప్రాయం:
08/05/2019 6:51 pm
భలే హార్టీ పరిచయం, హార్టిస్టు గారు! ఈసారి విశాలాంధ్రకి వెళ్ళడం అంటూ జరిగితే తప్పకుండా సత్యవతిగారి కథల పుస్తకం కొనుక్కుంటాను.