మా తెలుగు మాస్టారు విద్వాన్ పేరి రామారావుగారు ఈ పద్యాన్ని ఆలపిస్తే క్లాసంతా మైమరచిపోయేది. ఈ రెండు పద్యాల్లో కెమేరా పనితనం కనిపిస్తుందని గతంలో ఓ సాహిత్య సభలో చెప్పానండి. మనిద్దరి పరిశీలన ఒకేలా వున్నందుకు ఆనందంగా వుంది,
‘రవిబింబంబుపమింప’ పద్యానికి కూడ అర్థం చెపితే బాగుండేది.
చంద్రగణం లేని అక్కర మద్యాక్కర మాత్రమే. ఐతే దాని అందచందాలకు చంద్రగణం లేకపోవటమే కారణ మేమో అన్నది అవశ్యం పరిశీలనార్హమైన ఆలోచన. కారణమేదైనా అక్కరల్లో సంప్రదాయికంగా తెలుగువారు ఆదరించింది మధ్యాక్కర ఒక్కటే.
తరలి వృత్తంలో అక్షరాలా పదకొండు దేశిపద్యలక్షణాలను గమనించవచ్చునండి.
రెండు మూ చూపుతాను ఉదాహరణకు.
తరలి గురులఘుక్రమం UII IIU III IUI III UIU. ఇందులోఇందులో 1 స్థానం నుండి UI IIIU IIII UI తేటగీతి కనబడుతున్నది (అలాగే మొదటి గురువు తరువాతి స్థానం నుండి కూడా III UII IIUI III UI అన్నట్లుగా తేట గీతి కనబడుతున్నది.)
అంతేకాదు, తరలి గురులఘుక్రమంలో 1వ స్థానం నుండి UI III UI III అని నాలుగు త్రిమాత్రాగణాలతో హాయప్రచార రగడ కూడా కనబడుతున్నది.
మొత్తం తరలి గురులఘుక్రమాన్ని UI III UI III UI III UI U అని చూసినప్పుడు అది ఉత్సాహ అవుతున్నది!
ఇలాగే తరలి లోని మిగిలిన అంతర్గత ఛందస్సులనూ పోల్చుకోగలరు.
గాఢంగా ప్రేమించిన అనూని నర్సు అనే కుంటిసాకుతో వదిలేసి మణిని వివాహం చేసుకున్న సగటు మనిషి భరణి… వెన్నుపూసకు ఆపరేషన్ అయ్యి పూర్తిగా బెడ్ పైనే ఉన్న తన భార్య మణిని ఓ నెల నర్సులా చూసుకోమని అర్ధిస్తే కాదనలేకపోయిన అనూ…
వెన్నుపూసలో గడ్డకి ఆపరేషన్ అయి బెడ్ రెస్ట్ లో ఉండి ముఖంలో చిన్నపాటి క్రూరత్వం, హిస్టీరిక్‌గా ఉన్న భరణి భార్య మణికి ( విషాద జీవితాన్ని మోసిన స్త్రీ వాద రచయిత్రి వర్జీనియా ఉల్ఫ్ రచనలు ఇష్టపడే… గొంతులో విషాదంతో పాట పాడిన మణికి ) బెడ్‌పాన్ పెట్టడం, యూరిన్ ఎత్తిపొయ్యడం, బాత్రూమ్‌కి తీసుకెళ్లి స్నానం చేయించడం, చీర కట్టి, జుట్టు దువ్వడం, వేళకు మందులు వెయ్యడం, తిండి తినిపించడం, నిద్ర పట్టనప్పుడు కాళ్లు పట్టడం వంటి సేవలు చేసి, శారీకంగా కోలుకుని చిన్నచిన్నపనులు తనే చేసుకునేంతగా కోలుకునేలా చేసిన అనూ…
మాటల్లో నిర్లక్ష్యం. ప్రతి దానికి అనుమానంగా చూడటం, చూపుల్లో చిన్నపాటి క్రూరత్వం, ఆక్రోశంతో, అశాంతితో రాత్రిళ్లు సరిగా నిద్రపోకుండా ఉంటూ లోపల బాధ తగ్గడానికి గుండెలపైనా తొడల పైనా మచ్చలు పడేలా కాల్చుకున్న మాసోకిస్ట్ (masochist : a person who derives sexual gratification from being subjected to physical pain or humiliation) మణిని భరణి, పాప, అనూల పట్ల అనురక్తి, స్నేహపూర్వక ఆక్తత చూపేలా మానసికంగా కోలుకునేలా చేసిన అనూ…
పరిచయం అయిన తొలినాడు కళ్ళలో అమాయకత్వం కనపడని భరణి కూతురు పాపను… నవ్వుతూ సంతోషంగా తన చెయ్యి పట్టుకునేంతగా దగ్గరకు తెచ్చుకున్న అనూ…
డబ్బు కావాల్సిన తన అవసరాలు చూసి, ప్రేమ స్నేహం ముసుగులో భార్య మణి పనులు చేయించుకున్న భరణిని… అన్నీ తెలిసి ఎన్నో సేవలు చేయించుకుని చివరికి “నువ్వు భరణి ప్రేమించిన అనువి కదా!” అని అడిగిన మణి అభావపు చూపుని తలచుకుంటూ… ఎవరినీ బాధపెట్టి నిందించింది లేదు, నేనెందుకు ఇలా ఉండాలి? అని ఆత్మవిమర్శతో జరిగిన కాలానికి, దాటిపోయిన మనుషులకు దూరంగా జరిగిపోవాలనుకున్న అనూ…
“నేను ఎవరో నీకు తెలుసా?” అన్న అనాది తాత్విక శోధనని మళ్లీ సూటిగా సంధిస్తున్న అనూని ఆవిష్కరించిన డా. శ్రీసుధ గారూ! మనుషులపై తెగని దయ చూపే మిమ్మల్ని కానీ, పెదడాక్టర్ గారబ్బాయి త్రిపుర తండ్రిని కానీ తెలుసుకోవటానికి శక్తిలేనివాడిని… వేదనా తాత్వికతల విస్పోటనం, ఉదాత్త దుఃఖపు సంఘర్షణల “అమోహం” అనుభూతుల్లో ముంచెత్తే మీలాంటి సృజనశీల అబ్బురాలకేసి చూస్తూ అచ్చెరవొందటమే నాలాంటి నేలక్లాసు పాఠకుడు చెయ్యగలిగినది… నెనర్లు అనాలనే మాటకూడా మర్చిపోయి.
నాకు నచ్చిన పద్యం: వామనావతారం గురించి ఏ యం ఖాన్ యజ్దానీ (డానీ) హైదరాబాద్ అభిప్రాయం:
10/09/2020 12:19 am
ఇంతై అంతై వటుడింతై
మా తెలుగు మాస్టారు విద్వాన్ పేరి రామారావుగారు ఈ పద్యాన్ని ఆలపిస్తే క్లాసంతా మైమరచిపోయేది. ఈ రెండు పద్యాల్లో కెమేరా పనితనం కనిపిస్తుందని గతంలో ఓ సాహిత్య సభలో చెప్పానండి. మనిద్దరి పరిశీలన ఒకేలా వున్నందుకు ఆనందంగా వుంది,
‘రవిబింబంబుపమింప’ పద్యానికి కూడ అర్థం చెపితే బాగుండేది.
మీకు అభినందనలు.
ఏ యం ఖాన్ యజ్దానీ (డానీ)
హైదరాబాద్
అక్కరలు గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
10/07/2020 2:18 pm
చంద్రగణం లేని అక్కర మద్యాక్కర మాత్రమే. ఐతే దాని అందచందాలకు చంద్రగణం లేకపోవటమే కారణ మేమో అన్నది అవశ్యం పరిశీలనార్హమైన ఆలోచన. కారణమేదైనా అక్కరల్లో సంప్రదాయికంగా తెలుగువారు ఆదరించింది మధ్యాక్కర ఒక్కటే.
తరలి వృత్తంలో అక్షరాలా పదకొండు దేశిపద్యలక్షణాలను గమనించవచ్చునండి.
తరలి(భ-స-న-జ-న-ర):
1. అంతరాక్కర(సూ-ఇం-ఇం-చం):1
2. అల్పాక్కర(ఇం-ఇం-చం):1
3, ఉత్సాహ(సూ-సూ-సూ-సూ-సూ-సూ-సూ-గు):1
4. ఎత్తుగీతి(ఇం-సూ-సూ):2
5. చౌపద(చ-చ-చ-సూ):1
6. తేటగీతి(సూ-ఇం-ఇం-సూ-సూ):1
7. ద్విపద(ఇం-ఇం-ఇం-సూ):1
8. మధురగతిరగడ(చ-చ-చ-చ):1
9. మధురాక్కర(సూ-ఇం-ఇం-ఇం-చం):1
10. మేలనగీతి(సూ-సూ-సూ-సూ-సూ-సూ-సూ):1
11. హాయప్రచారరగడ(త్రి-త్రి-త్రి-త్రి):1
రెండు మూ చూపుతాను ఉదాహరణకు.
తరలి గురులఘుక్రమం UII IIU III IUI III UIU. ఇందులోఇందులో 1 స్థానం నుండి UI IIIU IIII UI తేటగీతి కనబడుతున్నది (అలాగే మొదటి గురువు తరువాతి స్థానం నుండి కూడా III UII IIUI III UI అన్నట్లుగా తేట గీతి కనబడుతున్నది.)
అంతేకాదు, తరలి గురులఘుక్రమంలో 1వ స్థానం నుండి UI III UI III అని నాలుగు త్రిమాత్రాగణాలతో హాయప్రచార రగడ కూడా కనబడుతున్నది.
మొత్తం తరలి గురులఘుక్రమాన్ని UI III UI III UI III UI U అని చూసినప్పుడు అది ఉత్సాహ అవుతున్నది!
ఇలాగే తరలి లోని మిగిలిన అంతర్గత ఛందస్సులనూ పోల్చుకోగలరు.
ఐసోలేషన్ గురించి anil Dani అభిప్రాయం:
10/07/2020 6:11 am
థ్యాంక్స్ అందరికి. ముందుగా సంపాదకులకి నా కవితని ఈమాటలో ప్రచురణకి అంగీకరించినందుకు. అలాగే స్పందించిన మిత్రులకి పెద్దలకి నా కృతజ్ఞతలు…
పరామర్శ గురించి Vijay అభిప్రాయం:
10/07/2020 2:40 am
Very Moving with a realistic and critical focus. Kudos to both writer and translator.
Pages with Mani గురించి Sudha అభిప్రాయం:
10/06/2020 8:40 am
చాల ధన్యవాదాలు రామయ్య గారు . కథ మీకు నచ్చినందుకు, మీ అమూల్యమైన ప్రతి స్పందనకు…
గ్రీకు పురాణ గాథలు 10 గురించి RAO VEMURI అభిప్రాయం:
10/05/2020 8:03 pm
నెనర్లు, లైలా గారూ!
వేమూరి
#జర్నీ_బ్లూస్ గురించి ధీరజ్ కశ్యప్ అభిప్రాయం:
10/05/2020 12:04 pm
కధనం దృష్ట్యా దేశాలు-వాటి వీసా నిబంధనలు ఈ కాలంలో మనుషులని దూరంగా ఉంచుతున్న కారణాల్లో ఒకటి అని తెలియచేయడం నా ఉద్దేశం అండి.
చదివి అభిప్రాయం తెలిపిన అందరికి ధన్యవాదాలు.
గ్రీకు పురాణ గాథలు 10 గురించి Lyla Yerneni అభిప్రాయం:
10/05/2020 11:23 am
World Teachers’ Day Greetings! To Professor Vemuri.
And, to many other gladiators who spar in this eemaata magazine, – a sporty educational arena.
Signing autographs, wearing team caps and shirts, vendors, cheering and booing crowd is part and parcel of the sports scene.
Love It! – Lyla
#జర్నీ_బ్లూస్ గురించి sudha అభిప్రాయం:
10/05/2020 10:07 am
జర్నీ బ్లూస్ బావుంది
Pages with Mani గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
10/05/2020 8:55 am