We touch people mostly without touching them: We touch them with our words, with our smile, with our eyes, with our courage, with our madness, with millions of different ways! This is what i know about touch till now. I know physical touch is also important, but this writeup really surprised me. Dont know professions are based on this
You have narrated the story very nicely and while reading the story all the characters are appearing before our eyes as if they are the real one. Narrated the emotions of the old man very lively and his ambition to fulfill the desire of his grand daughter. It reflects the present society and the inequality of the income of various people and how the common people are suffering to fulfill the basic desires of their children whereas the rich people are wasting the valuable resources of the society. Very heart touching story. Hats off to you Dev. All the best dear 👌👌👌👏👏👏💐💐💐
ఈ వ్యాసం చదవటానికి పూనుకున్నప్పుడు ఇది ఏదైనా జంగిల్ బుక్ కి సంబంధించినదేమో అనుకున్నాను, ఎత్తుకోవటమే ఏనుగులు, పులులు, సింహాలు లాంటి జంతువుల ప్రస్తావన చూసి. కాస్త తెరపార చూశాకే గుర్తించాను ఇది గుడిపాటి వెంకట చలం మీద వ్యాసం అని. అయినప్పటికీ, జంతువుల ప్రస్తావన తేవడం సముచితమేనని అనిపించింది. ఎందుకంటే చలం సాహిత్యం కూడా జంగిల్ బుక్స్ కి దరిదాపుల్లోనే వుంటుంది సాహిత్యపు విలువల కోణంలో చూస్తే. అందువలన, రచయిత్రి తెలిసో తెలియకో చలానికి న్యాయం చేసిందనే చెప్పాలి. సమాజాన్ని ప్రభావితం చేసిన సాహిత్యం అని చెప్పుకునే సందర్భంలో మృగాల ప్రస్తావన తేవడంలో రచయిత్రి ఉద్దేశం ఏమిటో గాని, ఒక చదువరిగా నాకు అనిపించింది ఏమిటంటే it’s a display of unnecessary aggressiveness. వెనకటి రోజుల్లో కాలు విరిగితే పుత్తూరు రాజుల దగ్గరకు వెళ్లేవాళ్లు కట్టు కట్టించుకోవటానికి. అది ఎముకల శాస్త్రం అభివృద్ధి చెందక ముందు, ఎముకల వైద్యులు అందుబాటులో లేని కాలంలో. ఇప్పుడు పుత్తూరు రాజుల కట్టు చరిత్రలో కలిసిపోయింది. దాని అవసరం ఎవరికీ కనిపించటం లేదు కనక. చలం సాహిత్యం కూడా అంతే! అది కాలగర్భంలో కలిసిపోయిన ఒక చిన్న పాటి సాహిత్య తుఫాను. నేడు చలం మీద సాహితీ ప్రియులకు పరిమితం. సమాజం పట్టించుకోకపోవడం లేదు. మనం అధునాతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. స్త్రీ పురుషుల మధ్య భేదం గుర్తించదు చట్టం. జండర్ వివక్షతకు గుడ్ బై చెప్పాము. స్వతంత్ర భారతదేశంలో స్త్రీలు రాష్ట్రపతి అయ్యారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అయ్యారు. మగడు నచ్చకపోతే విడాకులు తీసుకొని కొత్త జీవితం ప్రారంభించవచ్చు. ఇప్పుడు సాయిబుతో లేచిపోవాల్సిన అవసరం నేటి స్త్రీ కి అవసరం లేదు.
అయితే చలం మీద భక్తితో రాసిన వ్యాసం ఒకటి, రక్తితో హేతుబద్ధమైన విమర్శనాత్మక విశ్లేషణ చేసిన వ్యాసం మరొకటి ఒకే సంచికలో ప్రచురించిన ఈమాట సంపాదక వర్గం యొక్క సాహితీ సమతుల్య దృక్పథానికి హృదయపూర్వక అభినందనలు.
ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. నండూరి “విశ్వరూపం,” “నరావతారం,” రచనలకి ప్రేరకులు, కారకులు, అప్పటి “ఆంధ్రజ్యోతి” సంపాదకులు నార్ల. వాటికి నండూరితో పాటు కొడవటిగంటి, నార్ల, రాసిన ముందుమాటలు చదివితే ఈ ముగ్గురూ తెలుగువాళ్ళలో వైజ్ఞానిక దృక్పథం పెంచాలని ఎంత తపన పడ్డారో విశదమవుతుంది. మరి అవి వెలువడిన యాభై ఏళ్ల తర్వాత ఏమాత్రం ప్రగతి సాధించాం?
శ్రీనివాస్ గారూ, “వివిక్త” కోసం ఆంధ్రభారతిని సంప్రదించాను; సంతసించాను.
చాలా సంవత్సరాల క్రితం నండూరి రామమోహనరావు గారు ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక సంపాదకులుగా వున్నప్పుడు నరావతారం, విశ్వరూపం అనే గొప్ప గ్రంధాలను సీరియల్ గా ఆంధ్రజ్యోతి వార పత్రికలో ప్రతి వారం ప్రచురించారు. ఆ రచనా పరంపర కొనసాగినప్పుడు జ్యోతి వార పత్రిక కోసం జనం ఎదురు చూసేవారు. సామాన్య పాఠకులకు అర్థం అయ్యేలా మనిషి ఆలోచనలను, మేధస్సును ప్రభావితం చేసిన తత్వవేత్తలను తెలుగు వారికి పరిచయం చేసిన అద్భుత ప్రక్రియ. విశ్వరూపం అనేది ఖగోళశాస్త్రం గురించి అనుకుంటా. విశ్వం ఎలా ఆవిర్భవించింది, ఏ యుగంలో ఏ విధంగా పరిణామం చెందింది అనేది సరళమైన భాషలో చెప్పారు. హనుమంతరావు గారి వ్యాస పరంపర చూస్తుంటే నాకు ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. సమగ్ర సమాచారం, లోతైన విశ్లేషణలతో కూడుకున్న ఈ వ్యాసాలు పుస్తక రూపం దాల్చాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ వ్యాసాలు హైస్కూలు లో సైన్స్‌గా బోధించే ఉపాధ్యాయులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. గ్రామాల్లో కరెంటు లేని కాలంలో పుట్టిన నాకు చీకటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. స్విచ్ వేస్తే లైటు వెలిగే దశ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. కరెంటు అంటే ఏమిటో తెలియని రోజుల్లో జీవితం ఎలా ఉండేది అనేది ఆ అనుభవాన్ని చూసిన వాళ్లకే తెలుస్తుంది. నేను ఆ అనుభవాలను ఇక్కడ నెమరు వేసుకోవాలని మనసు వువ్విళూరుతున్నది. ధన్యవాదములు.
కథలను చాలా చక్కగా అనువదించి అందించినందుకు అనేక ధన్యవాదాలు మీకు. ముస్లిం మహిళల వేదనను ప్రతిబింబించే కథలివి. అందరూ చదవాలి. ఎందుకంటే ఇందులో మిగిలిన సమాజాల్లోని స్త్రీల వ్యధలు కూడా ఉన్నాయి.
పర్వ అనువాదకుని నివేదన గురించి Ramesh అభిప్రాయం:
10/12/2025 10:01 pm
లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు వ్రాసింది ఇది.
[‘పర్వ’ అనువాదపు మున్నుడి ఇది. ఆ పుస్తకం ప్రచురించబడ్డ 2002 ప్రాంతంలోనే వ్రాసి ఉండవచ్చునని ఊహించవచ్చు. – సం.]
మరింత దగ్గరికి గురించి Neeraja అభిప్రాయం:
10/11/2025 7:35 am
We touch people mostly without touching them: We touch them with our words, with our smile, with our eyes, with our courage, with our madness, with millions of different ways! This is what i know about touch till now. I know physical touch is also important, but this writeup really surprised me. Dont know professions are based on this
పై గదిలో ప్రేమికుడు గురించి శివచంద్ర అభిప్రాయం:
10/10/2025 5:04 pm
అనువాదం బాగుంది. పేర్లు మార్చడం చేత సులువుగా చదవగలిగాను. ‘ నిరాడంబరంగా’ కొంత మార్చవచ్చనిపించింది.
గెలుపు గురించి Ranga Rao అభిప్రాయం:
10/10/2025 12:09 pm
You have narrated the story very nicely and while reading the story all the characters are appearing before our eyes as if they are the real one. Narrated the emotions of the old man very lively and his ambition to fulfill the desire of his grand daughter. It reflects the present society and the inequality of the income of various people and how the common people are suffering to fulfill the basic desires of their children whereas the rich people are wasting the valuable resources of the society. Very heart touching story. Hats off to you Dev. All the best dear 👌👌👌👏👏👏💐💐💐
ఏనుగు, మర్రిచెట్టూ… చలం! గురించి Gummadidala Ranga Rao అభిప్రాయం:
10/10/2025 10:35 am
ఈ వ్యాసం చదవటానికి పూనుకున్నప్పుడు ఇది ఏదైనా జంగిల్ బుక్ కి సంబంధించినదేమో అనుకున్నాను, ఎత్తుకోవటమే ఏనుగులు, పులులు, సింహాలు లాంటి జంతువుల ప్రస్తావన చూసి. కాస్త తెరపార చూశాకే గుర్తించాను ఇది గుడిపాటి వెంకట చలం మీద వ్యాసం అని. అయినప్పటికీ, జంతువుల ప్రస్తావన తేవడం సముచితమేనని అనిపించింది. ఎందుకంటే చలం సాహిత్యం కూడా జంగిల్ బుక్స్ కి దరిదాపుల్లోనే వుంటుంది సాహిత్యపు విలువల కోణంలో చూస్తే. అందువలన, రచయిత్రి తెలిసో తెలియకో చలానికి న్యాయం చేసిందనే చెప్పాలి. సమాజాన్ని ప్రభావితం చేసిన సాహిత్యం అని చెప్పుకునే సందర్భంలో మృగాల ప్రస్తావన తేవడంలో రచయిత్రి ఉద్దేశం ఏమిటో గాని, ఒక చదువరిగా నాకు అనిపించింది ఏమిటంటే it’s a display of unnecessary aggressiveness. వెనకటి రోజుల్లో కాలు విరిగితే పుత్తూరు రాజుల దగ్గరకు వెళ్లేవాళ్లు కట్టు కట్టించుకోవటానికి. అది ఎముకల శాస్త్రం అభివృద్ధి చెందక ముందు, ఎముకల వైద్యులు అందుబాటులో లేని కాలంలో. ఇప్పుడు పుత్తూరు రాజుల కట్టు చరిత్రలో కలిసిపోయింది. దాని అవసరం ఎవరికీ కనిపించటం లేదు కనక. చలం సాహిత్యం కూడా అంతే! అది కాలగర్భంలో కలిసిపోయిన ఒక చిన్న పాటి సాహిత్య తుఫాను. నేడు చలం మీద సాహితీ ప్రియులకు పరిమితం. సమాజం పట్టించుకోకపోవడం లేదు. మనం అధునాతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. స్త్రీ పురుషుల మధ్య భేదం గుర్తించదు చట్టం. జండర్ వివక్షతకు గుడ్ బై చెప్పాము. స్వతంత్ర భారతదేశంలో స్త్రీలు రాష్ట్రపతి అయ్యారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అయ్యారు. మగడు నచ్చకపోతే విడాకులు తీసుకొని కొత్త జీవితం ప్రారంభించవచ్చు. ఇప్పుడు సాయిబుతో లేచిపోవాల్సిన అవసరం నేటి స్త్రీ కి అవసరం లేదు.
అయితే చలం మీద భక్తితో రాసిన వ్యాసం ఒకటి, రక్తితో హేతుబద్ధమైన విమర్శనాత్మక విశ్లేషణ చేసిన వ్యాసం మరొకటి ఒకే సంచికలో ప్రచురించిన ఈమాట సంపాదక వర్గం యొక్క సాహితీ సమతుల్య దృక్పథానికి హృదయపూర్వక అభినందనలు.
కంప్యూటర్ చిప్ కథ – 6: రసాయనాన్ని విద్యుత్తుతో సంధించిన హంఫ్రీ డేవీ ప్రయోగాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
10/08/2025 12:31 am
ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. నండూరి “విశ్వరూపం,” “నరావతారం,” రచనలకి ప్రేరకులు, కారకులు, అప్పటి “ఆంధ్రజ్యోతి” సంపాదకులు నార్ల. వాటికి నండూరితో పాటు కొడవటిగంటి, నార్ల, రాసిన ముందుమాటలు చదివితే ఈ ముగ్గురూ తెలుగువాళ్ళలో వైజ్ఞానిక దృక్పథం పెంచాలని ఎంత తపన పడ్డారో విశదమవుతుంది. మరి అవి వెలువడిన యాభై ఏళ్ల తర్వాత ఏమాత్రం ప్రగతి సాధించాం?
శ్రీనివాస్ గారూ, “వివిక్త” కోసం ఆంధ్రభారతిని సంప్రదించాను; సంతసించాను.
కొడవళ్ళ హనుమంతరావు
కంప్యూటర్ చిప్ కథ – 6: రసాయనాన్ని విద్యుత్తుతో సంధించిన హంఫ్రీ డేవీ ప్రయోగాలు గురించి Gummadidala Ranga Rao అభిప్రాయం:
10/07/2025 12:42 pm
చాలా సంవత్సరాల క్రితం నండూరి రామమోహనరావు గారు ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక సంపాదకులుగా వున్నప్పుడు నరావతారం, విశ్వరూపం అనే గొప్ప గ్రంధాలను సీరియల్ గా ఆంధ్రజ్యోతి వార పత్రికలో ప్రతి వారం ప్రచురించారు. ఆ రచనా పరంపర కొనసాగినప్పుడు జ్యోతి వార పత్రిక కోసం జనం ఎదురు చూసేవారు. సామాన్య పాఠకులకు అర్థం అయ్యేలా మనిషి ఆలోచనలను, మేధస్సును ప్రభావితం చేసిన తత్వవేత్తలను తెలుగు వారికి పరిచయం చేసిన అద్భుత ప్రక్రియ. విశ్వరూపం అనేది ఖగోళశాస్త్రం గురించి అనుకుంటా. విశ్వం ఎలా ఆవిర్భవించింది, ఏ యుగంలో ఏ విధంగా పరిణామం చెందింది అనేది సరళమైన భాషలో చెప్పారు. హనుమంతరావు గారి వ్యాస పరంపర చూస్తుంటే నాకు ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. సమగ్ర సమాచారం, లోతైన విశ్లేషణలతో కూడుకున్న ఈ వ్యాసాలు పుస్తక రూపం దాల్చాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ వ్యాసాలు హైస్కూలు లో సైన్స్‌గా బోధించే ఉపాధ్యాయులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. గ్రామాల్లో కరెంటు లేని కాలంలో పుట్టిన నాకు చీకటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. స్విచ్ వేస్తే లైటు వెలిగే దశ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. కరెంటు అంటే ఏమిటో తెలియని రోజుల్లో జీవితం ఎలా ఉండేది అనేది ఆ అనుభవాన్ని చూసిన వాళ్లకే తెలుస్తుంది. నేను ఆ అనుభవాలను ఇక్కడ నెమరు వేసుకోవాలని మనసు వువ్విళూరుతున్నది. ధన్యవాదములు.
బాను ముష్తాక్ కథలు గురించి Mrs. ALLURI GOURI LAKSHMI LAKSHMI అభిప్రాయం:
10/07/2025 5:05 am
కథలను చాలా చక్కగా అనువదించి అందించినందుకు అనేక ధన్యవాదాలు మీకు. ముస్లిం మహిళల వేదనను ప్రతిబింబించే కథలివి. అందరూ చదవాలి. ఎందుకంటే ఇందులో మిగిలిన సమాజాల్లోని స్త్రీల వ్యధలు కూడా ఉన్నాయి.
ఏనుగు, మర్రిచెట్టూ… చలం! గురించి రావెళ్ల సురేష్ బాబు అభిప్రాయం:
10/06/2025 11:33 pm
చంద్రలత గారికి ధన్యవాదాలు.
డా|| ప్రతాపరెడ్డి గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.
నేటికీ చలం ‘బిడ్డల శిక్షణ’ లోని అభిప్రాయాలు ప్రాసంగికత కలిగి ఉన్నాయి. బహుశా దీర్ఘకాలం ఆయన రచనలు మానవ ప్రగతిలో ప్రాధాన్యత కలిగే ఉంటాయి.
బహు సుందరుడు సుందరకాండ చందురుడు గురించి విజయసారథి జీడిగుంట అభిప్రాయం:
10/06/2025 11:27 pm
సమయం తీసుకుని నా వ్యాసం సాంతం చదివి నందుకు,
మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు వాసు గారు & మైథిలి గారు.