పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ఇటు నేనే – అటు నేనే గురించి డా.బోలుగద్దె అనిల్ కుమార్ అభిప్రాయం:

    04/05/2020 12:42 pm

    నేనైతే చాలాబాగా ఎంజాయ్ చేసాను. చాలా బాగా రాసారు. చాలా సంతోషం. ధన్యవాదాలు 💐💐
    డా.బోలుగద్దె అనిల్ కుమార్
    9502568218

  2. Tara and the Teacher గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    04/05/2020 12:34 pm

    ఆ రమణుడి పాదాలు కడిగేసి విబూది తీసుకోటమే పాఠకుల పని అనుకుంటున్నారు.

    లైలా గారు
    మీరు మాట వరసకి ఇలా అన్నారనుకుంటున్నాను. రమణులు తన జీవితకాలంలో ఎన్నడూ ఎవరికీ విభూది ఇచ్చిన దాఖలాలు లేవు. వచ్చినవాళ్లకేసి ఒక్కచూపు చూసేవారు(ట). ఆ చూపుకి వళ్ళు తప్పిపోయి, తలలో గర్వం పాదాల్లోకి ఒక్క క్షణంలో వచ్చి ఆయన శిష్యులైనవారున్నారు (ఉదాః చలం అనబడే ఒకానొక ప్రబుధ్ధుడు). ఆ చూపుకి అర్ధం తెలియక, ఎప్పటికీ ఏమీ తెలుసుకోలేని నాలాంటి వేలమంది ఉన్నారు కూడా. ఎవరు ఎలా ఆయనవల్ల ఉధ్ధరింపబడ్డారనేది వేరే విషయం, అప్రస్తుతమేమో కూడా.

    అయితే ఈ ఇంగ్లీషు అనువాదానికి, అదీ పూర్తిగా చేయని దానికి, ఈమాట పత్రికలో చోటు లేదని నేనూ అనుకున్నాను. మనం రాసే తెలుగు కధల్లో కవిత్వాలలో ప్రతి అయిదు మాటలకీ ఒక ఇంగ్లీషు పదం ఎలాగా దొర్లుతోంది. అటువంటప్పుడు అసలు దీన్ని ఈమాటలో వేసుకోవడానికి కారణం రచయిత తెలుగువారు కావడం ఒకటేనా అర్హత?

    నాగరాజు గారు – అన్యధా భావించకండి. మీరు బ్లాగు మొదలుపెట్టినప్పటినుండీ నేను చదువుతున్నా మీరు రాసేవి. మీకు తెలుగులో ఉన్న పటుత్వంతో మీరు దీన్ని తెలుగులో అద్భుతంగా అనువదించగలరు. అలా ప్రయత్నం చేయండి. మనకి ఇప్పటికే ఉన్న ఆంగ్ల దరిద్రానికి మరో సమిధ వేయడం ఎందుకు? ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోకండి.

  3. ఆకురాలిన చప్పుడు గురించి సిరిపురపు శ్రీనివాస శర్మ అభిప్రాయం:

    04/05/2020 3:16 am

    మీ కవితా శిల్పం చాలా బాగుంది. అంతర్మథనాన్ని ప్రశ్నగా వేసిన తీరు బాగుంది. ఆఖరి వరకు సాగిన అక్షర యుద్ధం చివరి పేరాలో మౌనం వహించింది అనిపించింది.

  4. ఏదైనా రాలిపోవాల్సిందే గురించి సిరిపురపు శ్రీనివాస శర్మ అభిప్రాయం:

    04/05/2020 3:11 am

    మీ కవితా శిల్పం అద్భుతం. కాకుంటే, మొదటి మూడు పేరాల్లో ఉన్న ఆక్రోశం, ఆవేదన ఒక్కసారిగా నాలుగో పేరాలో మాయమైంది. ఆ టెంపో సడలకుండా దీన్ని నడిపిస్తే బాగుండేదేమో.

  5. Tara and the Teacher గురించి తః తః అభిప్రాయం:

    04/04/2020 2:38 pm

    కనీసం ఆ రాసిన ఇంగ్లీషు పద్యాలకు అర్ధం తెలుగులో వివరించి చెప్పండి

    మళ్ళీ అదిగూడానా – కొంచెం కృషి చేస్తే మూలమే బాగా అర్థమౌతుందేమో – మీవంటి వారికి.
    నమస్కారాలతో – తః తః

  6. Tara and the Teacher గురించి తఃతః అభిప్రాయం:

    04/04/2020 2:27 pm

    గురువు మీద పద్యాలు రాసి పరీక్ష పాసైపోటం (అవతలి ఒడ్డు చేరుకోటం)!

    విద్య యొసగు వినయము ……” భర్తృహరి (తెలుగులో) ప్రసిద్ధమైన సుభాషితానికి ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో యాభై ఏళ్ళ క్రితమే ప్రచారంలో ఉన్న పాఠాంతరం “విద్య నొసగు వినయము”

    తఃతః

  7. కొన్ని లలితగీతాలు గురించి తః తః అభిప్రాయం:

    04/04/2020 2:07 pm

    శ్రీ పరుచూరి:
    మీకు ఎంతోమంది లలిత సంగీత ప్రియులు, నాతో సహా, ఎంతో ఋణపడి ఉంటారు. ఈ విడతలో వింజమూరి లక్ష్మి (అందమైన చందమామ), పద్మ ప్రియల (పాటలే) పాటలు బాగులేవని చెప్పటానికి ఏమాత్రం సంకోచించను. ‘పాటలే’ బాలమురళి గొంతులో విన్నవాళ్ళకు పద్మప్రియ పాట నచ్చే ఆస్కారం ఏమాత్రం లేదు. ఈ పాట ఆయన గొంతులో అమృతపు ఊట.

    బెజవాడ రేడియోలో శ్రీరంగం గోపాలరత్నం, వి బి కనకదుర్గగార్లతో పోల్చినప్పుడు లక్ష్మిగారు చాలా పేలవంగా (నా చిన్నతనంలోనే) అనిపించేవారు. నా అప్పటి ఈ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశాన్ని ఆమె ఎప్పుడూ కలిగించలేదు. 9, 10, 11 తరగతులలో బెజవాడ సత్యనారాయణపురంలో తర్వాతి కాలంలో ‘మంగళంపల్లి బాలమురళీ కృష్ణ వీథి’గా పేరుమార్చబడ్డ లైబ్రరీ వీథి మొగదలలో ఉన్న హైస్కూల్లో నా తోటి విద్యార్థిని వింజమూరి సూర్యసుబ్బలక్ష్మి పాడిన (పిల్లల) పాటలు, ’అక్షరాలూ దిద్దు నాకూ ఆట బొమ్మ లెందుకింక – అబ్బిగాడి కిచ్చివేస్త’ వంటివి వీలైతే వినిపించగలరా! బెజవాడ రేడియోలో శ్రీ ఏడిద కామేశ్వరరావు, కుమారి వింజమూరి లక్ష్మిగార్లు నడిపిన పిల్లల కార్యక్రమాలు చాలా సుబ్బలక్ష్మిగారి పాటతోనే మొదలయ్యేవి. ‘అందమైన చందమామ’ కూడా ఆమె పాడినట్టు గుర్తు.

    అన్నట్టు హేమామలినిగారు నిర్మించిన టి వి సీరియల్ ‘నూపుర్’లో కనకదుర్గగారితో పాడించిన భైరవి స్వరజతి చాలా మధురంగా ఉంటుంది.

    నమస్కారాలతో
    తః తః

  8. కొన్ని లలితగీతాలు గురించి Dr. I.A.P.S. Murthy అభిప్రాయం:

    04/03/2020 8:41 pm

    చక్కని పాటలు. అన్నిటా లాలిత్యం వెల్లివిరిసింది.

    దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వ్రాసిన ‘ఖుదా నీదే అదే పిలుపు, సదా నీదే కదా గెలుపు’, బహుశః వేదవతీ ప్రభాకర్ పాడినది, ఎంత ప్రయతించినా దొరకలేదు. ఉంటే అందించండి.

  9. Tara and the Teacher గురించి Lyla yerneni అభిప్రాయం:

    04/03/2020 1:45 pm

    ఈ పద్యాలలో పాండిత్య ప్రకర్ష ఉందా? అంత భాగ్యమెక్కడ!

    రిబాయత్ -ఫిట్జెరాల్డ్ ఇంగ్లిష్ అనువాదం చదువుకున్న వాళ్లు, దువ్వూరి రామిరెడ్డి తెలుగు అనువాదం చదువుకున్నవాళ్లు -ప్రతి పద్యం లోని భావ సౌందర్యానికి చలిస్తారు. ఈ పద్యాలలో అసలు ఏమి చెప్పబడినట్టు?

    ప్రతి వంశ మూలపురుషుడు వేదవ్యాసుడు కాడు. ఘంటం పట్టిన ప్రతివాడు గణపతి కాడు. సరస్వతి, తంత్రము, యంత్రము, మహావిద్య – ఇలాటి మాటలు వాడేస్తే చాలు, అందులో ఏవో వేదాంత రహస్యాలున్నయ్యనీ, ఇక ఆ రమణుడి పాదాలు కడిగేసి విబూది తీసుకోటమే పాఠకుల పని అనుకుంటున్నారు. కనీసం ఆ రాసిన ఇంగ్లీషు పద్యాలకు అర్ధం తెలుగులో వివరించి చెప్పండి.

    గురువు మీద పద్యాలు రాసి పరీక్ష పాసైపోటం ( అవతలి ఒడ్డు చేరుకోటం) అతి పాతపడిన విద్య. ఇంకా ఎన్నిసార్లు నేర్పిస్తారండీ!
    – Lyla

  10. తథాగతుని అడుగుజాడలలో గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    04/03/2020 8:08 am

    చక్కని సవివరాత్మక, సోదాహరణ పరిచయం.