పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. చంద్ర ఆడియో కథలు గురించి purnima అభిప్రాయం:

    08/22/2020 4:49 am

    శ్రీనివాస్ గారు,

    శ్రమకోర్చి ఇంత శ్రద్ధగా చంద్రగారి కథలు చదివి వినిపించినందుకు మీకు బోలెడన్ని థాంకులు! నేను చంద్రగారి కథలు గత కొన్నేళ్ళుగా ఈమాటలో వచ్చినవే చదివున్నాను. అంతకు ముందు రాసినవి తెలీవు. మీ ఛానల్ ద్వారా ఆయన కథలన్నీ పరిచయమైయ్యాయి. ముఖ్యంగా మీరు “పాప” కథ చదివిన తీరు నాకు బాగా నచ్చింది.

    మీరు ఇలానే కథలు వినిపిస్తుండడానికి కావాల్సినంత ఆసక్తి, శక్తి సమకూరుతూ ఉంటాయని నా ఆశ.

    థాంక్స్ అగైన్!

    పూర్ణిమ

  2. ప్రయాణం గురించి purnima అభిప్రాయం:

    08/22/2020 4:44 am

    చక్కని, చిక్కని కథ! చలికాలంలో ఛాయ్‍లా!

    మీనుండి మరిన్ని కథలకోసం ఎదురుచూస్తుంటాను.

  3. నీతో నువ్వే గురించి purnima అభిప్రాయం:

    08/22/2020 4:43 am

    Thank you! నాకూ ఇలాంటి కథలంటే కారణంలేని ఇష్టం. 🙂

    రాస్తూ ఉండండి.

  4. పులి వేషగాడు గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:

    08/14/2020 5:37 am

    టగరుపాయిట్ కాదర్ ఎంత విషాదకరమైన చిత్రణ. కధ చదివిన చాలా కాలం పాటు కాదర్ అతని నలుగురు బిడ్డలు అన్నం తింటున్నారో లేదో అని వ్యధ కలుగుతుంది. మిత్రుడు ఎవరో చెప్పినట్లు ఆట కదురా భూమిపై మూడువంతులు నీరు మిగతాది కన్నీరు అని ఎంత సరిపెట్టుకున్నా ఈ మానవ జాతి మీద ఎంతో క్రోధం కలుగుతోంది. దిగులుతో…

  5. గల్ఫ్ గీతం: 2. షార్జా గురించి Amarendra Dasari అభిప్రాయం:

    08/13/2020 8:38 pm

    ఫైన వారం క్రితం మొట్టమొదటి కామెంట్ పెట్టిన రాజేంద్ర మూడో భాగం చూడకుండానే నిన్న వెళ్ళిపోయారు. మంచి జర్నలిస్టు, సాహితీశీలి, మంచి మనిషి. కాపాడుకోలేకపోయాం…

  6. లక్ష్మి గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    08/10/2020 7:21 am

    దేశికాచార్యులుగారు నవ్వులు పూయించారు ఈ డయలాగులతో

    చొక్కంపు బంగారు సొమ్ములివి మేడెమ్!
    వినకుండ మేడాన్నివేధింతువేమి?
    ఈస్లిప్పరుం జూడు మేడమ్
    విసనకఱ్ఱ లమ్మువాఁడు: ఎండకాలము గడవ దిదిలేక మేడమ్

    విసనకర్ర గురించి చదివాక నా ఆంధ్రా జీవితం ఎండాకాలంలో గుర్తుకొచ్చింది. తాటాకు విసనకర్ర లేకపోతే ప్రాణం పోయినట్టే. ఎందుకంటే తప్పనిసరిగా పొద్దున్న 10 నుంచి సాయంత్రం ఆరువరకూ పవర్ కట్! మళ్ళీ రాత్రి పది నుంచి పొద్దున్న నాలుగు దాకా మరో సారి పవర్ కట్! ఏమైనా అంటే వర్షాలు రాక ఇలా ఉంది అని సమాధానం.

    మొత్తానికి ఆంగ్లేయుల ఎడతెగని రాణి భక్తిభావం, ఆవిడకోసం, రాజ్యం విస్తరించుకోవడానికి చేసే అనేకానేక పనులన్నింటినీ విక్టోరియా రాణి గురించీ, “ఇంగిలీషురాజ్యమింక వేయి వత్సరాలు” అనే మాటవాడీ ధృవపరిచారు.

    వాళ్ళపేరులని మనం మాత్రం సరిగ్గా నేర్చుకుని మరీ పలకాలి కానీ వాళ్ళు మాత్రం ఇసుమంత ప్రయత్నం చేయరు – ఇప్పటికీ. అందుకే మనపేర్లు వెంకీ, శ్రీనీ, శామ్ అంటూ మార్చుకుంటారు కానీ లక్ష్మి అనే పేరుని సరిగ్గా పలకడానికి ప్రయత్నం చేయనే చేయరు. వింత దరిద్రం ఏమిటంటే మనం కూడా అలాగే మన పేర్లు పలికించుకుంటూ పళ్ళు ఇకిలించుకుంటూ బాగానే ఉన్నాం.

    ఒక సూచన, మీకు నచ్చితే. పద్యాల్లో వృత్తాలపేర్లు ఉండి ఉంటే నాలాంటివాడికి కాస్త ఏ పద్యం ఏ వృత్తంలో రాసారో అర్ధం అయ్యే అవకాశం ఉంది.(నాకు పద్యం చూసి వృత్తం గుర్తించే అంత తెలుగు రాదు కనక అడుగుతున్నాను)

  7. పుస్తక పరిచయాలు గురించి Sai Brahmanandam అభిప్రాయం:

    08/09/2020 9:29 am

    వేలూరి కథల పుస్తకం ఇప్పుడు అమెజాన్‌లో కొనుక్కోవచ్చు:

    Aa Nela – Aa Neeru – Aa Gaali (ఆ నేల, ఆ నీరు, ఆ గాలి)by Veluri Venkateswara Rao

    ఆయన ఇతర పుస్తకాల కోసం ఈ లంకె చూడండి:

    అమెజాన్ రచయిత — వేలూరి వేంకటేశ్వరరావు

  8. మహారాజుగారి రయిలుబండి గురించి tadepalli subrahmanyam అభిప్రాయం:

    08/09/2020 6:46 am

    Wah! Most scintillating story greatly woven to touch chords of hearts.

    What happened to the train with bogies? Always haunts the reader for a long time.

  9. ఏటి గట్టున ఇల్లు గురించి Tadepalli subtahmanyam అభిప్రాయం:

    08/09/2020 6:33 am

    ఈ కథ చదువుతున్నపుడు చక్కని వింత హాయి కలుగుతుంది. కాని అనుభవంలో తేలేది ఏమిటంటే సున్నితమైన మనుస్సు చాలా చాలా గాయాలు చేస్తుంది.ప్రస్తుత దుర్మార్గపు ప్రపంచంలో సున్నిత మనస్కులు ఉంటే చాలా దుఃఖపడతారు.(అందుకే వేయి యంత్రాలనైనా నడపవచ్చు కాని ఒక మానవప్రాణితో సుఖంగా ఉండలేము)అదే యంత్ర వ్యాప్తికి కారణయ్యింది..

  10. గల్ఫ్ గీతం: 2. షార్జా గురించి Amarendra Dasari అభిప్రాయం:

    08/09/2020 3:16 am

    జనవరి, ఫిబ్రవరి, మార్చి ఢిల్లీలో పూల మాసాలు. కోట్లాది పూలు… రహదారులు, రౌండ్ అబౌట్లు, పార్కులు నిండిపోతాయి. రాళ్ళు కూడా పుష్పించే మాసాలవి.