పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి కర్లపాలెం హనుమంతరావు అభిప్రాయం:

    06/04/2020 8:44 pm

    సినిమాల్లో చేరి గుర్తింపు సంపాదించుకోవాలన్న మోజుతో శ్రమించి ఆ కల సాధించిన తరువాత ప్రైవెసీ పోయిందని విచారించిన విధంబుగా ఉందీ కథ. సెల్ఫ్ కంట్రోల్ ఉంటే సాంకేతిక అభివృద్ధి అందించే లాభాలను మాత్రమే సులభంగా సాధించుకునే మాధ్యమం సామాజిక మాధ్యమం. నా వరకు నేను కలలోనైనా కలుస్తానని ఊహించని పెద్దలతో పరిచయలాభం పొందాను. జై.. సామాజిక మాధ్యమాలూ!

  2. ముక్కోణాలు గురించి Indu అభిప్రాయం:

    06/04/2020 7:55 pm

    సంభాళించుకుంటోంది- తప్పనుకుంటాను.

    సంబాళించుకుంటోంది అని ఉండాలి.

  3. చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి Indrani Palaparthy అభిప్రాయం:

    06/04/2020 2:05 pm

    వ్యాసాన్ని ఆసాంతం చదివి ఆశీస్సులు అందజేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు.

    పాలపర్తి ఇంద్రాణి.

  4. భారతీయ మతసంస్కరణ – సంఘసంస్కరణ గురించి Indrani Palaparthy అభిప్రాయం:

    06/04/2020 9:55 am

    ..దయానందుడుదయించెను.


    బహుబలధారిణీం – నమామి తారిణీం
    రిపుదలవారిణీం మాతరం

    తుమి విద్యా తుమి ధర్మ – తుమి హృది తుమి మర్మ
    త్వంహి ప్రాణాః శరీరే

    ఎప్పటివలె హృదయాన్ని ఉత్తేజపరచిన వ్యాసం.

    దిగవల్లి వారికి నమోవాకములు.

    ఈ విలువైన వ్యాస పరంపరను అందిస్తున్న ఈమాటవారికి కృతజ్ఞతలు.

    పాలపర్తి ఇంద్రాణి.

  5. ముందుమాటే ఇది…! గురించి ప్రసన్న మద్దిరాల అభిప్రాయం:

    06/04/2020 4:14 am

    మాటలు లేవు రేఖ గారూ….ఎంత హృద్యంగా రాస్తున్నారు…

  6. మునిమాపు వేళకు గురించి ప్రసన్న మద్దిరాల అభిప్రాయం:

    06/04/2020 4:11 am

    జీవితాన్ని అన్ని కోణాల్లో కాచివడబోసినట్టే….మీ మాటలు…. అభినందనలు రేఖ గారూ

  7. నడిచొచ్చిన తోవ గురించి ప్రసన్న మద్దిరాల అభిప్రాయం:

    06/04/2020 4:08 am

    ప్రేమాగ్ని ని చల్లార్చే ప్రయత్నంలో మీ మాటలు… రేఖ గారూ ఏమని చెప్పమంటారు …. అద్బుతం మీరు….

  8. సడి లేని సంభాషణలు గురించి ప్రసన్న మద్దిరాల అభిప్రాయం:

    06/04/2020 4:03 am

    గుండె లోతును కనుకొనీ రాస్తున్నారా రేఖ గారూ…

  9. ముక్కోణాలు గురించి ప్రసన్న మ ద్దిరా ల అభిప్రాయం:

    06/04/2020 3:59 am

    పగుళ్ళిచ్చిన గుండె….భగవద్ అనుగ్రహం మీ వ్యక్తీకరణ….రేఖ గారూ……అభివాదం

  10. ముక్కోణాలు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    06/03/2020 2:11 am

    విరబూసిన మల్లె గుబురుని ఒంగి ముద్దాడి అభినందించలేని సౌందర్య రాహిత్య…
    పిచ్చుకల గూళ్ళు పీకి పారేసే కర్కశత్వ …
    ఇచ్చిన మాటలు మర్చిపోయే గందరగోళంలో ఉన్న ప్రేమరాహిత్య…
    ముక్కోణ తిమిరంలో ఉన్న అతడు…
    తమోగుణ అంధకారం నుండి విడివడి ఉషోదయంతో ఉదయించి…
    మదిలో వెన్నెల వెలుగులు నింపేలా తను చెప్పే మాటకోసం
    రాత్రులు మేలుకొనే ఉంటున్న ఆమె…
    అలికిడైతే కిటికీలో పిచ్చుకలు జడుసుకుంటాయని, కదిలితే పవిటచెంగుకి అంటుకున్న గరికపూవులు రాలిపోతాయని తలొంచుకొని పనిచేసుకునే ఆమె…
    ఆమె గుండె మరోసారి పగుళ్లిచ్చింది… అతడి స్పందన రాహిత్యానికి… అంగాత్మ సంధాన యోగ వైఫల్యానికి.

    శివ నివేదనగా, అగ్నితప్తమై మేను త్యాగమిచ్చిన అపర్ణ వేదననూ తలపుకు తెచ్చింది మీ కవిత రేఖాజ్యోతి తల్లీ.