పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు గురించి తః తః అభిప్రాయం:

    02/09/2020 3:09 pm

    ధన్యవాదాలు భాస్కర్. స్వర్ణహంస రిఫరెన్స్ అప్పటికి చూడలేదు. (ఈమాట దగ్గరకు రాత్రి ఏ ఒంటి గంటకో రావటం పెద్దకారణం- తప్పులకైనా ఒప్పులకైనా)-తః తః

  2. శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు గురించి Lyla yerneni అభిప్రాయం:

    02/08/2020 3:46 pm

    గ్రంథ గ్రంథులు = ?

    శ్రీహర్షుని ‘అవామే వామార్ధే’ అని మొదలయ్యే ఒక శ్లోకానికి కల మూడు రకాల అర్ధాలు ఇచ్చి, తనుగా ఇంకా శ్లోక రహస్యాలు శోధిస్తూ; ఈ వ్యాసం లో మొదటిగా ఇచ్చిన శ్లోకంలో ‘గ్రంథి’ అన్న మాటకు ముఖ్యార్ధం ముచ్చటించకపోటం, ‘చిక్కు ముడి’ అన్న ఒక్క అర్థంలో మాత్రమే ఆ మాటను శ్రీహర్షుడు వాడినట్టుగా ఆసాంతం ఈ వ్యాస రచయిత అనుకోటం ఆశ్చర్య పరిచింది.

    గురువు లేనందున, సంస్కృతమే తెలియదు నాకు. ఐతే, సంస్కృత కావ్యాలు చక్కగా చదువుకున్న, రసికులైన పంతుళ్లు, నాకు బెజవాడలో చెప్పిన తెలుగొచ్చు. అందుకేగా రచ్చబండ యాహూ లో ఇలాటి తెలుగు కవిత్వాలు చెప్పాను.

    నిన్న మొన్నటి దాక
    ఎన్నొ పున్నమి రాత్రులు
    పున్నాగల మీద జంట మిన్నాగుల వలే
    పెద్దకాలము మనము పెనగితిమి ప్రియతమా!
    నేడా చనువు చెలగాటములు లేవు
    నేడా తనువు తగలాటములు లేవు
    ఆ బులుపుల పున్నాగల గంధాలు
    భద్రముగ నుంచులే
    మెదడు మడుపుల సూక్ష్మగ్రంధాలు
    తలను వీడవుగాదా వాసనలు
    మనమిలను వీడువరకు!

    ఆ కవిత్వం చదివిన ఒక సభ్యులు జాబాలిమునిగారు, గ్రంథులు అనబోయి గ్రంథాలన్నారా? వైద్యులు లైలాగారు, అంటే ఆ తర్వాత కొంత డిస్కషన్ నడిచింది. యాహూ నిర్వాహకులు -గ్రూపులు మూసివేసినందున, కంటెంట్ తుడిసివేసినందువలన, ఇక ఆ లింకు ఇచ్చే గొడవ లేదు.

    పైది రచ్చబండ- యాహూ లో రాసినప్పటికి ఆంధ్రభారతి నిఘంటువుల తయారీ పూర్తికాలేదు. ఇప్పుడు ఆ నిఘంటువుల నుండి:

    గ్రంథి : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
    సంస్కృత విశేష్యము

    • 1. బుడిపి. గడ్డవలె పుట్టు రోగము.
    • 2. చెట్టు మొ.ని ముడి.
    • 3. కీలు.
    • 4. [జీవశాస్త్రము] శరీరమునకు అవసరమగు ఏదైన ఒక ద్రవమును తయారుచేసి ఉదాసర్జన చేయు (పైకి స్రవింపజేయు) జీవకణ సంహతి (Gland).

    అందులో నాలుగవది అతి ముఖ్యమైన అర్ధం. అన్ని రసాలకు కారణం ఆ గ్రంథులు.

    -Lyla
    Ps: సంస్కృత పండితులు ఈ వ్యాసంలోని మొదటి శ్లోకం గురించి విడమర్చి చెపుతారని ఆశిస్తాను.

  3. శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు గురించి Bhaskar Kompella అభిప్రాయం:

    02/07/2020 11:41 am

    @ తఃతః, ఈ వ్యాసం నచ్చినందుకు సంతోషం. నా కృతజ్ఞతలు. శ్రీ శేషేంద్ర శర్మగారిని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతుల వారి వద్దకు తీసుకువెళ్ళినది శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. ‘స్వర్ణహంస”లో ఈ వృత్తాంతమంతా వ్రాయబడింది.

    @KVSRR, ఈ వ్యాసం మీ అభిమానానికి పాత్రమైనందుకు ఆనందం. శ్రీనాథుణ్ణి తక్కువగా అంచనా వెయ్యలేము. మీరన్నట్టుగా, అతనికి తప్పకుండా “Benefit of doubt” ఇవ్వాలి.

    శ్రీహర్ష కావ్యంలోని అనౌచిత్యాల గురించి శ్రీ ఉమాకాంతం గారి వ్యాసం వివరించింది. విపరీత శృంగారం, సరస్వతిని విష్ణుపత్నిగా చెప్పడం మొదలైనవి ముఖ్యమైన అనౌచిత్యాలని ఆయన అభిప్రాయం.

    సరస్వతిని విష్ణుపత్నిగా చెప్పడం వంగవైష్ణవుల సాంప్రదాయంలో ఉంది (బ్రహ్మవైవర్త పురాణంలో ఉందని విన్నాను). వంగదేశంలో విద్యనభ్యసించిన శ్రీ ఉమాకాంతం గారికి ఈ విషయం తెలిసే ఉంటుంది. వాళ్ళు చెప్పే సరస్వతి, సరస్వతీనది అయి ఉంటుందని నా ఊహ. (గంగలాగే ఆ నది కూడా మరో పత్ని కావచ్చు). ఇక శృంగార విషయమై, అదంతా వామాచారవివరమా అన్నది కూడా నా సంశయం. ఈ రెండింటినీ పండితులు పరిశోధించాలి.

    కావ్యం చదివిన తర్వాత అనౌచిత్యాలున్నాయని ఒప్పుకోలేనంత అభిమానాన్ని మనలో సృష్టించగల మహాకవి శ్రీహర్షుడు.

    ఈ వ్యాసం గురించి ప్రస్తావిస్తున్నప్పుడు, శ్రీనాథుడి గురించి కూడా వ్రాయమని సూచననిచ్చిన మీకు నా బహుకృతజ్ఞతలు.

  4. శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    02/06/2020 8:21 pm

    ఇదీ పరిశోధన అంటే. మనసుపెట్టి చేసిన కృషి. మహానుభావుల భాష్యాలకి మెరుగులు దిద్దే మౌలికసాధన. బహుధా ప్రశంశనీయం. అద్భుతం.

    ఐతే శ్రీనాథుడికి ఇక్కడ ఉదహరించిన శ్లోకం లోని మంత్ర యంత్ర విశేషాలు తెలియవనటం సాహసమే. శ్రీహర్షుడిలా వాటిని తన పద్యంలో గర్భితాలు చెయ్యలేదని బహుశా ఒప్పుకోవచ్చు – ముందుముందు ఎవరైనా శ్రీనాథుడి పద్యంలో కూడ మంత్రమో యంత్రమో రెండూనో ఉన్నాయని చూపే అవకాశం వున్నా ఇప్పటికి ఏ మార్గమూ కనిపించటం లేదు కనక. శ్రీనాథుడికి తెలిసే కావాలని ఆ మంత్ర యంత్రాల్ని తన పాఠకులకి దూరంగా ఉంచాడని అనుకోవటానికి అవకాశం లేకపోలేదు. చింతామణి మంత్రాన్ని, ముఖ్యంగా యంత్రాన్ని ఎవరుబడితే వాళ్లకి దొరికేట్టు చెయ్యటం కూడ మూలం లోని ‘అనౌచిత్యాల్లో’ ఒకటిగా శ్రీనాథుడు భావించి వుండొచ్చు కూడ. మల్లినాథుడు వ్యాఖ్య రాయకముందు ఈ మంత్ర యంత్రాల రహస్యం ఎవరికీ తెలియదని భావించటం కన్నా తెలిసినా బయటపెట్టటానికి వెనకాడారని నమ్మటం తేలిక. (Occam’s razor కూడ అదే చెప్తుంది).

    కొంతకాలం క్రితం నైషథం లో అనౌచిత్యాల గురించి ఇక్కడ కొంత చర్చ జరిగింది. ఒకరు శ్రీహర్ష కావ్యంలో అనౌచిత్యాలే లేవని, లేని అనౌచిత్యాల గురించి ప్రస్తావించిన కారణంగా శృంగారనైషథం చివర్లో వున్న గద్యం శ్రీనాథుడు కాకుండా ఇంకెవరో అతికించారని ప్రతిపాదించారు. స్పష్టమైన ఉదాహరణలతో నైషథం లో అనౌచిత్యాలని చూపించిన ఈ వ్యాసం ఆ ప్రతిపాదనకి కూడ స్వస్తి పలుకుతుందని ఆశ.

  5. నవోదయతో నా రుణానుబంధం గురించి రోంగలి శ్రీనివాసరావు అభిప్రాయం:

    02/05/2020 4:53 am

    చాలా బాగుంది వ్యాసం. ఆయనకి నివాళి.

  6. నరకప్రవాసి గురించి RD అభిప్రాయం:

    02/05/2020 3:56 am

    “నాగరికతోయ్, నాగరికత! తెల్లవాడు రాక మునుపు చుమాష్ వాళ్ల చేతుల్లో కాలిఫోర్నియా, తెల్లవాడి చేతిలో బైబిలూ ఉంటే, వాడు దిగాక విడ్డూరంగా తెల్లోడి చేతిలో కాలిఫోర్నియా, చుమాషోడి చేతిలో బైబిలూ అయ్యాయి. అదీ మరి సువార్తంటే!

    ….. బాగా చెప్పారు / వ్రాశారు. అలా జరిగిన తరువాత 100 / 200 సంవత్సరాలకు “మార్పు సహజమే కదా?” అన్ని, అందరూ ఎల్లప్పటికీ ఓకే విధంగా ఉండలేవు కదా అనుకుంటాము.

    ఇంతకంటే వ్రాయను / వ్రాయదలచుకోలేదు.

  7. ఒక అచ్చమైన అన్వరీయం గురించి Amarendra అభిప్రాయం:

    02/03/2020 8:06 pm

    మనసు పెట్టి రాశారు, హృద్యంగా ఉంది. అభినందనలు భార్గవి గారూ.

  8. ఒక అచ్చమైన అన్వరీయం గురించి ఖాదర్ మొహియుద్దీన్ అభిప్రాయం:

    02/03/2020 4:51 am

    కాగజ్ పె రఖ్ దియా హయ్ కలీజా నికాల్ కే అని ఎవరో ఎవరి గురించో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. నేను కూడా డాక్టర్ గారిలా రాయగలిగితే….!

  9. ద్విజావంతి: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం గురించి srinivasa rao v,khammam అభిప్రాయం:

    02/02/2020 1:37 pm

    రా ళ్ళ ప ల్లి వారి గొంతు , విశ్లేషణ, వినిపించారు . ధన్యవాదాలు .

  10. ఏ విలువలకీ శప్తభూమి? గురించి Sailaja Kallakuri అభిప్రాయం:

    02/02/2020 2:17 am

    Your review is very exhaustive sir. And the way you entwined the interlinking stories is amazing.
    Yes, I too felt Pain
    Living Horror
    And over Dramatisation. But as you said the original incidents were too diverse and Physical that the episodes will stir us to fear, negation and Depression.
    These are Rare Books.
    Rare writers
    And yours is an amazing review.