పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. గ్రీకు పురాణ గాథలు 5 గురించి Dr. ఇంద్రకంటి పినాకపాణి అభిప్రాయం:

    05/27/2020 2:55 am

    శర్మ దంతుర్తి గారూ !

    “భగవంతుడనేవాడున్నాడు అనేది ఒప్పుకున్నట్టైతే కొన్ని విషయాలు గ్రహించాలి.”
    ఒక వేళ ఒప్పుకోక పోతే ఈ వాదనలన్నీ కుదురుతాయా !!

    “జ్ఞానం ఉన్నవాడు కనక మనకి ఆ జ్ఞానం లేనపుడు ఆయనని తెలుసుకోలేము. ”
    తెలుసుకోలేని దానికి ఎవరికో ఒకరికి భగవత్తత్వం ఆపాదించి భజనలు మాత్రం చేయడం దేనికి !!

    ” దీన్ని అద్భుతమైన సమన్వయం అనుకోవడం, ఎవరో ఏదో కావాలని మీ/మా కోసం ఇలా తయారు చేసారనుకోవడం మన లేకితనాన్ని తప్ప మరోదాన్ని విశదం చేయదు.”
    ఇది ఖచ్చితంగా అద్భుతమైన సమన్వయమే ! యుగయుగాలకూ మారి పోతున్న వైవాహిక సంప్రదాయాల వల్ల ప్రస్తుత తరాల వాళ్ళకు పురాణాల మీద ఏహ్య భావం పుట్టకుండా అంతకు ముందు రాసిన వాటికి పెద్దగా నొప్పించకుండా చేసినది. ఈ మాట అనడంలో వాళ్ళను మెచ్చుకోవడమే గానీ దూషించినది ఏదీ లేదు. మిగతా పురాణాలలో ఇలా లేదు అనడం వాటి వైవిధ్యాన్ని ఎత్తి చూపడమే గానీ పొగడడం ఏమీ కాదు. ఈ విషయాన్ని గుర్తించకుండా ఏవేవో విషయాలు చెప్పడమే లేకి తనం అవుతుంది.
    ఇంకా వివరించడానికి ఇది అస్తి నాస్తి విచికిత్స కాదు. సూక్ష్మముగా తేల్చాలంటే భగవంతుడు అజ్ఞేయుడా? ! అయితే ఒక రాముడికో మరెవరికో ఎలా అంటగడుతున్నారు.
    లేక జ్ఞేయుడేనా !! అప్పుడు ఎవరి జ్ఞానపు స్థాయిలో వారు మాట్లాడుతారు. మీకు వినే ఓపిక లేకపోతే ఇటువంటి వ్యాసాలు, వ్యాఖ్యలు చదవకండి.. ” అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటే అప్పుడు జ్ఞానం కలికి భగవంతుడి గురించి మాట్లాడ్డానికి అర్హత సంపాదించుకోవచ్చు. అప్పటివరకూ మరెలా అంటే ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖంలేదు అని చెప్పుకోవాల్సిందే.”…. తేల్చేసారు కదా !! ఆ పని మీదే ఉండండి.
    నిజంగా ఆ స్థాయికి చేరితే ఇంక మాట్లాడడం ఏమీ ఉండదనుకోండి..
    —శుభం

  2. రెండు ప్రపంచాలు గురించి vasundhara అభిప్రాయం:

    05/27/2020 1:40 am

    ఇది దినచర్యలో వాస్తవ సన్నివేశాలతో నిండిన స్కెచ్ లాంటి కథ. పరిస్థితుల్ని యథాతథంగా ప్రదర్శిస్తూనే ఆలోచింపజేసే కథ. ఎవర్నీ విమర్శించకుండానే సంస్కారం దిశలో స్పష్టమైన సందేశాన్ని అంతర్లీనం చేసుకున్న కథ. కథాంశానికి అవసరమైన హంగులన్నీ కూర్చి, పొల్లు అనిపించే వాక్యం మచ్చుకి ఒక్కటైనా కనిపించనివ్వని సమగ్రమైన కథ. ఆటోలో బడిపిల్లల్ని ఆహ్లాదంగా, స్వీటుషాపులో సేల్సుగర్ల్స్‍ని ఆత్మవిశ్వాసపరంగా గమనించిన కథ. కాఫీ డే వాతావరణాన్ని ప్రస్తావించినప్పుడు కాఫీ డే యజమానికి సంబంధించిన విశేషాన్ని కూడా స్ఫురణకు తెచ్చుకోగల స్పృహ ఉన్న కథ. ఈ కథాంశానికి అనితర సాధ్యం అనిపిస్తూనే మార్గదర్శకమైన గొప్ప ముగింపునిచ్చిన కథ. చదవగానే అద్భుతం అనిపించే ఈ కథను వ్రాసిన, ప్రచురించిన వారికి అభినందనలు.

  3. గ్రీకు పురాణ గాథలు 5 గురించి తః తః అభిప్రాయం:

    05/26/2020 9:41 pm

    ‘దేవతలు పోటీ పడి, పందెం కట్టి, దాని పర్యవసానంగా భూమి మీద లక్షలాది ప్రజలు నాశనం అవడానికి కారణభూతులు అవుతారు.”
    వీళ్ళే కిరీటధారులైన వైరసు లేమో _ (వైరసు- విరస శబ్దానికి తద్ధిత రూపమా?)

  4. గ్రీకు పురాణ గాథలు 5 గురించి తః తః అభిప్రాయం:

    05/26/2020 9:34 pm

    “అలాగే వాలి సుగ్రీవులకి తల్లీ తండ్రీ కూడా ఒకరే. అందువల్ల బ్రహ్మగారు సృష్టి చేస్తున్నారంటే ఎవరో ఒకర్ని పెళ్ళి చేసుకుని అనంతంగా పిల్లల్ని కనేస్తున్నారనుకోవడం మరోటి లేదు అంత బుద్ధి తక్కువ ఆలోచన”
    శర్మగారూ!
    ‘సర్వమూ సాధు కాని పురాణాల’ గురించి – నాకు మాత్రం ఇటువంటి బుద్ధితక్కువ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వాటినుంచి నేనూ నానుంచి అవీ తప్పించుకోలేము.
    “Anthropomorphic deities exhibited human qualities such as beauty, wisdom, and power, and sometimes human weaknesses such as greed, hatred, jealousy, and uncontrollable anger. Greek deities such as Zeus and Apollo often were depicted in human form exhibiting both commendable and despicable human traits” -wiki
    నమస్కారాలతో
    తః తః

  5. గ్రీకు పురాణ గాథలు 5 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    05/26/2020 1:18 pm

    పురాణాలు అవీ బయటకి తీసి తవ్వుతున్నారు కనక కొన్ని విషయాలు.

    భగవంతుడనేవాడున్నాడు అనేది ఒప్పుకున్నట్టైతే కొన్ని విషయాలు గ్రహించాలి. మొదటిది – ఉన్న భగవంతుడు జ్ఞానం, బలం, ఐశ్వర్యం, వీర్యం, శక్తి, తేజస్సులు కలవాడు. జ్ఞానం ఉన్నవాడు కనక మనకి ఆ జ్ఞానం లేనపుడు ఆయనని తెలుసుకోలేము. అందుకే మొదటగా చేయాల్సిన పని జ్ఞానం కోసం వెదకడం. ఆ జ్ఞానాన్ని వెదకడానికి మనకున్న బుద్ధి, మనసు ఎందుకూ పనికిరావని తెలుసుకోవడం రెండో మెట్టు. అదయ్యాక అంతర్గతంగా చూడడం, ఆ దారిలో అహంకారం పోగొట్టుకోవడం అది వదిలాక అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటే అప్పుడు జ్ఞానం కలికి భగవంతుడి గురించి మాట్లాడ్డానికి అర్హత సంపాదించుకోవచ్చు. అప్పటివరకూ మరెలా అంటే ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖంలేదు అని చెప్పుకోవాల్సిందే.

    ఇప్పుడా భగవంతుడు ఎలా పుట్టాడు, ఎందుకిలా చేసాడు, ఆ కాలంలో శూద్రుడు తపస్సు చేస్తుంటే రాముడు వెళ్ళి వాణ్ణి చంపాడు కనక అది పరమ దరిద్రమైన విషయం అనడానికి ముందు పైన జ్ఞానం అనేది సంపాదించాలి. ఎప్పుడో మరో యుగంలో జరిగిన దాన్ని బయటకి తీసి ఇప్పటి సూత్రాల ప్రకారం ఆ నిండు చూలాలైన సీతని అడవిలోకి తోసాడు కనక రాముడు ఇదీ అదీ అనడానికి మనకి అర్హత ఉండబోదు. అప్పట్లో ఆయన ఏం చేశాడో ఆ ధర్మాలెలా ఉన్నాయో, అది అసలు ధర్మమా కాదా అనేది నిర్ణయించడానికి మనకి జ్ఞానం ఏదీ ముందు? ఎన్ని విషవృక్షాలు రాసినా ముందు మనకి జ్ఞానం ఉందా భగవంతుణ్ణి గురించి మాట్లాడ్డానికి? అదలా ఉంచితే మానవ జీవితం కానీ పశుపక్ష్యాదులన్నీ కానీ సృష్టించబడాలంటే ఒక మొగ, ఒక ఆడ కలిసి తీరాలని – మనకి ఇప్పుడు తెల్సిన, అదీ పరిమితంగా – విషయాలని క్రోడీకరించి ఫలానా పుట్టి ఫలానాని పెళ్ళి చేసుకున్నందు వల్ల, ఆవిడ ఈయనకి చెల్లెలూ, ఈవిడ ఆయన బామ్మర్ది కూతురి మనవరాలూ అనడం మనకున్న అవగాహనా రాహిత్యం చూపిస్తుంది. హిందూమతాన్ని పక్కనపెట్టి మొదట్లో ఒక ఆడం ఈవ్ లు మాత్రమే ఉన్నారనుకుంటే, వాళ్ళసంతతిలోంచి మొత్తం జనాభా ఎలా వచ్చిందీ, ఎవరికెవరు చెల్లెళ్ళూ అక్కలూ అన్నీ లాగవచ్చు, అసహ్యించుకోనూ వచ్చు, నవ్వుకోనూ వచ్చు. అయితే అవి అర్ధం కావడానికి జ్ఞానం మనకి ఉందా? మనకి అది లేదు కనక (నాకెలా తెలుసు అంటే, ఆ జ్ఞానం ఉన్నవాళ్ళం అయితే ఇలా ఈమాటలో వ్యాఖ్యలూ, కధలూ రాయం కనక) పురాణాల్లో ఎవరెవకి పుట్టారు ఎవరెవరికకి ఏమౌతారూ అనేవి వదిలేసి అవి చెప్పే విషయాలు గ్రహిస్తే జ్ఞానంకోసం ఓ అడుగుముందుకి వేయవచ్చు. ప్రస్తుత కాలంలో కరోనా వైరస్ వల్ల ఒకర్నొకరు ముట్టుకోకూడదు. పొరపాట్న ముట్టుకుంటే, వెంఠనే చేతులు కడుక్కోవాలి. ఇంటికొచ్చాక ఆ బయటకెళ్ళేటప్పుడు వేసుకున్న బట్టలు ఉతుక్కుంటే మంచిది అని మనం కొత్తగా నేర్చుకుని చచ్చినట్టూ చేస్తున్నాం కదా? మరి చాలా ఏళ్ళ క్రితం – అనేకానేక వేల సంవత్సరాల క్రితం ఇటువంటిదే వచ్చి ఫలానా వారిని ముట్టుకుంటే వైరస్ అంటుకుంటుంది అనేది వచ్చిందేమో అని ఒక బ్లాగర్ అన్నారు. నిజమే అయిండవచ్చు ఎవరు చూసారు. మనకి తెలియదు కనక నోరు మూసుకుందాం. అయితే ఈ కాలంలో అలా చేయవచ్చా, అనేది ప్రస్తుత పరిస్థితుల ప్రకారం తప్పే; కాదని ఎవరూ అనడంలేదు. అందువల్ల ఒకనాడెప్పుడో వచ్చిన వ్యవస్థ మీద ప్రస్తుత జీవితంలో సూత్రాలు పెట్టి మెలికలు తిప్పితే మరో కొన్ని విషవృక్షాలు అద్భుతంగా పండుతై. అసలు జననమరణాలు ఒక ఆడ, మొగ కలవకుండా జరగవచ్చేమో? కొన్ని రకాల నత్తలు ఆడ మొగా తేడా లేకుండా మారుతూ వృధ్ధి పొందుతాయని మల్లాది గారి నవల “నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త” లో చదివాం కూడా. అలాగే వాలి సుగ్రీవులకి తల్లీ తండ్రీ కూడా ఒకరే. అందువల్ల బ్రహ్మ గారు సృష్టి చేస్తున్నారంటే ఎవరో ఒకర్ని పెళ్ళి చేసుకుని అనంతంగా పిల్లల్ని కనేస్తున్నారనుకోవడం అంత బుద్ధి తక్కువ ఆలోచన మరోటి లేదు. ఎందుకంటే భగవంతుడు ఏమేం లక్షణాలు ఉన్నవాడో మొదట్లోనే చూసాం కదా? “ఏదైనా చేయగల” భగవంతుడు – మనకి జ్ఞానం కలిగేవరకూ కనీసం – నిజంగానే ఏదైనా చేయగలడు కనక సృష్టి ఆయనిష్టం ప్రకారం ప్రభవించింది అనుకోవడం ఉత్తమం. అబ్బే దానిబదులు మన బుద్ధి, మనస్సు మనకి తోచిన విషయాలూ మనకి తెల్సిన గూగిల్ ప్రకారం ఇదీ అనేవీ కలిపి సృష్టి ఇలాగే ఆడా మొగా లేకుండా జరగదూ అనుకోవడం ఎటువంటిదంటే, భాగవతం చదివి పోతనగారు మొత్తం గోపికల అంగాంగాలు వర్ణించడం తప్ప అందులే ఏం లేదురా, కావాలిస్తే “ఆదిన్ శ్రీపతి కొప్పుపై..” అనే పద్యంలో బూతు చూడండోహో అని చెప్పడం, అనుకోవడం, మిగతావారి దగ్గర చెప్పుకోవడం వంటిదే.

    రాముడు పుట్టాక, అవతారం చాలించాక ఆయన పేరు కోటానుకోట్ల జనాలకి వాడారు/వాడుతున్నారు ఇప్పటికీ. బుధ్ధుడి కాలంలో రాముడనే రాజు, ఆయనకో చెల్లెలు సీత అనే వారు ఉంటే త్రేతాయుగంలో సీతారాముల్తో పోల్చి [అసలే మనకి బుధ్ధి చాలా పదును కదా?] చూసారా హిందూ మతంలో రాముడు చెల్లెలైన సీతని పెళ్ళిచేసుకున్నాడని చెప్పడం అతి ఏహ్యమైనది. మీ పేరు రామారావు అయితే మీకు హనుమంతరావు అనే తమ్ముడూ, ఆ తమ్ముడికి సీతాలక్ష్మి అనే పెళ్ళాం ఉండకూడదంటే ఎలా? యుగాలన్నీ కలిపేసి ఆయాధర్మాలన్నీ కలిపేసి ఏదీ నాకు చూపించు అంటే ఎందుకు చూపించాలి? దీన్ని అద్భుతమైన సమన్వయం అనుకోవడం, ఎవరో ఏదో కావాలని మీ/మా కోసం ఇలా తయారు చేసారనుకోవడం మన లేకితనాన్ని తప్ప మరోదాన్ని విశదం చేయదు.

    మొత్తానికి చెప్పేదేమంటే భగవంతుడు – మరోసారి ఆయన లక్షణాలు ఇక్కడ -జ్ఞానం, బలం, ఐశ్వర్యం, వీర్యం, శక్తి, తేజస్సులు ఉన్నవాడు, ఆయన గురించి మాట్లాడి ఇదీ ఫలానా అని చెప్పాలంటే ఆ జ్ఞానం మనకి ఉండాలి. ఇవన్నీ పుక్కిటి పురాణం, సరదా కథ అనుకుంటే సరే, అప్పుడు ఈ కధలని గ్రీకులతోటే కాదు ఆదిమ మానవుల గురించి కూడా పోల్చి చెప్పుకోవచ్చు – ఒకప్పుడు ఈమాటలో ప్రచురించిన విశ్వనాధ గారి నవల్లో పాత్రని ఏదో ఆంగ్ల సినిమా హీరోయిన్ తో కంపేర్ చేసి పెద్ద వ్యాసం రాసినట్టూ. శుభం.

  6. ఎడిటర్లూ, రచయితలూ, ఎడిటింగూ గురించి ఇంద్రగంటి ప్రసాద్ అభిప్రాయం:

    05/26/2020 12:45 pm

    ఇన్నేళ్ల తర్వాత ఈ సంపాదకీయం మీద వ్యాఖ్య రాయడానికి కారణం రేమండ్ కార్వర్. 2009 ఎడిషన్ ఇటీవల చదివేను. లీష్ కత్తిరించిన కథల్ని వాటి అసలు రూపంలో చదివేను. కొన్ని కథలు కత్తిరింపు వల్ల బావున్నాయి కానీ, కార్వర్ కి పెరు తెచ్చిన గొప్ప కథలు A small, good thing కానీ, so much water so close to home కానీ విస్తార రూపంలోనే బావున్నాయి. దగ్గరగా చూసినప్పుడు లీష్ వెర్షన్ అసమగ్రంగా అనిపించింది. విషాద వాస్తవికత చేదుగా అర్ధమవుతుంది.

  7. గ్రీకు పురాణ గాథలు 5 గురించి Dr. Indrakanti pinakapani అభిప్రాయం:

    05/26/2020 4:55 am

    జగదీశ్వర్ వల్లభదాసు గారి అభ్యంతరం సరైనదే ! అయితే ఇక్కడ ఆదిమ పురాణాలను దిద్ది ఉంటారని ఊహించ వచ్చు. ఏకోదర వివాహాలను నిషేధించే వరకు వీళ్ళందరూ బ్రహ్మ గారికి పుత్రులే ఐ ఉంటారు. తరువాతి కాలంలో మానస పుత్రులు కావడం పౌరాణికులు సాధించిన అద్భుతమైన సమన్వయం !
    జైన పురాణాలు మాత్రం ఇలా దిద్దినట్లు లేవు. వారి ఆదిమ పురాణాల్లో రాముడికి సీత చెల్లెలు ఐన సందర్భాలు కూడా ఉన్నాయని ఆరుద్ర గారు రాశారు.

  8. అటో యిటో గురించి Viswam అభిప్రాయం:

    05/22/2020 6:07 am

    కథ చక్కగ వున్నదండి. శైలి కూడా బాగుందండి.

  9. అసమర్థులు గురించి Viswam అభిప్రాయం:

    05/22/2020 5:49 am

    కథ ఇది కాదు, ఒక అమూల్యమైన అద్బుతమైన సందేశం ఇప్పటి తల్లి తండ్రులకు అనుకుంటున్నాను. కథను మించిన సందేశం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

  10. ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి Viswam అభిప్రాయం:

    05/21/2020 11:02 pm

    స్వప్నరాగలీన, గీతాదేవి, కృష్ణచైతన్య, శ్రీపతి తెలుగు నవలాసాహిత్యం ఉన్నంతవరకు వెలుగులీనుతూనే ఉంటారు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.