పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ఏదైనా రాలిపోవాల్సిందే గురించి Lyla Yerneni అభిప్రాయం:

    04/21/2020 11:17 am

    “ఇక గూగులమ్మ ఇచ్చిన కవి పరిచయం: జాని తక్కెడశిల వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన తెలుగు యువకవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు. తెలుగుతో పాటు హిందీ, ఆంగ్లంలోనూ కవిత్వం రాస్తున్న బహు భాషా కవి.”

    నమస్కారం రామయ్యగారు!
    చాల శ్రద్ధతో తెలుగు సాహితీకారుల whereabouts, what other things they are into, తెలుపుతున్నారు. Very nice of you!

    నేను ఇలాటి విశేషాలు చదువుకుంటూ, ఇల్లు సర్దుకుంటూ, చుట్టూ పక్షుల కూతలు వింటూ, తోటలో కొత్త కొత్త పూలు ఏం పూసినవో చూస్తూ, ఏరోజు సుఖం ఆ రోజుకి కేష్ చేసుకుని, జాలీగా ఉంటానా;
    మధ్యే మధ్యే ఎంతో జాలి గొంతుతో, “అయ్యో, అమ్మో, వెంటిలేటర్లు చాలక, ఒక వయసు దాటిన వాళ్లని హాస్పిటల్ లో వెంటిలేటర్ల మీద పెట్టటం లేదంట, నువ్వు జాగ్రత్తగా ఉండాలి,” అని ఫోన్లు వస్తూంటాయి.

    నాకు వళ్లు మండి;
    “ఎవడేడిసాడు ఇప్పుడు నన్ను వెంటిలేటర్ మీద పెట్టమని, నువ్వు రోజూ హాస్పిటల్ కెళ్లొస్తావు, నువ్వే జాగ్రత్తగా ఉండు, ఇప్పటిదాకా హాయిగా ఊపిరాడతా ఉంది. ఇప్పుడు నీమీద అరిసి, అనవసరమైన ఆయాసం. గో డిక్టేట్ యువర్ మెడికల్ ఛార్ట్స్, డోంట్ బాదర్ మీ” -అంటాను నేను.

    ఇంకో పక్కనుండి ఇండియా లో వాళ్లకు తెల్లారింది కదా అని, నాకు అర్ధరాత్రో, అపరాత్రో గమనించకుండా, పనిమాలా నాకు ఫోన్ చేసి;
    మా అమ్మ చచ్చిపోయినప్పుడు నువ్వు నాకు ఫోన్ చెయ్యకపోవటం తనకు చాలా బాధ కలిగించిందంటుంది ఇంకో చుట్టం! అంతకు ముందు వారం వారం, ఆ 100 దశకం లోని అమ్మ, అనారోగ్యం మూలాన తనతో చేయించే సర్కస్ తనే ఫోన్ చేసి నాతో చెప్పుకున్నది కదా! విన్నది నేనే కదా! మరి, ఇప్పుడు వాళ్లమ్మ చావు తనకు బాధే కలిగించిందో, రిలీఫ్ ఇచ్చిందో తనే కొంచెం సోల్ సర్చ్ చేసుకుని మాట్లాడితే న్యాయం! నా మీద ఈ తెలుగు ట్రెడిషనల్ గిల్ట్ ట్రిప్ ఎందుకు! ఇంతలోనే ఆమెకు మాయ ఏమ్నీషియా!
    నేను ఏమీ చచ్చు లేకుండా, ఫ్రాంక్లీ మై డియర్! ఐ డోంట్ గివ్ ఏ డామ్! ఐ డోంట్ కేర్! అన్నాను! ఈ ట్రాజిక్ క్వీన్లందరినీ వీళ్ల ప్రతి ఆనవాయితీ ‘టైమ్ ఆఫ్ నీడ్’ లో నేను సపోర్ట్ చెయ్యలేను.

    జెన్యుయైన్ గా -ఆనందించటంలో నాకెక్కువ ఆసక్తి ఉంది. తెచ్చిపెట్టుకుని విషాదించటమంటే పరమ విరక్తి.

    అసలుకి ఆ పోయిన నా పెద్దచుట్టం, అమెరికాలో ఉన్నప్పుడు, ఇన్నీ అన్నీ తెలుగు సామెతలు గావు నాకు చెప్పినవి! ప్రతి సందర్భానికీ ఒక సామెతుండేది ఆమె వద్ద. మా సంభాషణ ఆమె గాని వినుంటే “ ఏడిసి తద్దినం పెట్టించుకున్నట్టుంది’ ‘కడుపులో లేనిది కావిలించుకుంటే వస్తుందా’ ‘చచ్చిన గొడ్డు ఎక్కువ పాలిస్తుందంట’ ‘తంగేళ్లు దాటాక భ్రమత లెక్కువ’ ఇందులో ఏదో ఒకటి ఆమే అనుండేది.

    నన్ను విచ్చలవిడిగా వదిలేస్తే, నేనిలా రాసుకుంటూ పోతుంటాను. అసలెందుకు రాస్తున్నట్టు నేను!

    రామయ్యగారూ! “మీలాటి సాహితీ పెద్దలు” అని మీరు ఒక సమాసం వేసి ఈ pandemic time లో నన్ను పెద్దల్లో కలిపేసారు, అని నవ్వొచ్చి రాసాను. ఈ కవి – ఇంగ్లిష్ లో, హిందీలో కూడా కవిత్వం రాస్తారని మీరు చెపితే సంతోషించి రాసాను. ఎంతమందో భారతీయులు చక్కని ఇంగ్లిష్ రాస్తారు. నారాయణరావు ఇంగ్లీషులో తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కవులను ప్రపంచానికి పరిచయం చేసాడు. Did he enrich Telugu Literature? Or did he enrich English Literature! నా ఉద్దేశంలో నారాయణరావు -ప్రేమతో, దీక్షతో, తెలుగు సాహిత్యాన్ని, ఆ పైన ప్రపంచ సాహిత్యాన్నిపెంపొందించాడు. తెలుగు భాషను ప్రపంచ భాష చెయ్యటం అంటే ఏమిటి! ఏ పార్లమెంట్ లోనో ఓట్ చేయించి, రాజకీయంగా ప్రజలను ఒప్పించటమా! లేదండి! సాహిత్యం తనంత తానే మెప్పించి ఒప్పించాలి. ‘ఈమాట’ లో సాహిత్యం మీద కన్నా, తెలుగులో రాయాలా, ఇంగ్లీష్ లో రాయాలా, కలగలుపు భాష రాసే దుర్మదాంధులను ఏం చెయ్యాలి! -ఇలాటి డిస్కషన్స్ శాతం ఎక్కువ! సాహిత్యం మీద మనసు లగ్నం చేస్తే, ఈ మేగజీన్ కి పులిట్జర్ ప్రైజ్లు వచ్చునేమో! అని ఆశతో రాసాను.

    As I write this prose, I hear the singing of Thrush. This decastich I wrote sometime before, stealthily found it’s way back, into my conscience.

    “Don’t ever please pen a song
    If no lover is climbing a ladder rung
    To tumble you in hay, to have a fling
    Don’t you then please sing a song
    The nightingale will forget its notes
    The azalea bush will shed its buds
    The shrill sounds of your throat
    Will kill all that is lovely and sweet
    The sky unwraps its gloomy dark cloud
    April will go and wear a shroud.”

    -Lyla

  2. పలుకుబడి: వ్యుత్పత్తి, నిరుక్తము గురించి Praveenkumar అభిప్రాయం:

    04/21/2020 2:58 am

    Hi sir, this is praveen kumar i read above matter, i need telugu sahithyam books and vythparthalu books please send me by mail. I want to know about telugu sahithyam. Please send me It’s my request.

    Thanking you sir
    Praveen Kumar

  3. ఏదైనా రాలిపోవాల్సిందే గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    04/17/2020 10:18 am

    డా. లైలా ఏర్నేని గారూ.. నమస్కారములు.

    కవి జాని తక్కెడశిల గారిని ఆశ్వీరదిస్తున్న యీ నాగరాజు గారి (వీరు శ్రీ పప్పు నాగరాజు గారై ఉందురా) పదబంధనాలని ఇలా విశదీకరించుకోవాలని ఉంది. ఆపై దీని టీకా తాత్పర్యాలు మీలాంటి సాహితీ పెద్దలను అడిగి తెలుసుకుంటాను.

    ” కవిగారూ ….పద్యమై, గద్యమై, వచనమై, గణయతిప్రాసాను ప్రాసలమయమై …రహితమై… పరహితమైన పదబంధమై… జనరంజిత అక్షరమై… ప్రక్షేపిత కిరణమై… ప్రక్ష్వేడనమై… ( ప్రక్ష్వేడన=బాణములయొక్క ) ప్రతిధ్వనించగలరు….! ”

    పులివెందుల, అనంతపురం, సింగమనేని నారాయణలతో జతపడి ఉన్నాడని తెలిసి మురిసిపోతూ… వర్ధమాన కవి జాని తక్కెడశిల గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.

    ~ ఇట్లు త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు.

    ఇక గూగులమ్మ ఇచ్చిన కవి పరిచయం: జాని తక్కెడశిల వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన తెలుగు యువకవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు. తెలుగుతో పాటు హిందీ, ఆంగ్లంలోనూ కవిత్వం రాస్తున్న బహు భాషా కవి. సామాజిక సమస్యలను కవితా వస్తువులుగా స్వీకరించి విస్తృతంగా కవిత్వం రాస్తున్నారు. కవిత్వంతో పాటు కథలు, గేయాలు, విమర్శలు, సమీక్షలు, నానోలు, నానీలు, నక్షత్రాలు రాశారు. బాల సాహిత్యంలోనూ విశేష కృషి చేస్తున్నారు. వీరు రచించిన అనేక కవితలు, కథలు, వ్యాసాలు దిన, వార, మాస పత్రికలలో ప్రచురితమైనవి.

    మొదట సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా వివిధ సంస్థలలో పని చేశారు. ప్రస్తుతం ప్రతిలిపి తెలుగు సాహిత్య వెబ్ సైట్ కి మేనేజర్ గా ఉన్నారు.

    వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల వీరి స్వస్థలం. ప్రస్తుతం వృత్తిరీత్యా బెంగుళూరులో స్థిరపడ్డారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉండటంతో వీరి మొదటి పుస్తకం అఖిలాశ 2017లో జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ లోటస్ పాండ్ ఇంట్లో పుస్తకావిష్కరణ చేశారు. రెండవ కవితా సంపుటి విప్లవ సూర్యుడు వై.ఎస్ అవినాష్ రెడ్డి గారు 2017లో పులివెందుల ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆవిష్కరణ చేశారు. మూడవ కవితా సంపుటి నక్షత్ర జల్లులు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ గారితో అనంతపురంలో ఆవిష్కరణ చేశారు. నాల్గవ కవితా సంపుటి (హిజ్రాలపై దీర్ఘ కావ్యం) రాయలసీమ కథా శిఖరం సింగమనేని నారాయణ గారితో ఆవిష్కరణ చేశారు.

  4. ఏదైనా రాలిపోవాల్సిందే గురించి నాగరాజు అభిప్రాయం:

    04/17/2020 1:40 am

    కవిగారూ … పద్యమై గద్యమై వచనమై గణయతి ప్రాసానుప్రాసలమయమై రహితమై పరహితమైన పదబంధమై జనరంజిత అక్షరమై… ప్రక్షేపితకిరణమై… ప్రక్ష్వేడనమై.. ప్రతిధ్వనించగలరు…!

  5. నీ లోపలి నిజం గురించి నాగరాజు అభిప్రాయం:

    04/17/2020 1:24 am

    లోపలి ‘నేను’కు అక్షర అలంకరణ ఈకవిత… కానీ దృశ్యం ద్రష్ట ఒకటేగా, అప్పుడు లోపల బయట నిజం (truth) ఒహటే.

  6. ఆకురాలిన చప్పుడు గురించి నాగరాజు అభిప్రాయం:

    04/17/2020 1:16 am

    ఓ మౌనం నభోంతరాళాలలో విస్ఫుటించి ఆకురాలు చప్పుడులో గుండెచప్పుళ్లను ఆవిష్కరించుకున్నారు కవిగారు..అధ్భుతం

  7. సెకండ్ ఛాన్స్ గురించి Sriram Bhamidipati అభిప్రాయం:

    04/12/2020 2:24 pm

    చాలా తేటగా రాసేరు. నా అభిప్రాయం కూడానూ. అసలుకి ధైర్యస్థుల్లో చాలామంది నేరస్తులుగా తయారయ్యే ఛాన్సులెక్కువే. వాళ్లలోనే నేను అసలు నిజాయితీనీ, మంచినీ చూశా. మిగాతవాళ్లం (మనం) పిరికివాళ్లూ, మొహమాటస్తులూ మంచివాళ్లుగా చలామణీ ఆవుతున్నాం, ఆనిపిస్తూంటుంది.
    ఈ సోకాల్డ్ చట్రంలో ఇమడనివాళ్లు నేరస్తులు 🙂 వీళ్లకి మనం ఛాన్సు ఇస్తున్నిమనుకోడంకూడా ఒక వాంఛనే?

    నిజం నిష్టురం కూడానూ..

  8. నౌషాద్‌ గురించి Yugandar అభిప్రాయం:

    04/10/2020 2:53 pm

    Rohini Prasad gaaru,

    I had to write this in English as I wasn’t sure I could convey my response/appreciation in Telugu. Let me explain….I’ve read your deeply insightful article from a totally Hindi sensibility i.e., knowing Naushad saab, relishing his music, his innovations and the sheer artistry of bridging classical with folk traditions. Still I found the golden nuggets in finding about Saloori’s inspiration and Naushad saab’s influence on other Telugu/South Indian directors.It might be a cliché but he was truly a consummate artist.

    I may have to disagree on your assessment of Naushad Saab’s shayari though….as with his music, his shayari was top class too. And S-J definitely and most ably paid their tribute to Naushad saab in Basant Bahar….those songs are magical. Khayyam saab may have been the closest to Naushad saab in musical thinking/execution. Bless their souls….

    Thanks much

  9. చూడు చూడు! గురించి Lyla Yerneni అభిప్రాయం:

    04/05/2020 2:49 pm

    అనిల్ గారికి కథలలో చివరి ట్విస్ట్లు అర్థం అవుతున్నాయి.
    నాకెందుకు అర్థం కాటల్లేదు.!

    ఆ – ఓ హెన్రీ కథ Gift of Magi, లో ట్విస్ట్ బాగా అర్థం అవుతుంది. అబ్బా! నా జీవితం అంతా ఇలాగే నడుస్తున్నట్టుంది. ప్రతి గిఫ్ట్ ఒక దశాబ్దం లేట్, it goes a waste, అని ఒక jagged edge knife పొట్టలో దించి ట్విస్ట్ చేసినట్టవుతుంది.

    మరి చంద్ర ఈ కథ ఎందుకు వెళ్లిపొమ్మంటున్నది.? నాకు తెలియటల్లేదు.

    భలేగా చదువుతా సారస్వతం అని నన్ను నేనే కంగ్రాచ్యులేట్ చేసుకుంటుంటానా,
    ఈ మధ్య Harold Bloom series చదువుతూ,
    Stephen King మీది వ్యాసాలు, చదువుతూ చాలా ఆనందిస్తున్నప్పుడు, sudden setback.
    నా గర్వం సర్వం ఖర్వం.

    Misery అన్న సినిమా ఇప్పటికి ఎన్ని సార్లు చూసానో. I think it is a great movie. But not once did it occur to me – that it is a satire of an extremely popular writer- directed against his own fans.
    I was shocked at the innocent way I saw the movie. And more to my surprise, I still watch it as a pure horror movie.

    Exhibiting such immaturity, now how can I even say, the essays in that book are so literary, that even if you steadfastly refuse to accept Stephen King as a ‘man of letters’ you will know the beauty of well written literary essays?

    Who will believe me, (anything I ever say about Literature) – a girl -who does not understand what the twist in this story is?

    Lyla

  10. ఏదైనా రాలిపోవాల్సిందే గురించి Lyla yerneni అభిప్రాయం:

    04/05/2020 1:44 pm

    చాలా బాగున్నది కవిత.

    ఐతే, గంటగంటకీ బజాయిస్తున్న, CDC నగారాల వల్ల కాబోలు, ‘పద్యం’ అన్న చోటల్లా ‘వైద్యం’ అని తిరగ చదువుకున్నాను. అప్పుడచ్చంగా the poem for the right moment అనిపించింది.

    ఎవరి preoccupations, occupational health hazards వారివి!
    – Lyla