పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. గల్ఫ్ గీతం: 3. ఆబు దాబి గురించి Amarendra Dasari అభిప్రాయం:

    09/15/2020 8:28 pm

    Pl permit me to add a word to comment 8 above: by the way, కొంతమందికి పెన్సిలిన్ ప్రాణాంతకం అయినట్టే — నాకు మీరు సూచించిన స్మార్ట్ కార్డ్ …

  2. గల్ఫ్ గీతం: 3. ఆబు దాబి గురించి Amarendra Dasari అభిప్రాయం:

    09/14/2020 10:02 am

    Thanks శర్మ గారూ. మీ వివరణ వల్ల ఇప్పుడు సప్తద్వార ప్రక్రియ సులభం అనిపిస్తోంది. నారదుడితో ఎంత పరిచయం అంటే, ఎన్నో సార్లు కలిసిన భావన.

  3. గల్ఫ్ గీతం: 3. ఆబు దాబి గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    09/14/2020 8:30 am

    అసలు వైకుంఠంలో కూడా ఏడేడు ద్వారాలూ ద్వారపాలకులను ఉపసంహరించి స్మార్ట్‌కార్డ్ ప్రవేశపెడితే ఎలా ఉంటుందీ అనిపించింది.

    నమస్కారం అమరేంద్ర గారు,

    సరదాకి అంటున్నా. వైకుంఠ ద్వారాలన్నింటికీ కాపలా లేదేమోనండి. ఒక ద్వారం (ఏడవది కావొచ్చు) దగ్గిర మాత్రం జయవిజయులు ఉన్నారని చదివినట్టు గుర్తు. ఈ స్మార్ట్ కార్డ్ సిస్టం మన వేదాల్లోనే ఉందిష! గురజాడగారు అన్నట్టు. దానిపేరు భగవన్నామం. అజామీళుడు దాన్ని అప్రయత్నంగా వాడినట్టు ఉంది నేను చదివినంతలో. అయితే వైకుంఠంలో పెద్దాయనకి మనమంటే – ఆయన పిల్లలం కనకేమో – విపరీతమైన ఇష్టం. అందువల్ల ప్రతి ఒక్కరికీ ఈ కార్డు ఉచితం. అయితే మనకున్న దరిద్రం ఏమిటంటే మనకి ఏనాడూ కూడా అవసరమైనప్పుడు ఈ కార్డు మన దగ్గిర ఉన్నట్టు గానీ, అది మనకి ఉచితంగా ఇచ్చారని గానీ, దాన్ని ఎప్పుడు బడితే అప్పుడు ఉచితంగా వాడుకోవచ్చని గానీ, ఎవరికైనా సరే ఉచితంగా పంచిపెట్టొచ్చని కానీ, ముఖ్యంగా చావుబతుకుల్లో దాన్ని వాడుకోవచ్చని గానీ ఏనాటికీ గుర్తులేకపోవడం. ఏ శంకరభగవత్పాదులో వచ్చి, ‘ఒరే ఇదిరా పరిస్థితి, ఒళ్ళు దగ్గిరపెట్టుకోండిరా!” (నహి రక్షతి నహి రక్షతి డుకృణ్ కరణే) అని హెచ్చరిస్తున్నా మనం పట్టించుకోకపోవడం దౌర్భాగ్యం కదా?

    “నారదుడు ఈ సారి కనిపిస్తే …” అన్నారు. అంతకుముందో సారి కానీ ఎక్కడైనా కనిపించిన ఆ వివరాలు చెప్పగలరు 😉 (అదే … దేశంలో నైమిశారణ్యం వెళ్ళిన ప్రయాణం విశేషాలు)

  4. మనకు తెలియని మన త్యాగరాజు – 2 గురించి Kommajosyula Sadgurucharan అభిప్రాయం:

    09/14/2020 7:13 am

    సాయి బ్రహ్మానందం గారికి, నమస్కారం. చాలా పరిశోధన చేసి వివరంగా, అద్భుతంగా రాశారు. త్యాగరాజస్వామి వారి గురించి చాలా కొత్త విషయాలు తెలిసాయి. ముఖ్యంగా తంజావూరు రామారావుగారి గురించి, వారు ఇచ్చిన ప్రోత్సాహం, చేసిన సహాయం గురించి వివరంగా ఇన్నాళ్లు తెలియదు. మంచి స్నేహితుడు ఎలా ఉండాలో రామారావుగారి నుంచి తెలుసుకోవాలి. త్యాగరాజస్వామి వారి లౌకిక జీవితం గురించి కూడా చాలా విషయాలు తెలిసాయి. ధన్యవాదాలు 🙏

  5. మనం అపార్థం చేసుకున్న ప్రతిభావంతుడు కావలి రామస్వామి గురించి Bolloju Baba అభిప్రాయం:

    09/12/2020 6:32 am

    సమగ్రంగా ఉంది సర్. థాంక్యూ

  6. గల్ఫ్ గీతం: 2. షార్జా గురించి Amarendra Dasari అభిప్రాయం:

    09/12/2020 3:47 am

    Thankyou Sandeep garu for your kind words..yes, they still wait at Rolla Square every day to be picked up for daily wage jobs..

  7. ఐసోలేషన్ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/11/2020 9:34 pm

    కళాత్మకతతో పాటు వర్తమానత, సామాజికత, మానవత్వ దృక్పథంతో కవితలు రాసిన ” ఎనిమిదో రంగు కవి ” అని తగుళ్ళ గోపాల్ గారిచే పాఠకలోకానికి పరిచయం చెయ్యబడ్డ అనిల్ డ్యాని గారు … కలలు పాతిపెట్టబడి, కల్లోలాలు మొలుస్తున్న వేళ… ఒంటరితనం, కనిపించని దిగులు ముసురుకుంటున్న వేళ … ” ఐసొలేషన్ ” హద్దులు దాటి నలుగురికీ వినపడే ఆప్యాయతల గళం విప్పినందుకు నెనర్లు.

  8. ℞: మారేజ్ గురించి తాడేపల్లి సుబ్రహ్మణ్యం అభిప్రాయం:

    09/11/2020 1:31 pm

    సారీ! నిషిద్ధ పదాలతో నింపి మోడెర్న్ లైఫ్ అంటే డోకు పుట్టేటట్లు చిత్రణ చేశారు. ఎందుకో మా వూరిలో మట్టి బొమ్మలు తయారు చేస్తూ బురదలో వుండే వాళ్ళను చూస్తే చాలా సంతోషం వేసింది. బహుశా డబ్బూ దానికి విపరీతమైన విలువ నిచ్చే జీవితాలకి ఆఖరి మెట్టులో బోర్లా పడేదాకా విషయం అర్ధం కాదేమో మరి.

  9. గల్ఫ్ గీతం: 2. షార్జా గురించి Sandeep అభిప్రాయం:

    09/11/2020 6:38 am

    Your article proves that there’s more to Sharjah than a desert safari. I liked the fact that you touched upon the subject of migrant labourers from Asian countries who congregate at Rolla Square in hope of getting hired for the day. Not sure if it’s still the case, but your intention to meet people rather than the monuments puts you in a different league of travel writers. Wish you take up much more adventurous journeys in future. Cheers.

  10. మనం అపార్థం చేసుకున్న ప్రతిభావంతుడు కావలి రామస్వామి గురించి తః తః అభిప్రాయం:

    09/10/2020 9:33 am

    ఒక అవసరమైన వ్యాసం. అవసరమైన సందర్భం.

    “మనం ‘అపార్థం చేసుకున్న’ ప్రతిభావంతుడు కావలి రామస్వామి”. Is the title justified in the essay? – వ్యాసం రెండు సార్లు వెంటవెంటనే చదివినా ఆనందం రెట్టింపయిందే గానీ కావలి రామస్వామిని తెలుగు ప్రజ ఏరకంగా అపార్థం చేసుకున్నారో తెలిసి రాలేదు. “అతను చేసిన పనిని, ముఖ్యంగా దక్కను కవుల చరిత్రతో అతను సాధించిన పెద్ద మార్పుని మనం ఇప్పటికీ సరిగా గుర్తించలేదు.” — ఈ ఒక వాక్యం వ్యాసాంతంలో కనపడుతోంది కానీ శీర్షికను సమర్థించుకోవటానికి ఇది చాలదనుకుంటాను. ఆరుద్ర అపార్థం చేసుకున్నాడని రచయితలకు–సకారణంగా–అనిపించి దాన్ని జనరలైజ్ చేశారని తోస్తోంది.

    “…కావలి సోదరులని గురించి దక్షిణ భారతదేశపు 19వ శతాబ్దపు చరిత్రలో గొప్పగా చెప్పుకుంటారు.”
    అని వ్యాసం మొదట్లో ఒక వాక్యం – ఆ సోదరులలో రామస్వామికి ప్రత్యేకమైన గుర్తింపు రాలేదని రచయితలు చెప్పదలచుకున్నారా?

    ఈ సంగతి ఇలా ఉంచి, ఈ వ్యాసంలో కొన్ని వ్యవహారాలూ, కొన్ని వాక్యాలూ ఇబ్బంది కలిగించాయి.

    (1)రెండవ రకమైన నియోగులు మంత్రి, ప్రెగ్గడ లాంటి బిరుదులతో దాదాపుగా రాజుల్లాగా వ్యవహరించలేదు. – ఈ ‘దాదాపు వ్య్వహరించకపోవటం’ అంటే తెలియలేదు. కొన్ని ప్రయోగాలు ఒక పద్దతి లోనే చేయటం అలవాటుగా ఉంటుంది. ఇంగ్లీష్‌లో befall వంటి వాటిని నెగెటివ్ సెన్స్ లోనే వాడతాం. ‘దాదాపుగా అలా ఉన్నారు’ అంటే ఉన్న నేటివిటీ ‘దాదాపుగా అలా లేరు’ అన్నవాడకంలో ఉంటుందా ?

    (2) ‘…అక్కడ మాట్లాడే వాళ్ల వివిధ భాషల్ని గురించి, చాలా క్లిష్టమైన అవగాహన వుందని మనకి తెలుస్తుంది.’ – ‘క్లిష్టము’ అంటే ‘కష్టమైన’ అని ‘అవగాహన’ అంటే ‘అర్థము అవటము’ అని మాత్రమే అర్థం చెప్పింది నిఘంటువు.

    (3) “ఒక్క రమ మంతెన మాత్రం వివరంగా బొర్రయ్యను తొలి చరిత్రకారుడిగా ‘వర్ణించి’ గౌరవించింది” – ఈ ‘వర్ణించి’ ఇంగ్లిష్‌లో ‘శాస్త్ర ‘వ్యాసాల్లో describe అని తరచుగా వాడే ప్రయోగానికి భాషాంతరం లాగా ఉంది. ‘పేర్కొని’ అని చిన్నతనాన తెలుగు పుస్తకాల్లో చదువుకున్న ప్రయోగం మెరుగుగా ఉంటుందనుకుంటాను.

    ఇలా వాక్యాలు ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులోకి తిప్పి రాసినట్టుగా కొంత కృత్రిమంగా ఉండటం బాలేదు. ప్రసిద్ధులైన రచయితలు వీరు. ఈరకమైన ధోరణిలో రాస్తే ఎలా? అయితే ఇందుకు బాధ్యత ముఖ్యంగా సంపాదకులది అనుకోవాలేమో.

    రచయితలకు ధన్యవాదాలు.
    తః తః

    [నిజమే. మీరు పైన ఉదహరించిన వాక్యాలు మేము సరిచేయవలసివుండింది. మా పొరపాటుకు క్షమాపణలు. – సం.]