పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. దేవగిరి గురించి భాస్కర్ కె అభిప్రాయం:

    11/04/2020 8:10 am

    NS Murty గారు, పిన్నమనేని మృత్యుంజయరావు గారు,Indraganti prasad గారు, Suparna మహి గారు, సుధగారు కధపై మీ అభిప్రాయాలు తెలియచేయడం సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి.

  2. దేవగిరి గురించి భాస్కర్ కె అభిప్రాయం:

    11/04/2020 8:06 am

    సూర్యనారాయణ మూర్తిగారు, ఈ ప్రశ్నకోసం కొంచెం ఎదురుచూసానండి. శైవుడు అని చెబుతూ రామాచారి పేరు ఏమిటని. ఒక శివాలయానికి రామప్ప దేవాలయం అని పేరు రావడానకి కారణంలో ఇలాంటి కథ ఏదైనా ఉందేమో అనే ఆలోచన ఒకటి ఉండేది నాకు. ఆ ఆలయం నిర్మాణకర్త రేచర్ల రుద్రడని గణపతిదేవుడు వేయించిన శాసనం ఉంది. రామ అనే పేరు జైనులు కూడా పెట్టుకునే వారండి. శైవానికి ముందు కాకతీయరాజ్య ప్రాంతంలో జైనమే ఎక్కువగా ఉండేది. అలాంటప్పుడు వంశపారంపర్యంగా వచ్చేపేర్లలో రామ శబ్దం ఉండే అవకాశం ఉంది. గణపతి దేవుడు చాలాకాలం (6 నుంచి 12 సంవత్సరాలు) బందిగా ఉన్నాడనే అంటారు. ఎలా విడుదలయ్యాడు అనేది తెలియదు కాని, ఒక మంచి రిలేషన్ మాత్రం యాదవులతో కొనసాగిందన్నది నిజం. ఓ యుద్దంలో రెండు సైన్యాలు కలిసి పోరాడాయి. జైత్రపాలుడి కూతురునే పెళ్లి చేసుకున్నాడని అంటారు కొందరు. జైత్రపాలుడి కొడుకు సింగడికి తెలుగురాష్ట్ర ప్రతిష్టాపనాచార్య బిరుదుకి కారణం తెలియదు. హిస్టారికల్ స్పెక్యులేషన్స్ మధ్య నిజాన్ని వెతకడం కూడా కష్టమే ఈ రోజుల్లో. మతం – జనం సంబంధం తేలికైనదా, అత్యంత బలీయమైనదా అనేది అనేక అంశాలపైన ఆధారపడి ఉంటుందండి. బహుశా రేఖామాత్రంగా చెప్పే ప్రయత్నం అంతే. ధన్యవాదాలండి.

  3. స్థితం గురించి Ma Siddhiq అభిప్రాయం:

    11/04/2020 6:21 am

    ఎప్పుడైతే సంఘంతో, సంఘం చేసే కట్టుబాట్లతో కలిసి ఉంటాడో, ఉండాలనుకుంటాడో వెంటనే స్వేచ్చ అనే పదానికి మినహాయింపులు మొదలౌతాయి. అలాగే ప్రతి మనిషి తన అధికార అహం పరిధిలో, బంధాల సెంటిమెట్ల పరిధిలొ మరికొన్ని ఆంక్షలు మొదలౌతాయి. ఇవి విస్మరించలేని నగ్నసత్యాలు. మెజారిటి సాధారణ మనుషులుకు ఈ ఆలోచనలేవి పట్టవు. పట్టలపై నడిచే రైళ్ళులా పట్టలు ఉన్నంత దూరం వెళ్ళి జీవితం ముగించడమే వారి జీవిత పరమార్ధం. ఎప్పుడైతే మనిషిని వాడుకుని వదిలేసే, ఆత్మ లేని ఫక్తు స్వార్ధపరుల మధ్య జీవితం గడిపే పరిస్థితులు వస్తాయో అప్పుడు ఈ కధలో పాత్రలా స్వేచ్చ కోసం ఈ మనుషుల్ని వదిలి మరో ప్రపంచం కోసం పరితపిస్తుంది.

    ఈ కాంక్రిట్ అరణ్యంలో, యాంత్రిక ప్రపంచంలో ఇలా నలిగిపోయే ఎన్నో బతుకుల ఆలోచనలకు ప్రతి రూపం ఈ కథ!

    కధలో పాత్ర అన్నట్లు మనకోసం ఒక్క మనిషంటూ లేకపోతే జీవితం డొల్లగా మారి ఇలాంటి ఆలోచనలు చేసి తీరిక వస్తుంది. అందుకే జీవితానికి ఇలా ఆలోచించే తీరిక ఇవ్వకూడదేమో.

    కథ కథనం అధ్బుతం – సుధ గారికి అభినందనలు.

  4. వీధి అరుగుపై… గురించి బివివి ప్రసాద్ అభిప్రాయం:

    11/04/2020 3:34 am

    Thank you, Vanajagaru..

  5. స్థితం గురించి అరుణ ఆర్ కుమార్ అభిప్రాయం:

    11/03/2020 8:53 pm

    నిత్యం మనుషుల్లో..మనసుల్లో జరిగే సంఘర్షణే..అలౌకికం అనే సోపానం జీవితంలో ఏదో ఒక స్టేజిలో ఎక్కాల్సి వస్తుంది.తప్పదు
    కథ కంటే కథనం బావుంది…

  6. దేవగిరి గురించి sooryanarayana murthy akella అభిప్రాయం:

    11/03/2020 7:29 pm

    శైవులు రామాచారి అని పేరు పెట్టుకుంటారా

  7. దేవగిరి గురించి suryanarayana murthy akella అభిప్రాయం:

    11/03/2020 7:08 pm

    చారిత్రక విషయం చెప్పిన పద్ధతి బావుంది, కానీ మతం విషయం అంత తేలిగ్గా తీసుకోవడం మన చరిత్రకారుల ఔదార్యం / బలహీనతా కూడా

  8. పోర్టికో గురించి ధీరజ్ కశ్యప్ అభిప్రాయం:

    11/03/2020 3:49 pm

    తాంక్ యూ సర్!

  9. గ్రీకు పురాణ గాథలు 11 గురించి RAO VEMURI అభిప్రాయం:

    11/03/2020 2:36 pm

    ధన్యవాదాలు. ఈ వ్యాస పరంపరని మరికాస్త మెరుగు పరచి, పుస్తకరూపంలో తీసుకురావాలనే కోరిక ఉంది. చూద్దాం.

  10. దేవగిరి గురించి sudha అభిప్రాయం:

    11/03/2020 7:38 am

    ఒక చారిత్రాత్మక కథలో మీరిచ్చిన సమాచారం, ఈ సమాజపు పోకడలను ప్రశ్నించుకొమ్మని చెప్తుంది … ఇలాంటి కథలు మరిన్ని రావాలి మీ కలం నుంచి భాస్కర్ గారు.